బందోబస్తు మరింత ‘పది’లం
● ఎస్పీ సునీల్ షెరాన్
శ్రీశైలం: భక్తుల భద్రత కోసం బందోబస్తును మరింత పెంచామని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. బందోబస్తు చేయాల్సిన ప్రాంతాలను పది సెక్టార్లుగా విభజించామని చెప్పారు. శ్రీశైలంలోని వన్ న్ సర్కిల్ పోలీస్‌స్టేషన్లో శుక్రవారం నాలుగు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి 1,614 మంది సివిల్ పోలీసులు వచ్చారన్నారు. మొత్తం 11 మంది అదనపు ఎస్పీలు, 24 మంది డీఎస్పీలు, 78 మంది సీఐలు, 132 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ/హెచ్ లతో కలిపి 303 మంది పనిచేస్తారన్నారు. వీరు కాకుండా ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బం, మూడు స్పెషల్ పార్టీ బృందా లు పనిచేస్తాయన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని సెక్టార్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ స్వామి వారి ప్రసాదం అందేలా చూడాలని సూచించారు.


