వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా? | Mahesh Babu Varanasi Creates Massive Buzz As Rajamouli Eyes Mega Hero For Hanuman Role, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Varanasi Movie: వారణాసిలో హనుమంతుడి పాత్ర.. టాలీవుడ్ స్టార్‌ హీరోనా?

Aug 9 2026 1:43 PM | Updated on Aug 9 2026 3:13 PM

Mahesh Babu Varanasi Movie Hanuman Role goes To Tollywood Hero

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలిసారి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు మహేశ్ బాబు బర్త్‌ డే కావడంతో జక్కన్న క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మహేశ్ బాబు రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా మందాకినిగా చేస్తోన్న ప్రియాంక చోప్రా పోస్టర్‌ కూడా పంచుకున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం త్రేతాయుగం ఎపిసోడ్‌లో మహేశ్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే హనుమంతుడి రోల్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఈ పాత్రలో ఎవరు చేస్తున్నారనే దానిపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. హనుమాన్ లాంటి పవర్‌ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు మాధవన్ పేరు పరిశీలించారని టాక్. కానీ తాజాగా మరో పేరు వినిపిస్తోంది. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ అయితేనే కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకధీరుడు ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement