సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా | Jagapathi Babu Vadala Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

Vadala OTT: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Aug 14 2026 8:47 AM | Updated on Aug 14 2026 9:01 AM

Jagapathi Babu Vadala Movie OTT Streaming Now

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు.. కాక్ టెయిల్ 2, కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి వేరే భాషల చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'వదలా'. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఓ మగాడిపై అతి వ్యామోహం అనే కాన్సెప్ట్‌తో దీనిని తీశారు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

'వదలా' విషయానికొస్తే.. యోగి సిద్ధార్థ్‌ (జగపతిబాబు) ఓ డాక్టర్‌. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్‌) అనే యువతి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈమెని సిద్ధార్థ్‌ చికిత్స చేసి కాపాడతాడు. అలా ఇతడిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. తర్వాత సిద్ధార్థ్‌ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఈ క్రమంలోనే భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్‌.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అముద ఎవరు? ఆమె కథేంటి? ఈ సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్ధార్థ్‌ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement