భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలంప్రాజెక్ట్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఫలితంగా క్షేత్ర పరిధిలో అన్ని ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. పాతాళగంగలోని కృష్ణా నదిలో తెల్లవారు జాము నుండే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దైవదర్శనం కాగానే కొందరు భక్తులు తిరుగు ప్రయాణమవుతుండగా, చాలా మంది మహాశివరాత్రి పర్వదినం వరకు శ్రీశైలంలోనే ఉండిపోతున్నారు. దీంతో శ్రీగిరిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ స్వామి అమ్మవార్లను 1.25 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల ప్రధాన వీధి


