చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు! | Class 12 Student Incident | Sakshi
Sakshi News home page

చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు!

Aug 15 2026 12:25 PM | Updated on Aug 15 2026 12:35 PM

Class 12 Student Incident

తిరువొత్తియూరు: చెన్నైలోని శాలిగ్రామంలో బుద్ధిమాంధ్యంతో బాధపడే విద్యార్థికి చాక్లెట్‌ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన కిరాణా దుకాణం ఉద్యోగిని విరుగంబక్కం మహిళా పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై శాలిగ్రామానికి చెందిన విద్యార్థిని ఆ ప్రాంతంలోని ఒక ప్రత్యేక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. 

కొన్ని రోజులుగా పాఠశాలకు వచ్చేటప్పుడు తన తోటి స్నేహితురాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు వంటి తినుబండారాలను భారీగా తెచ్చి ఇస్తూ ఉండేది. ఇది గమనింన పాఠశాల టీచర్‌కు అనుమానం వచ్చింది. అలాగే విద్యారి్థని ప్రవర్తనలోనూ కొన్ని మార్పులు రావడం టీచర్‌ కనిపెట్టారు. దీంతో విద్యార్థినిని విచారించగా దిగ్భ్రాంతి  కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తాను పాఠశాలకు వచ్చే దారిలో ఉన్న ఒక కిరాణా దుకాణంలోని వ్యక్తి, ప్రతిరోజూ తనను షాపులోకి పిలి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి తప్పుగా ప్రవర్తించేవాడని ఆ విద్యార్థిని తెలిపింది. దీంతో టీచర్‌  వెంటనే ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యారి్థనిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు పళనిస్వామి (35)ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement