● బోడబండలో వర్షం కోసం 24 గంటల భజన
భజన చేస్తున్న భక్తులు
మండలంలోని బోడబండ గ్రామంలో వర్షం కోసం 24 గంటల పాటు భజన చేపట్టారు. ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు భక్తి పాటలతో ‘వరుణ దేవా.. కురియరావా’ అంటూ వరణుడిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి, ఈశ్వరస్వామి దేవాలయాల్లో అభిషేకం, అలంకరణ తదితర పూజలు నిర్వహించారు. అలాగే అన్నదానం చేపట్టారు.
– ఎమ్మిగనూరుసెంట్రల్


