తీరని యూరియాతన | - | Sakshi
Sakshi News home page

తీరని యూరియాతన

Jun 30 2026 2:59 AM | Updated on Jun 30 2026 2:59 AM

నందవరం: కూటమి పాలనలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. పొలాల్లో సాగు పనులు వదులుకొని వ్యవసాయ కార్యాలయాలు, సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం మండల పరిధిలోని హాలహర్వి గ్రామ సచివాలయంలో ఆన్‌లైన్‌లో యూరియా పంపిణీకి చర్యలు చేపట్టారు. వందలాది మంది రైతులు ఉదయమే అక్కడి చేరుకొని బారులు తీరారు. తీరా ఓటీపీ చెప్పేందుకు మొబైల్‌ఫోన్‌ తప్పనిసరి అని లేకపోతే ఎరువులు ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో చాలా మంది తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. గత ప్రభుత్వ హయాంలో అడగగానే అవసరమైన ఎరువులు ఇచ్చే వారని, ఇప్పుడేందుకు కొత్తకొత్త రూల్స్‌తో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement