‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్‌సీ 17’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు రుక్మిణి వసంత్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని, మరో పాత్రలో సున్నిత మనస్కుడిగా కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవలే చరణ్ చేతికి సర్జరీ జరిగింది. ఈ కారణంగా ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు. చరణ్ పూర్తిగా కోలు కున్న తర్వాత ‘ఆర్‌సీ 17’ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు.


