బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో జబర్దస్త్‌ కమెడియన్‌! | Bigg Boss Telugu 10 Contestants Update, Jabardasth Star Ram Prasad Likely To Enter The House, Fans Excited | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో జబర్దస్త్‌ కమెడియన్‌!

Aug 9 2026 12:42 PM | Updated on Aug 9 2026 2:12 PM

Bigg Boss Telugu Jabardasth Comedian Ram Prasad Likely to Enter the House

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ  కింగ్‌ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్‌ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. 

అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్‌ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్‌ మీడియాలో రోజుకో పేరు వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్‌ నడుస్తోంది. జబర్దస్త్‌ నటుడు రామ్‌ ప్రసాద్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ ప్రసాద్‌.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ టీమ్‌ రామ్‌ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement