breaking news
ram prasad
-
బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’
బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్ విషయంలో త్రిగుణ్ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో పక్క ఝాన్సీ లెటర్ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్ ఎదురైంది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది. అసలు ప్రేక్షకులకూ, అటు హౌస్‌మేట్స్‌కు ఎదురైన ఆ ట్విస్ట్ ఏంటి.? ఒకసారి చూద్దాం..ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికనరేశ్కు అన్యాయం జరిగిందంటూ..బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్ సందర్భంగా బజర్ విషయంలో మరోసారి రచ్చ జరిగింది. నరేశ్ బజర్ కొట్టేలా అవకాశం ఇవ్వాలని రాంప్రసాద్ తన టీమ్‌తో మాట్లాడతాడు. అయితే సైరన్ మోగిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఝాన్సీ బజర్ కొట్టగా.. లివింగ్ ఏరియాలో నరేశ్, వంశీ మధ్య పోటీ నెలకొంది. లివింగ్ ఏరియా సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ తొలుత నరేశ్ బజర్ కొట్టాడని ప్రకటించాడు. దీంతో నరేశ్ టీమ్ సంబరాలు చేసుకుంది. కానీ అమన్, రోహిత్, చరణ్ మాత్రం వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్‌కు చెప్పారు. దీంతో త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బిగ్‌బాస్ అడిగినప్పుడు వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్ చెప్పడంతో నరేశ్ మండిపడ్డాడు. తన పేరును ప్రకటించిన తర్వాత సడన్‌గా నిర్ణయం ఎలా మార్చుకుంటావంటూ ప్రశ్నించాడు. నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ సుధీర్, ముకేశ్ కూడా త్రిగుణ్‌తో వాదించారు. దీంతో బజర్ వ్యవహారం హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.లెటర్ కోసం నరేశ్‌ను టార్గెట్ చేసిన ఝాన్సీఆ తర్వాత ఝాన్సీ, వంశీ బజర్ మోగించడంతో ఇద్దరికీ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఝాన్సీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్ ఝాన్సీకి కాల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘మీ నాన్న రాసిన లెటర్ మీ కోసం వచ్చింది. అది మీకు దక్కాలంటే నరేశ్ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను దూరం చేయాలి. లేదంటే రాంప్రసాద్‌కు వచ్చిన ఫొటోను వదులుకోవాలి’ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఝాన్సీ నరేశ్ లెటర్‌ను దూరం చేసేందుకు నిర్ణయించుకుంది. ‘నరేశ్‌కు టెన్షన్ ఇస్తా’ అంటూ అతడి లెటర్‌ను వదులుకుంది. మరోవైపు తన తండ్రి రాసిన లెటర్‌ను చదివిన ఝాన్సీ భావోద్వేగానికి గురైంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ఆడియన్స్ అనుకునేలోపే.. !ఇక హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరిగా వారి ఆటతీరుపై మెసేజ్‌లు రావడంతో.. అవి ఆడియన్స్ నుంచి వచ్చినవని అందరూ భావించారు. కానీ బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అగ్నిపరీక్షలో పోరాడి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ప్రయత్నించిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేశాడు. ముగ్గురినీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనేది హౌస్‌మేట్సే నిర్ణయించాలి అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలు తమను ఎందుకు హౌస్‌లోకి తీసుకోవాలో వివరించారు. ఈ క్రమంలో త్రిగుణ్, రాంప్రసాద్, ముకేశ్‌లతో వారికి వాగ్వాదం జరిగింది. తెలుగు మాట్లాడడంపై త్రిగుణ్‌తో వారితో వార్కి దిగాడు. ఈ తరుణంలో నీకు అసలు తెలుగు వచ్చా వస్తే పద్యం పాడు అంటూ మిథిలేష్‌పై త్రిగుణ్ రెచ్చిపోయాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం కనిపించింది.ఇదీ చదవండి: రజినీకాంత్ ‘జైలర్2’ పాటకు.. డేవిడ్ భాయ్ డ్యాన్స్ మాత్రం..ముగ్గురిలో ఎవరు? హౌస్మేట్స్ ఓటింగ్..వాదనలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ముగ్గురినీ బయటకు పంపించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కీలక నిర్ణయం అప్పగించాడు. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్ సూచనల మేరకు హౌస్మేట్స్ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. ఆ ఓట్లను బిగ్‌బాస్ చెప్పిన బాక్స్‌లో వేశారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ
బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం టెమ్టేషన్స్, ఎమోషన్స్ రెండూ తారాస్థాయికి చేరినట్లు తాజా ప్రొమో చూస్తే అర్థమవుతోంది. లివింగ్ రూం హౌస్‌లో ముందుగా బజర్ నొక్కింది వంశీ అని త్రిగుణ్ చెప్పగా, నొక్కింది నేనే అని నరేశ్ వాదించాడు. ‘నేను చెప్పినా వినకపోతే నేనేం చేస్తా?’ అంటూ నరేశ్ ప్రశ్నించగా, ‘నేను చూసిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటా’ అని త్రిగుణ్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆమె ఎవరిని ఎంచుకుంటుంది?ఇక కెప్టెన్సీ కంటెండర్‌గా మారేందుకు ఝాన్సీ, వంశీకి ఇచ్చిన టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగినట్లు ప్రొమోలో కనిపించింది. అయితే అసలు ట్విస్ట్ తరువాతే వచ్చింది. ఝాన్సీని పిలిచిన బిగ్‌బాస్.. ‘నీ మనసుకు దగ్గరైన టెమ్టేషన్ నీ చేతికి అందే ముందు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా’ అని చెప్పాడు. మొదటి ఆప్షన్‌గా నరేశ్‌కు అతని తమ్ముడు రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని, రెండో ఆప్షన్‌గా రాంప్రసాద్‌కు వారి కుటుంబంతో దిగిన ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ రెండు ఆప్షన్లు విన్న వెంటనే ఝాన్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? నరేశ్ లేఖనా? రాంప్రసాద్ ఫోటోనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
బిగ్‌బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్‌లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్‌గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్‌ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్‌బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్‌ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్‌లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్‌బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్‌ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్‌ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్‌ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్‌గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్‌బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్‌కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు.ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని -
బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్‌బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్‌లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్‌ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్‌లో జంతువులను సరైన సీక్వెన్స్‌లో అమర్చాలి. అన్ని బ్లాక్స్‌ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్‌ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్‌ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్‌లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్‌బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్‌లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్‌లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్‌తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్‌కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టాస్క్‌కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్‌లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్‌ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్‌తో ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన డిస్క్‌లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్‌లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ వివరించారు. ఈ టాస్క్‌కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్‌లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్‌లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్‌లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్‌లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్‌గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్) -
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్‌పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్‌కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్‌ను హౌస్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్‌ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్‌లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్‌కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్‌ను రెండు టీమ్‌లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్‌లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్‌తో బిగ్‌బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్‌తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్‌ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి? -
బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్‌బాస్10 హౌస్‌లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్‌లో పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. హైరిస్క్‌లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్‌ను హైరిస్క్‌లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్‌బాస్‌కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్‌ను యూనానిమస్‌గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్‌లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్‌రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్‌లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్‌బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్‌తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి -
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుఊహించలేరు..‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్ఒకసారి మాట్లాడుకోండి..అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్‌ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640— AnantapurBO (@AnantapurBO) September 8, 2026 -
FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?
-
బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్‌బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్‌లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్‌బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్‌తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్‌లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్‌బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10వ సీజన్ నిన్న (ఆదివారం) గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. వాళ్లే రాంప్రసాద్, నరేశ్‌లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్‌లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్‌బాస్ విషయానికి వస్తే..బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్మేట్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్, రాంప్రసాద్ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్‌లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: హాట్ టాపిక్‌గా నాగార్జున రెమ్యునరేషన్భేదాభిప్రాయాలు రావడం..అయితే బిగ్‌బాస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్. ఒక టాస్క్‌లో పోటీ పడటం, నామినేషన్ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ఒకవేళ గొడవ జరిగితే?ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్‌లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్‌లో బలంగా మారుతుందా? లేక బిగ్‌బాస్ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? -
బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా?
అంగరంగ వైభవంగా 'బిగ్‌బాస్' 10వ సీజన్ మొదలైంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే కమెడియన్ ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తనదైన డ్యాన్స్‌తో అలరించాడు. గతంలో ఇతడి స్నేహితులైన ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కమెడియన్ కేటగిరీలో వచ్చారు. ఫుల్ ఎంటర్టైనర్ చేశారు. మరి వాళ్లని రాంప్రసాద్ మర్చిపోయేలా చేస్తాడా లేదా అనేది చూడాలి?రాంప్రసాద్ విషయానికొస్తే ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్‌కి రైటర్‌గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్‌లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసిపోయాడు. ఇతడి టీమ్‌లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. -
ఆ తల్లి కన్నపేగు మన జెండా నూలుపోగు
1927 డిసెంబర్ 19. గోరఖ్‌పూర్ జైలులో ఒక తల్లి తన 30 ఏళ్ల కొడుకును చివరిసారి కలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం అతణ్ణి ఆ రోజు ఉరి తీయబోతోంది. కాని ఆ తల్లి కళ్లలో నీళ్లు లేవు. గొంతులో వణుకు లేదు. బదులుగా గర్వం ఉంది. ఆమె పేరు మూల్మతి దేవి. ‘సర్ఫరోషీ కి తమన్నా’ అని దేశాన్ని ఊపిన రాంప్రసాద్ బిస్మిల్‌ను కన్నతల్లి. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు ఇలాంటి తల్లుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి.జైలులో ఉన్న ఆ కొడుకు తల్లిని చూడగానే ఉద్వేగంతో కన్నీరు కార్చాడు. ఆ రోజే తనకు ఆఖరు అని అతనికి తెలుసు. తల్లికీ తెలుసు. కాని ఆ తల్లి చలించలేదు. కొడుకును చూసి ఏడ్వలేదు. ‘ఎందుకురా ఏడుస్తావు? నిన్ను ఏడిపించడం రాకనే కదా బ్రిటిష్ ప్రభుత్వం నిన్ను చూసి భయపడింది’ అంది. ‘నేను నిన్ను మళ్లీ చూడలేనని ఏడుస్తున్నాననమ్మా... భయంతో కాదు’ అన్నాడు కొడుకు.అప్పటిదాకా తాను జైలులో రాసిన ఆత్మకథను ఆమెకు ఇచ్చాడు. ఆమె దానిని టిఫిన్ డబ్బాలో దాచి రహస్యంగా బయటకు తెచ్చింది. ఆ తర్వాత ఆ ఆత్మకథ ‘కాకోరీ కే షహీద్’ పేరుతో పుస్తకమై లక్షలమందికి స్పూర్తినిచ్చింది. ఆ రోజు జైలు గోడలు కూడా సిగ్గుపడేంత ధైర్యం చూపిన ఆ తల్లిపేరు మూల్మతి దేవి.ఆమె కన్న వీరపుత్రుడు, దేశభక్తుడే రాంప్రసాద్ బిస్మిల్.ధిక్కారం ఆమె ధోరణిఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో 11 ఏళ్ల వయసులో అత్తగారింట్లో మూల్మతి అడుగు పెట్టే సమయానికి ఆమెకు చదువు లేదు. లోకం తెలియదు. కాని భర్త సహకారంతో ఆమె చదువుకుంది. ఆడపిల్లలు పుడితే చంపేసే ఆ ఇంటిలో అత్తగారిని, బంధుగణాన్ని ఎదిరించి ఐదుమంది ఆడపిల్లలను కన్నది. పెద్ద కొడుకు రాంప్రసాద్ బిస్మిల్ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే ‘నువ్వు చేయాల్సింది ఇలా బతకడం కాదు. దేశం కోసం బతకాలి’ అని నూరిపోసింది. ‘మా అమ్మ లేకపోతే నేను నాశనం అయి ఉండేవాణ్ణి’ అని రాంప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. బిస్మిల్ విప్లవవాద సాహిత్యం రాస్తుంటే మూల్మతి తన పొదుపు డబ్బును కొడుకు చేతిలో పెట్టి ‘దేశం మేలుకోవాలి నాన్నా. నువ్వు రాయి, నేనున్నా’ అని ప్రోత్సహించింది. దేశభక్తుల వెతుకులాటలో బ్రిటిష్‌వారు ఇళ్లను గాలిస్తుంటే ‘నా కొడుకు దొంగ కాదు, దేశాన్ని కాపాడే సిపాయి’ అని ఊర్లో గర్వంగా చెప్పుకునేది.కాకోరి ట్రైన్ యాక్షన్రాంప్రసాద్ బిస్మిల్ ‘హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ స్థాపించి బ్రిటిష్ వారిపై ఆయుధాలతో తిరగబడాలని ఆయుధాలకు కావాల్సిన డబ్బుకోసం 1925 లో లక్నో సమీపంలోని కాకోరి స్టేషన్ వద్ద రైలును కొల్లగొట్టి ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాడు. అది ప్రజల సొమ్మే. సుంకాల పేరుతో బ్రిటిష్ దోచిన సొమ్ము. అది కబ్జా చేయడం నేరం కాదని బిస్మిల్ అనుకున్నాడు. కాని బ్రిటిష్‌వారు ఈ దాన్ని తమకు పరువు తక్కువగా భావించారు. భారీ వేట కొనసాగించి రాంప్రసాద్ బిస్మిల్‌ను, అతనితో పాటు రైలు యాక్షన్‌లో పాల్గొన్న అష్ఫఖుల్లా ఖాన్, మరికొంతమందిని అరెస్టు చేశారు. రాంప్రసాద్ తోపాటు మొత్తం నలుగురికి ఈ కేసులో ఉరిశిక్ష పడింది. 1927లో ఉరిశిక్ష అమలు చేస్తే రెండేళ్లు రాం ప్రసాద్ గోరఖ్‌పూర్ జైలులో గడిపాడు. ఉరిశిక్షకు ముందు తల్లిని కలిశాడు. ఉరిశిక్షలో ఉరితాడును ముద్దాడుతూ రాంప్రసాద్ చివరి మాట...‘బ్రిటిష్ సామ్రాజ్యం నాశనం కావాలి’. ఆ శక్తి, స్థయిర్యం మూల్మతిది.ఒక కొడుకు పోయినా...బిస్మిల్‌ను ఉరితీస్తే దేశం మొత్తం దుఃఖంలో మునిగింది. కానీ మూల్మతి దేవి కొద్దిరోజులకే ఒక బహిరంగ సభకు వెళ్లి వేలాది మంది ముందు మైక్ పట్టుకుని ‘నా పెద్ద కొడుకు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. నా చిన్న కొడుకును కూడా ఇప్పుడే అర్పిస్తున్నాను. అవసరమైతే నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఇస్తాను’ అంది. కడుపు కోత మానకముందే రెండో కొడుకును అదే త్యాగానికి సిద్ధం చేసింది. ఆ తర్వాత ఆమె మీద బ్రిటిష్ వారి పరోక్ష నిర్బంధం కొనసాగింది. రూపాయి రూపాయికి ఆమె అల్లాడాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు పడినా ధైర్యంగా ఎదుర్కొంది. షాజహాన్ పూర్లో స్త్రీలకు దేశభక్తి గేయాలు నేర్పేది. చరఖా తిప్పమని, ఖాదీ కట్టమని చెప్పేది. దేశం కోసమే బతుకుతూ చివరి ఊపిరి వదిలింది.వారి త్యాగమే....ఆగస్టు 15న మనం రంగురంగుల బెలూన్లు ఎగురవేస్తాం. తీపి పంచుకుంటాం. కానీ ఈ స్వేచ్ఛ వెనుక మూల్మతి లాంటి తల్లులు ఉన్నారు. వాళ్లు కొడుకులను కనలేదు. అమరవీరులను కన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం అంటే అందుకు కారణం సరిహద్దులోని సైనికుడు మాత్రమే కాదు... ఇంట్లో కూర్చుని కొడుకును యుద్ధానికి పంపిన తల్లి కూడా. సెల్యూట్ టు మూల్మతి దేవి. అమ్మా నీ పాదాలకు వందనాలు. -
బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ రామ్ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ W/O అనిర్వేశ్’. ‘ది డెవిల్ చైర్’ఫేం గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రైవేట్ ఉద్యోగి అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) తనను నిత్యం వేధిస్తోందని సి.ఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. మరో వైపు అనిర్వేశే నిత్యం తనను వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధను అంతా వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు రాబర్ట్(సాయి కిరణ్ కోనేరి).. అనిర్వేశ్, విచెలిత కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు.కట్ చేస్తే..బిజినెస్ మ్యాన్ ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను లోబరుచుకొని దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసు విచారణలో సి.ఐ వరదరాజులు బిజీ అయిపోతాడు. అనిర్వేశ్ కేసు విచారణకు మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి రెండు కేసుల విచారణలో తేలిన నిజాలు ఏంటి? అనిర్వేశ్, విచెలిత, రాబర్ట్లలో ఎవరు ఎవరిని వేధించారు? మైథిలీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ కేసుతో రౌడీ షీటర్ ఆది, డాక్టర్ శరణ్య, సీఐ వరదరాజులుకు ఉన్న సంబంధం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ రామకృష్ణతో ఈ కేసులకు ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉండటమే ఇందుకు కారణం. W/O అనిర్వేశ్ కూడా ఆ జానర్ కథే. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి... కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గంగ సప్తశిఖర.భార్య వేధిస్తోందంటూ భర్త... భర్త వేధిస్తున్నాడంటూ భార్య... వీరిద్దరూ తోడుదొంగలు... నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి... నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ... మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి... సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి. ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం... అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో... ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా... చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే..ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్... ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది.రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
జబర్దస్త్ రాంప్రసాద్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ ఆనిర్వేశ్'. ఈ సినిమా గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే కామెడీకి భిన్నంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ సందర్భంగా సినిమా మంచి హిట్ అవుతుందని టీమ్‌కు శివాజీ అభినందనలు తెలిపారు. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. మార్చి 7వ తేదీ ఈ చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించారు.దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' జబర్దస్త్ రాంప్రసాద్‌తో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం మా చిత్రబృందమే. మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ, మా చిత్రంలో నటించిన తారాగణం ఎంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. -
లింక్డ్ స్క్రీన్ ప్లేతో ‘W/O అనిర్వేష్’.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం W/O అనిర్వేష్. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని "లింక్డ్ స్క్రీన్ ప్లే" అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాము అన్నారు.ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని, మా బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. -
కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. గురువారం (డిసెంబర్ 5) షూటింగ్‌కు వెళ్తుండగా తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎప్పటిలాగే షూటింగ్‌కు వెళ్తుండగా కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. దాంతో రామ్ ప్రసాద్ కారు ముందున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమవగా, రామ్‌ప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.‘పుష్ప 2’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం. ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
తన కిడ్నీని అమ్మాలనుకుని, చివరకు..
