ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు | Ketan tragedy Siya Wanted To Marry him Confused About Chetan says Brother | Sakshi
Sakshi News home page

ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు

Jun 30 2026 5:11 PM | Updated on Jul 3 2026 1:56 PM

Ketan tragedy Siya Wanted To Marry him Confused About Chetan says Brother

పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు. 

సియా-చేతన్‌ల ప్రేమ వ్యవహారం సాహిల్‌కు ముందే తెలుసా? అతను ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యుల నుండి దాచాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు నోరు విప్పని సాహిల్,  ఒక మీడియా ముఖంగా తొలిసారి  స్పందించాడు. అయితే అతని వ్యాఖ్యలకు, పోలీసుల దర్యాప్తునకు మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంది.

సియాకు పెళ్లి ఇష్టమే..కానీ
తాను కేతన్ అగర్వాల్‌ను మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, చేతన్‌తో సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని సియా తనతో చెప్పిందని సాహిల్‌ తెలిపాడు. తమ మధ్య ఏమీ లేదని, ఇకపై చేతన్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని తనపై ఒట్టు వేసిందని కూడా చెప్పాడు అందుకే, సియా, చేతన్ గురించి తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. వాళ్లు స్నేహితులుగా ఉంటారని భావించి, దీనిపై తల్లిదండ్రులకు చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.

కన్ఫ్యూజన్‌లో ఉంది : సియా తన బంధం విషయంలో కొంత గందరగోళంలో ఉందని, వయసు రీత్యా స్నేహాన్ని ప్రేమగా అనుకోవడం సహజమేనని, అందుకే తాను ఆమెకు నచ్చజెప్పానని సాహిల్ అన్నాడు. ఆమె కేతన్‌తో పెళ్లికి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఎంతో సంతోషంగా ప్లాన్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.

డ్రైవర్ సాక్ష్యంతో అనుమానాలు
సాహిల్ చెబుతున్న మాటలకు, పోలీసుల దర్యాప్తులో తేలుతున్న విషయాలకు అస్సలు పొంతన కుదరడం లేదు.  సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదనే నిజాన్ని ఆమె సాహిల్‌కు ముందే చెప్పిందని, అయినా అతను సైలెంట్‌గా ఉన్నాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ ఇచ్చిన కీలక సాక్ష్యం సాహిల్‌పై అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.

ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకుగాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి సియా నిరాకరించినప్పుడు, సాహిల్ బలవంతంగా ఆమెను కారెక్కించాడని కారు డ్రైవర్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు.

పాస్‌పోర్ట్ చింపేసినా
బాలి ట్రిప్‌కు వెళ్లడానికి ముందే కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా చింపేసిన విషయం సాహిల్‌కు తెలిసినప్పటికీ, అతను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఎవరికీ చెప్పకపోవడం పోలీసులలో అనుమానాలను మరింత పెంచింది. 

ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌

సాహిల్‌ ఎందుకు మౌనంగా ఉన్నాడు?
ప్రస్తుతానికి సాహిల్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోయినప్పటికీ,  సోమవారం నాడు పోలీసులు అతన్ని దాదాపు 10 గంటల పాటు విచారించి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు కేవలం ఒక 'హత్య' మాత్రమే కాకుండా, దీని వెనుక పెద్ద 'ముందస్తు ప్లాన్ (కుట్ర)' ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో సాహిల్ కూడా సియా, చేతన్‌లకు ఏమైనా సహాయం చేశాడా? లేక అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నాడా? అని పోలీసులు తేల్చనున్నారు.

ముందే  హెచ్చరించిన కుటుంబ జ్యోతిష్యుడు
సియా గోయల్, చేతన్ చౌదరిల జాతకాలను నలుగురు వేర్వేరు జ్యోతిష్యులు ద్వారా పరీక్షించినపుడు, వారిలో ముగ్గురు  వారిద్దరికీ అనుకూల ఫలితాలను అందించారట. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల వివాహానికి పురోహితుడిగా వ్యవహరించిన అగర్వాల్ కుటుంబ పురోహితుడు, వీరి పెళ్లికి సుముఖంగా లేదని చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

కుటుంబ పురోహితుడు ఈ సంబంధంపై ఆందోళన వ్యక్తం చేశారని, సియా కేతన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి శారీరకంగా హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం.  ఇన్ని అభ్యంతరాలున్నప్పటికీ, తన తండ్రి మద్దతుతో కేతన్ సియాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది.

(హై-టెక్‌ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)

కాగా జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్ అగర్వాల్‌ను సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కిందకు తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు.

ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement