breaking news
Grocery stores owners
-
చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
తిరువొత్తియూరు: చెన్నైలోని శాలిగ్రామంలో బుద్ధిమాంధ్యంతో బాధపడే విద్యార్థికి చాక్లెట్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన కిరాణా దుకాణం ఉద్యోగిని విరుగంబక్కం మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై శాలిగ్రామానికి చెందిన విద్యార్థిని ఆ ప్రాంతంలోని ఒక ప్రత్యేక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా పాఠశాలకు వచ్చేటప్పుడు తన తోటి స్నేహితురాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు వంటి తినుబండారాలను భారీగా తెచ్చి ఇస్తూ ఉండేది. ఇది గమనింన పాఠశాల టీచర్‌కు అనుమానం వచ్చింది. అలాగే విద్యారి్థని ప్రవర్తనలోనూ కొన్ని మార్పులు రావడం టీచర్ కనిపెట్టారు. దీంతో విద్యార్థినిని విచారించగా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను పాఠశాలకు వచ్చే దారిలో ఉన్న ఒక కిరాణా దుకాణంలోని వ్యక్తి, ప్రతిరోజూ తనను షాపులోకి పిలి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి తప్పుగా ప్రవర్తించేవాడని ఆ విద్యార్థిని తెలిపింది. దీంతో టీచర్ వెంటనే ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యారి్థనిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు పళనిస్వామి (35)ని అదుపులోకి తీసుకున్నారు. -
ఎక్సైజ్ దాడులపై కిరాణా యజమానుల ధర్నా
జడ్చర్ల (మహబూబ్‌నగర్) : గుడుంబా తయారీకి బెల్లం విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సోమవారం కిరాణా దుకాణాల యజమానులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిరాణా దుకాణాల్లో బెల్లం విక్రయాలపై నిషేధం లేదని, తాము తీపి వంటలకు వినియోగించే తెల్ల బెల్లంను విక్రయించినా కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బెల్లం విక్రయాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న నిబంధనలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసలు కిరాణా దుకాణాల్లో బెల్లం విక్రయాలు జరపాలా వద్దా, ఎంత మేరకు బెల్లం నిల్వ ఉంచాలో తెలియజేయాలన్నారు. బెల్లం తరువాత చక్కెరతో కూడా గుడుంబా తయారు చేసే పరిస్థితి ఉందని ఇకపై చక్కెర కూడా విక్రయించాలో లేదో చెప్పాలన్నారు. ఈ మేరకు తమ సమస్యలను తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


