breaking news
Nandyal District News
-
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్బీకి విశేష స్పందన
నేను మ్యాథ్స్‌బీ పరీక్షకు హాజరయ్యాను. గణితమంటే నాలో చాలా భయం ఉండేది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు. ఇది నా భవిష్యత్తుకు మంచి పునాది. – ప్రతీక్, 8వ తరగతి,కర్నూలు స్పెల్‌బీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంగ్లిష్‌లో కష్టమైన పదాలకు అర్థాలు తెలిశాయి. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇలాంటి పరీక్షలు రాయించడం ద్వారా వారిలోని భయాన్ని తొలగించవచ్చు. – జయకృష్ణ, టీచర్ నాకు స్పెల్లింగులు రాయడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. వాటిని పలికే విధానంపై గందరగోళం ఉండేది. నేను స్పెల్‌బీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లిషు అంటే భయం పోయింది. –జె.అనిసపర్హిన్, ఏడో తరగతి బనగానపల్లె నేను ఇంగ్లిషులో మంచి పట్టు సాధించేందుకు స్పెల్‌బీ ఉపయుక్తంగా ఉంది. ఎన్నో నేర్చుకున్నా. భవిష్యత్తులో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత పెరిగింది. – సమన్విత, ఏడో తరగతి, కర్నూలు నేను ముందుగా సాక్షికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను మ్యాథ్స్ బీ పరీక్షకు హాజరయ్యాను. మూడో దశకు వెళ్తానన్న నమ్మకం ఉంది. – యశస్వి, 8వ తరగతి, కర్నూలు కర్నూలు(సెంట్రల్): సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు నగరంలోని రవీంద్ర విద్యానికేతన్‌లో ఆదివారం నిర్వహించిన సెమీఫైనల్ పరీక్షలకు 121 మంది విద్యార్థులు హాజరయ్యారు. మ్యాథ్స్బీతో కష్టమైన సమస్యలను సులభంగా..వేగంగా..కచ్చితత్వంతో సాధించేందుకు ఎంతో ఉపయుక్తమైనట్లు విద్యార్థులు తెలిపారు. స్పెల్బీతో ఇంగ్లిషులో కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు నేర్చుకున్నారు. ఈ పరీక్షలు తమ భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఉన్నత తరగతుల్లో రాణించేందుకు ఉపయోగ పడతాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు విభాగాలుగా నైపుణ్య పరీక్షలు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలకు వందలాదిగా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ నేపథ్యాలు ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని నైపుణ్యాలను బట్టి రెండో దశకు ఎంపిక చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిషులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మ్యాథ్స్‌లో పట్టు సాధించాలని సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలను నిర్వహిస్తోంది. 1,2 తరగతుల విద్యార్థులను ఒక్క గ్రూపుగా, 3, 4, 5 తరగతులను విద్యార్థులను రెండో గ్రూపుగా, 6,7 తరగతుల విద్యార్థులను మూడో గ్రూపుగా, 8, 9, 10వ తరగతుల విద్యార్థులను నాలుగో గ్రూపు వర్గీకరించి పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశలో ఎంపికై న విద్యార్థులకు రీజినల్ స్థాయిలో, అందులో ఎంపికై న విద్యార్థులకు ఫైనల్ స్థాయిలో పోటీ పరీక్షలు ఉంటాయి. ఆదివారం జరిగిన రెండో దశ పరీక్షలకు స్పెల్‌బీ నుంచి 87, మ్యాథ్స్‌బీ నుంచి 34 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండో దశ పోటీలకు 121 మంది విద్యార్థుల హాజరు నాలుగు విభాగాలుగా విద్యార్థులను వర్గీకరించి పరీక్షలు ఎంతో ఉపయోగమని సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు -
నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల నిశ్చితార్థం
ఆస్పరి: రాష్ట్రంలో పిడకల (నుగ్గులాట) సమరం అంటేనే టక్కన గుర్తుకొచ్చేది ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామం. ఆ నుగ్గుల సమరానికి కారణమైన (భక్తులు ప్రేమికులుగా భావిస్తున్న) వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లికి పెద్దల సమక్షంలో సోమవారం నిశ్చితార్థం జరుగనుంది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. పెద్దలు అంగీకారం మేరకు ఏటా కార్తీక మాసం ముగిసిన తరువాత మొదటగా వచ్చే సోమవారం స్వామి, అమ్మవార్ల నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం దాదాపు నాలుగు ఐదు నెలల తర్వాత ఉగాది పర్వదినం రోజు పిడకల సమరం తరువాత స్వామి అమ్మవార్ల పెళ్లిని ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో సోమవారం జరిగే కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి హాజరు కానున్నన్నారు. -
మహిళలు మోసపోయారు
చంద్రబాబు ప్రభుత్వంలో సున్నా వడ్డీ జాడలేదు. పొదుపు మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న తోడు, కళ్యాణమస్తు వంటి పథకాలు అమలు అయ్యాయి. నేడు మహిళలకు ఒక్క పథకం అమలు కావడం లేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వస్తే పొదుపు మహిళలే అవసరం అవుతున్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయామని మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. – పి లక్ష్మీదేవి, మాజీ అధ్యక్షురాలు, ఉమ్మడి జిల్లా మహిళా సమాఖ్య -
సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఆదివారం స్థానిక సంజీవనగర్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు హాజరై భగవాన్ సత్యసాయికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. బాబా బోధనలు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలకు చేరాయంటే, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్య, వైద్యం రంగాల్లో సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సత్యసాయి సీపీడబ్ల్యూ పథకాలు అమలు చేయడం ద్వారా బాబా సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. సేవా తత్పరత ప్రజలందరిలో పెరిగి సమాజం పట్ల బాధ్యతతో సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి శత జయంతి సందర్భంగా ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లు, ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. -
బతికున్న వ్యక్తి చనిపోయినట్లు సృష్టించి..
● ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ఆదోని అర్బన్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, ఫోర్జరీ సంతకంతో రూ.కోటిన్నర విలువ చేసే బిల్డింగ్‌ను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు విఠల్‌రావు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని కంచగారి వీధిలో తన జేజినాయన హనుమంతరావు ఉండేవారని చెప్పారు. తన తమ్ముడు శ్రీనాథ్ మృతి చెందరాని, అయితే బతికి ఉన్న తన పేరు మీద డెత్ సర్టిఫికెట్‌ను తీసుకున్నారన్నారు. అంతేగాకుండా తన భార్య సునీతభాయి ఆధార్‌కార్డులో వేరే మహిళ ఫొటో వచ్చేటట్లు చేసుకున్నారన్నారు. అక్టోబర్ 22న అదే మహిళతో ఫోర్జరీ సంతకాలు చేయించి అక్రమంగాభవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. అక్టోబర్ నెలలో 31న బైచిగేరి గ్రామానికి చెందిన నీలాసింగ్కు అమ్మేశారన్నారు. ఆ బిల్డింగ్‌లో అద్దెకు ఉన్న వ్యక్తి చూసి సమాచారం అందించడంతో హైదరాబాద్ నుంచి తాను వచ్చానన్నారు. మున్సిపల్, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్, రిజిస్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలించకపోవడంతో ఈనెల 3న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇప్పటికై నా ఆస్తిని కాపాడాలని కోరారు. -
వెండి కిరీటం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలోని బయలు వీరభద్రస్వామివారికి అలంకరింప జేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను శ్రీశైలంకు చెందిన ఎం.సుబ్రమణ్యం విరాళంగా సమర్పించారు. ఇవి 1.230 కేజీల బరువు ఉన్నట్లు దాత తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, పర్యవేక్షకులు రవి, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం దాతను స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించారు. -
ఆడబిడ్డల కోసం మహాశక్తి పథకాన్ని తీసుకువస్తాం. వారి జీవితాలను మార్చేందుకు ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేస్తాం. ఇది వరకు జనాభా నియంత్రణ కోసం ఒకరిద్దరితో సరిపుచ్చుకోమని చెప్పా. ఇప్పుడు చెబుతున్నా. మీకు ఓపిక ఉంటే ముగ్గురు, నలుగురు ఆడబిడ్డలను కనండి. ఒక్కొక్కరికి నెలక
కర్నూలు(అగ్రికల్చర్): మహిళా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 ప్రకారం ఐదేళ్లు చెల్లించింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్నే ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నెలకు రూ.1,500 ప్రకారం ఏడాదికి రూ.18,000 చెల్లిస్తామని ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఆరు లక్షల కుటుంబాలను మినహాయించినా తొమ్మిది లక్షల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన మహిళలు ఇద్దరు వరకు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 18 లక్షల మంది మహిళలు ఆడబిడ్డనిధి పథకానికి అర్హులవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర్ర అయినప్పటికీ ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మహిళల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అప్పల ఊబిలో పొదుపు మహిళలు స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని పక్కన పెట్టడంతో పొదుపు మహిళలపై వడ్డీభారం పడుతోంది. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం వల్లనే మహిళలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందారు. 2024–25 సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 35 వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2500 కోట్ల వరకు లింకేజీ రుణాలు ఇచ్చారు. 2025–26లో ఇప్పటికే రూ.1500 కోట్ల వరకు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు పొందారు. సంఘాలకు బ్యాంకులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణాలు పొందుతున్నారు. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది. లింకేజీ రుణాలపై మహిళలు 15 శాతం వరకు వడ్డీ భరిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి.... ఆచరణలో జరుగుతున్నది మరొకటి కావడంతో మహిళల ఆందోళన అంతా ఇంతా కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు వంటి కార్యక్రమాలను ఐదేళ్లు నిర్విగ్నంగా చేపట్టింది. ప్రస్తుతం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడం, వడ్డీ భారం పడుతుండటంతో పొదుపు సంఘాల నుంచి బయటికి వచ్చేందుకు మహిళలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి ..అధోగతి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమన్లెడ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కేవలం కాగితాల మీదనే కనిపిస్తోంది. 2024–25లో 5750 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. మహిళలు 2024–25 ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకున్న యూనిట్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రౌండింగ్ చేశారు. మహిళల అభ్యున్నతికి ఇతోధికంగా తోడ్పడే సోలార్ డ్రైయర్లకు మంగళం పలికారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుదేలయ్యాయి. మహిళల కోసం కేంద్రం లక్పతి దీదీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదు.మహిళా సంక్షేమానికి ‘చంద్ర’ గ్రహణం అమలుకాని ‘ఆడబిడ్డ నిధి’ దిక్కేలేని సున్నా వడ్డీ రుణాలు చంద్రన్న బీమాకు మంగళం కాగితాలపైనే ‘లక్పతీ దీదీ’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పా హారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. నేరాలకు స్వస్తి పలకండి ● ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ఎక్కడ రాజీ పడేది లేదని, నేరాలకు స్వస్తి పలకకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్పీ సూచనల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. కుటుంబాల భవిష్యత్తు, సమాజంలో మంచిపేరు తెచ్చుకొని మార్పు చెందాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 24న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీలో విజిలెన్స్ అధికారుల దాడులు నంద్యాల(వ్యవసాయం): నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆదివారం విజయవాడ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు అకౌంట్స్ సెక్షన్లో తనిఖీలు నిర్వహించారు. వివరాల మేరకు అకౌంట్స్ సెక్షన్లో పని చేసే సిబ్బంది ఆర్టీసీ ఆదాయాన్ని తన అకౌంట్లోకి మార్చుకొని తిరిగి పది రోజుల్లో అకౌంట్లో జమ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ నివేదికను విజిలెన్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కర్నూలు(అర్బన్): శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం విషయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు తీర్మానం గిరిజనులను విడదీసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్‌నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు తీర్మానం చెంచులకు న్యాయం చేస్తూనే, గిరిజన లంబాడీలకు తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. ఆది వారం స్థానిక ఎల్‌హెచ్‌పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు నెలలో ఒక సారి శివ లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. అయితే కేవలం చెంచులకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తూ లంబాడీలను విస్మరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బోర్డు కమిటీ సభ్యులు మరో సారి సమావేశం నిర్వహించి నెలలో ఒక సారి గిరిజన లంబాడీలు కూడా స్పర్శ దర్శనం చేసుకునే విధంగా తీర్మాణం చేయాలని కోరారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తుపాన్‌తో పంటలకు నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించారు. పాణ్యంలో ఆదివారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తుపాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే తప్పుడు లెక్కలు చూపారని విమర్శించారు. ఖరీఫ్‌లో పండించిన వరికి గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. బస్తా ధర రూ.1400 మాత్రమే ఉందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదన్నారు. అరటి గెలలను రోడ్డున పడేస్తున్న దుస్థితి చూస్తున్నామన్నారు. యురియా మొదలుకొని ఇప్పటి వరకు అన్నదాతలకు పెట్టిన కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో త్వరలో తెలిసివస్తుందన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, వడ్డుగండ్ల రాముడు, బొజ్జన్న, జిల్లా వైఎస్సార్సీపీ ట్రేడ్ అధ్యక్షుడు చాంద్‌బాషా, బాబి, రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో వరి సాగు వివరాలు
వరి రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగిలాయి. గత ఏడాది ఖరీఫ్సీజన్లో చవి చూసిన నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు వరిసాగు చేస్తే తీవ్ర నిరాశే మిగిలింది. పంట చేతికి వచ్చిన సమయంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా రైతన్నలు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. కోవెలకుంట్ల: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విస్తారంగా వరిసాగైంది. 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా 65,255 హెక్టార్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 73,038 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల, షుగర్‌లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేశారు. ఇందులో బండి ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,588 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 6,868, శిరివెళ్ల మండలంలో 6,215, నంద్యాల మండలంలో 5,602, గోస్పాడు మండలంలో 4,950, అవుకు మండలంలో 4,447, పాణ్యం మండలంలో 4,320, వెలుగోడు మండలంలో 4,234 బనగానపల్లె మండలంలో 3,676, మహానంది మండలంలో 3,444 హెక్టార్లలో వరి సాగైంది. పైరు వివిధ దశలతోపాటు గత నెలలో కురిసిన భారీ వర్షాలు, మోంథా తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ఈ ఏడాది జిల్లాలో వరి సాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. గతేడాది నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు కర్నూలు, నంద్యాల సోనా రకాలకు చెందిన వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. నార, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, వరి కోత, నూర్పిడితో కలిపి ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో భారీ వర్షాలకు తోడు మోంథా తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజతాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి నేలవాలడంతో కోత, నూర్పిడి ఆలస్యమవుతుంది. యంత్రాలకు బాడుగ రూపంలో అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు దిగుబడులు తగ్గగా మరోవైపు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా 2,200 వరకు ధర పలికింది. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరకు విక్రయిస్తే కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.నియోజకవర్గం సాధారణ సాగు విస్తీర్ణం విస్తీర్ణం (హెక్టార్లలో) శ్రీశైలం 19,126 20,849 ఆళ్లగడ్డ 17,512 19,210 బనగానపల్లె 11,021 12,194 నంద్యాల 8,898 10,552 నందికొట్కూరు 3,068 4,158 డోన్ 427 255 పాణ్యం, గడివేముల 5,203 5,820 జిల్లాలో 73 వేల హెక్టార్లలో సాగైన వరి ఎకరాకు రూ. 35 వేలు పెట్టుబడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు గతేడాదీ ఇదే పరిస్థితి మార్కెట్లో మద్దతు ధర అంతంత మాత్రమే నష్టాల ఊబిలో అన్నదాతలు -
తక్కువ పెట్టుబడితో ఉత్పాదకత పెంచుకోవాలి
● జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మికర్నూలు(అగ్రికల్చర్): తక్కువ పెట్టుబడితో ఉత్పాదకత పెంచుకుని అధిక నికరాదాయం పొందుతూ వ్యవసాయంలో రాణించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీల్ వరలక్ష్మి అన్నారు. శనివారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో కర్నూలు డివిజన్ లోని రైతులు, వ్యవసాయ అధికారులు, వీఏఏలు, ఏఈవోలతో శాస్త్రవేత్తలకు కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. రసాయన ఎరువులు అడ్డుగోలుగా వాడవద్దని, భూసార పరీక్ష ఫలితాలకు లోబడి మాత్రమే వినియోగించాలని సూచించారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, శనగ, జొన్న, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కంది తదితర పంటల్లో చీడపీడల నియంత్రణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను వివరించారు. ఆత్మ పీడీ శ్రీలత మాట్లాడుతూ... ఆత్మ కార్యక్రమం ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమన్వయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్, బనవాసి కేవీకే శాస్త్రవేత్తలు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు, గూడూ రు, ఓర్వకల్, సీ.బెళగల్ మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
డెయిరీని అభివృద్ధి చేయడమే తప్పా
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘నేను చైర్మన్ అయ్యే నాటికి డెయిరీ రూ.50లక్షల లాభాల్లో మాత్రమే. ఆ తర్వాత ఏడాదికి రూ.15కోట్ల లాభాలను తీసుకొచ్చాం. పాల ఉత్పత్తిదారులకు రూ.18 కోట్లు, ఉద్యోగులకు రూ.3 కోట్ల ప్రకారం రూ.21 కోట్లు బోనస్‌లు ఇచ్చాం. టర్నోవర్ రూ.180 కోట్ల నుంచి రూ.360 కోట్లకు తీసుకెళ్లాం. డెయిరీని అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా..’’ అని కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. శనివారం ఆయన కర్నూలులోని విజయ డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను చైర్మన్ అయ్యాక అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కరి నుంచైన డబ్బు తీసుకున్నట్లు చేతనైతే నిరూపించాలన్నారు. కర్నూలు మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) ఆస్తుల్లో ఒక్క సెంటు భూమి/స్థలాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు నిరూపిస్తే తన యావదాస్తి భూమా అఖిలప్రియ కుటుంబానికి స్వాధీనం చేస్తానన్నారు. మంత్రి లోకేష్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసి.. శాసనసభలో తనపైన, డెయిరీపైనా అసత్యాలు చెప్పి పరువు పోగొట్టుకున్నారన్నారు. 2015లో జగత్ డెయిరీని ఏర్పాటు చేసి నడుపలేక 2020లోనే మూతవేశారన్నారు. అలాంటి మీరు కర్నూలు మిల్క్ యూనియన్ను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి చైర్మన్ పదవికే అనర్హుడని ఎస్వీ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన, ఎమ్మెల్యే కర్నూలు మిల్క్ యూనియన్‌కు రూ.1.30 కోట్ల బకాయి పడ్డారని, 2020 నుంచి ఈ బకాయి ఎంత మొత్తానికి చేరుకొని ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని నేరాలు, ఘోరాలు, అవినీతి మయం చేశారని.. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా అఖిలప్రియ పరిస్థితి ఉందన్నారు. నా మీద ఇప్పటికే పలు కేసులు పెట్టించారని.. కానీ ఉద్యోగులను కేసుల పేరిట వేధించడం మంచిది కాదన్నారు. మీ స్వార్థం కోసం డెయిరీని దెబ్బతీయవద్దని హితవు చెప్పారు. డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫెడరేషన్ ద్వారా ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నా ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ఇంకా ఎన్ని దర్యాప్తులకై నా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. యావదాస్తి మీకు స్వాధీనం చేస్తా లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? ముందు డెయిరీకి బకాయి పడిన రూ.1.30 కోట్లు చెల్లించండి ఎమ్మెల్యే అఖిలప్రియపై కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ధ్వజం -
పెండింగ్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు
ఆలూరు: కరువు, కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు అనేక హమీలను ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు వాటి జోలికే వెళ్లడం లేదన్నారు. ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు కాగా కేవలం రూ.30 వేల కోట్లతో గురురాఘవేంద్ర, ఆర్డీఎస్, వేదావతి, గుండ్రేవులు సహా అనేక ప్రాజెక్టు పనుల్లో కదలిక వస్తుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో రైతులు పండించిన ఉల్లి, పత్తి, మామిడి పంటలకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరను కూడా కల్పించలేకపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని దిగువ రాష్ట్రాలకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాంను నింపుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికై నా భావి తరాలకు ఉపయోగపడేలా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే సీమ ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ క్షమించరన్నారు. -
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల బహూకరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శనివారం శ్రీశైం, కొత్తపేటకు చెందిన సుద్దాల మహేష్ ఒక వెండి పళ్లెం, వెండి గిన్నె విరాళంగా సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగాణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. రెండు వెండి వస్తువుల బరువు 727 గ్రాములు ఉంటుందని దాత తెలిపారు. అనంతరం దాతకు రసీదును అందజేసి, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారు వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మార్గశిర మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. విద్యార్థి ఫెయిల్ అయితే ఉపాధ్యాయులదే బాధ్యత కొత్తపల్లి: పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులదే బాధ్యత అని జిల్లా విద్యాధికారి పి.జనార్దన్ రెడ్డి అన్నారు. సులభ రీతిలో విద్యను బోధించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. శివపురం గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి, వ్యక్తిగత శుభ్రత లేకపోవడంతో ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్‌ను తనిఖీ చేసి చిన్నారులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు. తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా నంద్యాల: తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు సంబంధించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎం మిషీన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేసేలా చూడాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు సాయిరాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
నంద్యాల: అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, సీడీపీఓ, సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు తాజా కాయగూరలతో పాటు వారి వయస్సును బట్టి విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. టీనేజ్ గర్భాలకు సంబంధించి బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డలో ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు అనే వివరాలను సోమవారం అందజేయాలని, ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గుండెల్లో ‘పైపులైన్’ గుబులు
ఓర్వకల్లు: పచ్చని పంటపొలాల మధ్య నిర్మించతలపెట్టిన పైపులైన్ నిర్మాణం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పూడిచెర్ల నాగుల చెరువు వద్ద పైపులైన్ నిర్మాణాన్ని రైతులు అడ్డుకున్నారు. ఓర్వకల్లు ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్‌లైన్ నుంచి వచ్చే రెండు టీఎంసీల నీటిని మీదివేముల సమీపాన జలాశయం నిర్మించనున్నారు. పైపులైన్ నిర్మాణం కోసం 54.74 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం గార్గేయపురం భూములకు ఎకరా రూ.12.50 లక్షలు, కేతవరం భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, పూడిచెర్ల భూములకు ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున ధరలు నిర్ణయించారు. గార్గేయపురం–కేతవరం మధ్య ఉన్న హంద్రీ–నీవా కాలువ నుంచి నీటిని కేతవరం, పూడిచెర్ల మీదుగా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు వద్ద నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ వరకు పైపులైన్ ద్వారా ప్రవహించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆమేరకు పైపులైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు సజావుగా జరిగాయి. వివాదం ఇలా.. పైపులైన్ నిర్మాణం పూడిచెర్ల వద్దకు రాగానే వివాదాస్పదం అయ్యింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా కేతవరం దగ్గర 1.30 ఎకరాలు, పూడిచెర్ల వద్ద 22 సెంట్లు, గార్గేయపురం వద్ద 1.50 ఎకరాల చొప్పున ప్రైవేట్ భూములు తీసుకున్నారు. ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బాధిత రైతులకు పరిహారం చెల్లించారు. అయితే పూడిచెర్ల వద్ద గల నాగుల చెరువు కట్ట మలుపు నుంచి ఊరుబయట పొలాల మధ్య పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించడం వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి పూడిచెర్ల గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండ పైభాగం నుంచి పైపులైన్ తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించివున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు 3.50 ఎకరాల మేర పొలాల భూములు ఇవ్వాల్సిందిగా రైతులను కోరారు. అయితే స్థానిక రైతుల్లో ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో అధికారులు చేసేదేమీలేక వెనుతిరిగి వెళ్లారు. పట్టా భూముల్లో పైపులైన్ నిర్మించేందుకు ససేమిరా పూడిచెర్ల పంట పొలాల్లో వివాదాస్పద నిర్మాణం కాంట్రాక్టర్‌కు ప్రయోజనమంటూ అడ్డగించిన రైతులు -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
చాగలమర్రి: మండలంలోని మూడురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 10 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.అంబాపురం శ్రీఅభయాంజనేయస్వామి విగ్రహ ప్రథమ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆర్గనైజర్ పూలి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో మద్దిరాళ్ల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి వృషభాలు నిలువగా రూ.50 వేలు బహుమతి, రెండవ స్థానంలో రాయవరం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి వృషభాలు నిలువగా రూ.40వేలు బహుమతి, మూడవ స్థానంలో చర్లోపల్లె గ్రామానికి చెందిన చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.30 వేలు, నాలుగో స్థానంలో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన విజయకుమార్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.20వేలు, ఐదవ స్థానంలో రాచమల్లు అనిల్ కుమార్‌రెడ్డి ఎడ్లు నిలువగా రూ.10 వేలు అందజేశారు. అలాగే 6, 7, 8, 9 స్థానా ల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 5 వేలు, రూ. 4 వేలు అందజేశారు. వ్యాఖ్యాతగా సదా శివారెడ్డి వ్యవహరించారు. -
వచ్చేనెల 13న మెగా జాతీయ లోక్ అదాలత్
నంద్యాల(వ్యవసాయం): మెగా లోక్ అదాలత్‌ను డిసెంబర్ 13న నిర్వహించనున్నారని, విజయవంతం చేయాలని న్యాయవాదులకు మూడో అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, కంపెనీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఈ బస్సులకు ఏమైంది?
హొళగుంద: ఏ సమయంలో ఎక్కడ నిలబడి పోతాయో తెలియని డొక్కు బస్సులను ఆర్టీసీ అధికారులు హొళగుంద మండలానికి తిప్పుతున్నారు. శనివారం మార్లమడికి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్టీసి బస్సు స్థానిక ఎల్లెల్సీ(తుంగభద్ర దిగువ కాలువ) వద్ద ఏయిర్ లాక్ కావడంతో నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ బస్సును ముందుకు నడిపేందుకు తీవ్రంగా ప్రయత్నించి వీలు కాక హొళగుందలోనే నిలిపేశాడు. అసలే మండలానికి అరకొరగా తిరిగే బస్సుల్లో ఆదోని డిపో అధికారులు పూర్తి కండిషన్ లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. బస్సులు కాలం చెల్లి, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతూ గ్రామాలకు కచ్చితంగా చేరుతామనే నమ్మకం కూడా లేదు. ఇటీవల కాలంలో బస్సులు మరమ్మతులకు గురై ఎక్కడబడితే ఆగిపోతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు గంటల పాటు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక విద్యార్థులు పాఠశాల నుంచి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. తరచూ ఈ సమస్యలు తలెత్తినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి మండలానికి కండిషన్లో ఉన్న బస్సులను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు. నారాయణ, రమణమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడోవ కుమారుడు వెంకటేశ్వర్లు(34) కార్తీక మాసం చివరి రోజు కావడంతో శుక్రవారం మహానంది పుణ్య క్షేత్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి వెళ్లిన అరగంటలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మార్గమధ్యలో మిడుతూరు మండలం తలముడిపి గ్రామ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి అన్న శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు నిత్యం వేగంగా , అధిక లోడుతో వెళ్లడంతో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రూ. 20 లక్షలతో ఉడాయించిన రికవరీ ఏజెంట్లు
● న్యాయం చేయాలని కోటక్ బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన నంద్యాల: రుణాల రికవరీ ఏజెంట్లు పని చేసే ముగ్గురు వ్యక్తులు రైతులను నట్టేట ముంచేశాడు. రైతులు బ్యాంక్‌కు చెల్లించిన కంతులను వసూలు చేసుకుని ఉడాయించారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం మహానంది, నంద్యాల, ఆళ్లగడ్డ, గోస్పాడు, బండిఆత్మకూరు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది రైతులు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు నుంచి దాదాపు రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కో కంతుకు రూ.75 వేల చొప్పున ఆరు కంతుల్లో చెల్లించేలా బ్యాంకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంకు అధికారులు ఉదయ్‌కుమార్, అస్లాం, అనిల్‌లను రికవరీ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు రైతుల నుంచి కంతులు వసూళ్లు చేసి దాదాపు రూ. 20 లక్షలు బ్యాంకులో జమ చేయకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కంతులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపారు. లోన్లు చెల్లిస్తున్నా నోటీసు లు ఎందుకు పంపారంటూ రైతులు శుక్రవారం బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించారు. తీవ్ర ఒత్తిడిలు తెస్తూ తమవద్ద నుంచి రికవరీ ఏజెంట్లు లోన్ డబ్బులు కట్టించుకున్నారంటూ రైతులు మేనేజర్‌కు వివరించారు. అంతకు మునుపు సంబంధిత రికవరీ ఏజెంట్లను రైతులు ఫోన్ల ద్వారా సంప్రదించగా స్పందన లేకుండా పోయింది. రికవరీ ఏజెంట్లు థర్డ్ పార్టీ కాబట్టి వారితో సంబంధం లేదన్నారు. తీసుకున్నా లోన్ మొత్తాన్ని రైతులే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకు షెట్టర్ మూసి నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినుల ఎంపిక
పగిడ్యాల/పాణ్యం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యా రు. పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పదవ తరగతి చదువుతున్న అమృత బోస్, పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంచె వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యార్థిని ఆర్. సుగుణ ఎంపికయ్యారు. వీరు నియోజకవర్గస్థాయి పోటీల్లో ప్రతిభ చూపార ని ప్రిన్సిపాళ్లు దినేష్‌బాబు, రమణమ్మ తెలిపారు. ఆర్. సుగుణ, అమృత్ బోస్ -
దొంగ దొరికాడు
వెలుగోడు: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సురేష్ కథ నం మేరకు.. గాంధీనగర్‌కు చెందిన కుప్పల రమణయ్య పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో పానీపూరి బండి పెట్టుకొని జీవ నం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రమణయ్య, అతని భార్య ఇంటి నుంచి సెంటర్‌కు వెళ్లి పానీపూరి బండి ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి, బీరు వాను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.60 వేల నగదు, 24 గ్రాముల బంగారు నెక్లెస్ (విలువరూ.1,35,000), రూ. 3000 విలువైన సెల్ ఫోన్ ఇలా మొత్తం రూ. 1,98,000 విలువ గల సొత్తు అపహరించారు. బాధితు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టగా శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో వెలుగోడు గ్రామ శివారులోని ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించా డు.అతని వద్ద నుంచి నగదు, నక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆత్మకూ రు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
పల్లెలు తూలుతున్నాయ్ !
బేతంచెర్ల/పాములపాడు: చంద్రబాబు సర్కారు మద్యం బాబులకు తాగినోళ్ల తాగినంత.. అన్నట్లుగా మద్యాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతోంది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అర్ధరాత్రి తర్వాత మద్యం విక్రయాలు కనిపించకపోయినా పక్కనే ఉన్న పల్లెల్లో మాత్రం గ్లాసులు గలగలమంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలకు అధికారుల గ్రీన్ సిగ్నల్‌తో పగలు, రాత్రి తేడా లేకుండా దర్జాగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో యువత మత్తుకు బానిసై చిత్తువుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలకు సైతం మద్యం దుకాణాలు రావడంతో మందు బాబులు పట్టపగలే పీకలదాగా తాగి రహదారులపై పడిపోతున్నారు. బేతంచెర్ల మండలంలో గతంలో పట్టణంలో నాలుగు, ఒక బార్, ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో రెండు మద్యం దుకాణాలు ఉండేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నూతనంగా సీతారామాపురం, సిమెంట్ నగర్ గ్రామాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. గతంలో పట్టణాలకే పరిమితమైన మద్యం దుకాణాలు గ్రామాలకు సైతం అందుబాటులోకి రావడం, మరో వైపు యథేచ్ఛగా బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో తాగినోళ్లకు తాగినంత అన్నట్లుగా నిత్యం మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. సీతారామాపురం గ్రామంలో మద్యం దుకా ణం ఏర్పాటు చేసిన రహదారిలో నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలో రైల్వే గేటు సమీపాన ఉన్న ఓ మద్యం దుకాణ దారుడు వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను చెత్త డస్ట్ బిన్లో వేయకుండా మద్యం దుకాణం వెనకాల ఉన్న శ్మశానం స్థలంలో వేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అలాగే మండల కేంద్రం పాములపాడులో మద్యం విక్రయాల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మందుబాబులు ఫూట్‌గా మద్యం సేవించి రోడ్లపై పడిపోతున్నారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ హోటల్ ముందు పడిపోయాడు. అలాగే మరో వ్యక్తి లింగమయ్య స్వామి అరుగుపై పొర్లుతూ కనిపించారు. వీరిని చూసిన జనం మద్యాన్ని విచ్చలవిడి విక్రయిస్తుండటంతో ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. -
సీనియర్ సహాయకులుగా ఆరుగురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, సీఈఓ జి.నాసరరెడ్డి నియామక ఉత్తర్వులను, పదోన్నతి ఉత్తర్వులను అందించారు. పేరు హోదా పదోన్నతిపై కేటాయించిన కార్యాలయం టి.కోటేశ్వరమ్మ టైపిస్ట్, పీఆర్ పీఐయు సబ్ డివిజన్, పత్తికొండ జడ్పీపీ, కర్నూలు వై.మద్దిలేటి టైపిస్ట్, కర్నూలు జడ్పీపీ, కర్నూలు ఎస్.జమీరుద్దిన్ జూనియర్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్, నన్నూరు ఆర్డబ్ల్యూఎస్, ఎస్ (పీ), సబ్ డివిజన్, బనగానపల్లి ఎ.నాగరాజు టైపిస్ట్, ఎంపీపీ, ఎమ్మిగనూరు పీఆర్ (పీఐయు), సబ్ డివిజన్, ఆలూరు నూర్ మహమ్మద్ టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, బనగానపల్లి టి.శ్రీదేవి టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, గడివేముల పదోన్నతి పొందిన వారిలో... -
రైతులను ఆదుకోవడంలో బాబు సర్కారు విఫలం
కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు సర్కారు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వంగాల భరత్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి కన్నా రెండింతలు రైతు సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశారన్నారు. ముమ్మాటికీ ఆయన రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైందన్నారు. ఏడాదిన్నరగా రైతులు అన్ని విధాలా నష్టపోతున్నా ఆదు కోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. పొగాకు, మిర్చి రైతుల ఇబ్బందులు తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాతనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా..? రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా... అని భరత్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 11.50 లక్షల క్వింటాళ్ల పత్తిని పండిస్తే అందులో 5.50 లక్షల క్వింటాళ్లు కర్నూలు జిల్లా దిగుబడేనన్నారు. మోంథా తుపాన్‌తో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినా పాలకులు పలకరించడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో సీసీఏ కేంద్రాలు పనిచేస్తున్నాయా..అని ప్రశ్నించారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఎంత మంది రైతులకు ఇచ్చారో.. ప్రకటించాలన్నారు. శనగ దిగుబడులు గోడౌన్లలో మగ్గు తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అరటి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. రూపాయికి కిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు నాయుడుకు అమరావతి భవనాల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రైతులు తిరగబడే రోజలు దగ్గర్లోనే ఉన్నా యని హెచ్చరించారు.. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున, మైనార్టీ నాయకులు పత్తా బాషా, ఆర్టీఐ నాయకులు గద్ద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● ధాన్యం సంచుల కింద పడి ఒకరు మృతి ● ఆరుగురికి తీవ్ర గాయాలు
మొక్కజొన్నల లారీ బోల్తా జూపాడుబంగ్లా: అతివేగానికి ఓ ప్రాణం బలైంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కర్నూలు – ఆత్మకూరు జాతీయ రహదారిపై శుక్రవారం తంగడంచ క్రాస్‌రోడ్డు వద్ద మొక్కజొన్నల బస్తాల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. తూడిచెర్ల గ్రామానికి చెందిన దొంతుల నరసింహులు గ్రామంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఐచర్ వాహనంలో నందికొట్కూరు సమీపంలోని గోదాముకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహ నం డ్రైవర్ షేక్బాషాతో పాటు బస్తాలను గోదాములో దింపేందుకు గ్రామానికి చెందిన హమాలీలు భరత్, యుగంధర్, శివరాజు, వెంకటేశ్వర్లు, నారాయణ, వెంకటరమణ, పుల్లయ్య వాహనంలో బయలుదేరారు. కాగా తంగడంచ క్రాస్‌రోడ్డు వద్ద డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉంచిన డ్రమ్ములను ఢీకొన్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంపైన ఉన్న వారిపై బస్తాలు పడటంతో భరత్(32)కు తీవ్రగాయాలై అక్కక్కడికే మృతిచెందాడు. వాహనం డ్రైవర్ షేక్‌బాషా పరారీ అయ్యా డు. క్షతగాత్రులను 108లో నందికొట్కూ రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భరత్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమణమ్మ, భార్య కళ్యాణి సంఘటనా ప్రాంతానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
యువకుడి బలవన్మరణం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. గౌరినాఽథ్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన భవానీప్రసాద్(23)కు గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాకపోవంతో మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్ పాణ్యం: పాణ్యంలోని స్టీల్‌ప్లాంట్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చాగలమర్రిలోని చిన్న మకన్మన్ వీధికి చెందిన ముల్లా వసీం ఆక్రమ్, ఆళ్లగడ్డలోని గడ్డంవీధికి చెందిన లంక అలెగ్జాండర్, కుమ్మరిదొడ్డి వీధి అవుకు పట్టణం(ప్రస్తుతం బనగానాపల్లెలో ఉంటున్నారు)కు చెందిన బురుగుల మనోహర్ ఉన్నట్లు చెప్పారు. మొత్తం రెండు కేజీల గంజాయి, ఒక పల్సర్ బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, ట్రైనీ ఎస్ఐ ధనుజంయ, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య డోన్ టౌన్: వ్యాపారం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన శ్రీనివాసులు (30) అనే వ్యక్తి గ్యాస్ స్టౌవ్‌లు రిపేరి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక బైకుపై డోన్ ప్రాంతానికి వచ్చి డోన్ – చిన్న మల్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య బైకును ట్రాక్ పక్కన నిలిపి గూడ్స్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడ్సు లోకో ఫైలెట్ సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. -
కక్ష ఎవరిది.. శిక్ష ఎవరికి?
రాతనలో అసంపూర్తిగా ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల భవనంతుగ్గలి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నాడు – నేడు పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీ కావు. పేద విద్యార్థుల కోసం చేపట్టిన భవనాలు చంద్రబాబు కక్షకు నిరుపయోగంగా మారాయి. ఇందుకు రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనమే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న నాడు –నేడు మన బడి పథకం కింద రూపురేఖలు మార్చేశారు. చదువులే పేదల ఆస్తి.. అంటూ విద్యా రంగాన్ని పరుగులు పెట్టించారు. చదువులమ్మ గుడిలో అభివృద్ధి దీపం వెలిగించారు. విప్లవాత్మక మార్పులతో సర్కారు బడులు కొత్త రూపుదిద్దుకున్నాయి. అదనపు గదులు, ప్రహరీలు, నూతన భవనాలు, మౌలికవసతులు పూర్తి చేసుకుని .. ఇవి ప్రభుత్వ పాఠశాలలా.. అన్నట్లుగా మార్పు చెందాయి. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం ఒకటి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు – నేడు కింద గ్రామ శివారులో నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేసింది. ఈ లోగా ప్రభుత్వం మారడంతో నాడు–నేడు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలు స్కూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక కక్ష గట్టి పనులు నిలిపివేసింది. ఉన్న నిధులను వాడుకునే వీలు లేకుండా ఫ్రీజ్ చేసింది. దీంతో పాత పాఠశాల భవనంలోనే విద్యార్థులు అవస్థల మధ్య విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 238 మంది విద్యార్థులు ఉండగా.. మూడు ఇరుకైన గదుల్లో మూడు తరగతుల కు బోధన సాగుతోంది. మిగిలిన రెండు తరగతులు వరండా, చెట్ల కింద నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 238 మంది విద్యార్థులు, 13 మంది ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఉన్న ఒక మూత్రశాల, ఒక మరుగుదొడ్డితో చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు. దీంతో ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక క్రీడా మైదానం లేక క్రీడలకు నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పాలకులు స్పందించి అసంపూర్తి పాఠశాలల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆన్లైన్ లైంగిక దాడులను ఎదుర్కొందాం
కర్నూలు: పిల్లల ఆన్లైన్ భద్రత విధానాలు, సైబర్ క్రైమ్స్ తదితరాలపై చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా (సీఐఎఫ్) సౌజన్యంతో స్థానిక న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆన్లైన్లో పిల్లలపై అనేక రకాలుగా లైంగిక దోపిడీలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎదుర్కొని పిల్లలను రక్షించాలన్నది సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. సైబర్ క్రైం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆన్లైన్లో జరిగే మోసాలను వివరిస్తూ వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయమై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శుభ్రత్ కుమార్ మాట్లాడుతూ పిల్లలపై ఆన్లైన్లో జరిగే లైంగిక దోపిడీని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, జ్యువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్స్, చిల్డ్రన్స్ వెల్ఫేర్, రెవెన్యూ, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, కోఆర్డినేటర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ కేవీ కొండప్ప పాల్గొన్నారు. -
బీఈడీ కాలేజీలకు నోటీసులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలోని మూడు బీఈడీ కాలేజీలకు గురువారం నోటీసులు ఇచ్చారు. సాక్షి దినపత్రికలో ‘ఉన్నట్టు...కనికట్టు’ అనే శీర్షికన గురువారం కథనం ప్రచురితం కావడంతో వర్సిటీ అధికారులు ఈ మేరకు స్పందించారు. డోన్‌లోని శ్రీసుధా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, గాయత్రి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పంచలింగాల గ్రామం చిరునామాతో ఉన్న బాలాజీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. ఆ కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆర్యూ పరిధిలో కర్నూలు జిల్లాలో 10, నంద్యాల జిల్లాలో మరికొన్ని కాలేజీలకు భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ కాలేజీలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ బి.విజయకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, ఫిర్యాదులు వచ్చిన మిగిలిన కాలేజీలకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
తెలుగుగంగ ఉప కాల్వకు గండి
రుద్రవరం: మండల పరిధిలోని టీ.లింగదిన్నె పొలిమేరలోని 23వ బ్లాక్ తెలుగు గంగ ఉప కాల్వకు గండి పడి సాగు నీరంతా వృథాగా పోతోంది. అయినప్పటికీ ఆ గండి పూడ్చేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి గండిని పరిశీలించి వెళ్లారే తప్ప పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు. మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా? ● ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం నంద్యాల(న్యూటౌన్): ‘మీ ఇంటిని కూడా ఇలాగే ఉంచుతారా’ అంటూ ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, బహిర్భూమికి బయటికి వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు. మూడు రోజుల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎంకు, ఎంఈఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. శిక్షణలో ఉచిత వసతి, ఆహారం, ప్రింటెడ్ స్టడీ మెటీరీయల్ అందిస్తామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో శిక్షణకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆవిష్కరించారన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా రెగ్యులర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు https://apstudycircle.apcfss.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27వ తేది నుంచి హాల్‌టిక్కెట్స్ పొందవచ్చని, ఈ నెల 30న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు డిసెంబర్ 10వ తేది నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 9493343866 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ సస్పెన్షన్ కర్నూలు(అర్బన్): నగరంలోని గిరిజన బాలికల గురుకులంలో ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి వెళ్లిన ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ సలోమిని సస్పెండ్ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణ జరిపి నివేదికను రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శికి పంపించగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు. -
రుణం తిరిగి చెల్లించేంత వరకు విఖ్యాత్ డీ ఫాల్టరే
విఖ్యాత్ రెడ్డి డెయిరీకి డీ ఫాల్టర్గా ఉన్న విషయాన్ని మరువ వద్దు. అప్పటి డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నుంచి జగత్ డెయిరీ పాల నాణ్యత చూపి రూ.1.20 కోట్లు రుణం తీసుకొని జగత్ విఖ్యాత్‌రెడ్డి డీ ఫాల్టర్ అయ్యాడు. రుణం తిరిగి చెల్లించేంత వరకు డైరెక్టర్ కాలేడు. 25 ఏళ్లు చైర్మన్‌గా మీ కుటుంబానికి చెందిన వ్యక్తులే పదవిలో ఉన్నారు. ప్రభుత్వం పోలీసుల చేతుల్లో ఉండటంతో నాపై మూడు కేసులు నమోదు చేయించారు. డెయిరీలో అవినీతి జరిగితే ఏ విచారణకు అయినా సిద్ధం. నాలుగున్నరేళ్లలో రూ.45కోట్లు డెయిరీకి ఆదాయాన్ని ఇచ్చాను. పాడిరైతులు, ఉద్యోగులకు డెయిరీ ఏర్పాటు నుంచి తొలిసారిగా బోనస్ అందజేశాం. డెయిరీకి అభివృద్ధికి కృషి చేయాలే తప్ప కుటిల రాజకీయం చేయవద్దు. – ఎస్వీ జగన్మోహన్రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్, నంద్యాల -
అడ్డగోలుగా జాబ్‌కార్డుల తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు సర్కారు రాజకీయ కక్షతో ఉపాధి కూలీల నోటికాడి ముద్దను లాగేస్తోంది. జిల్లాలో 3 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వీటిల్లో 5,56,672 మంది కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారని, ఉపాధి పనుల పట్ల ఆసక్తి లేదని, జాబ్‌కార్డు హోల్డర్లు మరణించారని తదితర కారణాలతో 44,501 జాబ్‌కార్డుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈ కారణంగా 1,23,997 మంది కూలీలు ఉపాధి పనులను దూరం కానున్నారు. తొలగించిన జాబ్‌కార్డుల వివరాలను పరిశీలిస్తే 80 శాతం మంది ప్రతి ఏటా ఉపాధి పనులకు వస్తున్నవారే. మాకు ఈ–కేవైసీ విషయమే తెలియదని.. మేట్/ఫీల్డ్ అసిస్టెంట్ ఆ విషయమే చెప్పలేదని కూలీలువాపోతున్నారు. జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంటు ఉంటారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత 300 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ–కేవైసీ జరుగుతుండటంతో పచ్చపాతం చోటు చేసుకుంటోంది. ఫలితంగా 1.23 లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోనున్నారు. నేడు గ్రామసభల్లో తొలగింపులకు ఆమోదం ఈ–కేవైసీ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో గ్రామసభలు నిర్వహించి జాబ్‌కార్డుల తొలగింపులకు ఆమోదముద్ర వేయనున్నారు. జిల్లాలో ఈ నెల 22న గ్రామసభలు నిర్వహించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. గోనెగండ్ల మండలంలో 4,788, వెల్దుర్తి మండలంలో 2,762, కోసిగి మండలంలో 3,148, కోడుమూరు మండలంలో 2,423, ఆలూరులో 2,261, దేవనకొండలో 2,963, నందవరంలో 2,306, ఆదోనిలో 2,093, సీ.బెళగల్ మండలంలో 2,147 చొప్పున ప్రకారం జాబ్‌కార్డులు తొలగించినట్లు స్పష్టమవుతోంది. మాకు ఉపాధి పనులే అధారం. ఎలాంటి వ్యవసాయ భూములు లేవు. ఉపాధి పనులు పెట్టని సమయంలో వలసపోతుంటాం. నాట్ విల్లింగ్ కారణం చూపి నా భార్య కోమలిక(ఏపీ –13–002–017–027/10703) ను ఉపాధి పనులకు దూరం చేశారు. ఈ–కేవైసీ విషయం మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఇలా ఏకపక్షంగా తొలగించడం అన్యాయం. – నరసప్ప, జమ్ములదిన్నె, కోసిగి మండలం 40,401 జాబ్‌కార్డుల తొలగింపుతో 1.23 లక్షల మంది కూలీలకు ఉపాధి దూరం మైగ్రేషన్, ఉపాధి పనుల పట్ల ఆసక్తి లేదనే కారణాలతో తొలగింపులు నేడు గ్రామసభలలో ఆమోదముద్ర -
ఆక్రమణకు ‘పచ్చ’జెండా!
‘లక్కీ’ భూదందాఅధికార పార్టీ నేతల భూ దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలమైనా సరే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అడిగిందే తడవుగా అధికారులు సైతం తల ఊపేస్తున్నారు. ఎలాంటి స్థలమైనా అప్పనంగా కట్టబెడుతున్నారు. ఆ తర్వాత స్థలాలను అమాయక ప్రజలకు విక్రయించి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ స్థలాలను అమ్మినా, కొన్నా నేరమే కావడంతో.. ఎప్పటికై నా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు కూలీనాలీ చేసుకొని కూడబెట్టుకున్న డబ్బును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.సాక్షి టాస్క్‌ఫోర్స్: గత కొంత కాలంగా బనగానపల్లె పరిసర ప్రాంతాల్లోని ఎస్సార్బీసీ స్థలాలు ఆక్రమణకు లోనవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. తాజాగా అధికార పార్టీ నేతల కన్ను కూడా ఆ స్థలాలపై పడింది. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అధికారులు సైతం ‘పచ్చ’జెండా ఊపేశారు. ఉమ్మడి ఆదివుశేన్రెడ్డి కుమారుడు ఉమ్మడి హుస్సేన్‌రెడ్డి అవుకు రోడ్డు నుంచి రవ్వలకొండ వేళ్లే దారిలో జలాల్బాబా దర్గా ఎదుట ఎస్ఆర్బీసీకి చెందిన 151/2 పైకి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 14 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు పథకం రచ్చించారు. లక్కీ డ్రాలను ప్రభుత్వం నిషేధించినా అడిగేవారు ఎవరని ‘అన్నపూర్ణ లక్కీ డ్రా’తో అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు. ‘పట్టా’గా రిజిస్ట్రేషన్ భానుముక్కలలోని సర్వే నంబర్ 151లో 13.45 ఎకరాలు ఉండగా మొత్తం విస్తీర్ణం ఎస్ఆర్బీసీ కాల్వ నిర్మాణానికి భూసేకరణ చేశారు. ఇందులో కాల్వ నిర్మాణం పూర్తయ్యాక మిగులు భూమి ఆక్రమణకు గురవుతోంది. రిజిస్ట్రేషన్‌కు 151 సర్వే నంబర్‌ను మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల డిప్యూటీ సర్వేయర్ 151/1,151/2గా సబ్ డివిజన్ చేయడం గమనార్హం. ఇందులో 151/1ను ఎస్ఆర్బీసీ కెనాల్ భూసేకరణకు 151/2 పట్టాగా మార్పు చేశారు. ఆ తరువాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 151/2 పైకి పేరిట 14 సెంట్లను టీడీపీ నేత ఉమ్మడి హుస్సేన్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. వంత పాడిన అధికారులు నిబంధనల ప్రకారం ఎస్ఆర్బీసీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చడం రిజిస్టేషన్ చేయించడం నిబంధనలకు విరుద్ధం. మండల తహసీల్దార్ కార్యాలయంలో సబ్ డివిజన్ చేయడం కూడా నేరమే. కానీ మండల డిప్యూటీ సర్వేయర్ సబ్ డివిజన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ నిబంధనలను తొక్కిపెట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్సార్బీసీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు మాట మాత్రమైనా అడ్డుచెప్పకపోవడం గమనార్హం. లక్కీడ్రాతో ప్లాట్ల విక్రయం అన్నపూర్ణ లక్కీ డ్రా పేరిట ఎస్సార్బీసీ స్థలం విక్రయానికి బనగానపల్లె ప్రాంతంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. బ్రోచర్లు ముద్రించి సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు. ప్రథమ బహుమతిగా 2.5 సెంట్లు, రెండు నుంచి 5వ బహుమతి వరకు 2 సెంట్ల ఓపెన్ ప్లాట్.. 6వ బహుమతి 1.26 సెంట్లుగా నిర్ణయించారు. కూపన్ ధర రూ.999లుగా నిర్ణయించి 3,600 మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. కూపన్లు మొత్తం విక్రయించిన తర్వాతనే లక్కీ డ్రా తీస్తామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అప్రూవల్‌కు పంచాయతీ అనుమతి తప్పనిసరి. కానీ పంచాయతీ అప్రూవల్ ఉందని, వాటర్ సప్లయ్ కూడా ఉందంటూ బురిడీ కొట్టిస్తున్నారు.ఎస్సార్బీసీ స్థలాన్ని ఆక్రమించుకున్న విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయంలో వాస్తవాలను పరిశీలిస్తాం. ఆక్రమణకు గురైనట్లు తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున ఈఈ ఎస్ఆర్బీసీ భానుముక్కలకు చెందిన సర్వే నంబర్ 151 పూర్తి విస్తీర్ణం ప్రభుత్వ భూమి. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదు. రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ఈ వ్యవహారం గతంలోనే జరిగింది. అందువల్ల నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు. – విజయకుమార్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, బనగానపల్లె అడ్డదారుల్లో అధికార పార్టీ నేత దురాక్రమణ ఓ మంత్రి అండదండలతో ఇష్టారాజ్యం అడ్డుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ అడ్డంగా సంతకాలు రూ.50లక్షలకు పైగా విలువైన స్థలం లక్కీడ్రా పేరిట అమాయక ప్రజలకు కట్టబెడుతున్న వైనం అధికారులకు తెలిసినా మౌనం -
శివ.. శివా.. నీవే మాకు రక్ష!
శ్రీశైలంటెంపుల్: కార్తీకం.. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం. ఈ నెలలో ఈశ్వరుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసిన దేవస్థాన అధికారులు ఆచరణలో మాత్రం విఫలం అయ్యారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘శివ.. శివా.. నీవే మాకు రక్ష’ అని కంపార్టుమెంట్లలో స్వామిని చేతులెత్తి వేడుకున్నారు. గంటల తరబడి నిరీక్షణ శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 22 నుంచి శుక్రవారం వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించారు. క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రేకులషెడ్డు కంపార్ట్మెంట్లలో పరిమితికి మించి భక్తులు కనిపించారు. చాలా మంది ఊపిరి అడక అవస్థలు పడ్డారు. చిన్నారులు, బాలింతలు, వృద్ధుల అవస్థలు వర్ణానాతీతం. కష్టాలను ఎదు ర్కొని కంపార్ట్మెంట్లు దాటుకుని వచ్చిన భక్తులు ఆలయ ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు చేరుకునేందుకు మళ్లీ గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, షుగర్ రోగులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే నిరసన తెలిపారు. ‘ఇదేం పాలన’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. పాలన అస్తవ్యస్తం ● కార్తీకమాసమంతా శని, ఆది, సోమ, రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శదర్శనాన్ని రద్దు చేశారు. అయితే వీఐపీల పేరుతో కొందరు దేవస్థాన ఉన్నతాధికారులే స్వయంగా ఆలయానికి వచ్చి దగ్గరుండి అన్ని క్యూలైన్లను మూసివేయించి స్పర్శ దర్శనం చేయించారు. ● సిఫార్సుల లేఖలకు ఇష్టం వచ్చినట్లు స్పర్శదర్శనం టికెట్లు ఇచ్చారనే అరోపణలు వచ్చాయి. ● సామాన్య భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం అవకాశం కలగలేదు. ● కొందరు దేవస్థాన అధికారులు అర్హత లేని వారితో ప్రధాన గేటు ద్వారానే ఆలయ ప్రవేశం చేయించారు. ప్రధాన గేటుకు ఉన్న ప్రతిష్టతను మంట కలిపారనే విమర్శ లు వచ్చాయి. ● ఆలయంలో దీపారాధన చేయడం లేదని చెప్పిన కొందరు అధికారు లు కుటుంబ సభ్యులతో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. శ్రీశైలంలో మోగిన అవస్థల గంట! కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులకు తప్పని తిప్పలు అధికారుల పర్యవేక్షణ కరువు ముగిసిన కార్తీక మాసం -
యువకుడి బలవన్మరణం
కోవెలకుంట్ల: స్థానిక ఎల్ఎం కాంపౌండ్‌కు చెందిన ఓ యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన రామారావు కుమారుడు రంగస్వామి(21) పట్టణంలో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఉదయం తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన యువకుడు ఉరి వేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భవనాశి వాగులో పడి రైతు మృతి చాగలమర్రి: కలుగొట్లపల్లె పంచాయతీకి మజరా గ్రామమైన నగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన పాడి రైతు మురబోయిన రామ సుబ్బరాయుడు(60), అతని భార్య లక్ష్మీదేవితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో భవనాశి వాగు వద్ద పశువులు మేపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత గేదెలు కనిపించకపోవడంతో వాగు అవతల చూసేందుకు నీటిలో దిగగా.. గుంతల్లో గల్లంతయ్యాడు. భార్య గమనించి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో గాలించగా రామ సుబ్బరాయుడు విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
మాయలూరులో పిచ్చి కుక్క దాడి
● ఆరుగురు ఆసుపత్రిపాలుఉయ్యాలవాడ: మాయలూరు బస్టాండు సమీపంలోని చికెన్ సెంటర్ వద్ద గురువారం ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అల్లూరు గ్రామానికి చెందిన లక్ష్మి హర్షవర్ధన్ ఆచారి 9వ తరగతి విద్యార్థి, మాయలూరు గ్రామానికి చెందిన వెంకటేష్ 10వ తరగతి విద్యార్థి వీరివురు పాఠశాలకు వెళ్తుండగా అక్కడ తిరుగుతున్న పిచ్చి కుక్క దాడి చేసి చేయడంతో కాలు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మాయలూరు గ్రామానికి చెందిన పెద్ద తిరుపాలు, పుల్లన్న అనే ఇద్దరు వ్యక్తులు రైతు పొలంలో కూలి పనికి వెళ్తుండగా వారి మీద కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ నలుగురికి అక్కడే వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సలు వైద్యాధికారి రాబర్డ్ కెనడి వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మధ్యాహ్నం అదే కుక్క గ్రామానికి చెందిన రామలింగారెడ్డి, రామసుబ్బయ్య అనే వ్యక్తులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, చుట్టు పక్కల వారు చుట్టుముట్టి పిచ్చి కుక్కను చంపేశారు. ఈఎన్టీ మురళీక్రిష్ణ, ఫైలట్ రాజారెడ్డిలు వీరిని 108లో ప్రథమ చికిత్స చేసి కోవెలకుంట్లకు తీసుకెళ్లారు. -
జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మద్దికెర: చత్తీస్‌ఘడ్‌లో ఐటీబీపీ జవానుగా పని చేస్తూ అనారోగ్యంతో మృత్యువాత పడిన మద్దికెరకు చెందిన కసాపురం నాగార్జునకు (32) గురువారం గ్రామస్తులు, ఆర్మీ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో సెలవుపై వచ్చి నాగార్జున బళ్లారిలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజులుగా అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, నాలుగేళ్ల కూతురు వున్నారు. గురువారం స్వగ్రామం మద్దికెరలో అంత్యక్రియలు నిర్వహించా రు. ఆర్మీ అధికారులు జవాను మృతదేహంపై జాతీ య పతాకం వుంచి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఐటీబీపీ ఆర్మీ అధికారులు ఎస్ఐ హరీష్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు లు, బాలాజీ, మద్దికెర పంచాయతీ సలహాదారు బండారు ఆంజనేయులు పాల్గొన్నారు. -
తిమ్మాపురంలో మహిళ ఆత్మహత్య
నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం గడివేముల మండలం బూజనూరు గ్రామానికి కరిష్మాకు(20) మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మొల్ల షఫివుల్లాతో వివాహమైంది. ఓపెన్ డిగ్రీ మూడోవ సంవత్సరం చదువుతున్న కరిష్మా ఈ నెల 21వ తేదీన పరీక్షలు ఉండటంతో నందికొట్కూరులో హాల్‌టికెట్ తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సున్నిపెంటలో సీసీ కెమెరాల మెకానిక్ పని చేస్తున్న భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. రేపు వెళ్దామని చెప్పంతో ఆమె మనస్తాపానికి గురైంది. వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నా.. నా కూతుర్ని బాగా చూసుకో’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అతను తిరిగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే సమీపంలోని బంధువులకు విషయం చెప్పాడు. వారు వెళ్లి చూసేపోలే కరిష్మా ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా కరిష్మా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిరాలికి 14 నెలల పాప ఉంది. మృతురాలి తల్లి రమిజాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కౌతాళం: కౌతాళం పోలీస్టేషన్ పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన వడ్డే కోటేశ్వరి గురువారం తుంగభద్ర దిగువ కాలువలో శవమై తేలింది. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కామవరం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు, ఈరమ్మల దంపతుల కుమారుడు వడ్డే వీరేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పులకల్ గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి కూతురు వడ్డే కోటేశ్వరి (21)తో వివాహమౌంది. ఏమి జరిగిందో తెలియదుకానీ తమ కూతురు కనిపించడం లేదని బుధవారం మద్దిలేటి కౌతాళం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా గురువారం పెద్దతుంబళం గ్రామం వద్ద తుంగభద్ర కాలువలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు బయటకు తీశారు. మృతి చెందిన మహిళ కోటేశ్వరిగా తండ్రి మద్దిలేటి గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 23 నుంచి రగ్బీ పోటీలు కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 23, 24 తేదీల్లో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రగ్బీ అండర్– 19 చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 కార్యదర్శి రాఘవేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం జీపు జాతా కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 23, 24 తేదీల్లో జీపు జాతా చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రామకృష్ణ తెలిపారు. గురువారం కార్మిక, కర్షక భవన్లో సీపీఎం మండల కమిటీ సమావేశం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు మండలం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నా సమస్యలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయన్నారు. రైల్వే వ్యాగన్ వర్కుషాపు పూర్తి చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. నాయకులు బాలపీర, శ్రీరాములు, నరసింహులు, బీసన్న పాల్గొన్నారు. తలసీమియా బాధితుల కోసం రక్తదానం కర్నూలు(హాస్పిటల్): సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ కర్నూలు ఆధ్వర్యంలో తలసీమియా బాధిత చిన్నారుల కోసం గురువారం కర్నూలులోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ ప్రారంభించి ఆయన కూడా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసీమియా బాధిత చిన్నారుల కోసం చేసే ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాగే యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. రక్తదానం ఆవశ్యకత, తలసీమియా వ్యాధి గురించి రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి వివరించారు. -
ప్రారంభానికి మోక్షమెన్నడో!
● నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని సచివాలయం ● పంచాయతీ భవనంలోనే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులుకోవెలకుంట్ల: గ్రామస్థాయిలో పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్‌క్లినిక్‌లకు రాజభవనాల తరహాలో అన్ని హంగులతో భవనాలు నిర్మించింది. కోవెలకుంట్ల మండలం రేవనూరులో రూ. 38.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. అనివార్య కారాణాలతో గత ప్రభుత్వం భవనాన్ని ప్రారంభించలేకపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోలేదు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భవనంలో అరకొర వసతులు ఉండటంతో ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. కొత్త భవనం చుట్టూ ముళ్లపొదలు పేరుకపోయి భవన ప్రాంతంలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
పాత తూకం.. కొత్త మోసం
ఆదోని అర్బన్: అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులు గద్దల్లా వాలి రైతు కష్టాన్ని దర్జాగా దోచుకుంటున్నారు. అధిక ధర ఆశచూపి తూకాల్లో మోసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆదోని వ్యవసాయ మార్కెట్లోనే నాణ్యత పత్తికి రూ.7,330 ధర పలుకుతోంది. అటువంటిది ఇతర రాష్ట్రం నుంచి వచ్చి పత్తి క్వింటాకు ఎలాగున్నా సరే రూ.7,300 ఇస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు పాత తక్కెడ తూకాలతో కోసిగి, కౌతాళం, హాల్వి మండలాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పెద్ద పెద్ద లారీలను తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కేవలం కుడివైపు 50 కేజీల రాళ్లను తాడుతో వేలాడదీడయం, ఎడమవైపు ఒక పెద్ద సంచిని వేలాడదీసి తూకం వేస్తు న్నారు. దీంతో 50 కేజీల పత్తికి గానూ 8 నుంచి 10 కేజీల వరకు తూకంలో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక క్వింటానికి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతు క్వింటాకు రూ.7300 ప్రకారం చెల్లించినా రూ.1466 చొప్పున నష్టపోవాల్సిందే. రోజుకు ఎనిమిది లారీల్లో తరలింపు.. మహారాష్ట్రకు చెందిన పత్తి వ్యాపారస్తులు 15 రోజుల నుంచి ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకు 8 లారీలు పత్తి దిగుబడులను కొనుగోలు చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒక లారీ వంద క్వింటాళ్లకు పైగానే ఉంటుంది. దీని ప్రకారం 800 క్వింటాళ్లు రోజూ లారీల్లో తరలిస్తున్నారు. 15 రోజుల్లో ఇప్పటి వరకు 120 లారీల్లో 96 టన్నుల పత్తిని మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి దిగుబడులను తక్కెడ తూకాల్లో వేయకూడదు. కేవలం ఎలక్ట్రానిక్ మిషన్‌లోనే తూకాలు వేయాలి. తక్కెడ తూకాల్లో మోసం ఉంది. అధిక ధర ఇస్తామంటే రైతులు మోసపోవద్దు. ముందుగా రాళ్లు, ముళ్లును సరి చూసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు అనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – శంకర్, తూనికల కొలతల శాఖ ఆదోని ఇన్చార్జి అధికారి పత్తి కొనుగోళ్లకు మహారాష్ట్ర వ్యాపారులు ఎక్కువ ధర ప్రకటించి పాత తూకాలతో మోసగిస్తున్న వైనం క్వింటానికి 15 కేజీలకు పైగా దోపిడీ ఎక్కడా కనిపించని ఎలక్ట్రానిక్ కాటాలు పట్టించుకోని తూనికల శాఖ అధికారులు -
మొక్కజొన్న పంట దగ్ధం
బనగానపల్లె: మండలంలోని యాగంటిపల్లె గ్రా మంలో గురువారం సాయంత్రం సోమన్నగారి రామకృష్ణారెడ్డికి చెందిన మొక్కజొన్న పంట నూ ర్పిడి దశలో ఉండగా ప్రమాదవశాత్తూ మూడు ఎకరాల్లోని పంట దగ్ధమైందని రైతు వాపోయాడు. పంట పొలాని కి కొంత దూరంలో ఎగిసిన మంటలు సుడిగాలి వల్ల మొక్కజొన్న పంటపై నిప్పులుపడ్డాయి. దీంతో మంటలు పంట మొత్తం వ్యాపించాగా బనగానపల్లెలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా.. నాలుగు ఎకరాల్లో పంట సాగు చేయగా.. మూడు ఎకరాల్లోని పంట కాలిపోయింది. -
మేలైన వంగడాలతో అధిక దిగుబడులు
డోన్ టౌన్: రైతులు మేలైన వంగడాలను ఎంచుకోవడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో ఉల్లి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ టీం సభ్యులు అన్నారు. కామగానికుంట్ల గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను బుధవారం వారు పరిశీలించారు. రైతులతో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.జే బ్రహ్మ, సెక్రటరీ మనోజ్, డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హేమంగ్ భార్గవ్, గుంటూరు డీడీహెచ్ జమదగ్ని మాట్లాడారు. ఉల్లి సాగు చేసే విధానాలు, పెట్టుబడి ఖర్చులు, ఉత్పత్తి, దిగుబడుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతులు పాటించాలని, నారుమళ్లను ఎత్తయిన మడుల్లో పెంచాలని సూచించారు. నీటి తడుల కోసం డ్రిప్ వాడాలని, సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వీరి వెంట కర్నూలు ఎన్హెచ్ఆర్డీఎఫ్ ఛీప్ శర్వానంద్, మహానంది ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఠాగూర్‌నాయక్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నాగరాజు, డోన్ ఉద్యానవనశాఖ అధికారి కళ్యాణి ఉన్నారు. -
చెంచులకు నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం స్థానిక చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం ఉచితంగా కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పి.రమేష్‌నాయుడు తెలిపారు. బుధవారం దేవస్థానం అన్నదాన భవన సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ధర్మకర్తల చైర్మన్ పి.రమేష్ నాయుడు అధ్యక్షతన మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. సమావేశంలో 14 అంశాలు చర్చించగా, 11అంశాలు ఆమోదించారు. 2అంశాలను వాయిదా, ఒక అంశాన్ని తిరస్కరించారు. సమావేశం అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కొత్తపల్లి మండలం శివపురంలోని కొలనుభారతి సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయంగా నిర్వహింపజేయాలని దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన భూములు, బంగారం, వెండి, ఎఫ్‌డిఆర్‌లు, నగదును దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారుల బృందం, ధర్మకర్తల మండలి సమక్షంలో త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. డిసెంబర్ 1వ తేది నుంచి మల్లన్న స్పర్శదర్శనం, అతిశీఘ్ర దర్శనం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. భక్తులు సూచనలు, సలహాలు స్వీకరించేందుకు పలుచోట్ల ఫిర్యాదులు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. -
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
బేతంచెర్ల: చిన్నారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాఠాలు బోధించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. యంబాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తినేలా చూడాలని, వారికి ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చామంతి పూలను, ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను చూసి రైతులను అభినందించారు. రైతు సంక్షేమమే లక్ష్యం బేతంచెర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. యంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఏం కిసాన్ డో విడత జిల్లా స్థాయి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లాలోని 2,06,052 మంది రైతులకు మెగా చెక్కును అందజేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రైతులకు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. రైతులు మిశ్రమ, అంతర పంటల మీద దృష్టి సారించాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నరసింహులు, డోన్ ఏడీ సునీత, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, ఏఓ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు కర్నూలు సిటీ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామంలో ఆమె మాట్లాడారు. అత్యధిక శాతం రైతులు లోకల్ విత్తనాలు వాడుతుండడం, ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు డివిజన్ కేంద్రాల్లో డివిజినల్ డెవలప్మెంట్ కార్యాలయాలను అన్ని హంగులతో త్వరలో ప్రారంభించనున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాల్లోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారులకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలకు అనుగుణంగా ఆయా భవనాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ నిధులు రూ.95.70 లక్షలను కేటాయించారు. ఫర్నీచర్ ఇతరత్రాలకు అదనంగా మరో రూ.10 లక్షలను వెచ్చిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ప్రతి డీడీఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామన్నారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా నియమితులైన డీడీఓ ఆయా డివిజన్లలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు గ్రా మ పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు. -
శ్రీశైలంలో టెండ‘రింగ్’
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు వచ్చాయి. తమకు నచ్చిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు తయారు చేశారనే ఆరోపణలు వినిపించాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల టెండర్లలో వివరాలు గందరగోళంగా ఉండటం విమర్శలకు, ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిబంధనల్లో మార్పులు ఇలా.. శ్రీశైలంలో ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 11రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు చలువ పందిళ్లు, అదనపు క్యూలైన్లు, తాత్కాలిక విద్యుద్దీకరణ తదితర 84 పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.13కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే వాటిలో వివరాలు, నిబంధనలు సక్రమంగా లేవని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్‌తో చేసే పనులకు సివిల్ క్లాస్ టెండర్ల నిబంధన, క్లాస్–5, క్లాస్–4, క్లాస్–3 ఉండాల్సిన పనులకు ఫర్మ్ రిజిస్ట్రేషన్లు.. ఇలా పలు పనుల్లో నిబంధనలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హర్డ్‌వేర్ మెటీరియల్, శానిటరీ మెటీరియల్ తదితర పనులకు సంబంధించిన టెండర్లలో సరైన వివరాలు కూడా పొందుపర్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు అయోమయానికి గురై టెండర్లు కూడా వేయలేదని తెలుస్తోంది. నయా ట్రెండ్‌కు శ్రీకారం శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో ఏదేని పని పూర్తి చేసిన తరువాత బిల్లు చెల్లించేటప్పుడు పర్సెంటేజీ ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ఇంజినీర్లు డబ్బులు తీసుకునే వారని సమాచారం. అయితే ఇకపై పర్సెంటీజీలకు హితవు పలికి కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై పనుల్లో పాట్నర్‌షిప్ అడుగుతూ ‘నీ కెంత..నా కెంత’ అని బేరసారాలు కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బేరం కుదిరితే ఏ పని చేయాలి, ఆ పనికి టెండర్ ఎంత కోట్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత వరకు పని చేయాలి, పనిని ఎలా పెంచుకోవాలని ఇంజినీర్లే కాంట్రాక్టర్లకు దగ్గరుండి సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రస్ట్‌బోర్డు దృష్టి ఏది? ఏ పనులు ఎంత మేరకు ఎలా చేయాలో దేవస్థాన ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్య ఇంజినీరు టెక్నికల్ అనుమతులు ఇస్తారు. దేవస్థాన ఈఓ పరిపాలన అనుమతులు ఇస్తారు. అనంతరం ఆయా పనులకు టెండర్లు పిలుస్తారు. భక్తులకు అవసరమైన పనులకే టెండర్లు పిలిచారా.. అనవసరమైన పనులకు పిలిచారా ? అని ఆయా టెండర్లను ట్రస్ట్‌బోర్డు దృష్టిసారించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా ట్రస్ట్‌బోర్డు దృష్టి సారించలేదని సమాచారం. ఇవీ ఆరోపణలు.. నిర్మాణంలో ఉపయోగించే ఇత్తడి, ఇనుముతో చేసిన సామగ్రి సరఫరా చేసేందుకు టెండర్ వేశారు. ఒకే సామగ్రికి రెండు, మూడు సార్లు టెండర్ పిలిచారు. టెండర్‌లోని నంబర్ 85లో ట్యూబ్ లెవల్ పైప్ సరఫరా ధర రూ.495, నంబర్ 97లో లెవల్ పైప్ సరఫరా ధర రూ. 455గా పొందుపర్చారు. ఎస్.నెం.2 టెండర్లో మూడు ఇంచుల బాబే నెయిల్స్ ధర రూ.346.96గా, హార్ట్‌వేర్ మెటీరియల్ సరఫరాలో అదే మూడు ఇంచుల బాంబే నెయిల్స్ ధర ఎస్.నెం.4లో రూ.210గా, ఎస్.నెం.42లో రూ.350గా కోట్ చేశారు. ఎస్.నెం.147 టెండర్లో బైండింగ్ వైర్ కట్టర్ 500గా నిర్ణయించారు. అది 500 బైండింగ్ వైర్ కట్టర్‌లా లేక 500 కేజీల బైండింగ్ వైర్ అని అర్థం కాలేదు. ధర రూ.400 కోట్ చేశారు. ఎస్.నెం.15లో కేజీ బైండింగ్ వైర్ ధర రూ.195గా కోట్ చేశారు. అలాగే చలువ పందిళ్లకు అనుభవం, ఫర్మ్ రిజిస్ట్రేషన్ పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఫ్లైవుడ్ సరఫరా టెండర్‌లోను ధర ఎక్కువగా ఉంది. క్వాలిటీ పొందుపర్చలేదు. చైన్ లింక్ మెష్ టెండర్లో ఇన్ని వేల చదరపు అడుగుల పని చేసిన అనుభవం పొందుపర్చారు. పేరుకు మాత్రం అన్లైన్ టెండర్లు అని దేవస్థాన ఇంజినీర్లు చెబుతున్నారు. ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లతో కొందరు ఇంజినీర్ల కుమ్మక్కు మల్లన్న ఆదాయానికి గండికొట్టే యత్నం తమ కాంట్రాక్టర్‌కే పనులు వచ్చేలా నిబంధనలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల టెండర్లలో వివరాలు లేని వైనం టెండర్లపై దృష్టిసారించని దేవస్థాన ట్రస్ట్‌బోర్డు -
పత్తి రైతుల ‘యాప్’సోపాలు!
● చుక్కలు చూపిస్తున్నకిసాన్ కపాస్ యాప్ ● పనులు వదులుకొని స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్న రైతులు ● వారం రోజులుగా స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు ● చోద్యం చూస్తున్నసీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ వారం రోజులుగా అష్టకష్టాలు.. కర్నూలు(అగ్రికల్చర్): నాలుగైదు నెలల పాటు రేయింబవళ్లు కష్టించి పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతులకు తలప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతోంది. పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్న తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖ అధికారులు, అటు వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి రోజు ఉదయ 10 గంటలకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉంటంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. అయితే ఓటీపీ నెంబరు ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు కనిపిస్తోంది. ఇదేమీ సీసీఐ మాయనో రైతులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యాప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులోని 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేయాలి. సామర్థ్యంలో కనీసం 50 శాతం కూడా కొనడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారం, పది రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. వందలాది మంది రైతులు అన్ని పనులు వదిలి పెట్టి పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోయింది. కొంతమందికి మాత్రం రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరకు ఫోన్ చేయవచ్చని యాప్‌లోనే ఉంది. ఇంతవరకు టోల్‌ఫ్రీ నెంబరు పనిచేసిన దాఖలాలు లేవు. స్లాట్ బుకింగ్‌కే ఇంత సమయం పడుతుంటే సీసీఐ కేంద్రం వద్ద తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ సూచనలు, ఆదేశాలను సీసీఐ పట్టించుకోవడం లేదని, అందువల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. -
తల్లిదండ్రులకు భరణం హక్కు
● పిల్లల నుంచి నిరాదరణకు గురైన వారు పొందవచ్చు ● జిల్లా జడ్జి కబర్ధి నందికొట్కూరు: పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు చట్ట ప్రకారం భరణం పొందే హక్కు ఉందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి అన్నారు. నందికొట్కూరు సమీపంలోని ఆశ్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి పి. మోహన్‌రావు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు భరణం పొందవచ్చన్నారు. న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన్ 15100కు ఫోన్ చేయవచ్చన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య, ఆత్మకూరు ఈఆర్డీఓ నాగజ్యోతి, మున్సిపల్ కమిషనర్ బేబి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అఖిల వ్యాఖ్యలు హాస్యాస్పదం
● ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు ● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఆసుపత్రిని తానే నిర్మించానని, డిసెంబర్లో ప్రారంభిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచడానికి వీలుకాదని 2017లో టీడీపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి 2023 డిసెంబర్లో తామే ప్రారంభించామని, ఇందుకు సాక్ష్యంగా శిలాఫలాకాలు అక్కడే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వార్డుల కోసం నిర్మాణం జరుగుతున్న గదులకు కూడా 2023లోనే భూమిపూజ చేశామన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసని, ఇప్పుడు అబద్ధాలు చెబితే ఎవరూ నమ్మబోరన్నారు. అబద్ధాల ప్రకటనలు మానుకుని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతుల కోసం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకనట చేసి ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు ● బంధువులను రైలు ఎక్కించి వస్తుండగా ప్రమాదం మహానంది: బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైలు ఎక్కించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన సీతారామాపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఎం.వెంకట కృష్ణ (22), అతని బంధువు నందవరం గ్రామానికి చెందిన తిమ్మయ్య బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి తిరిగి గోపవరం వస్తున్నారు. బైక్‌పై వస్తుండగా సీతారామాపురం సమీపంలో వడ్ల ట్రాక్టర్ రివర్స్‌లో వస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో లైట్ల వెలుతురులో సరిగా కనిపించలేదు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. వెంకటకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా తిమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. -
పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం
పత్తికొండ: వైద్య సేవలను దూరం చేస్తూ చంద్రబాబు సర్కారు పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని తేరుబజార్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదల ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యనభ్యసించేలా గత ప్రభుత్వంలో జగనన్న 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 కాలేజీలను ప్రారంభించడంతో, మరికొన్ని కాలేజీలు దాదాపు 50 నుంచి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటి నిర్మాణాలు పూర్తి చేయకుండా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణకు యత్నించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తున్నా చంద్రబాబు సర్కారకు చీమకుట్టినట్లుగాల లేదని విమర్శించారు. 18 నెలల కాలంలో రూ.2.50 లక్షలు కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు పేదలకు ఏమి చేశారని మండిపడ్డారు. అప్పుల్లో కనీసం 5వేలు కోట్లు కేటాయిస్తే చాలు 11 మెడికల్ కాలేజీలు పూర్తయి పేదలకు అందుబాటులోకి వచ్చేవన్నారు. ఇప్పటికే పేదవాడి సంజీవినిగా పేరుగాంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రస్టుపట్టించారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్‌దాస్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, జిల్లా ఎస్టీ సెల్ సంఘం అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, మండల కన్వీనర్ కారం నాగరాజు, నాయకులు టీఎండీ హుశేన్, లలితా రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. కాగితాల ఎంఓయూలు వద్దు
ఆదోని రూరల్: ‘సీఎం చంద్రబాబూ.. ప్రభుత్వం కాగితాల ఎంఓయూలు కాదు... కాసులు కురిపించే ఎంఓయూలు చేపట్టండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం ఆదోనిలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైజాగ్‌లో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఎంఓయూలు, ఉద్యోగాల కల్పనపై ప్రజలకు నమ్మకం కలగడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగానే మారుతోందన్నారు. విశాఖ వేదికగా ఆర్భాటంగా సీఐఐ పేరుతో సీఎం చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. సీఐఐ పేరుతో ఆర్భాటంగా చేసిన ఎంఈఓయూల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఏమి మేలు జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. 2014–19 మధ్యలో 1,761 ఎంఓయూలు చేసుకుంటే ఎన్ని ఎంఓయూలలో గ్రౌండ్ అయ్యాయో చంద్రబాబు చెప్పాలన్నారు. ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు ఇలా ఎంఓయూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేపట్టాలని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేవీపీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు జగన్నాథం, సీపీఐ నాయుకలు సుదర్శన్, వీరేష్, కల్లుబావి రాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ దిగ్గజానికి నివాళి
కర్నూలు(అగ్రికల్చర్): కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబల సుబ్బారావు పాయి 173వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో కెనరా బ్యాంకుకు 53 బ్రాంచీలు ఉన్నాయి. అన్ని బ్రాంచీల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. 1852 నవంబర్ 19న జన్మించిన ఆయన 1906 జూలై 1న కెనరా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుతం కెనరా బ్యాంకు 10 వేల శాఖలతో సేవలందిస్తోందని అధికారులు వెల్లడించారు. కర్నూలు శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకొని శిక్షణ పొందుతున్న వారికి జీరో ఖాతాలు ప్రారంభించి సురక్ష బీమా యోజన అమలుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించారు. -
మహిళ అనుమానాస్పద మృతి
● పరారీలో భర్త ● అనాథగా మూడేళ్ల చిన్నారి డోన్: డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన వివాహిత తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి మృతి చెంది, తండ్రి పరారీలో ఉండగా వారి కుమార్తె అనాథగా మిగిలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన పెయింటర్ కుమ్మలపాటి విజయ్‌కుమార్ పెద్దకుమార్తె మణి (25)ని ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని బసవనపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ధనరాజ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షల కట్నంతో పాటు 8 తులాల బంగారు, గృహోపకరణాలు పెళ్లి కానుకగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా పర్వతాపురంలో నివాసం ఉండే వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ధనరాజ్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. భార్య మణిపై అనుమానం పెంచుకున్న ధనరాజ్ వేధిస్తూ రెండు రోజుల క్రితం ఆమె పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని రిజిస్ట్రర్ చేసి ఇవ్వాలని విజయ్‌కుమార్‌పై ఒత్తిడి చేశాడు. మరుసటిరోజే మణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు ధనరాజ్ ఆమె కుటుంబీకులకు విషయం తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోలుకోలేక మృతి చెందింది. బుధవారం మృతురాలి మృతదేహానికి డోన్ పట్టణంలోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పో యి, తండ్రి దూరమై రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని విజయ్‌కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ధన్రాజ్పై హత్యకేసు నమోదు చేసినట్లు తెలిసింది. మణి (ఫైల్),అనాథగా మిగిలిన మూడేళ్ల చిన్నారి -
పుడమి తల్లి ‘ఉల్లి’కిపాటు
ట్రాక్టర్‌తో ఉల్లి పంటను దున్నుతున్న రైతు రైతు కష్టం నేలపాలు కావడంతో పుడమి తల్లి ఉలికిపాటుకు గురైంది. నాట్లు వేసి.. ఎరువు చల్లి.. నీరు కట్టిన చేతులతోనే పచ్చని పంటను దున్నేస్తుంటే మౌనంగా రోదించింది. నల్లటి నేలలో కలసిపోతున్న ఎర్రటి ఉల్లిని చూసి తల్లడిల్లింది. వరుసగా తన బిడ్డ నష్టాలు మూటగట్టుకుంటుంటే చలించిపోయింది. పెట్టుబడిని కోల్పోయి అప్పుల్లో దిగబడుతున్న రైతు ను ఆదుకునేదెవరంటూ ప్రశ్నించింది. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన రైతు పీవై. సురేంద్ర ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన తరు ణంలో మార్కెట్లో ధర లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కనీసం కూలీల ఖర్చు కూడా చేతికందే పరిస్థితులు లేకపోవడంతో బుధవారం పంటను తొలగించాడు. ట్రాక్టర్‌తో టిల్లర్ కొట్టించి దున్నేశాడు. చూసినా వారంతా అయ్యో అంటూ నిట్టూర్చారు. – పాణ్యం -
పర్యాటక కేంద్రంగా గాజులదిన్నె
గోనెగండ్ల: జిల్లాలో ఏకై క మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అయిన గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు ప డుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఏపీ టూరి జం శాఖ ఏఈ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సాజీత్, సుధారాణిలు జీడీపీలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఎకరా స్థలంలో చిన్న పిల్లలకు పార్కు, రెస్టారెంట్, అలాగే పర్యాటకులు, వికలాంగుల కోసం బాత్రుమ్‌లు ఏర్పాటుకు సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వే చేసిన ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
వేసవిలో మంచినీటి సమస్య తలెత్తరాదు
కర్నూలు (అర్బన్): రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ ఆదేశించారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఈఈ, డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు మెజార్టీ గ్రామాలకు నీటిని సరఫరా చేసే తుంగభద్ర దిగువ కాలువకు జనవరి నెలలో నీటి ప్రవా హం ఆగిపోయే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఎల్సీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపుకోవాలని సూచించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న వారి జాబితాలను ఈనెల 30 లోగా తయారు చేయాలని సూచించారు. సకాలంలో జాబితాలను రూపొందిస్తే వచ్చే నెల మొదటి వారంలో జరిగే సమావేశంలో వాటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటి సరఫరా పైప్లైన్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లోని నీటి ట్యాంకులను నిర్ణీత సమయంలోగా క్లోరినేషన్ చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని ఈఈలు అబ్దుల్ ఖాదర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో ఏదీ?
● అధికారుల తీరుపై బీజేపీ నేతల ఫైర్ వెలుగోడు: కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ మండల నాయకులు మరోసారి మండిపడ్డారు. ఇటీవల వెలుగోడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజకు బీజేపీ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేయగా, తాజాగా మంగళవారం వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించకపోవడాన్ని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నూలు నాగేశ్వరరావు తప్పుపట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 10న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ప్రారంభించారన్నారు. చేపల పెంపకం, ఉత్పత్తిని పెంచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోదీని జిల్లా, మండల అధికారులు విస్మరించడం సరికాదన్నారు. ప్రధానిని, బీజేపీ పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్‌కు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని ఫొటో లేని కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆకతాయికి దేహశుద్ధి
కోవెలకుంట్ల: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో మంగళవా రం ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆకతాయికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన ఓ మహిళ తన పిల్లలతో కిరాణా వస్తువులు కొనుక్కునేందుకు వచ్చింది. మహిళ షాపు వద్ద ఉండగా ఎనిమిది ఏళ్ల వయసున్న కుమార్తె అక్కడే రోడ్డుపై నిలుచుని ఉంది. అదే ప్రాంతంలో ఉన్న కోవెలకుంట్లకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బొంగు చిన్నారిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన తల్లి వెంటనే అక్కడికి చేరుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఆమెతోపాటు స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు –బైక్ ఢీ మరో యువకుడికి తీవ్ర గాయాలు శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్లో మంగళవారం ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దోర్నాల పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజావలి (35), స్నేహితుడు ముండ్లమూడి పాలకొండ స్వామి శ్రీశైలం నుంచి బైక్‌పై దోర్నాల వస్తుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో బస్సు ఢీకొంది. బైక్ నడుపుతున్న ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీశైలం ప్రాజెక్టు హాస్పిటల్‌కు తరలించారు. కాగా స్వామి శివమాలను శ్రీశైలం విరమణ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దోర్నాల పోలీసులు తెలిపారు. -
ఓవర్‌లోడ్ ఆటోలపై ఎంవీఐ కొరడా
వెల్దుర్తి: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఆటోలపై ఎంవీఐ రవీంద్రకుమార్ కొరడా ఝళిపించారు. పెద్దల్లారా..పిల్లలు జాగ్రత్త శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం కర్నూలు ఎంవీఐ రవీంద్రకుమార్ 44వ జాతీయ రహదారి చెరుకులపాడు, వెల్దుర్తి క్రాస్లు, వెల్దుర్తి ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో స్థానిక, హైవే పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పరిమితికి మించి బడి పిల్లల్ని తీసుకెళ్తూ, ప్రమాదకరంగా టాప్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న రెండు ఆటోల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. వాటిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఓవర్‌లోడ్‌తో పాటు సరైన పత్రాలు లేని కారణంగా రూ.20,220(రూ.14,410, రూ.5,710) జరిమానా విధించారు. ప్రమాదాలు, శిక్షలపై పలువురు ఆటో డైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సమయాల్లో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని గ్రామాలకు బస్సులు నడపాల్సిందిగా డోన్ ఆర్టీసీ డీఎం శశిభూషణ్‌ను కోరామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కర్నూలు : రాజీ పూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశమున్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి పోలీసు అధికారులకు సూచించారు. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జి.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువగా క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని వారి కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రబాబు, మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, అపర్ణ, అనూష, డీఎస్పీ వెంకటరామయ్య, ప్రమోద్ కుమార్, కర్నూలు దిశ పీఎస్ సీఐ రామయ్య నాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్‌తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఒడిశా యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శివ సర్కిల్లోని ఎస్బీఐ ఏటీఎం సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన టికెలాల్ ఒరియా(36) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన టికెలాల్ ఒరియా మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని సాయంత్రం ఎమ్మిగనూరుకు వెళ్లివస్తానని తోటి కూలీలతో చెప్పి బయలుదేరాడు. మంగళవారం ఉదయం ఏటీఎం ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడు ఉన్నాడు. గమనించిన కాలనీ వాసులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా చెన్నాపురం బట్టి వద్ద ఉన్న తోటి కూలీలను రప్పించి వివరాలు ఆరా తీశారు. కొన్ని రోజులుగా మృతుడు మూర్చవ్యాధితో బాధపడేవాడని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు. -
● 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం
దొంగ దొరికాడు కర్నూలు: ఇళ్ల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగను సి.బెళగల్ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. అతని వద్ద 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపర్చగా కోడుమూరు సీఐ తబ్రేజ్, బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్ రాజుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో డీఎస్పీ.. వివరాలు వెల్లడించారు. సి.బెళగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్నరెడ్డి ఇంట్లో సెప్టెంబర్ 25న చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులపై నిఘా ఉంచి విచారణ చేశారు. నేరం జరిగిన రోజు సీసీ ఫుటేజీల ఆధారంగా తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన గిర్నీ వెంకటేష్ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. బెళగల్ నుంచి చింతమానుపల్లె గ్రామానికి వెళ్లే దారిలో గుట్టల నాగమ్మ గుడి వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.9.25 లక్షల విలువచేసే 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనతి కాలంలోనే కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్ఐ వేణుగోపాల్ రాజు, ఏఎస్ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్, సత్యరాజు తదితరులను డీఎస్పీ అభినందించారు. -
ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు
● కర్నూలు నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీలో కొన్ని నెలల క్రితం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఓ ఇంటి రెండో అంతస్తులో తనిఖీ చేసి అక్కడ జూదం ఆడుతున్న బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ అండ ఉన్న ఒకరు ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలంగా జూదం సాగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ● తాజాగా ఉల్చాల రోడ్డు ఆదిత్య నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డోన్‌కు చెందిన హరి యాదవ్ ఇల్లు అద్దెకు తీసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార తతంగాన్ని నడిపించాడు. గతంలోనూ అతడు వేరే చోట అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహించడంతో యజమాని వెళ్లగొట్టినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ● కర్నూలు–గుత్తి రోడ్డులోని రామచంద్ర నగర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంటిని చుట్టుముట్టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు విటులు, ఐదుగురు సెక్స్ వర్కర్లతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. దీన్ని నిర్వహిస్తోంది మహిళ కావడం గమనార్హం. నివాసముండేది వేరే కాలనీలో అయినా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొన్ని నెలలుగా తతంగం నడిపించినట్లు విచారణలో బయటపడింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని జూదం, వ్యభిచారం, మద్యంపానం వంటి వాటిని నిర్వహిస్తున్నారు. జన సంచారం అంతగా ఉండని ప్రాంతాలు, కాలనీలు, యజమానులు లేకుండా ఉన్న ఇళ్లను ఇందుకోసం ఎంచుకుంటున్నారు. దీనివల్ల వేళాపాలాతో సంబంధం లేకుండా వచ్చి వెళ్లే వారిని అక్కడ జరిగే వ్యవహారాలను పట్టించుకునేవారు ఉండరు. నిర్వాహకులకు సంబంధించిన వారు లేదా సమాచారం అందుకున్న వారు మాత్రమే అక్కడికి వచ్చే వీలుంటుంది. ఫలితంగా అక్రమ తతంగానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదన్న ధీమా వారిని మరింత ప్రోత్సహిస్తోంది. పోలీసులనే బెదిరించే స్థాయిలో నిర్వాహకులు.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారికి ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో కొందరు తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరించే స్థాయిలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కర్నూలులో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంత్రి అండతో డెన్ నిర్వాహకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి విముక్తి పొందాడు. అలాగే కర్నూలు విష్ణు టౌన్షిప్ శివారులో భారీగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు ఓ రాజకీయ పార్టీ మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని దాడికి వెళ్లిన పోలీసు అధికారినే బెదిరించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఇలా మట్కా, పేకాట, వ్యభిచార నిర్వాహకులు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులనే బెదిరించే స్థాయిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. యజమాని దృష్టి సారిస్తేనే... ఇంటి కోసం వచ్చిన వారికి అద్దె, ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఠంచన్‌గా అద్దె చెల్లించాలని చెప్పడమే గాకుండా వచ్చిందెవరో పూర్తిస్థాయిలో ఆరా తీయాలి. అవసరమైతే వారి సంబంధీకుల వివరాలు తెలుసుకోవాలి. అన్నీ నిర్ధారించుకుని ఇంటిని అప్పగించాలి. యజమాని హోదాలో తరచూ ఇంటికి వెళ్తుండటం, తరచూ పరిశీలిస్తూ ఉండటం, నిర్వాహకులను పరిశీలించడం, వారు చేసే కార్యకలాపాలపై దృష్టి సారించడం తప్పనిసరి. ఇల్లు ఖాళీగా ఉందని.. ఎవరో ఒకరు వచ్చారని.. అడిగినంత అద్దె ఇస్తారని ఆశ పడే ఓనర్లు కొందరు.. నెలనెలా ఎంతో కొంత ఆదాయం వస్తుందని ముక్కూమొహం తెలియని వాళ్లకు ఇల్లు అద్దెకు ఇస్తున్న వారు ఇంకెందరు.. అయితే అద్దెకు అడిగే వారి స్వభావం తెలుసుకోకుండా, కనీస వివరాలను కూడా ఆరా తీయకుండా అద్దెకు ఇస్తే లేనిపోని తలనొప్పులు తప్పవంటున్నారు పోలీసులు. పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కల్పించిన వారవుతారని, ఒక్కోసారి కేసుల్లో కూడా ఇరుక్కునే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. – కర్నూలుచుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినా, వ్యక్తుల సంచారం కనిపించినా డయల్ 112, 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలి. మన చుట్టుపక్కల నివాసాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ -
● అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు ● తమ్ముళ్ల అండతో కాంట్రాక్టర్ నిర్వాకం ● పట్టించుకోని అధికారులు
అడిగేదెవరు! ప్యాపిలి: ఎక్కడైనా గ్రావెల్ తవ్వాలంటే అనుమతులు ఉండాలి. అయితే, తనకు ఇవేవి పట్టవని ఓ కాంట్రాక్టర్ తమ్ముళ్ల అండతో ఏకంగా అటవీ ప్రాంతంలో మట్టి తవ్వి తరలిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మామిల్లపల్లి నుంచి నల్లమేకలపల్లి వరకు కొత్తగా రోడ్డు మంజూరైంది. ఇటీవలే ఆ రోడ్డు పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేస్తున్నారు. ఈ గ్రావెల్‌ను మామిల్లపల్లి గ్రామ శివారు ప్రాంతమైన అటవీప్రాంతం నుంచి గత రెండు రోజులుగా యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా రోడ్డు వద్దకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో గ్రావెల్ తీయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, స్థానిక టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కదా అని కాంట్రాక్టర్‌కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ ప్రాంతం నుంచి జేసీబీ ద్వారా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
4 క్వింటాళ్లే కొంటాం
ఇప్పటి వరకు కొనుగోళ్లే మొదలు కాక రైతులు కన్నీరు కారుస్తుంటే మురారీ పవన్ ఆగ్రోటెక్ యాజమాన్యం ఎకరాకు 4 క్వింటాళ్లే కొంటామని చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సీసీఐ అధికారులు ప్రకటించినట్లుగా రైతులు ఎకరాలకు 7 క్వింటాళ్లు కొంటారనే ఆశతో ఆ మేరకు సరుకును తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక యాజమాన్యం చేతులెత్తేయడంతో మిగిలిన సరుకును ఏమి చేయాలని లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయల బాడుగలు చెల్లించి భారీ వాహనాలతో పత్తిని తీసుకొస్తే ఇక్కడ నిలువునా మోసం చేస్తున్నారని వాపోతున్నారు. అయితే 4 క్వింటాళ్ల మెలికతో కొనుగోలు కేంద్రం యాజమాన్యం మిగిలిన సరుకు అరకొర ధరతో కొనుగోలుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. వీరికి సీసీఐ కూడా వంత పాడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తి కొనుగోలు చేయనప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రారంభించారని, ఇక్కడికి వచ్చాక సాకులు చెబితే లారీల బాడుగలు, కూలీ ఖర్చులకు ఎక్కడి నుంచి తెచ్చేదని ప్రశ్నిస్తున్నారు. -
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి
● అధికారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని డ్వామా కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 686 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 652 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారన్నా రు. పరిశీలనలో ఉన్న మిగతా 32 దరఖాస్తులను కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఉత్పాదన సేవా రంగాల్లో 4 యూనిట్లకు మొత్తం రూ. 11.14 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్ మహబూబ్ బాషా, ఎల్డీఎం రవీందర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి, డీపీఓ లలిత భాయ్, రవా ణా శాఖ అధికారి శివారెడ్డి, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు వచ్చింది. మంగళవారం స్థానిక రాజ్యంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 34 రోజులకు హుండీల్లో వచ్చిన నగదు లెక్కించగా రూ.5,26,89,128 వచ్చింది. నాణేల రూపంలో రూ.14,58,100 సమకూరింది. అంతేగాక 80 గ్రాముల బంగారం, వెండి 1,610 గ్రాములు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకట్ష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి, ఏఈ కోనాపూర్ సురేష్ తెలిపారు. -
భారీగా కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు: గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడింది. వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన బోయ మహేష్ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. బోయ మహేష్ తన ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ భూమిలో 21 బాక్సుల్లో 2014 మద్యం బాటిళ్లను నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా ఈఎస్టీఎఫ్ ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె మండలం కై ప గ్రామానికి చెందిన తలారి కృష్ణ కర్ణాటక నుంచి మహేష్‌కు మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. ఇరువురిపై కేసు నమోదు చేశారు. మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరఫరాదారుడు తలారి కృష్ణ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రామచంద్ర, శాంతిరాజ్, అయ్యన్న పాల్గొన్నారు. -
చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళ్లెదుటే పత్తి రైతు గగ్గోలు పెడుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి. ఒక మంత్రి ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కానీ, అక్కడ జరుగుతున్న దోపిడీని ప్రశ్నించకపో
కొనుగోలు కేంద్రం ఏర్పాటైన మురారీ పవన్ ఆగ్రోటెక్ సముదాయం నంద్యాల(అర్బన్): పత్తి రైతు కష్టాన్ని కొనుగోలు కేంద్రాలు నిలువునా దోచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 15రోజులుగా 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోలు చేస్తుండగా.. నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని గత సోమవారం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. మంత్రి అండదండలు ఉన్నాయనో, లేక అడిగేవారు ఎవరనో కానీ మురారీ పవన్ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం యాజమాన్యం రైతులకు చుక్కలు చూపుతోంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 23,516 హెక్టార్లు కాగా.. తెగుళ్లు, ఇతరత్రా సమస్యలతో ఈ ఏడాది 7,211 హెక్టార్లలోనే సాగయింది. మామూలుగా 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా తుపాను ప్రభావంతో దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. ఇదిలాఉంటే ఎకరాకు 7 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ఘనంగా ప్రకటించారు. ఆ మేరకు రైతులు కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్‌ల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నంద్యాల మురారీ పవన్ ఆగ్రోటెక్లో ఏర్పాటైన సీసీఐ కొనుగోలు కేంద్రానికి గత రెండు రోజులుగా రైతులు దిగుబడులతో బారులు తీరుతున్నారు. అయితే స్లాట్ బుకింగ్‌లో ఏర్పడ్డ సమస్యలు పరిష్కారమైతేనే పత్తి కొనుగోలు చేస్తామంటూ యాజమాన్యం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రెండు రోజులుగా తిండీతిప్పలు మాని ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 15 రోజులుగా కొనుగోళ్లు గత 15రోజులుగా కర్నూలు జిల్లాలో 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 60 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. నంద్యాలలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయని పరిస్థితి. స్లాట్ ఓపెన్ కాకున్నా నాలుగు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఉందని నిర్వాహకులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్ని స్తే ఇష్టమైతే అమ్ముకో, లేదంటే నీ సరుకు నువ్వు తీసుకుపో అనే బెదిరింపులకు దిగుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్నా మంత్రులు కానీ, జిల్లా అధికారులు ఎవరూ సమస్యకు పరిష్కారం చూపకపోవడం గమనార్హం.కొనుగోళ్లు ‘తెల్ల’బోయి! స్లాట్ బుకింగ్ సమస్య పత్తి పండించిన రైతులు మొదట కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్‌లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి సీసీఐ అధికారులు స్లాట్ ఇవ్వాలి. ప్రస్తుతం జిన్నింగ్ సామర్థ్యంలో 50శాతానికి కూడా స్లాట్ బుకింగ్ జరగని పరిస్థితి. ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్న అధికారులు ప్రస్తుతం నాలుగు క్వింటాళ్లేనని మొండికేస్తున్నారు. అది కూడా స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాతే కొనుగోళ్లు మొదలు పెడతామని మెలిక పెట్టడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.రోడ్డునపడ్డ పత్తి రైతన్న స్లాట్ సమస్య కారణంగానే కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య కొలిక్కి వస్తే 4 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తాం. ఏడు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. అనుమతులు వస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. – రహమాన్, మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్తు
దొర్నిపాడు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని డీఈఓ జనార్ధన్‌రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఇటీవలే ఎంపీయూపీ నుంచి జెడ్పీహెచ్ఎస్గా అప్‌గ్రేడ్ కావడంతో వసతులు పరిశీలించేందుకు వచ్చారు. తరగతిగదులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయులు పనితీరు, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అనే దానిపై ఆరా తీశారు. 9వ తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించారు. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతారన్నారు. మొదటి బ్యాచ్ పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్నాభోజం పరిశీలించి విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓలు మనోహర్‌రెడ్డి, రామచంద్రయ్య, హెచ్ఎం లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. నేడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో బుధవారం దేవస్థాన ట్రస్టు బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఉదయం 10గంటలకు కమాండ్ కంట్రోల్ రూము వద్ద ఉన్న సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, క్షేత్ర అభివృద్ధిపై చర్చించనున్నట్లు వెల్లడించారు. వీబీఆర్‌లో చేప పిల్లల విడుదల వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మంగళవారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 21.15 లక్షల చేప పిల్లల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నంద్యాల జిల్లా జాయింట్ డైరెక్టర్ హిరా నాయక్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కర్నూలు అబ్జర్వర్ డా.రంగనాథ్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. అనుమానితులపై నిఘా అవసరం నంద్యాల: పాత నేరస్తులు, నేరచరిత్ర గల వారి కదలికలు, అనుమానితులపై నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసులకు సూచించారు.మంగళవారంపట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి నేరచరిత్ర, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని సీఐకు సూచించారు. కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడిన వారికి కిక్కు దిగేలా న్యాయమూర్తి జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్‌లను విస్తృతం చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మోతాదుకు మించి పట్టుబడిన 23 మందిని మంగళవారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ జేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ అపర్ణ తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ సీఐ తెలిపారు. -
ఎస్‌డబ్ల్యూపీసీలను వినియోగంలోకి తేవాలి
● జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సి.బెళగల్: గ్రామాల్లో చెత్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను (ఎస్‌డబ్ల్యూపీసీ) వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పలుకుదొడ్డి గ్రామ పంచాయతీలో పర్యటించారు. వీధులను, మురుగు కాలనువలను, నీటి సరఫరా పథకాలను పరిశీలించి రెగ్యులర్‌గా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి అజహర్ మహ్మద్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులోని ఎస్డబ్ల్యూపీసీను తనిఖీ చేసి తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ అంశాలను పీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. వానపాము ఎరువుల తయారీ, విక్రయాలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమై పలు అంశాలపై సూచనలిచ్చారు. సచివాలయం – 2ను తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, రికార్డులను తనిఖీచేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ మహేశ్వరి, కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉన్నారు. -
సీఎం చంద్రబాబు రైతు ద్రోహి
నందికొట్కూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ధ్వజమెత్తారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని పటేల్ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని అన్నదాతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పార్టీ నేత బుడ్డా శేషారెడ్డి సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షలో కూర్చొన్న డాక్టర్ దారాకు, జెడ్పీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు సాయంత్రం కాటసాని, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రైతులను విస్మరిస్తే ఉద్యమం ఉద్ధృతం చంద్రబాబు సర్కారు రైతులను విస్మరిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ దారా సుధీర్ హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం పంటల బీమా చేయకపోవడంతో రైతులు ఎంతో నష్ట పోయారన్నారు. జగనన్న పాలనలో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు నష్ట పరిహారం చెల్లించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొక్కజొన్న, ఉల్లి, పొగాకు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మోంథా దెబ్బతో రైతులు నిండా మునిగి గగ్గోలు పెడుతున్నా ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి కనీసం రైతులను పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. మధ్య దళారులు మొక్కజొన్నను క్వింట రూ.1,500 నుంచి రూ.1,700 వరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ కారణంగా చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నా పట్టించుకునేనాథుడే లేరని విమర్శించారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ.30 వేలు, కౌలు రూ.15 వేలు, ఉల్లి పంటకు ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నష్టాల పాలైన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కల్లిమున్నీసా బేగం, పర్వత యుగంధర్‌రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి నాగభూషణంరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జబ్బార్, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మోమిన్ మన్సూర్, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి, జిల్లా అధ్యక్షులు సురేష్‌యాదవ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుమల్లేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగార్జునరెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు కోకిల రమణారెడ్డి, మండలాల కన్వీనర్లు అశోక్‌రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, లోకేష్‌రెడ్డి, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి దారా సుధీర్ రిలే నిరాహార దీక్షకు వెల్లువలా సంఘీభావం -
కోటి కాంతుల కార్తీకం
● శ్రీశైలంలో వైభవంగా కార్తీక కడ సోమవారం వేడుకలు ● దీపారాధన చేసి ప్రత్యేక నోములు నోచుకున్న భక్తులు ● కనుల పండువగా లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు లక్షదీపోత్సవంలో పాల్గొన్న భక్తులుశ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కార్తీక మాసం చివరి సోమవారం నిర్వహించిన లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు కనుల పండువగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై బారులు తీరారు. భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకుని వేకువజామున 4.30 గంటల దర్శనాలు ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధరమండపం వద్ద కార్తీక దీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసి 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సం, పుష్కరిణిహారతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు లక్షదీపాలు వెలిగించి పూజలు చేశారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్ద ఉంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం దశవిధ హారతులు సమర్పించారు. ఆయా పూజల్లో శ్రీశైల దేవస్థాన ట్రస్టు బోర్డు చైర్మన్ పి. రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: పీజీఆర్ఎస్లో వచ్చిన వినతుల పరిష్కారంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, డీఆర్ఓ రామునాయక్, ఎస్డీసీలు, డీఆర్డీఏ పీడీ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి రీ ఓపెన్‌కు తావు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 140 వినతులు అందజేశారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని లారీ దగ్ధం
ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను లారీ ఢీకొని కాలిపోయింది. డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. బళ్లారి నుంచి నంద్యాలకు క్లింకర్ (సిమెంట్, కంకర మిశ్రమం) లోడుతో వస్తున్న లారీ చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో ఉన్న స్పీడు బ్రేకర్ దగ్గర డ్రైవర్ తన ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు తిప్పాడు. అదుపు తప్పిన లారీ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టింది. వెంటనే షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెలరేగిన మంటలు పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన బోయ రంగన్నకు సంబంధించిన వరి గడ్డి, జొన్న సోప్ప ఉన్న వాముల్లోకి పడడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీంతో సదరు రైతుకు రూ.50 వేలు నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఆలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో లారీ ముందు భాగం, పది టైర్లు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పరిపాలన చేతకాక దాడులు
హరోం హర!ఓం నమఃశివాయ.. హరహర మహదేవ..శంభో శంకర నామస్మరణ మార్మోగింది. కార్తీక మాసం కడ సోమవారాన్ని పురస్కరించుకుని శైవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి దీప దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇల కై లాసమైన శ్రీశైల మహా క్షేత్రం, మహానంది, యాగంటి భక్తజన సంద్రంగా మారాయి. శ్రీగిరిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధహారతులు కనుల పండువగా జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆయా క్షేత్రాల్లో స్పర్శదర్శనం రద్దు చేశారు. –సాక్షి, నెట్వర్క్ భక్తులతో కిక్కిరిసిన పాతాళగంగదీపారాధన చేస్తున్న భక్తులునంద్యాలలో ప్రత్యేక అలంకరణలో నాగలింగేశ్వరస్వామిబొమ్మలసత్రం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పరిపాలన చేతకాక టీడీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురం వైఎఎస్సార్సీపీ కార్యాలయా న్ని శనివారం టీడీపీ గూండాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నంద్యాలలో వైఎస్సార్సీపీ నేతలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఏసీఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్‌బాషా, సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించా రు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మంటగలుపుతున్న టీడీపీ నేతల కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీజీకి వినతిపత్రం అందించామన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా పోలీసులు చర్యలు తీసుకోకుండా విరుద్ధంగా వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం దివంగతనేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అంబేడ్కర్, దేవతామూర్తుల చిత్రపటాలను విసిరేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం సరైందికాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ఆజాద్, క్రిష్టియన్ మైనారిటీ అధ్యక్షులు కారు రవికుమార్, సెక్రటరీలు దేవనగర్‌బాషా, శివనాగిరెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టైలర్ శివయ్య, లీగల్‌సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి, లీగల్ సెల్ నాయకులు వివేకానందరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి అమానుషం పోలీసుల తీరు హాస్యాస్పదం జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి
● ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు ● మహిళ ఇంటిలో ఘటన ● దర్యాప్తు చేపట్టిన పోలీసులు డోన్ టౌన్: డోన్ పట్టణంలో ఓ మహిళ, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. స్థానిక రాజ్ టాకీస్ వెనుక వీధిలోని ఒక ఇంటిలో నివాసముంటున్న అశ్విని(35), పాతపేటకు చెందిన ఫరీధ్ (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందా రు. వీరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అశ్విని కుటుంబం గతంలో పాతపేటలో ఫరీద్ ఇంటి సమీపంలో ఉండగా, కొద్ది నెలల క్రితం రాజ్ టాకీస్ వెనుక ఉన్న వీధిలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి చేరింది. సోమవారం సాయంత్రం అశ్విని కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగా.. ఇంటిలో తల్లితో పాటు మరో వ్యక్తి మృతి చెంది కనిపించడంతో కేకలు వేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు అక్కడకికి చేరుకున్నారు. ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని, పరిసరాలను గమనించి ఉన్నతాధికారులకు, ఫోరెనిక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంటసీఐ రాకేష్, ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కాగా అశ్విని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అడ్డుకోబోయిన ఫరీద్ కూడా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని సీఐలు తెలిపారు. మృతుడు ఫరీద్ , అశ్విని (ఫైల్) -
ప్రజలపై మోయలేని విద్యుత్ భారం
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సర్కారు ప్రజలపై మోయలేని విధంగా విద్యుత్ భారం వేస్తోందని సీపీఎం జిల్లాకార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అన్నా రు. సోమవారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకమునుపు ట్రూ అప్చార్జీలను వ్యతిరేకించారని, గత ప్రభు త్వంపై భారాలు మోపుతోందని విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు రూ.24 వేల కోట్ల ట్రూ అప్చార్జీలు, సర్‌చార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని, అది చాలక మరోసారి రూ.12 వేల కోట్ల భారాలను వేసేందుకు పూనుకోవడం అన్యాయమన్నా రు. ఇప్పటికే కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసమయంలో మరోసారి ప్రజలపై భారం వేసేందుకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంగళవారం ఏపీఈఆర్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నా యకులు టి.రాముడు, అరుణ, వై.నగేష్, విజయ రామాంజనేయులు, సీహెచ్సాయిబాబ, సుధాక రప్ప, ఎస్ఎండీ షరీఫ్ పాల్గొన్నారు. -
మోసగాళ్లు దొరికారు
ఆళ్లగడ్డ: వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ రూ. కోట్లలో డబ్బులు వసూళ్లు చేసి చివరకు బోర్డు తిప్పేసి పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రమోద్ వివరించారు. 2023లో వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ పేరుతో నలుగురు వ్యక్తులు కంపెనీ స్థాపించి కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కంపెనీ, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు సృష్టించి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ కంపెనీల గ్రాఫ్ స్క్రీన్షాట్లు పంపాలని సూచిస్తూ వాటిని జాబ్వర్క్గా చూపించి నెలకు రూ.40 వేలు జీతం ఇస్తామని చెబుతూ ప్రజలను నమ్మించారు. మొదట కుటుంబ సభ్యులను చేర్చుకుని జీతాలు ఇస్తూ ప్రచారం చేశారు. దీంతో గ్రామాల వారీగా ప్రజల్లో ఆశ కల్పించారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశారు. ఇందులో అనంతపురం జిల్లా గొడ్డుమర్రి గ్రామంలో 250 మంది, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 950 మంది నుంచి ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. మొత్తం రెండు జిల్లాల నుంచి 1,200కి పైగా చేర్చుకుని వారి నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో బాధితులకు జీతాలు నిలిపి వేయడంతో అందరూ రోడ్డెక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బాధితులు వందల్లో ఉన్నారని తెలుసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అంతపు రాజారెడ్డి, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె గ్రామానికి చెందిన సింగతల ఉమామహేశ్వరరెడ్డి, దొర్నిపాడుకు చెందిన బాచిరెడ్డి వీరారెడ్డి, బాచిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని బాధితులు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సులభంగా డబ్బు వస్తుందని ఎవరూ ఇలాంటి మోసపూరిత పథకాలను నమ్మవద్దన్నారు. ఇలాంటి కంపెనీలు, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్త్ అండ్ హెల్త్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ 1,200 మందిని బాధితులుగా గుర్తించిన పోలీసులు రూ.35 కోట్లు వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడి -
మెదడులో కలకలం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ రోగులకు చికిత్స అందిస్తారు. ప్రతి ఓపీ రోజున 200 నుంచి 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఇందులో వీరిలో 20 శాతం మంది మూర్చ వ్యాధి బాధితులుంటున్నారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ఐపీ సేవలతో పాటు ఈఈజీ, ఎపిలెప్సీ స్టడీ సేవలు ఏడాదికి 3వేల మంది వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటే రూ.2 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. మూర్ఛ బాధితులకు అవసరమైతే ఎంఆర్ఐ, వీడియో ఈఈజీ పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనే గాక జిల్లా మొత్తంగా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్దకు వెళ్లే వారు ప్రతి నెలా మరో 10వేల మంది దాకా ఉంటారని అంచనా. కాగా ఇప్పటికీ గ్రామాల్లో కొందరు ఈ వ్యాధికి నాటు మందు తీసుకుంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వస్తున్నారు. మూర్చలో రకాలు–లక్షణాలు ● సాధారణ మూర్ఛలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్చలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. ● మయోక్లోనిక్ మూర్చలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలలో ఆకస్మిక విచ్ఛిన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లల్లో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. ● ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు.రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతులలో, కాళ్లల్లో తరచూ లాగుతుంది. చికిత్స మూర్ఛ వ్యాధులను 75 శాతం మందులతోనే నయం చేయవచ్చు. 25 శాతం మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి వారికి కూడా ముందుగా మందులు ఇచ్చి చూస్తారు. అయినా మందులకు లొంగకపోతే ఆపరేషన్‌కు సూచిస్తారు. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్చ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కాస్త బాగైందిలే అని మందులు మానిస్తే ప్రమాదం సంభవించవచ్చు. మూర్ఛవ్యాధి అంటే... మూర్ఛ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటి అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికై నా రావచ్చు. పెరుగుతున్న మూర్ఛ వ్యాధి బాధితులు అవగాహనే ఈ జబ్బుకు నివారణ కొద్దికాలం మందులు వాడితే నయం చికిత్సలో ఆధునిక మందులు, పరికరాలు నేడు జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినంఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్లూ, చేతులు కొట్టుకుంటూ నోట్లో నురగ వస్తుంటే అలాంటి వారిని చూసి మూర్చ వచ్చిందని భావిస్తాము. వెంటనే కొందరు వారి నుదుటన అదిమి పట్టి, చేతుల్లో తాళం చెవి పెట్టి అలాగే ఉంచుతారు. కొద్దిసేపటికే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా మారి మళ్లీ ఎలా వచ్చాడో అలా వెళ్లిపోతారు. సమాజంలో నిత్యం ఇలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాము. దీనినే వైద్యపరిభాషలో ఎపిలెప్సీ అని, సాధారణ పరిభాషలో మూర్ఛ/వాయి/ఫిట్స్ అని పిలుస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అవగాహన కలిగి ఉండటంతో పాటు సకాలంలో మందులు వాడితే ఈ జబ్బు నుంచి బయటపడొచ్చు. నేడు జాతీయ మూర్చవ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్చ వస్తుంది. -
ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు!
కోవెలకుంట్ల/కోడుమూరురూరల్/హాలహర్వి/కౌతాళం: చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంటలు పండక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పలు గ్రామ సచివాలయాలు అసంపూర్తిగా ఉండి అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మందుబాబులు మద్యం సేవించి సీసాలు పగులగొడుతున్నారు. ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు కనిపిస్తుండటంతో ‘ఇదేం పాలన’ అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తొలగని ‘దారి’ద్య్రం హాలహర్వి మండలంలోని గూళ్యం–బల్లూరు గ్రామ రహదారి కంకరతేలి గుంతలతో అధ్వానంగా మారింది. ఏడాదిగా గ్రామ రహదారి బాగుపడడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్లేందుకు వాహనాల్లో ఈ మార్గం గుండానే విద్యార్థులు వెళ్తుంటారు. రోడ్డుబాగా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి..ఆధోగతి కోడుమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గ్రామ సచివాలయ భవనం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ భవనంలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కొందరు ఆకతాయిలు నిత్యం మద్యం తాగుతున్నారు. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవనంపైనే కాంట్రాక్టర్ ఇసుక, కంకరను అలాగే వదిలేశారు. దీంతో వర్షాలకు నీళ్లు నిలిచిపోయి భవనం దెబ్బతింటోంది. అసాంఘిక చర్యలు కౌతాళంలోని కన్నడ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్‌లో విద్యార్థులు నిత్యం ప్రార్థన చేసే స్థలంలో బీర్ బాటిళ్లను పగలగొట్టారు. గాజు ముక్కల్ని చెల్లాచెదురుగా పడేశారు. పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఈ పాఠశాల ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల కాంపౌండ్‌లోకి దూకి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. విద్యార్థులు ప్రార్థన చేసే స్థలంలో ఇలా చేయడం చాలా బాధాకరం అని, వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మిరప పైరును తొలగించి.. కోవెలకుంట్ల మండలం రేవనూరులో ఇటీవల తుపాన్‌తో కురిసిన భారీ వర్షాలు మిరప రైతులకు కన్నీటిని మిగిల్చాయి. గ్రామానికి చెందిన హనుమంతు రెడ్డి నాలుగు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది జూలై నెలలో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. 90 వేలు ఖర్చు చేశాడు. నాలుగు నెలల పంట కావడంతో మొక్కకు 60 నుంచి 70 మిరప కాయలు కాశాయి. గత నెలాఖరులో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతో పైరులో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయి దెబ్బతినింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే మరో రైతు ఎకరా రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడున్నర ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. లక్ష చొప్పున పెట్టుబడుల రూపంలో వెచ్చించాడు. భారీ వర్షాలతో వేరుకుళ్లు తెగులు ఆశించి పైరు పూర్తిగా దెబ్బతినింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నమంతా వృథా కావడంతో విధిలేని పరిస్థితుల్లో పైరును తొలగించారు. అధికారులు పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం
నంద్యాల(వ్యవసాయం): యాంత్రిక జీవనంలో ఉండే అధికారులు ఆధ్యాత్మిక త చింతనతో ఒత్తిడి దూ రమై మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి కబర్ది అన్నారు. జిల్లాలోని పలువురు జడ్జీలు ఆదివారం నవనందుల యాత్ర చేపట్టారు. మొదట ప్రథమనందీశ్వరుడిని దర్శించుకుని అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. వారికి ఆల య ఈఓ ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం వారు అన్నదాన కార్యక్రమాల్లో పాలొన్నారు. ఆలయ నిర్వాహకులు జడ్జీలను శాలువాలతో సత్కరించి స్వామి వారి ప్రతిమలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్జిలు కమలాదేవి, అమ్మన్నరాజా, శ్రీవిద్య, రాజేంద్రబాబు, దివాకర్, శ్రీనివాసులు, కర్రి లక్ష్మి, నీలవెంకటశేషాద్రి పాల్గొన్నారు. -
‘వరి’ంచని ధర..
జిల్లాలో వరి సాగు 1,00,819 హెక్టార్లు. హెక్టారుకు 3 టన్నుల చొప్పున 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. రైతుల సొంత, స్థానిక అవసరాలు పోను 89,374 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అంచనా. ఇందుకు తగ్గట్టు జిల్లాలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కనీసం 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు దళారుల ఉచ్చులో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రం ఇటీవల ధాన్యానికి ఏ – గ్రేడు క్వింటా రూ. 2,389, సాధారణ రకం రూ.2,369గా మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన ఏ గ్రేడు రకం బస్తా (77 కిలోలు) రూ.1,840 ఉంది. జిల్లాలో దాదాపు అందరూ ఏ – గ్రేడు రకమే రకమే సాగు చేశారు. మద్దతు ధర రూ.1,840 ఉన్నప్పటికీ దళారులు ప్రస్తుతం బస్తా (77 కేజీలు) రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి బస్తా రూ. 1,200 నుంచి రూ.1,400కు మించి కొనుగోలు చేయడం లేదు. రైతులు, రైతు సంఘాలు ధాన్యం ధర పెంచాలని, మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని గగ్గోలు పెడుతున్నా పాలకులు, అధికార యంత్రాంగం కనీసం స్పందించడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో కోతలు వచ్చేసరికి ధర మరింత దిగజారుస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యాన్ని లారీలోకి లోడ్ చేస్తున్న దృశ్యం -
దర్శనం.. దూరా‘భారం’
మహానంది: మహానందీశ్వరుడి దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లను కొందరు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా, మరి కొందరు శీఘ్ర, లఘు దర్శనాల ద్వారా, ఇంకొందరు ఉచిత దర్శనం చేసుకుంటారు. సామూహిక అభిషేకం రూ. 1,500, స్పర్శదర్శనం రూ. 150, శీఘ్రదర్శనం రూ. 50, లఘు దర్శనం రూ. 20గా ఆలయ అధికారులు నిర్ణయించి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఆలయ అధికారులు క్షేత్రానికి వచ్చే ఆదాయంపై దృష్టి పెడుతున్నారే కానీ, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనం, రూ. 20 లఘు దర్శనం ద్వారా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండపాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడాల్సి వస్తోంది. పేరుకే లఘుదర్శనం టికెట్లు ఇస్తున్నారని, ఉచితం ఇదీ రెండు ఒకటే అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి వేచి ఉంటే కనీసం భక్తులకు ఫ్యాన్లు ఏర్పా టు చేయలేరా..? అంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు. రూ. 20, రూ. 50, ఉచిత క్యూలైన్ల ద్వారా అంత కష్టపడి ఆలయంలోకి వస్తే మహానందీశ్వ రుడి దర్శనం కనులారా చూసే భాగ్యం కూడా లేదని, దూరం నుంచే పంపించేయడం ఏంటనీ పలువు రు నిరాశ చెందుతున్నారు. టికెట్లలో వ్యత్యాసం ఉన్నా దర్శనం అంతా ఒకటేనని వాపోయారు. వృద్ధులు, వికలాంగులకు ఏర్పాట్లేవి.. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులను స్వామి గర్భాలయం వద్దకు వచ్చే సమయంలో స్వామివారికి దగ్గరగా నంది ముందు నుంచి పంపేవారు. వారిలో వృద్ధులు, వికలాంగులు ఉంటారు. అయితే భక్తులరద్దీ పేరుతో స్వామివారి గర్భాలయం ముందు ఉండే హుండీని అడ్డుగా పెట్టేసి మహానందీశ్వరస్వామి దర్శనాన్ని భక్తులకు దూరం చేశారు. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉండటం సహజం. మహానందిలో మాత్రం పుట్టాకారంలో ఉండటంతో దూరం నుంచి చూసే భక్తులకు మహానందీశ్వరుడు రూపాన్ని పూర్తిగా దర్శించుకోలేక పోతున్నారు. దీంతో ఓం నమఃశివాయ అనుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే సేవ పేరుతో వచ్చిన వారు గుంపులు గుంపులుగా ఒకటే చోట ఉండటం గందరగోళం నెలకొంటుందని కొందరు భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారినైనా దగ్గర నుంచి చూసే భాగ్యం కల్పిస్తారనుకుంటే అక్కడా దూరం నుంచే చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదివారం నంద్యాలకు చెందిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లాంటి క్షేత్రంతో పాటు ఏ ఆలయానికి వెళ్లినా వృద్ధులు, వికలాంగులకు కాస్త మినహాయింపు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కానీ మహానందిలో ఎలాంటి ఏర్పాట్లు లేవు. అఽధికారులు ఇప్పటికై నా స్పందించి భక్తుల ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మహానంది క్షేత్రంలో శీఘ్ర, లఘు దర్శనాలపై భక్తుల విమర్శలు స్వామి దర్శనంలో సాధారణ భక్తులకు ఇక్కట్లు వృద్ధులు, దివ్యాంగులకు కనిపించని ప్రత్యేక ఏర్పాట్లు -
అంతర్జాతీయ డాడ్జ్‌బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు
ఆదోని సెంట్రల్: అంతర్జాతీయ స్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు బి.వెంకట్ ఎంపికయ్యాడు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ డాడ్జ్‌బాల్ పోటీల్లో భారతదేశం తరఫున బి.వెంకట్ పాల్గొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ డాడ్జ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంబిరెడ్డి, సెక్రటరీ సాబీర్అహ్మద్ ఆదివారం తెలిపారు. ఈ క్రీడను ఒక జట్టుగా ఆడతారని, దీనిలో ఆటగాళ్లు తమ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బంతులతో కొట్టి అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. -
అమ్ముకోలేం.. దాచుకోలేం
పది ఎకరాల సొంత పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలు తీసుకుని 5 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల్లో వరి సాగు చేశా. మొక్కజొన్న కోత సమయంలో వర్షానికి తడిచిపోవడంతో క్వింటా రూ.1,200 చొప్పున అమ్ముకోవడంతో రూ. లక్ష నష్టం వచ్చింది. వరి పరిస్థితి ఇలాగే ఉంది. దళారులు బస్తా రూ.1,200, రూ.1,400గా ధర నిర్ణయించడంతో అమ్ముకోలేక, దాచుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. – మహబూబ్ సాహెబ్, చాగలమర్రి నేను 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పంట కోసిన సమయంలో వర్షం రావడంతో మొక్కజొన్నలు తడవటంతో రూ.1500కే అమ్ముకోవాల్సి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో క్వింటాకు రూ. 900 తక్కువకు అమ్ముకోవడం జరిగింది. ఈ లెక్కన సుమారు 240 క్వింటాళ్లకు రూ 2 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం ఉండేది కాదు. – రామకృష్ణ, రుద్రవరం, పాములపాడు మండలం ● -
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు కాలం కలిసిరావడం లేదు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరిసి అన్నదాతలు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మొక్కజొన్న, వరి, మినుము పంటలు చేతొకొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేని వర్షాలకు చేల
ఆళ్లగడ్డ: ఖరీఫ్.. రబీ.. సీజన్ ఏదైనా రైతులకు దుఃఖమే మిగలుతోంది. జిల్లాలో మొక్కజొన్న, మినము కోతలు ముగింపునకు రాగా.. వరి కోతలు మొదలయ్యాయి. కానీ టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ కింద సుమారు 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపఽథ్యంలో 15 నుంచి 20 క్వింటాళ్లకే పరిమితమైంది. అది సగం మంది రైతులు ధాన్యాన్ని ఆరబోసిన సమయంలో వర్షానికి తడిసి రంగుమారి, ముగ్గిపోయాయి. ఇదే అదునుగా భావించిన దళారులు ధరలను అమాంతం తగ్గించారు. కొనుగోలు కేంద్రాలు లేక పోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగినంత ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి. అక్టోబర్ నెలలో కోతలు మొదలయ్యే సరికి రూ. 2,200 ధర పలికింది. ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,600 వరకు తగ్గిపోగా.. ఒకనొక సమయంలో తడిచిన ధాన్యాన్ని రూ. 900 నుంచి రూ.1000 లోపే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులను గ్రామాల్లోకి రాకుండా కమీషన్ ఏజెంట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రకటిస్తే.. మార్కెట్లో క్వింటా రూ.700 నుంచి రూ.1,000 తగ్గించారని పంటను ఎలా విక్రయించాలని రైతలు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.35 వేలు ఖర్చు చేసినా 20 క్వింటాళ్ల దిగుబడి అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ లెక్కన ప్రతి రైతు ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున నష్టపోతున్నారు. ఈ మేరకు జిల్లా రైతులకు రూ.200 కోట్లకు పైగానే నష్టం వాటిల్లనుంది. అదనపు తూకం.. ఆగని మోసం వరి ధాన్యం బస్తా 75 కిలోలు. అయితే తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరగు కింద 2 కిలోలు, తేమ శాతం కింద మరో 2 కిలోలు లెక్కన దోచుకోవడం ఒక ఎత్తైతే ఎలక్ట్రానిక్ కాటాలో టెక్నిక్‌గా 4 నుంచి 5 కిలోలు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బస్తాకు 6 నుంచి 10 కిలోల వరకు అదనంగా లాగుతున్న విషయం బహిరంగ జరుగుతోంది. రవాణా చార్జీలు, హమాలీ కూలీల ఖర్చు నిమిత్తం బస్తాకు మరో రూ. 60 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు. వీటన్నింటి మూలంగా రైతన్నకు ఈ ఏడాది రమారమీ బస్తాకు రూ. 350 నుంచి రూ. 550 వరకు కోల్పోవాల్సి వస్తోంది. దిగుబడి దిగజారి.. ధరలు చేజారి ప్రకటనలకే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు కల్లాల్లో వాలుతున్న దళారులు నష్టాల్లో మొక్కజొన్న, వరి రైతులు -
నదీ జలాల పంపిణీలో సీమకు అన్యాయం
నంద్యాల(అర్బన్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర నదీ జలాల పంపిణీలో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి మండిపడ్డారు. నదీ జలాల పంపిణీలో సీమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పంద దినం పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ విలీనం జరగడంతో రాజధాని హైదరాబాద్‌కు తరలిపోయి.. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలు గళమెత్తినా చంద్ర బాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి సీమకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏర్వ రామచంద్రారెడ్డి, ఆకుమల్ల రహీం, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయమని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మూడో రోజు ఆదివారం గ్రంథాలయ ఉద్యమ నాయకులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించా రు. గ్రంథాలయ ఉద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణ య్య, పాతూరి నాగభూషణం, ముచ్చుకోట చంద్రశేఖర్ చిత్ర పటాలకు డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఆర్అండ్బీ డీఈ పి.ప్రేమకుమారి, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎస్ఆర్ రత్న రూత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠంతో మేదస్సు పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఇన్చార్జ్ సెక్రటరీ పెద్దక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, చంద్రమ్మ, నసీమా, రేణుక, పద్మావతమ్మ, ఈశ్వరమ్మ, ఉమ పాల్గొన్నారు. -
బియ్యం గింజలతో పరమ శివుడు
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజలతో పరమశివుడు రూపాన్ని ఆవిష్కరించారు. కుంచె, రంగులు లేకుండా స్కెచ్‌లు ఉపయోగించకుండా బియ్యపు గింజలను పలకమీద పోస్తూ చేతి వేలితో బియ్యపు గింజలను క్రమంగా సరి చేస్తూ శివయ్య రూపాన్ని ఆవిష్కరించారు. గంగాదేవి, సిగలో నెలవంక, మెడలో నాగరాజు(పాము), త్రిశూలం, ఓం ఆకారం, కార్తీక ప్రమిదలను చిత్రంలో రూపొందించడంతో కోటేష్‌ను పలువురు అభినందించారు. – నంద్యాల(అర్బన్) -
బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు
ఆదోని అర్బన్: బాలికను వేధించడంతో త్రీటౌన్ పోలీసులు బీజేపీ నాయకుడు మహేష్‌నాయక్ అనే యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు.. మహేష్‌నాయక్ అనే బీజేపీకి చెందిన నాయకుడు వేధిస్తున్నాడని శనివారం ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మహేష్‌నాయక్ ఎమ్మెల్యే ఇంటి ముందే వారితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇరువురు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బాలికను వేధిస్తున్నాడని బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మహేష్నాయక్పై బాలిక తల్లిదండ్రులు దాడి చేసినట్లు మహేష్‌నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ● కుంచం వెంకట సుబ్బారెడ్డి కర్నూలు(అర్బన్): రాయలసీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలనే డిమాండ్‌పై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలతో వేలకోట్ల రూపాయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాయలసీమ జిల్లాలో పర్యటించారని, ఏ ఒక్కరికి కూడా శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు నోరు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక రూపాల్లో నష్టపోతున్న రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తన తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం అపబోమన్నారు. రాయలసీమ ఎప్పటికై తే ప్రత్యేకంగా ఉంటుందో అప్పుడే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చూస్తున్న పాలకులు రాయలసీమపై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాయలసీమ రాష్ట్ర సమితి మైనార్టీ నాయకులు ఖాదర్ వలి, బి. ముసికిన్, సుభాన్, రాజశేఖర్, ఖాసీం వలి, మీడియా కోఆర్డినేటర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కర్నూలు (టౌన్): హిందూపురంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు విధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఆదివారం స్థానిక సీ.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులతో వైఎస్సా ర్సీపీ నాయకులను బెదిరించలేరన్నారు. ప్రజల్లో ఇప్పటికే బాబు సర్కార్‌పై పూర్తి వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. 24న డాక్టర్ ఖాదర్‌వలి కర్నూలు రాక కర్నూలు(అగ్రికల్చర్): ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ స్పెషలిస్టు, పద్యశ్రీ అవార్డు గ్రహాత డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 24న కర్నూలుకు రానున్నారు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీ.క్యాంపు సెంటరులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని అధితి చిరుధాన్యాల ప్రతినిధులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్వింటా పత్తిని రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలి కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పత్తిని క్వింటాలు రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఆదివారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంగళ, బుధవారాల్లో ఆదోనిలోని రోషన్ గార్డెన్స్‌లో జరిగే పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, రావుల వెంకయ్య, మాజీ మంత్రి రఘువీరారెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. తిప్పాయపల్లెలో దొంగలు హల్చల్ ఓర్వకల్లు: మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి దొంగతనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ బాలమద్దిలేటి, బైరాపురం చంద్రశేఖర్‌రెడ్డి, వడ్డె రవిచంద్రుడు ఇళ్లకు తాళం వేసి వేర్వేరు ప్రాంతాలో జీవనం సాగిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళం గడియలను ఆక్సిల్ బ్లేడుతో కోసి ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. కురువ బాలమద్దిలేటి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, బైరాపురం చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.30 వేల నగదు, వడ్డె రవిచంద్రుడు ఇంటిలో రూ.7 వేలు, ముల్ల బషీర్ అహ్మద్ ఇంట్లో సుమారు రూ.25 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం ఇంటికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. -
కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శివారులోని తుంగభద్ర బ్రిడ్జి దగ్గర కేసీ కెనాల్లోకి దూకి కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ అన్వర్(60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత 20 ఏళ్లుగా కిమ్స్ హాస్పిటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆదివారం ఉదయం మాసామసీదు వద్ద కేసి కెనాల్లో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్ తాలుగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంభ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పాతిమాతో పాటు కుమారుడు, కూతురు సంతానం. సోదరి కుమారుడు జావీద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నల్లమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘాట్‌రోడ్డులోని బొగద దొరబావి వంతెన వద్ద గిద్దలూరు నుంచి వస్తున్న లారీ, నంద్యాల నుంచి వెళ్తున్న కారు మలుపు వద్ద ఢీకొన్నాయి. కారు ముందు భాగం దెబ్బతినింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహానంది, శిరివెళ్ల మండలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. -
20 శాతం మంది మూర్ఛరోగులే...!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి వచ్చే రోగుల్లో 20 శాతానికి పైగా మూర్చరోగులే ఉంటున్నారు. తాము ప్రతి వారం దాదాపు వంద మంది మూర్చవ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాము. అవసరమైన వారికి ఈఈజీ, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయించి ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స చేస్తున్నాము. ఇక్కడ చికిత్సతోపాటు అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా రోగులకు అందిస్తున్నాము. –డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి విభాగాధిపతి, పెద్దాసుపత్రి ఈ వ్యాధికి ఆడ, మగా తేడా లేదు. వయస్సుతో సంబంధం లేదు. సున్నా నుంచి 90 ఏళ్ల వయస్సు వారి వరకు ఈ వ్యాధి రావచ్చు. కొందరికి పుట్టుకతో వస్తే, మరికొందరికి ప్రమాదాలు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్ల వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో పలు కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అది ఎందువల్ల వచ్చిందో వైద్యులు నిర్ధారించి చికిత్స చేస్తారు. కొందరు మాత్రమే దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. అధిక శాతం వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం మందులు వాడితే సరిపోతుంది. – డాక్టర్ బి.హైందవకుమార్రెడ్డి, న్యూరోఫిజీషియన్, కర్నూలు -
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రికి పెరిగెడతారు. పెంపుడు జంతువులకు సైతం పశు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి. మరి అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులకు అనుకోని ప్రమాదం జరిగితే... అనారోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటి? అరుదైన జంతు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్– శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ముఖ్య సంరక్షిత జంతువు పెద్ద పులి. దానికి అనారోగ్య సమస్యలు తలెత్తితే కనీసం పరీక్షించేందుకు మత్తు ఇవ్వాలన్నా హైదరాబాద్, తిరుపతి జంతు ప్రదర్శనశాలల నుంచి వైద్యులు రావాల్సి ఉండేది. ఇదంతా నాలుగేళ్ల క్రితం వరకే. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీలో 2021లో వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది అరుదైన వన్యప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ ఉన్న వైద్యులను నియమించారు. వారికి ఒక వెటర్నరీ సహాయకుడిని, ఒక న్యాచురాలజిస్ట్ (వన్యప్రాణి ప్రవర్తనను అంచనా వేసేందుకు), మరో ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని సౌకర్యాలు కలిగిన ఒక అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాహనం కూడా ప్రతి అటవీ డివిజన్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన అనిమల్ రెస్క్యూ వ్యాన్ కూడా ఉంది. ఓ వైపు అనుభవం ఉన్న వైద్యులు, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో అరుదైన వన్యప్రాణులకు రక్షణగా నిలుస్తున్నారు. సహజంగా అడవిలో ఏదో కారణంగా గాయపడిన వన్యప్రాణిని చేరుకోవడానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. నల్లమల అడవుల్లో విస్తారంగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలలో వన్యప్రాణుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఏదైన జంతువు గాయ పడిన విషయం సాధారణంగా కెమోరాల ద్వారానే తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ జంతువు సంచరించే ప్రాంతాన్ని గుర్తించి, దానిని పట్టుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెస్క్యూ పార్టీ విధులు ఇలా.. ● వన్యప్రాణులను రక్షించి తిరిగి అడవిలోకి వదలడం ● ప్రమాదవశాత్తూ మరణించిన వన్యప్రాణుల పోస్ట్‌మార్టం, దహనం ● పులి దాడిలో మరణించిన పెంపుడు జంతువుల పోస్ట్ మార్టం (లైవ్‌స్టాక్ డిప్రిడేషన్) ● అడవుల్లో అంటువ్వాధుల నిరోధం, పర్వవేక్షణ ● అటవీ సమీప గ్రామాల్లో పెంపుడు జంతువుల వాక్సినేషన్‌పై పర్యవేక్షణ ● వేటగాళ్ల దగ్గర లభించే మాంసాన్ని పరిశీలించి వన్యప్రాణి మాంసంగా నిర్ధారించడం ● అటవీశాఖ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ మానిటరింగ్ ● ట్రైనీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్లకు శిక్షణా కార్యక్రమాలు డిస్పెన్సరీ వైద్యుల విజయాలు.. ● నల్లమలలో అడవి పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం. ● రాష్ట్రం నలుమూలల చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల సమీపంలోకి వచ్చినపుడు వాటిని పట్టి తిరిగి అడవిలోకి వదలడం. ● అడవి దున్న (గౌర్)ను తిరిగి నల్లమలకు తెప్పించే ప్రాజెక్ట్‌లో సాంకేతిక సహాయకులుగా ఉండటం. ● డిస్పెన్సరీ వైద్యులు రక్షించిన వన్య ప్రాణుల్లో చిరుత, పెద్దపులులు, ఎలుగు బంటి వంటి జంతువులే కాకుండా పాంగోళిన్ (అలుగు), అడవిపంది, పునుగు పిల్లి, మొసలితో పాటు రకాల పక్షులు ఉన్నాయి. ● నల్లమలలో నాలుగు పెద్దపులి కూనలు తల్లికి దూరమై ఆత్మకూరు అటవీ డివిజన్లోని గుమ్మడాపురం గ్రామ శివార్లకు చేరుకోగా బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు వాటిని క్షేమంగా తిరుపతి జంతు ప్రదర్శన శాలకు తరలించారు. కాని అప్పటికే అవి మానవ స్పర్శకు అలవాటు కావడంతో వాటి వన్యజీవన విధానానికి దూరమయ్యాయి. అవి ఇప్పుడు తిరుపతి జూలోనే ఉన్నాయి. అడవిలో ఎవరి పర్యవేక్షణలో లేని వన్యప్రాణులకు వైద్యం చేయడం అత్యున్నత సేవగా భావిస్తాం. ఎన్నో రకాల వన్యప్రాణులకు చికిత్స చేసి అడవుల్లోకి తిరిగి పంపాం. నెమలి పిల్లలు, గద్ద(కై ట్) వంటి వాటికి ఇక్కడ చికిత్స అందించాం. అవి కోలుకుంటున్నాయి. పెద్దపులి లాంటి ముఖ్య రక్షిత వన్యజంతువు సంరక్షణ మాకు ఎంతో కీలకం. వన్యప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – డాక్టర్ జుబేర్, వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ పశువైద్యులు డ్రోన్‌తో గుర్తించి.. ఉచ్చు తొలగించి..వేటగాడు జింకల కోసం పన్నిన ఉచ్చు పెద్దపులి మెడకు బిగుసుకోవడంతో గాయపడింది. బైర్లూటి రేంజ్‌లోని ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఆ పులిని చిత్రీకరించడంతో విషయం తెలుసుకున్న బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు రంగంలోకి దిగారు. గాయపడిన పులి ఆవాస ప్రాంతం సమీపంలో ప్లాష్ కెమెరాలను ఉంచారు. పులి వాటి సమీపంలో వెళుతున్నప్పుడు ఆటో మేటిగ్గా ప్లాష్ వెలిగి పులి రాకపై సమాచారం అందడంతో అక్కడ మాటు వేసి దాని జాడను కనిపెట్టారు. వంద అడుగుల దూరం నుంచి ఓ వైద్యుడు ట్రాంక్విలైజర్ గన్‌తో మత్తు ఇచ్చాడు. ఆ తర్వాత డ్రోన్‌తో దానిని అనుసరించారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి చేర్చి ప్రత్యేక వాహనంలో బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీకి తరలించారు. పులి మెడకు వున్న ఉచ్చును తొలగించారు. ఆహార నాళానికి గాయం తీవ్రంగా ఉండడంతో వైద్యం అందించి తిరుపతిలోని జంతుప్రదర్శన శాలకు తరలించారు. అక్కడ వెటర్నరీ సర్జన్ల చేత ఆపరేషన్ చేసి గాయానికి కుట్లు వేశారు. వారం రోజులు పరిశీలనలో ఉంచారు. దురదృష్టవశాత్తు ఆ పులి కోలుకోలేక మరణించింది. క్షేమంగా 60 జింకల తరలింపు.. వన్యప్రాణులను ఒకచోట నుంచి మరో చోటికి తరలించడం అంటే అది ఒక పెద్ద టాస్క్. ఇలాంటి తరలింపుల్లో గమ్యం చేరేది 50 శాతం మాత్రమే. అయితే దేశంలోనే మొట్ట మొదటి సారి నూరుశాతం సక్సస్ రేట్‌తో పుట్టపర్తిలోని 60కి పైగా కృష్ణజింకలు, పొడదుప్పులను బైర్లూటీ డిస్పెన్సరీ వైద్యుల పర్యవేక్షణలో నల్లకాల్వ సెక్షన్‌కు తరలించారు. జింకలు తరలించే సమయంలో అవి తీవ్రమైన భయాందోళనకు గురవుతాయి. అకారణంగా వాటి శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగి అవి షాక్‌కు గురై రవాణాలో ఎక్కువ శాతం మరణిస్తాయి. అయితే బైర్లూటీ వైల్డ్‌లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ జుబేర్, డాక్టర్ అరోన్ వెస్లీల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రవాణా వాహనంలో చల్లటి నీటిని వెదజల్లే స్ప్రింక్లర్లు ఉంచడం, కుదుపుల్లో వాహనం అంచులకు తగిలి గాయపడకుండా కుషన్ ఏర్పాటు చేయడం, నల్లమలలో ఒక ఎన్‌క్లోజర్‌లో 10 రోజులు ఉంచి, ఈ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వాటిని అడవిలో వదిలారు. నల్లమలలో వన్యప్రాణులకో ఆసుపత్రి ఎన్‌ఎస్‌టీఆర్‌లో విస్తృత సేవలందిస్తున్న ౖబైర్లూటీ వెల్డ్ లైఫ్ డిస్పెన్సరీ గాయపడిన వన్యప్రాణులకు సత్వర చికిత్స -
ఫాస్టాగ్ లేకపోయినా స్మార్ట్ టోల్ సిస్టమ్
కర్నూలు: ఫాస్టాగ్ లేకపోతే ఇకపై టోల్ ప్లాజాల్లో డబుల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించే వాహనదారులు ఇప్పటివరకు టోల్‌ప్లాజాలో క్యాష్ (నగదు) చెల్లిస్తే డబుల్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు రూ.100 టోల్ ఉన్న చోట ఫాస్టాగ్ ఉంటే రూ.100, లేకపోతే నగదు రూ.200 వసూలు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 25 శాతం అదనంగా మాత్రమే అంటే రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధన ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం.. యూపీఐ చెల్లింపుల ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతాయి. నగదు లావాదేవీల్లో ఉండే అవినీతి, ఆలస్యం కూడా తగ్గుతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఈ మేరకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమోద పత్రం జారీ చేసింది. ఇకపై కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్‌హెచ్40)లోని టోల్ ప్లాజాల్లో స్టాటిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపు విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు ఫాస్టాగ్ లేకపోయినా సులభంగా క్యూఆర్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు–కడప జాతీయ రహదారిపై క్యూఆర్ యూపీఐ టోల్ చెల్లింపు అమలు ప్రారంభం కావడం వేలాది వాహనదారులకు పెద్ద ఉపశమనం. వాహనదారులు టోల్ బూత్ వద్ద ఆగి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. నగదు చెల్లింపులతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు. ట్రాఫిక్ తగ్గింపుతో పాటు పారదర్శకత కూడా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలతో టోల్‌ప్లాజాల్లో లైన్లు తగ్గి ట్రాఫిక్ కుదింపు, సమయం ఆదా అవుతుంది. – వి.మదనమోహన్, ప్రాజెక్ట్ హెడ్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే -
మినీ బస్సుకు రూ.86 వేల జరిమానా
కృష్ణగిరి: అమకతాడు టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) క్రాంతికుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక మినీ బస్సును ఆపే ప్రయత్నం చేయగా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. నిర్ఘాంతపోయిన అధికారి తేరుకుని మినీ బస్సును తన వాహనంలో వెంబడించి పట్టుకున్నారు. శ్రీసాయి విష్ణు ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు హైదరాబాద్ నుంచి యాగంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బస్సుకు ఫిట్నెస్ పత్రాలు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, చివరకు బస్సు డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు గుర్తించి బస్సును జప్తు చేశారు. రూ.86వేల జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించినట్లు ఎంవీఐ తెలిపారు. -
విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: పట్టణంలోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ముల్లాన్‌పేటకు చెందిన దినేష్, ప్రవళ్లికల కుమారుడు ప్రజ్వల్(15) శుక్రవారం రాత్రి ఇంట్లో దిమ్మెకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, చదువులో రాణించకపోవడం, త్వరలోనే పదవ తరగతి పరీక్షలు వస్తుండటంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.గుండె పోటుతో ఉపాధ్యాయుడి మృతి పాణ్యం/కొలిమిగుండ్ల: ఎంతో కష్టపడి ఆశల ఉద్యోగం సాధించి విధుల్లో చేరిన నెల రోజుల్లోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (37) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాణ్యం మండలం నెరవాడ సమీపంలోని గిరిజన బాలుర పాఠశాలకు నియమితులయ్యారు. సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా అక్టోబర్ 13న విధుల్లో చేరాడు. అంతకు ముందు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండేవారు. ఎట్టకేలకు డీఎస్సీలో ప్రతిభ చాటుకొని కొలువు సాధించడంతో జీవితంలో స్థిరపడేందుకు మార్గం సుగమమైంది. ఈలోగా విధి వక్రీకరించడంతో అర్ధాంతంగా మృతి చెందారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటనతో కుటుంబ సభ్యులు రోదనలు స్థానికులను కంట తడిపెట్టించాయి. ఎంఈఓ శ్రీధర్‌రావుతో పాటు నెరవాడ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, సిబ్బంది అవుకు చేరుకొని విజయ్‌కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఆదోని అర్బన్: ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేశాడని, ఆ బాలిక తల్లిదండ్రులు శనివారం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు వారిని చూసి.. మాటామాటా పెరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది.ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్ బండి ఆత్మకూరు: వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను శనివారం అరెస్ట్ చేసినట్లు బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా తెలిపారు. మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన కల్లూరి వెంకట రమణ, కల్లూరి వెంకటేశ్వర్లు, కలడి ఈశ్వరయ్య సెప్టెంబర్ నెలలో గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ వద్ద అడవి పందిని వేటాడుతుండగా అటవీ శాఖ సిబ్బంది వారిని వెంటబడించారు. అప్ప టి నుంచి పరారీలో ఉన్న ముగ్గురిని శనివారం గ్రామ ంలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు అటవీ అధికారి తెలిపారు. సమావేశంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీ సర్లు జి. రామకృష్ణ, వై. నాగేంద్రయ్య, బీట్ ఆఫీసర్ పరమేశ్వరి పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
కర్నూలు (సెంట్రల్): జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ఆదేశించారు. కోర్టు సముదాయంలోని న్యాయ సదన్‌లో శనివారం జిల్లాస్థాయి న్యాయాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల జడ్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈపీ కేసులను ఆరు నెలల్లోపు పరిష్కరించేందుకు చేయాల్సిన సవరణలపై పలు సూచనలు ఇచ్చారు. కోర్టు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్జీలు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన రాజ, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, ఇ.రాజేంద్రబాబు, ఎంవీ హరినాథ్ పాల్గొన్నారు. -
మసీదులో రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా బొమ్మలసత్రం: నంద్యాల జుమ్మామసీదులో రాజకీయాలు చేస్తున్నది ఎవరోప్రజలకు తెలుసని, అయితే మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ తమపై అబద్ధాలు చెప్పడం తగదని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. నంద్యాలలోని కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీ నాయకుడిగా ఎన్ఎమ్డీ ఫరూక్ ఇన్నేళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవంలో ఒక్క వ్యక్తికి కూడా మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీ పక్షపాతి కాబట్టే తనను మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా చేశారని, తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. అంతే కాకుండా మైనారిటీ మహిళకు మున్సిపల్ చైర్పర్సన్ హోదా కల్పించారన్నారు. జుమ్మామసీదు అభివృద్ధిపై మంత్రికి అవగాహనలేదని, అనుచితంగా మాట్లాడటం ఆయన హోదాకు సరికాదన్నారు. -
రైతు సేవా కేంద్రాల్లో వైద్య సేవలు బంద్
2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పశువుల ఆసుపత్రులు కేవలం 338 మాత్రమే ఉన్నాయి. మూగజీవాలకు సరైన వైద్య సేవలు అందడం లేదనే విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలలో కూడా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు రైతుభరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా మందులు సరఫరా అయ్యాయి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువైద్య కేంద్రాల సంఖ్య 721కి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుభరోసా కేంద్రాల్లో వైద్య సేవలు స్తంభించాయి. వీటికి మందుల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్బీకేలకు ప్రత్యేకంగా మందులు ఇవ్వమని.. ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డెస్పెన్సరీలు, గ్రామీణ పశువైద్యశాలలకు ఇస్తున్న మందుల నుంచే తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇస్తుండటం గమనార్హం. వీటిల్లోనే మందులు లేకపోతే రైతుభరోసా కేంద్రాలకు ఎలా ఇస్తారని పశుసంవర్ధక శాఖ అధికారులు వాపోతున్నారు. -
తెగిన ఆధారం
● చేనేత కార్మికులను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● అమలుకాని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోవెలకుంట్ల: చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అలాగే నేతన్నలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామని వాగ్దానం చేశారు. బాబు ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్న దాటినా ఉచిత విద్యుత్ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. జిల్లాలోని బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల పరిధిలోని ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో చేనేత కుటుంబాలు ఆ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. వీరంతా హ్యాండ్లూమ్, పవర్లూమ్ మగ్గాల ఆధారంగా వివిధ రకాల చీరెలు నేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వీరందరూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులు. కానీ ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి ఉచిత విద్యుత్ ప్రయోజనం దక్కలేదు. గత ప్రభుత్వంలో ఇస్తున్నట్లుగా 100 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తిస్తోంది. ఆపై విద్యుత్ వినియోగానికి వందలాది రూపాయాలు విద్యుత్ బిల్లు వస్తోందని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఇదే తరహా మోసం వర్షాకాలంలో చేనేత పరిశ్రమకు అంతరాయం కలుగుతున్నందున నెలకు రూ. 4 వేలు చెల్లిస్తామని, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వీటితోపాటు ఆరోగ్య ధీమా, చేనేత కార్మికులకు ఇళ్లు, షెడ్లు, పట్టణాల్లో జీ+3 భవనాలు అంటూ దాదాపు 18 రకాల హామీలు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. టీడీపీ హయాంలో చేనేతలకు ఒక్క రూపాయికూడా మంజూరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ విధానాలతో చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. అరకొర నిధులతో వీవర్స్ వెల్ఫేర్ ప్యాకేజీ అంటూ హడావిడి చేసి చేతులు దులుపుకుంది. ఆదరణపథకం కింద డబ్బులు కట్టించుకుని అరకొర సామగ్రి ఇచ్చి మమా అనిపించారు. నేతన్నలు తమను ఆదుకోవాలని ఎన్నిమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పింఛన్ పేరిట మోసం.. కష్టాలు ఇలా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, తదితర ప్రాంతాల నుంచి పట్టు చీరలకు సంబంధించి దారం, ఇతర సామగ్రి తెచ్చుకుని నంద్యాల జిల్లాలో చేనేత కార్మికులు చీరెలు నేస్తున్నారు. వపర్లూమ్ద్వారా ఒక చీర నేసేందుకు ఒక రోజు, హ్యాండ్లూమ్ ద్వారా రెండు రోజుల సమయం పడుతోంది. చీర నేసినందుకు రోజుకు రూ. 900 కూలీ వస్తోందని, ఈ మొత్తం ఏ మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం చేనేతలను అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేతల కుటుంబాలకు అండగా నిలిచింది. ప్రతి ఏటా రూ. 24వేలు ఆర్థికసాయం అందజేస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 848 చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా లబ్ధి చేకూరింది. కుదేలైన చేనేత పరిశ్రమకు పునర్జీవం పోసేందుకు అప్పటి ప్రభుత్వం 2019 డిసెంబర్ 21న నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్డర్లు లేక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అండగా నిలిచింది. ఐదు విడతల్లో జిల్లాలోని ఒక్కో చేనేత కుటుంబం రూ. 1.20 లక్షల సాయం అందుకుంది. ఐదు విడతల్లో చేనేతలకు రూ. 10.17 కోట్లు ఆర్థికసాయం అందింది. ఈ సాయంతో నేతన్నలు ఫెడల్ లూమ్స్, నూతన డిజైన్లు ఇచ్చే జక్కార్డ్లు, బాబిన్లు, కొనుగోలుతో వృత్తిని సాంకేతికంగా మార్పు చేసుకుని అభివృద్ధి పథకంలో పయనించారు. -
బ్యాంక్ సిబ్బంది రక్తదానం
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో 60 మంది బ్యాంక్ సిబ్బంది శనివారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించామన్నారు. రాష్ట్రంలో అత్యధిక వడ్డీని గ్రామీణ బ్యాంక్ ఇస్తోందన్నారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, విజిలెన్స్ ఆఫీసర్ సలీం, మేనేజర్ రవీంద్ర, సీనియర్ మేనేజర్లు అమీత్‌కుమార్, స్ఫూర్తి, కిరణ్, సృజన్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకర జీవనానికి, సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందన్నారు. డీఆర్ఓ రాము నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బంది కార్యాలయ ప్రాంగణంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, పరిసర పరిశుభ్రత వంటి శుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జేసీ, అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సులో 15 కేజీల వెండి చోరీ డోన్ టౌన్: జాతీయ రహదారి పక్కన ఒక హోటల్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రైవేట్ బస్సులో నుంచి 15 కేజీల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోంది. అందులో హైదరాబాద్‌కు చెందిన సంగ్రం అనే వ్యక్తి 15కిలోల వెండి తీసుకుని వెళ్తున్నాడు. శనివారం ఉదయం అల్పాహారం కోసం డోన్ సమీపంలో బస్సును ఆపగా బ్యాగును తీసుకోకుండా దిగాడు. ఈ సమయంలో ఒక కారు వచ్చి ఆక్కడ ఆగి ఇద్దరు వ్యక్తులు బస్సులోకి ఎక్కి వెండి ఉన్న బ్యాగును తీసుకొని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు డోన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లు నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికెట్, టీసీ, రెసిడెన్సీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం, ఆధార్ ఐడీ తీసుకొని కళాశాలకు నేరుగా రావాలని తెలిపారు. సివిల్స్‌కు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు తదితర జిరాక్స్ కాపీలను జతపరిచి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, కల్లూరు చిరునామాలో స్వయంగా వచ్చి దరఖాస్తులను ఈ నెల 25లోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు బీసీ భవన్, గొల్లపూడి, విజయవాడలో ఉచిత శిక్షణను అందించేందుకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటైందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వివరాలకు 08518– 236076 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
చట్టాలపై అవగాహన పెరగాలి
కర్నూలు(అర్బన్): ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కంటి వైద్యులు డాక్టర్ స్వాతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం, విద్యాబ్యాసం, దేశానికి చేసిన సేవలను వివరించారు. అలాగే విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, పేదరికం, నిరక్షరాస్యత, బాల కార్మిక సమస్య, అక్రమ రవాణా తదితర అంశాలపై ఆయన చట్టపరమైన అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి లోపం ఉన్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.విజయ, డీసీపీఓ టి.శారద, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, 3వ పట్టణ సీఐ శేషయ్య, వసతి గృహ సంక్షేమాధికారిణులు సులోచన, రజనీ, శైలజ పాల్గొన్నారు. -
ప్రతి పాఠశాలలో శుభ్రత తప్పనిసరి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రతి పాఠశాలలో శుభ్రతను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. పచ్చదనం పెంచడానికి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కూల్చి వేతకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో టాప్ స్థానం దక్కేలా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చేనెలలో జరగనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు సిద్ధమవ్వాలన్నారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ ప్రేమాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయితీలు చేయడం మీకే చెల్లు చరితమ్మా
కల్లూరు: ఓర్వకల్లు జయరాజ్ కంపెనీని టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్పడం హాస్యాస్పదమని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం సల్కాపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పంచాయితీలు చేసి ప్రజల నుంచి ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు, జయరాజ్ లిమిటెడ్ కంపెనీకి చంద్రబాబు కేవలం టెంకాయ మాత్రమే కొట్టారన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక జయరాజ్ అభివృద్ధికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించానన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు భూములు కోల్పోయిన రైతుల దగ్గర్నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారని, అలాంటి దిగజారుడు పనులు తామెన్నడూ చేయమన్నారు. అధికారుల ట్రాన్స్ఫర్లు, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై చరితమ్మ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తేదీ, సమయం చెబితే చర్చకు ఎక్కడికై నా వస్తామన్నారు. యాగంటీశ్వరస్వామి దగ్గరకు వెళ్లడానికి మీకు డీజిల్ ఖర్చు అవుతుందేమో, పాణ్యం నియోజకవర్గంలోని కాల్వబుగ్గ ఈశ్వర దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో కల్లూరు ఎంపీపీ శారద, సర్పంచు మద్దిలేటి, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రుద్ర పార్కులో కార్తీక వన భోజనాలు
శ్రీశైలం: దేవస్థాన ఉద్యోగులకు రుద్ర పార్కులో శుక్రవారం కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశారు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పి రమేష్ మాట్లాడుతూ.. వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడంతో రెట్టింపు ఫలితం లభిస్తుందన్నారు. శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్పతీర్థంగా కూడా మన పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మందుబాబులకు వినూత్న శిక్ష ఆళ్లగడ్డ: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఆళ్లగడ్డన్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మంది పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరు పరచగా మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు రూరల్ పోలీసులు నిందితులతో పట్టణంలోని నాలుగు రోడ్లకూడలితో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శన చేయించారు. రూరల్ ఎస్ఐ వరప్రసాద్ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారన్నారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇక్బాల్ బాషా కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యానికి చెందిన ఎస్. ఇక్బాల్ బాషాను నియమించారు. అలాగే కళాకారుల విభాగం ఆలూరు, కర్నూలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా వడ్ల మల్లికార్జున ఆచారి, కన్నా ప్రదీప్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. గోనెగండ్లలో డెంగీ కేసు గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల ఎస్సీ కాలనీలో 34 ఏళ్ల వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోడంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా డెంగీ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీంతో జిల్లా మలేరియా సబ్యూనిట్ అధికారి విజయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణుడు గోనెగండ్ల వైద్య సిబ్బంది శుక్రవారం డెంగీ సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. -
విజయ డెయిరీని కాపాడుకుంటాం
● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిఆళ్లగడ్డ: విజయ డెయిరీని ప్రజాస్వామ్య బద్ధంగా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు ఇద్దరూ ఆళ్లగడ్డలో అదృశ్యమైన సంఘటనపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు వెళ్తున్న ఇద్దరు అధికారులను ఆళ్లగడ్డలో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడం ఎంతవరకు సబబో చెప్పాలని ప్రశ్నించారు. ఉదయం కిడ్నాప్‌కు గురయ్యారని మరో అధికారి చెబుతున్నప్పటికీ రాత్రి వరకు వారి ఆచూకీ తెలుసుకోలేక పోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇప్పుడే వారు నంద్యాల ఇంట్లో ఉన్నట్లు ఫోన్లో మాట్లాడించడం జరిగిందన్నారు. అయితే ఉదయం నుంచి ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఒక సాధారణ గ్రామీణ డెయిరీ ఎన్నిక జరగకుండా ఏవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. డెయిరీ ఏర్పాటు చేసింది రైతుల కోసమని, ప్రభుత్వం మారితే చైర్మెన్‌ను మార్పు చేస్తున్నారని అప్పటి టీడీపీ ప్రభుత్వమే మాక్స్ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్లే దాన్ని తుంగలోకి తొక్కొందుకు యత్నిస్తున్నారన్నారు. అలా జరక్కుండా పోరాటాలు చేసి డెయిరీని కాపాడుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట విజయ డెయిరీ డైరెక్టర్లు గంగుల విజయసింహారెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. -
శ్రీగిరిలో ‘కోటి’ కాంతులు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి వెలిసిన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం నాలుగో శుక్రవారం రాత్రి దశమి ఘడియల్లో కోటి దీపోత్సవం కనుల పండువగా సాగింది. గంగాధర మండపం వద్ద ఏర్పాటుచేసిన కై లాస పర్వత భారీ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. మహాగణపతి పూజ, షోడ శోపచారాది ప్రత్యేక పూజలు నిర్వహించి కోటి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కోటి దీపోత్సవ ఆరంభ సూచనగా దేవత ఆహ్వాన పూర్వక దీపారాధన వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దశ హారతులుగా ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను సమర్పించారు. దీపారాధనతో దివ్యగుణాలు శ్రీశైల క్షేత్రం– కోటి దీపోత్సవంపై సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ దివ్య ప్రవచనాలను వినిపించారు. వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా చెబుతారని ఆయన తన ప్రవచనంలో పేర్కొన్నారు. ఉత్సాహం, ఆనందం, శాంతి మొదలైన వాటికి దీపాన్ని ప్రత్యేకంగా భావిస్తారని, దీపారాధనతో దివ్య గుణాలను పొందవచ్చు నని వివరించారు. పరమేశ్వరునికి దీపజ్యోతిని సమర్పిస్తే శుభాలు కలుగుతాయన్నారు. భక్తజన సంద్రం గంగాధర మండపం నుంచి నందిమండపం పురవీధిలో కోటి దీపోత్సవం కోసం ప్రత్యేకంగా చిన్నపాటి వేదికలను ఏర్పాటు చేశారు. దానిపై 365 వత్తులతో కూడిన ప్రమిదలను ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులను ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో వేలాది మంది ఆధార్ కార్డుల తో తమ పేర్లను నమోదు చేసుకొని కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ కాంతుల మధ్య దశ హారతుల వీక్షణతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం కై లాస పర్వత భారీ సెట్టింగ్ ప్రధాన పురవీధుల్లో ప్రజ్వరిల్లిన కోటి కార్తీక దీపాలు కార్తీక మాస దశమి ఘడియలలో భక్తులకు దివ్య అనుభూతి -
శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్రవారం శ్రీశైల దేవస్థానం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి దీపోత్సవం ఏర్పాట్లను గురువారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కైలాస పర్వతం సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఉత్సవంలో పాల్గొనే భక్తులకు అవసరమైన పూజాద్రవ్యాలన్నింటిని దేవస్థానమే సమకూర్చనుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. పరమేశ్వరునికి దివ్యజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాల్సిసినదిగా దేవస్థాన అధికారులు కోరుతున్నారు. -
జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో 50 శాతం డయాబెటీస్ రోగులే ఉన్నారు. షుగర్ రోగులు వారి మూత్రంలో యూరిన్ ప్రొటీన్ ఎక్కువగా వెళ్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రంలో నురగ, కాళ్లవాపులు, రాత్రిపూట మూత్రంకు ఎక్కువసార్లు వెళ్లడం దీని లక్షణాలు. షుగర్ వచ్చి ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరిన్ ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష చేయించుకోవాలి. క్రియాటినిన్ 1.2 దాటితే కిడ్నీ జబ్బు ప్రారంభమైందని గుర్తించాలి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. – డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కోడుమూరు రూరల్: హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గురువారం కోడుమూరు పోలీసులు పట్టుకున్నారు. ‘బరి తెగించిన ఇసుకాసురులు’ అన్న శీర్షిక ఈనెల 12వతేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు పోలీసులు ఈ మేరకు స్పందించారు. వర్కూరుకు చెందిన రెండు ట్రాక్టర్లు, కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు పారిపోగా, మరో ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యాజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): ఏపీజీఎల్ఐలో 2024 ఏప్రిల్ నుంచి అమలులోని ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కర్నూలులోని ఏపీజీఎల్ఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్, నిధి పోర్టల్ అమలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగంలో చేరిన వారు దరఖాస్తు చేసుకుంటేనే బీమా అమలయ్యేదని, బీమా బాండు పొందడం కూడా కష్టతరమయ్యేదన్నారు. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏపీజీఎల్ఐ తప్పనిసరి చేశారన్నారు. ప్రతి నెలా రూ.800 నుంచి రూ.3వేల వరకు ప్రీమియం ఉంటుందన్నారు. బీమా బాండు కూడా సంబంధిత డీడీఓనే ఆన్లైన్లో జనరేట్ చేస్తారన్నారు. నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్ఐ నుంచి లోన్ పొందడం సులువైందన్నారు. కార్యక్రమంలో ఏడీలు రంజిత్‌కుమార్ నాయుడు, గౌరిప్రసన్న, పర్యవేక్షకులు శివనాగకుమార్, రామకృష్ణారెడ్డి, కళ్యాణి తదితరులు పా ల్గొన్నారు. ఇదిలాఉంటే డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్‌తో ఏపీన్జీజీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ ఆధ్వర్యంలో పలువురు సంఘం నాయకు లు సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
రోజుకో పుంజు చొప్పున ఏసీబీకి పట్టిస్తా!
● వీఆర్వోలందరూ అవినీతిపరులే.. ● మండల మీట్లో టీడీపీ సర్పంచ్ హల్చల్ ● అవాకై ్కన అధికారులు డోన్: మండల సర్వసభ్య సమావేశంలో టీడీపీ మద్దతుదారుడైన గుమ్మకొండ సర్పంచ్ తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. సభలో సంబంధం లేని అంశాలపై మాట్లాడమే కాకుండా.. వీఆర్వోలపై నోరు పారేసుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరుగుతుండగా గుమ్మకొండ సర్పంచ్ దశరథరామిరెడ్డి వీఆర్ఓలపై రెచ్చిపోయారు. ‘మండలంలో పనిచేస్తున్న వీఆర్‌ఓలందరూ అక్షరం ముక్క రాని వారు. అందరూ అవినీతిపరులు. ఇలాంటి వారి పట్ల రైతులకు ఏమి మేలు జరుగుతుంది. నేను అనుకుంటే రోజుకో పుంజు చొప్పున అన్నట్లు ఏసీబీకి అధికారులను పట్టిస్తా’ అంటూ సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ డీటీ నారాయణమ్మ తప్పుబడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతిపరులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అందరూ అవినీతిపరులని సంబోధించడం సబబు కాదన్నారు. వీఆర్వోలపై నోరు పారేసుకున్న సర్పంచ్.. ప్యాకెట్ పాల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని, విక్రయాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశా రు. అయితే తమకు సంబంధం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా ఆయన ఉపన్యాసం ఆపలేదు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ప్రైవే టు ఆసుపత్రి యాజమాన్యాలు అనధికారికంగా పీఆర్ఓలను ఏర్పాటు చేసి గర్భిణులను భయబ్రాంతులకు గురిచేసి సిజేరియన్ల కోసం తమ ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తా మని ఎంపీపీ హామీ ఇచ్చారు. కాగా సర్యసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి కుటుంబీకులు హాజరైనా అధికారులు పట్టించుకోకపోవడంపై ఎంపీడీఓను కొందరు సభ్యులు ప్రశ్నించారు. -
కొలనుభారతి పూజార్లపై చర్యలు తీసువాలి
● కాకనూరు శారద పీఠం పీఠాథిపతి కొత్తపల్లి: అమ్మవారి పూజల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొలనుభారతి ఆలయ పూజార్లపై చర్యలు తీసుకోవాలని కాకనూరు శారధ పీఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి అధికారులను కోరారు. గురువారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉదయం 8 గంటల లోపు అన్ని పూజలు పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమివ్వాల్సిన అమ్మవారికి పురోహితులు 9.20 గంటలైనా పూజలు చేయకపోవడంతో ఆయన మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆల య పురోహితుల ప్రవర్తనలో మార్పురాకపోతే దేవ దాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నా రు. ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానానికి అనుసంధానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, ఛారుఘోషిణి నది విస్తరణ, డార్మెంటరీ, ప్రత్యేక క్యూలైన్లు నిర్మాణానికి శ్రీశైల దేవస్థానం కృషి చేయాలని కోరారు. -
టెండర్ ‘క్లాస్’గా కట్టబెట్టేందుకు..!
శ్రీశైలంటెంపుల్: ‘వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి’.. అన్న చందంగా మారింది దేవస్థాన ఇంజినీర్ల వ్యవహారశైలి. అర్హత లేని కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా తమ పనితనం చూపారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నూతనంగా పాతాళగంగలో తెప్పోత్సవం నిర్వహించాలని దేవస్థాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 18వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ సరఫరా, ట్రాన్స్‌పోర్టు, ఫిక్సింగ్ చేసేందుకు రూ.21.81 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ పిలిచారు. అక్టోబరు 30న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సాధారణంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 14 రోజుల కాలవ్యవధి ఇస్తారు. కానీ ఈ పనికి మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే కాలవ్యవధి ఇచ్చారు. కాంట్రాక్టర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకు లేక ఏకంగా తమ వారి కోసం నిబంధనలను సైతం మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాము అనుకున్న కాంట్రాక్టర్‌కే పని దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తూ పప్పులో కాలేశారు. పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు నిబంధనల మేరకు క్లాస్–4, అపైన ఉండే కాంట్రాక్టర్లు అర్హులు అవుతారు. కానీ మన ఇంజినీర్లు టెండర్ షెడ్యూల్లో క్లాస్–5, అపైన వారు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చారు. క్లాస్–5 కాంట్రాక్టర్ రూ.10 లక్షల లోపు పనులు మాత్రమే చేసేందుకు అర్హులు. కానీ ఇక్కడ పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు క్లాస్–4, అపై కాంట్రాక్టర్ అర్హులు. కానీ మన ఇంజినీర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పని దక్కేలా క్లాస్–5 టెండర్లో పొందుపరిచారు. ఈ టెండర్‌కు ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖాలు చేశారు. నేడో, రేపో టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించిన దేవస్థాన ఇంజినీర్లపై చర్యలు తీసుకు ని, మల్లన్న ఆదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ విషయంపై శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం టెండర్లో క్లాస్–5, ఆపైన ఏదేని సివిల్ రిజిస్ట్రేషన్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు. శ్రీశైల ఇంజినీర్ల ఇష్టారాజ్యం ఓ కాంట్రాక్టర్‌కు హంస వాహనం టెండర్ వరించేలా నిబంధనలు మార్పు క్లాస్–4 వర్క్‌ను క్లాస్–5గా మార్పులు చేసిన వైనం -
వ్యాయామం తప్పనిసరి
మధుమేహం అనేది కేవలం చక్కెర స్థాయిల సమస్య మాత్రమే కాదు. శరీరంలో వాత దోషం అసమతుల్యతతో వస్తుంది. దీని నివారణకు ఆహారంలో మార్పులు, వ్యాయామం, మూలికల వాడకం వంటి సమగ్ర విధానాన్ని సూచిస్తాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, మెంతులు, దాల్చిన చెక్క, పసుపు వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద చికిత్సలో ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఆహార మార్పులు, వ్యాయామం, మూలికల కలయికను సూచిస్తాం. –డాక్టర్ వెంకటనాగరాజ పాల, ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
● మోంథా తుపాన్ నష్టంపై ప్రభుత్వం కాకి లెక్కలు ● పంట నష్టం సర్వేలో లోపించిన పారదర్శకత ● 1.05 లక్షల ఎకరాల్లో నష్టం.. 28 వేల ఎకరాలకు సరిపెట్టిన ప్రభుత్వం ● మరోసారి సర్వే నిర్వహించాలంటున్న అన్నదాతలు
బండిఆత్మకూరులో నేలకొరిగిన వరిపైరు ఎకరాకు 18 బస్తాల కౌలుతో ఈ ఏడాది ఖరీఫ్ కింద 12 ఎకరాల్లో వరి సాగు చేశా. దాదాపు ఎకరాకు రూ. 30 వేల నుంచి 35 వేల పెట్టుబడులు అయ్యాయి. కంకి దశలో కళకళలాడుతున్న పంటను మోంథా తుపాన్ ముంచింది. పంట మొత్తం నేలకొరిగి ధాన్యం చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. పంట నష్టం అంచనాలకు వచ్చిన అధికారులు తమ పొలాన్ని చూడకుండానే వెళ్లిపోయారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట అంతా నీట మునిగినా అధికారులకు కనికరం కలుగలేదు. ప్రభుత్వం పేద రైతులను గుర్తించి న్యాయం చేయాలి. – మాలీబాషా, కౌలు రైతు, కానాల గ్రామం, నంద్యాల(మం) నంద్యాల(అర్బన్): మోంథా తుపాన్‌తో జిల్లాలో పంట నష్టం భారీగా చూపించిన ప్రభుత్వం.. పంట నష్టపరిహారం విషయం వచ్చేసరికి భారీగా కోత పెట్టింది. తుపాన్ వచ్చిన రెండు వారాల తర్వాత ఎన్యుమరేషన్ చేస్తే మునిగిన పంటలో నీరు అంతా బయటకు పోతుంది. అలా పంటలో నుంచి నీరు పోతే దాన్ని పంట నష్టంగా పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో పంట నష్ట పరిహారంలో చంద్రబాబు సర్కార్ కోత విధించింది. జిల్లాలో మోంథా తుపాన్ వల్ల మొత్తం 22,554 మంది రైతులకు చెందిన 28,620 ఎకరాల్లో సాధారణ పంటలు, మరో 1,126 మంది రైతులకు చెందిన 1,445 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగినట్లు అధికారుల లెక్కలు తేల్చారు. దీనిలో వరి 15,960 ఎకరాలు, మొక్కజొన్న 10,737, మినుము 1170, పత్తి 507 ఎకరాల్లో సాధారణ పంటలు నష్టం వాటిల్లినట్లు, ఉద్యానవన పంటలకు సంబంధించి 500 ఎకరాల్లో ఉల్లి, 425 ఎకరాల్లో మిరప, 175 ఎకరాల్లో బొప్పాయి పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. సోషల్ ఆడిట్ అనంతరం ఈ నివేదికను ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అధికారులు గుర్తించిన మేరకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున 11,448 హెక్టార్లకు దాదాపు రూ.28.62 కోట్లు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వనుంది. దీని వల్ల రైతులకు ఎంత మాత్రం ఉపయోగం లేదు. బాబు సర్కార్ కాకి లెక్కలు.. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొట్టేందుకు ఎన్యుమరేషన్‌ను మమ అనిపించింది. రైతులను ఆదుకునేందుకు పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయాలని యంత్రాంగం ఎంతగా శ్రమించినా స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లోనే తుది జాబితాలు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మోంథా తుపాన్ వెలసిన తర్వాత మొదట 64,720 ఎకరాలు, రెండో సారి 96,965 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా తయారు చేశారు. అయితే స్థానిక నేతల ఒత్తిళ్లు, ప్రభుత్వం పంట నష్టం అంచనాను తగ్గించాలన్న ఆదేశాలతో చివరకు 28,620 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదికలు పంపారు. ఉద్యానవన పంటలకు సంబంధించి 25వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా 1,445 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అంచనాలు తయారయ్యాయి. -
తేలు కాటుకు విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని దైవందిన్నె గ్రామంలో పొలంలో తేలు కాటుకు గురై కురవ సరస్వతి(13) అనే విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన కురవ శేఖర్, కురవ శకుంతలమ్మ కుమార్తె కె. సరస్వతి స్థానిక హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. బుధవారం తల్లిదండ్రులతో పాటు సాయంత్రం పత్తి పొలంలో పనిచేస్తుండగా తేలు కాటుకు గురైంది. ఇంటికి వచ్చాక గ్రామంలో నాటు వైద్యం చేయించటంతో నొప్పి తగ్గి రాత్రి మరలా ఎక్కువ కావటంతో గురువారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో కోలుకోలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. గుండెపోటుతో జీవితఖైదీ మృతి కోవెలకుంట్ల: భీమునిపాడుకు చెందిన మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఆరికట్ల సుంకిరెడ్డి(73) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకేసులో 2022వ సంవత్సరంలో జీవితఖైదీ పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ఽధ్రువీకరించారు. ఈ మేరకు మృతదేహాన్ని రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భార్య కాపురానికి రాలేదని భర్త అదృశ్యం కర్నూలు: భార్య దీణరాణి కాపురానికి రాకుండా ఉందని మనస్తాపానికి గురైన భర్త సుంకన్న అలియాస్ రాజు (39) అదృశ్యమయ్యాడు. ఈయన కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శిరివెళ్ల మండలం మాదేపురం గ్రామానికి చెందిన దీణరాణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. చిన్న గొడవ కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి సంసారానికి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. అయినా ఆమె కాపురానికి రాకపోవడంతో సుంకన్న మనస్తాపానికి గురై ఈనెల 1వ తేదీన పిల్లలను చూడటానికి భార్య దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి సాగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 95029 81868 లేదా 7989690812 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తండ్రి సాగర్ కోరారు. ముచ్చట్లలో వ్యక్తి మృతి బేతంచెర్ల: ముచ్చట్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల మేరకు.. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మనోహర్(45) కొంత కాలంగా నాపరాయి ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు ముచ్చట్ల క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న మనోహర్ ఆలయ కోనేరులో స్నానం చేస్తుండటంతో ఆయాసం వచ్చింది. భయంతో ఒడ్డుకు వచ్చి మెట్లపైనే కుప్పకూలి పోయి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో భక్తుడు గమనించి ఆలయ పూజారికి తెలపడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగలక్ష్మితోపాటు కుమారులు మణికంఠ, మురళీ ఉన్నారు. ఆస్పరి: చిరుత పులి దాడిలో ఆవు దూడ మృతి చెందడంతో తొగలగల్లు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. గ్రామ సమీపంలోని కొండ పక్కన అహోబిలం అనే రైతు బోరు కింద పంటలను సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజులాగే బుధవారం సాయంత్రం పశువులను ఆరుబయట కట్టేశాడు. రాత్రి సమయంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున రైతు చూస్తే ఆవు దూడ కన్పించకపోవడంతో వెతకగా కొద్ది దూరంలో ఆవు దూడ కళేబరం కన్పించింది. ఆవు దూడపై చిరుతే దాడి చేసిందని రైతు తెలిపారు. రెండు సంవత్సరాలు నుంచి చిరుత పులి ఇక్కడే కొండల్లో సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని అహోబిలం అనే రైతుకు పరిహారం ఇవ్వాలని తొగలుగల్లు గ్రామస్తులు కోరుతున్నారు. -
కేసులను సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా ఎప్పీ సునీల్ షెరాన్గోస్పాడు: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సిబ్బందికి సూచించారు. గురువారం గోస్పాడు పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు. సమస్యల పట్ల వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యల సరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. మట్కా, పేకాటతో పాటు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు రాత్రి వేళల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. అనంతరం స్టేనన్ ఆవరణాన్ని పరింశీలించారు. ఆయన వెంట ఎస్ఐ సుధాకర్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు నంద్యాల: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మైనర్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు, నివారణ, రోడ్డు భద్రతా నిబంధనలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రుల, సంరక్షకులు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మైనర్ డ్రైవింగ్‌పై 607 కేసులు నమోదు చేసి రూ.30.35 లక్షలు జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. -
ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
షుగర్ రోగుల్లో ఎముకల ఆరోగ్యం తగ్గిపోతోంది. తక్కువ ఎత్తు నుంచి కింద పడినా కొందరి ఎముకలు విరుగుతున్నాయి. కొందరు నిద్ర నుంచి లేచిన వెంటనే కళ్లు తిరిగి కింద పడతారు. షుగర్ రోగుల్లో న్యూరోపతి వచ్చి నడిచేటప్పుడు అదుపు తప్పి కిందపడే అవకాశం ఉంది. మహిళలు పయోగ్లిటజోన్ అనే మందు వాడటం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు జీజీహెచ్‌లో డెక్సా స్కాన్ చేసి, ఎముకల సాంధ్రత తక్కువగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
ప్రతిభను ప్రోత్సహించేలా..!
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈఈఎంటీ పరీక్ష ● రిజిస్ట్రేషన్‌కు ఈనెల 14న తుది గడువు ● విజేతలకు నగదు బహుమతులు నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపీఫనీ అనే సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ టెస్టు (ఈఈఎంటీ) నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలలోని 7, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనుంది. ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి పరీక్షకు హాజరు కావచ్చు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్/ కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్షకు డిసెంబరు 20న టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్–ఎడ్యుకేషనల్ ఎపిఫనీ.ఓఆర్జీ–ఈఈ ఎంటీ2026/రిజిస్ట్రేషన్, పీహెచ్‌పీ లింక్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాసు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈఈఎంటీ పరీక్ష అని, అధిక శాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుకు ఎటువంటి రుసుం లేదన్నారు. బహుమతులు ఇలా.. ఈ పోటీ పరీక్షల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.8వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు,రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. -
పంట కుళ్లిపోయినా పట్టించుకోలేదు
నోటి కాడికి వచ్చిన పంట నిలువునా గంగమ్మ పాలైంది. కొంత సొంత పొలం, మరికొంత కౌలుతో 30 ఎకరాల్లో నంద్యాల సన్నలు(ఎన్‌డీఎల్‌ఆర్–7) రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 నుంచి రూ.35వేల వరకు పెట్టుబడులు పెట్టా. పంట ఏపుగా పెరిగింది. ఒక నెల ఆగితే పంట దిగుబడులు ఇంటికి వచ్చేవి. దీపావళి పండుగ వెళ్లిన వెంటనే వర్షాలు వచ్చాయి. పెద్ద నష్టం జరగలేదనుకున్నాను. ఈలోగా మోంథా తుపాన్ 20 ఎకరాలను ముంచేసింది. తుపాన్ తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాకు రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎప్పుడు వచ్చారో తెలియదు. పొలంలో నీళ్లు ఉండటంతో అధికారులు రాలేకపోయారు. నాకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి నష్టం పరిహారం అందించాలి. – సుబ్బారెడ్డి, రైతు, లింగాపురం, బండిఆత్మకూరు(మం) -
మరో సారి సర్వే చేయాలి
జిల్లాలో ఎన్యుమరేషన్ మొక్కుబడిగా సాగింది. వరి, మొక్కజొన్న, మినుము, ఉల్లి, మిరప తదితర పంటలకు భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా వరి పంట నేలవాలిపోయింది. నేలకు ఒరిగిన వరిని యంత్రాలతో నూర్పిడి చేసే అవకాశం ఉండదు. కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కేవలం 28 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందనేది వాస్తవం కాదు. మళ్లీ రీ సర్వే జరపాలి. తడిసిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – రామచంద్రుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నంద్యాల -
మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, దేవస్థాన ఈఓ శేషవస్త్రాలు బహుకరించి సత్కరించారు. పీఠాధిపతి అధికారులకు, అర్చకులకు, వేదపండితులకు అనుగ్రహభాషణం చేశారు. ఓవర్ లోడ్ వాహనాలను సీజ్ చేస్తాం నంద్యాల(న్యూటౌన్): ఓవర్ లోడ్ వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో గ్రావెల్ రవాణా చేస్తున్న టిప్పర్, గనుల యజమానులతో జిల్లా రవాణా శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. ఓవర్ లోడ్ఓవర్, ఓవర్ స్పీడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డస్ట్, మెటల్ గ్రావెల్ తరలింపు సమయంలో తప్పనిసరిగా టార్పల్ కట్టుకొని రవాణా చేయాలన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గత మూడు రోజుల్లో ఏడు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.22 లక్షలు జరిమానా విధించామన్నారు. ఈ సమావేశంలో మైనింగ్ అధికారి వేణుగోపాల్, మోటారు వాహన తనిఖీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 25 లోపు ‘పది’ పరీక్షల ఫీజు చెల్లించాలి నంద్యాల న్యూటౌన్: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఫీజు చెల్లించాలని, రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో వచ్చే నెల 10వ తేదీ, రూ.500 రుసుంతో డిసెంబరు 15వ తేదీలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో సాధారణ సెలవులు ఏవైనా ఉన్నట్లు అయితే ఆ మరుసటి రోజు కూడా చెల్లించవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలకు www. bseap.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపు చాగలమర్రి: గ్రామ పంచాయతీల్లో ఇంటి, కుళాయి, ఇతర పన్నుల చెల్లింపులకు డిజిటల్ విధానంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని నంద్యాల డీఎల్పీఓ రాంబాబు తెలిపారు. గొడిగనూరు గ్రామ పంచాయతీని ఆయన గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పన్నులను డిజిటల్ పేమెంట్ చేయడంతో ఇంటి యజమానుల మొబైల్ ఫోన్‌కు మేసేజ్ వస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్ సంజీవరాయుడు, ఎంపీడీఓ తాహెర్ హుస్సేన్, ఈఓ తారకేశ్వరి, కార్యదర్శి రాజశేఖర్, పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఏ–1 పరీక్ష వాయిదా కర్నూలు సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం)జరగాల్సిన ఎస్ఏ–1 పరీక్షను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షను 1వ తరగతి నుంచి 5తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రాలను సురక్షితంగా భద్ర పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోను తెరవకూడదని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యకర్నూలు(సెంట్రల్): ఉల్లి, టమాటా, పత్తి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తిని కూడా క్వింటాల్ రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన జిల్లా సమితి సమావేశంలో గురువా రం ఆయన మాట్లాడారు. అధికారంలో లేని సమయంలో మాత్రమే గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడి కాలువల ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోరని విమర్శించారు. కులగణన జరిగిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన తరువాత తొలిసారి కర్నూలు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. సీపీఐ నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, జగన్నాథం, మునెప్ప, లెనిన్‌బాబు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీలో విద్యార్థి గల్లంతు
పాములపాడు: మద్దూరు పంచాయతీ కృష్ణానగర్ గ్రామ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో వీరేష్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన మొగిళీశ్వరప్ప, మల్లిక దంపతుల కుమారుడు వీరేష్ (17) పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులు పొలంలో మొక్కజొన్న కోత కోపిస్తున్నారు. కాగా అప్పటికే కోత కోసి ఎస్సార్బీసీ కాల్వ గట్టుపై మొక్కజొన్నలు ఆరబోయగా అక్కడికి వీరేష్ వెళ్లాడు. అయితే నీటి కోసం కాల్వలో దిగిన వీరేష్ కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కాల్వ గట్టుపై జీవాలు మేపుతున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశా డు. చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకునేలోపే యువకుడు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ బాబు పుట్టీల సాయంతో మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కుందూ పాత వంతెన పునరుద్ధరణ వేగవంతం
నంద్యాల: శిథిలావస్థకు చేరుకున్న కుందూ నది పాత వంతెన పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణ శివారులోని కుందూ నదిపై ఉన్న పాత వంతెననను జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్నతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుందూ నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కొత్త వంతెన పూర్తవడానికి సమయం పట్టే అవకాశం ఉందన్నారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాని పెంచేందుకు లేయర్ వేసి, వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొత్త వంతెన పనులు పూర్తి అయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి ప్రభుత్వ కొత్త కార్యాలయ భవనాల నిర్మాణానికి అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. -
జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కరించేందు కు చర్యలు తీసుకోవాలని జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులతో జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకాదిగన కేసులు, ఎకై ్సజ్, మెటార్ యాక్సిడెంట్, చెక్‌బౌన్స్, భూసేకరణ, సివిల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రీలోక్ అదాలత్‌లను పెట్టి త్వరతిగతిన ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి కమాదేవి, అరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ఫోక్సోకోర్టు జడ్జి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు శ్రీవిద్య, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సీనియర్ సివిల్ జడ్జీలు మల్లేశ్వరి, దివాకర్, జూనియర్ సివిల్ జడ్జీలు సరోజమ్మ, అపర్ణ, అనిల్‌కుమార్, అనూష పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య ఆళ్లగడ్డ: పట్టణంలోని ఎస్వీ నగర్లో ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన యోహాను కూతురు సీతమ్మ (31)కు చందలూరు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఈ మధ్యకాలంలో సీతమ్మ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో ఎస్వీనగర్‌లో ఉన్న తండ్రికి వద్దకు చేరింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ శివయ్య (50) మృతి చెందాడు. పట్టణంలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ శివయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక పట్టణ శివారులోని టిడ్కో గృహాల్లో ప్రయాణికుడిని దించి తిరిగి వచ్చేక్రమంలో జాతీయ రహదారిపైకి వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివయ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కేసులు నంద్యాల(అర్బన్): చిన్నారుల హక్కుల ఉల్లంఘించే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) చైర్పర్సన్ జుబుదాబేగం హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను భిక్షాటన, పనికి పంపకుండా పాఠశాలలకు సంబంధించి విద్యాహక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఈఆర్డీఎస్ సంస్థ సహకారంతో ఆర్టీసీ బస్టాండ్, సంజీవనగర్ గేట్, శ్రీనివాససెంటర్, ఆత్మకూరు బస్టాండ్, తదితర ప్రాంతాల్లో జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని పలువురు సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భిక్షాటన చేస్తున్న ఆరుగురు చిన్నారులను రక్షించి జువైనెల్ జస్టిస్ చట్టం ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు. అనంతరం జుబుదాబేగం మాట్లాడుతూ భిక్షాటన, బాల కార్మికత్వం వంటి చర్యలు చట్టపరంగా నేరమన్నారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, దర్గయ్య, ఓబులమ్మ, సునిల్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పది ఇసుక ట్రాకర్ల పట్టివేత
కౌతాళం: ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను బుధవారం ఏరిగేరి గ్రామం వద్ద పట్టుకున్నట్లు తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉండటంతో మూడు రీచ్‌లను తాత్కలికంగా బంద్ చేయించామన్నారు. కొంత మంది ఎలాంటి రశీదులు లేకుండా అనుమతులు తీసుకోకుండా కుంబళనూరు వద్ద ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక ఉచితంగా ఉన్న కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడానికి అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లకు మైనింగ్ అధికారుల సూచనల మేరకు జరిమానా విధిస్తామన్నారు. -
కష్టానికి ఫలితం
మాది అనంతపురం జిల్లా బత్తలపల్లి. అమ్మలేరు, నాన్న ఉపాధ్యాయుడు. ఆర్యూసీఈలో ఈసీఈ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తి చేశాను. బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను చదువుకున్న కోర్సులో టాపర్‌గా నిలవడంతో కష్టానికి ఫలితం లభించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రాణించాలని ఉంది. – యశ్విత, బీటెక్ విద్యార్థి మాది ఎమ్మిగనూరు. తల్లిదండ్రులు క్లాత్ బిజినెస్ చేస్తున్నారు. నేను ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌లో పీజీ పూర్తి చేశాను. కోర్సులో డిపార్ట్ మెంట్లో టాపర్‌గా నిలిచాను. నాల్గవ స్నాతకోత్సవంలో గవర్నర్‌గా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉంది. కంప్యూటర్స్ రంగంలో ప్రొఫెషనల్‌గా స్ధిరపడాలని ఉంది. ఎంచుకున్న కోర్సులో ఇష్టంతో చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. – ప్రభావతి, ఎమ్ఎస్సీ కంప్యూటర్స్● -
స్నాతకోత్సవ సంబరం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి పాల్గొన్నారు. ఎ.ఎం.గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేశారు. పీజీ, ఇంజినీరింగ్ విద్యలో ప్రతిభ కనబరిచి టాపర్స్‌గా నిలిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. గవర్నర్ కాన్వొకేషన్ సందేశాన్నిచ్చారు. అనంతరం గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు విద్యుత్ రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. స్టార్టప్స్ రంగంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులు అంతా చోదక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు వర్సిటీ ౖవైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వర్సిటీ ప్రగతి నివేదికను వివరించారు. వర్సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోర్సులు, జరుగుతున్న పరిశోధనలను తెలియజేశారు. విద్యార్థులచేత ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి, వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రామకుమార్ 55 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వర్సిటీ రెక్టార్ ప్రొఫెస్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బీవీ జయకుమార్నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు, వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్ సుందరానంద్, ప్రొఫెసర్ భరత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, వర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సునిత, డాక్టర్ శైలజ, ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లోకనాథ, తదితరులు పాల్గొన్నారు. అందరూ గర్వపడేలా యువత ఎదగాలి.. చాన్స్‌లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ, సమాజానికి రుణం తీర్చుకోడం అందరి ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా యువత ఎదగాలన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులంతా ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. వర్సిటీ నాణ్యమైన బోధన, పరిశోధనల ద్వారా విద్యార్థుల భవితకు బాటలు వేయడం సంతోషకరమన్నారు. డిగ్రీలు సంపాదించుకున్న విద్యార్థులు జ్ఞానంతో సార్థకమైన జీవితాన్ని గడపాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నప్పుడు భవితకు డోకా ఉండదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి దేశాన్ని ప్రగతి పథంలో నిలపాలన్న దేశ ప్రధాని మోదీ ఆశయాలకు నూతన విద్యా విధానం తోడ్పాటు అందిస్తుందన్నారు. -
స్నేహితుడే చంపేశాడు
బేతంచెర్ల: ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరకు హత్యకు దారితీశాయి. ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఆర్ఎస్ రంగాపురంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా(41) అదే గ్రామానికి చెందిన బోయ మదనభూపాల్ స్నేహితులు. వీరు మూడేళ్ల క్రితం గుజిరిషాపు నిర్వహించే వారు. కాగా మద్యం అక్రమ అమ్మకాల కేసులో మహబూబ్ బాషా జైలుకెళ్లాడు. ఆ సమయంలో తన భార్యకు మదనభూపాల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని మహబూబ్ బాషా అనుమానిస్తూ వచ్చాడు. అలాగే గుజిరీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మదన భూపాల్‌తో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో మహబూబ్ బాషా గొడవ పడగా, స్థానికులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో మధనభూపాల్ బుధవారం తెల్లవారుజామున మహబూబ్ బాషా ఇంటికెళ్లి నిద్రిస్తున్న అతన్ని బళ్లెంతో పొడిచి, రోకలి బండతో తలపై మోది చంపేశాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హతుడి కుమార్తె ఆసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. వ్యక్తి దారుణ హత్య -
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడతా..
మాది నందికొట్కూరు. ఆర్యూసీఈలో సీఎస్ఈ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తి చేశాను. బ్యాచ్‌లో టాపర్‌గా, కోర్సులో టాపర్‌గా నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉంది. పాఠాలు బోధించిన అధ్యాపకులు, ఫ్రెండ్స్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడాలన్నది నా లక్ష్యం. – ఖాజ మొయినుద్దీన్, బీటెక్ విద్యార్థి మాది అవుకు మండలం చెర్లోపల్లె. నాన్న దాసరి పెద్దరాజు, అమ్మ రాజ్యలక్ష్మి వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె అయిన నేను చదువు లో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. పీహెచ్డీ రీసెర్చ్ చేయడమే నా లక్ష్యం. – శిరీష, ఎమ్మెస్సీ బాటనీ మాది వెల్దుర్తి. నా తల్లిదండ్రులు హసీనా, ఫరీద్‌బాబా. నేను ఆర్‌యూలో 2020–22లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆర్యూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – షేక్ ఇర్ఫాన్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ -
ఇసుక విక్రయాల్లో పారదర్శకత
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాల్లో పూర్తి పారదర్శకతతో చర్యలు చేపట్టి ప్రజలకు ఇసుక సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబరులో ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ల సమీక్షించారు. ఆళ్లగడ్డ, నంద్యాల స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు లేకపోవడం, పలు ఫిర్యాదులు రావడం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్న కారణంగా వాటి రెన్యువల్‌కు అవకాశం లేదన్నారు. నంద్యాల స్టాక్ యార్డ్ డిపో హోల్డర్‌ను పిలిపించి విచారణ జరపాలని మైనింగ్ అధికారులకు సూచించారు. డోన్ పట్టణంలో కొత్త స్టాక్ యార్డు ఏర్పాటుకు టెండర్లను పిలవాలన్నారు. మైనింగ్ శాఖ అధికారులు చురుకుగా వ్యవహరించి, జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా మైనింగ్ అధికారి వేణుగోపాల్, కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, ఆర్టీఓ శివారెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, గ్రౌండ్ వాటర్ అధికారి రఘురాం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలబొమ్మలసత్రం: వైద్య విద్య కలలను కూల్చేలా.. మెరుగైన వైద్యాన్ని దూరం చేసేలా.. కుట్ర పన్నిన చంద్రబాబు సర్కారుపై విద్యార్థి లోకం కదంతొక్కేందుకు సిద్ధమైంది. నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి పేదలు ప్రతి రోజు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అధిక విద్యుత్ బిల్లుల భారంతో జనం, మద్దతు ధర అందక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ జాప్యంతో విద్యార్థులు.. సంక్షేమ పథకాలు అందక పేదలు.. ఇలా అందరూ బాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీల ద్వారా విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చా రు. వాటిని కూడా బాబు సర్కార్ ప్రైవేటీకరణ పేరు తో దూరం చేసే కుట్ర చేయడంతో అడ్డుకునేందుకు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమంతో వైఎస్సార్సీపీ ప్రజలను చైతన్యం చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ‘ప్రజా ఉద్యమం’ పేరుతో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొననున్నారు. కోటి సంతకాల సేకరణ విజయవంతం.. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పోకడలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ శిబిరాల వద్దకు వెళ్లి సంతకాలు చేశారు. మరో వైపు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మెడికల్ కళాశాలు నిర్మాణాలు మొదలు కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కళాశాలల వద్దకు చేరుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు గత 17 నెలల పాలనలో చేసిన రూ. 2.50 లక్షల అప్పులో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయలేమని చేతులెత్తేయటం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే పేదలకు సేవలందిస్తున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు పేదల వైద్య విద్య కలను సాకారం చేసేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 నూతన మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. వాటిలో ఐదింటిని ప్రారంభించటమే కాకుండా 750 మెడికల్ సీట్లను ప్రభుత్వం అదనంగా విద్యార్థులకు అందించింది. ప్రారంభమైన కళా శాలలో నంద్యాల కాలేజీ ఉండటం విశేషం. 2022లో 150 మెడికల్ సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3వ విద్యా సంవత్సరం నడుస్తోంది. ఎంతో మంది జిల్లాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చెంతనే వైద్య విద్యను అభ్యసిస్తునార్రు. అయితే మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మెడికల్ కాలేజీ పనులను అడ్డుకున్నారు. కళాశాల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభమైతే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరుస్తుందనే అక్కసుతో వాటిని ప్రైవేటీకరణకు కుట్ర పన్నారు. చంద్రబాబు కక్షపూరిత విధానాల ద్వారా రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల నిర్వాహణ ప్రైవేటు వ్యక్తులకు కట్టబడితే పేద విద్యార్థులకు వైద్య విద్య కలగా మిగిలిపోనుంది. -
నిరసన ర్యాలీలు విజయవంతం చేయండి
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే నిరసన ర్యాలీలను పార్టీ శ్రేణులు, విద్యార్థులు విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. 17 నెలల చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. సకాలంలో పెట్టుబడి నిధులు, ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా రైతులను నిలువునా మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 ఇప్పుడిస్తారో చంద్రబాబు ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు. జగనన్న చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తేవాల్సిన వ్యక్తి కక్షపూరితంగా వ్యవహరిస్తూ పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణకు పూనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో వెనకడుగు వేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాల యం వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. -
ఎత్తిపోతలను గాలికొదిలేశారు
● ఎమ్మెల్యే, ఎంపీకి రైతు సమస్యలు పట్టవా? ● వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ నందికొట్కూరు: ఎత్తిపోతల పథకాలను పాలకులు గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకరవ్గ ఇన్చార్జ్ దారా సుధీర్ విమర్శించారు. మంగళవారం ఆయన రైతులు, పార్టీ నేతలతో కలసి నాగటూరు ఫేస్–1, ఫేస్–2 మద్దూరు సుబ్బారెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లను దొంగలు అపహరించినా అధికారులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు గురైతే ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి, అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారు. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 15 వేల ఎకరాలకు సాగునీరు అందక ఖరీఫ్ సీజన్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ ప్రారంభమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా పార్టీ రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రత్యేక చొరవతో వెంటనే చేయించి రైతులకు సాగునీరు అందించారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ జగదీశ్వర్‌రెడ్డి, సర్పంచు జనార్దన్‌గౌడ్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి మద్దిలేటిరెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, శివరామకృష్ణారెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నాగశేనారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రమణ, శ్రీరాములు, ప్రశాంత్‌రెడ్డి, మధురెడ్డి, మోహన్‌రెడ్డి, నారాయణ, నరేష్ పాల్గొన్నారు. -
సత్తా చాటిన ప్రభుత్వవైద్య కళాశాల విద్యార్థులు
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ తెలిపారు. మంగళవారం విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023కు బ్యాచ్ సెకండియర్ విద్యార్థులు 98.6 శాతం, 2024కు సంబంధించిన ఫస్ట్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులు 95.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో ఫస్ట్ ఇయర్లో 6 మంది డిస్టింక్షన్, 73 మంది ఫస్ట్ క్లాస్, 64 మంది సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌లో 12 మంది డిస్టింక్షన్, 78 మంది ఫస్ట్ క్లాస్, 52 మంది సెకండ్ క్లాస్ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు, పలు విభాగాల అధిపతులు, డాక్టర్లు పాల్గొన్నారు. వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. మంగళవారం పట్టణంలోని సైబ్ జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలను న్యాయవాదుల దృష్టికి, ఆన్లైన్ 1500 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం గృహ నిర్మాణాల పరిశీలన శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానం సిబ్బంది కోసం సున్నిపెంటలో నిర్మిస్తున్న గృహ సముదాయాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీశైలంలో నివసిస్తున్న దేవస్థాన సిబ్బందిని త్వరలో సున్నిపెంటలో నిర్మిస్తున్న గృహాలకు తరలించి, అక్కడి దేవస్థానం స్థలాలలో ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గతంలో సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన స్థలాలలో రెండు 3 స్టార్ హోటళ్లు, నగర వనం, అమ్యూజ్మెంట్ పార్కులు, రెస్టారెంట్ల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ కె.వి.శ్రీనివాసులు ఉన్నారు. యాగంటీశ్వరుడికి రూ.2.45 లక్షల ఆదాయం బనగానపల్లె: మండలంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం తలనీలాల వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఈ నెల 13వ తేదీ నుంచి 2026 నవంబర్ 12 వరకు తలనీలాలు పోగు చేసుకునే హక్కు లభిస్తుంది. చాగలమర్రి గ్రామానికి చెందిన కోటపాడు నాగేంద్ర రూ.2.45 లక్షలకు హక్కు దక్కించుకున్నారు. ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు బ్రహ్మనందరెడ్డి, యాగంటిపల్లి మౌలీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక టిప్పర్లకు భారీ జరిమానా
ప్యాపిలి: పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లపై ఏడీఎంజీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఈనెల 7న ప్యాపిలి పోలీసులు మూడు ఇసుక టిప్పర్లను అదుపులోకి చేసుకుని ఏడీఎంజీ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెండు రోజులుగా సాక్షిలో ‘ఇసుక మస్కా’, ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన ఏడీఎంజీ అధికారులు.. రికార్డులు సక్రమంగా లేకపోవడం, అధిక లోడ్ తదితర కారణాలతో టిప్పర్ల యజమానులకు భారీగా జరిమానా విధించారు. నల్లమేకలపల్లికు చెందిన బాలనరసింహులు టిప్పర్‌కు రూ1.36 లక్ష లు, చిన్న కుల్లాయప్ప టిప్పర్‌కు రూ.1.28 లక్షలు, వెంగలాంపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి టిప్పర్‌కు రూ.62 వేలు జరిమానా విధించారు. కాగా ఈనెల 10న ప్యాపిలిలో యథేచ్ఛగా ఇసు కను అన్లోడ్ చేస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాసేపటికే వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము కూడా టీడీపీలోనే కొనసాగుతున్నా తమపై పెనాల్టీ విధించి మరొక నాయకుడి టిప్పర్‌ను వదిలేయడం ఏమిటని జరిమానాకు గురైన ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వర్షసూచన లేదని వ్యవసాయ వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త జి.నారాయణ స్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఇందువల్ల ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18.5 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 74–80 శాతం వరకు ఉండటం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు. -
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
● రూ. 35 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం డోన్ టౌన్: చుక్కల భూమిని పట్టాగా మార్చేందుకు డోన్ డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు..వెల్దుర్తి మండలం గుంటుపల్లె గ్రామానికి చెందిన రైతు దామ వేణుగోపాల్‌కు డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలో 20–1,20–బీ2, 27–బీ2 సర్వే నంబర్లలో పొలం ఉంది. అయితే చుక్కల భూమిగా ఉండటంతో పట్టా భూమిగా మార్చాలని డోన్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయితే ఇందుకు డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న సునీల్‌రాజా రూ. 35 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రైతు నుంచి మంగళవారం డీటీ సునీల్ రాజా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐలు కృష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులతో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెండ్ పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తుదుపరి విచారణ చేపడుతామని డీఎస్పీ తెలిపారు. -
ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు
డోన్: ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఓ వైపు నియోజకవర్గ ముఖ్యనేతకు కప్పం కడుతూ, మరో వైపు అధికారుల చేతులు తడుపుతూ గుట్టుగా దందా సాగించిన టిప్పర్ యజమానుల్లోనే ముసలం పుట్టడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, ఈటూరు, బిడుదూరు, పామిడి రీచ్‌ల నుంచి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, బేతంచెర్ల, డోన్ మండలాల పరిధిలో ఇసుక రవాణా చేసే టిప్పర్ యజమానులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. టిప్పర్ యజమానులు టన్నుకు రూ.200 అదనంగా అధికార పార్టీ ముఖ్యనేతకు చెల్లించాలని నిర్ణయించారు. పై ప్రాంతాల నుంచి నియోజకవర్గానికి రవాణా అవుతున్న ఇసుక టిప్పర్లకు రాయల్టీ వే బిల్లులు అసలు ఉండటం లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కొంతమంది టిప్పర్ యజమానులు ప్రభుత్వ స్కాన్ బిల్లులు కాకుండా మ్యానువల్ బిల్లులతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా ఈ ఇసుక దందా కొనసాగుతోంది. అయితే టిప్పర్ యజమానుల మధ్య ముసలం పుట్టడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇసుకను నల్లమేకలపల్లెకు చెందిన తమ టిప్పర్లు మాత్రమే రవాణా చేయాలని ఒక వర్గం పట్టుపడుతుండగా.. వేరొక వర్గం ప్యాపిలి, వెంగలాంపల్లె గ్రామాలకు చెందిన టిప్పర్లతో కూడా రవాణా చేసేందుకు సిద్ధపడి సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి ఏమి చేస్తారో చేసుకోండని సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా అధికార పార్టీలోని ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒక రు ప్యాపిలి, జలదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటుండటంతోనే 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఆరు వాహనాలు పోలీసుస్టేషన్ల వద్ద ఉంచడం జరిగిందంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇటు పోలీసులు కానీ అటు ఏడీఎంజీ అధికారులు కానీ నోరు మెదిపి వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధపడటం లేదు. దీంతో అధికారపార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాపై నియోజకవర్గ ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పట్టుకుంటారు.. వదిలేస్తారు.. ఇసుక సిండికేట్ మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. రెండు రోజులుగా ఇరువర్గాల నాయకులు పరస్పరం ఫిర్యాదుతో టిప్పర్లను పట్టుకోవడం తర్వాత ముఖ్యనేత ఫోన్‌తో వది లేయడం జరుగుతోంది. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లె, వెంగలాంపల్లె గ్రామాలకు చెందిన ఇసుక టిప్పర్లను రెండురోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ప్యాపిలికి చెందిన మరో అధికార పార్టీ నాయకుడు పోలీసులకు పట్టించారు. ఈ వాహనాలకు బిల్లులు సక్రమంగా లేకపోవడంతో ఏడీఎంజీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వెంగలాంపల్లె, నల్లమేకలపల్లెకు చెందిన టీడీపీ నాయకులు ప్యాపిలి పట్టణానికి చెందిన మరో టీడీపీ నేతకు చెందిన వాహనాన్ని సోమవారం పోలీసులకు పట్టించారు. అయితే ప్రజాప్రతినిధి ఒత్తిడి మూలంగా పోలీసులు ఈ ఇసుక రవాణా చేసే టిప్పర్ యజమాని వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని స్పష్టం చేస్తుంటే, అన్ని సక్రమంగా ఉంటే ఇసుక లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను పోలీసుస్టేషన్ వద్ద ఎందుకు ఉంచారని సొంత పార్టీ నేతలే పోలీసులను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఇసుక అక్రమ రవాణా దర్జాగా జరుగుతున్నా అడిగేవారు లేరు. ఇసుకను తామే తరలించాలని ఒక వర్గం పట్టు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్న ఇరువర్గాలు పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం నోరుమెదపని ఏడీఎంజీ అధికారులు -
విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం
● ట్రిపుల్ఐటీ, ఆర్యూ మధ్య ఒప్పందంకర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ డిజైన్ అండ్ మ్యాను ఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఆర్యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటం, పోస్ట్ క్వాంటం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యూ రిజిస్ట్రార్ విజయ్‌కుమార్, ట్రిపుల్ఐటీ డీఎం రిజిస్ట్రార్ రాజ్ కుమార్, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల (వ్యవసాయం): మానసిక ఉల్లాసానికి కార్తీక వనభోజనాలు కార్యక్రమా లు ఎంతో దోహద పడతా యని మూడవ అదనపు సీనియర్ సివిల్ జిల్లా జడ్జి అమ్మన్నరాజ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహిళా జడ్జీలు, న్యాయవాదులు ఉసిరి, వేప, రావి దేవత వృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో జడ్జీలు, న్యాయవాదులు నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారురాని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కష్ణారెడ్డి, పెద్ది శ్రీనివాసులు, రామసుబ్బయ్య రామచంద్రారావు, వివేకానంద రెడ్డి, ఓబుళరెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, ఏపీపీలు, కోర్టు సిబ్బంది, గుమాస్తాలు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు చీవాట్లు పెట్టినా మారని ప్రభుత్వం
● చంద్రబాబు పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరల్లోనే.. ● వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డికర్నూలు(టౌన్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సోమ వారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి పార్టీలు విషం చిమ్మినా ఏనా డూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ రోజులను మించిపోయిందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మీడియాతో పాటు తాము కూడా ప్రభు త్వ తప్పులను ప్రశ్నించామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం మత్తులో ఉన్న బైకర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారన్నారు. లక్ష్మీపురం పరిధిలోని బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే విష యంపై తాము మాట్లాడితే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడి యా ప్రతినిధులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల ఆఫీసులకు పోలీసులు వెళ్లడం, నోటీసులు ఇవ్వడం ఎప్పు డూ చూడలేదన్నారు. సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కర్నూలు మేయర్ బివై.రామయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో ముచ్చటించి..సౌకర్యాలపై ఆరాతీసి
హొళగుంద: శిక్షణలో భాగంగా మండల కేంద్రం హొళగుందకు వచ్చిన ట్రైనీ కలెక్టర్లు శివంసింగ్, శివానీ, శివణేంధరణ్, మైఖెల్, నిధి యా, ఆల్ప్రెడ్లు సోమ వారం ప్రభుత్వ పాఠశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టేశారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజానగర్ కాలనీలోని కన్నడ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించి..విద్యాబోధన, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. తర్వాత తహసీల్దారు కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చలవాది రంగమ్మ, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
పోలీసు పీజీఆర్ఎస్లో 111 వినతులు
నంద్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన పోలీసు పీజీఆర్ఎస్లో 111 వినతులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిల్ షెరాన్ తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీసుల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఫిర్యాదుల్లో అధిక శాతం కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. -
ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి
నంద్యాల: తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్ జయంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీపీ బ్రౌన్ చిత్రపటానికి ఎస్పీ సునీల్ షెరాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీ బ్రౌన్ (చార్లెస్ ఫిలిప్ బ్రౌన్) 1798 నవంబర్10న కలకత్తాలో జన్మించారని, తరువాత 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరి, 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారన్నారు. ఆయనకు తెలుగు భాషపై ఎంతో ప్రేమ పెరిగి పాత పుస్తకాలను సేకరించారన్నారు. వాటిని సవరించి మళ్లీ ముద్రించి, మన భాషను భవిష్యత్తుకు సురక్షితం చేశారన్నారు. ఆయన వేమన శతకాలు, కవి తిక్కన, నన్నయ్య మరియు అనేక తెలుగు సాహిత్య కృతులను రక్షించి ప్రసిద్ధం చేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.