హైదరాబాద్: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్ మూలాలు నగరంలో బయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రతాపన్(41) విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠా ఏర్పడిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో రియల్టర్ అయిన రాంప్రసాద్.. తన కిడ్నీని అమ్మాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఉన్న అనారోగ్యంతో అది వీలుకాలేదు. ఈలోపు ఇరాన్లో కిడ్నీ రాకెట్ నడిపించే మధుతో రాంప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే మరో నిందితుడు సబిత్ కూడా తన కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ రాకెట్ ద్వారా మధు సంపాదన తెలిసి వీళ్లకూ ఆశపుట్టింది. అలా.. మధు ద్వారా రాంప్రసాద్, సబిత్.. ఇంకొందరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాంప్రసాద్ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. ఇరాన్‌తో పాటు కువైట్, శ్రీలంక కేంద్రాలుగా ఈ గ్యాంగ్ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యప్తులో వెల్లడైంది. ఇక.. ఈ ముఠా దాదాపు 40 మందికిపైగా యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు వెల్లడైంది. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని.. యువకులకు గాలం వేసేది ఈ గ్యాంగ్. ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో ఫేక్ పాస్‌పోర్టులు తయారు చేసి ఇరాన్‌కు తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్మెంట్లలో ఉంచేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించేవాళ్లు. కిడ్నీ దాతలను గుర్తించేందుకు హైదరాబాద్, విజయవాడలలో తనకు పలువురు సహకరించారని, అందులో వైద్య రంగానికి చెందిన వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు, ఇందుకోసం వారికి కొంత కమీషన్ కూడా ముట్టజెప్పానని రాంప్రసాద్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఇక.. ఈ కేసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. కిడ్నీ మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపు నిర్ధారణ దగ్గర నుంచి అనేక పరీక్షలు నిర్వహించి, ఫలానా దాత కిడ్నీ ఫలానా గ్రహీతకు సరిపోతుందని నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రాంప్రసాద్ పంపిన వారందరి కిడ్నీలు ఇరాన్లో ఎదురుచూస్తున్న వారందరికీ సరిగ్గా సరిపోయాయి. గ్రహీతల వైద్య పరీక్షల వివరాలను రాంప్రసాద్ ముందుగానే తెప్పించుకునేవాడని, కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధమైనవారికి ఇక్కడున్న ల్యాబొరేటరీల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎవరిది ఎవరికి సరిపోతుందో ముందుగానే నిర్ధారణకు వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. రాంప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిన్ని అరెస్టులు ఈ కేసులో జరిగేలా తప్పడం లేదు. ఈ కేసులో అంతకు ముందే త్రిస్సూర్‌కు చెందిన సబిత్ నాజర్, కళామస్సేరికి చెందిన సాజిత్ శ్యామ్‌రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సబిత్‌ను విచారణ చేపట్టాకే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగింది. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌కు సంబంధించి భారత్‌లోని ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్ట్ కావాల్సింది ఇరాన్లో రాకెట్ నడిపించిన మధు మాత్రమే. -
జూనియర్ ఎన్టీఆర్‌తో చిన్నారి.. తెగ ఆరా తీస్తోన్న ఫ్యాన్స్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే దుబాయ్‌లో సైమా అవార్డ్స్ వేడుకలకు హాజరైన జూనియన్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పని చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ పాపను ఎంతో అప్యాయంగా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో ఉన్న పాప జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ మేనకోడలు అని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తారక్ అన్నతో నా మేనకోడలు అంటూ రామ్ ప్రసాద్ పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ గ్లింప్స్, పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA — Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023 -
యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. హీరోయిన్గా స్థిరపడాలనే ఆశతో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర యాంకర్‌గా స్థిరపడిపోయిందనే చెప్పవచ్చు. అక్కడ తను స్టార్ పొజీషన్‌లోనే ఉన్నారు కూడా. తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా విపరీతమైన క్రేజ్ తనకు ఉంది. (ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) తాజాగా తను హోస్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లో రష్మిని అవమానించినట్లేనని చెప్పవచ్చు . ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడు. తన స్కిట్లో భాగంగా రష్మిని ఏకంగా 'రాత్రికి వస్తావా' అంటూ డబల్ మీనింగ్ అర్థం వచ్చేలా చిల్లర డైలాగ్ వేశాడు. దీంతో రష్మీ కూడా నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటూ సమాధానం ఇస్తుంది. రాత్రికి ఎందుకు రమంటారో తెలియదా..? అంటూ ఆటో రాంప్రసాద్ తిరిగి అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్లోని అందరు కూడా షాక్ అయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ కలుగజేసుకుని ఏయ్... అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ 'ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ' మరో డైలాగ్‌తో కవర్ చేస్తాడు. ఇలాంటి కవరింగ్‌లు ఆ ప్రోగ్రామ్‌లలో సర్వసాధారణమైనా మరీ ఇంతలా దిగజారిన చిల్లర డైలాగ్‌లు ఉంటే ఎలా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) గతంలో ఇలాంటి ప్రోగ్రామ్లలోనే విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు, తనను బాడీ షేమింగ్ చేస్తూ వేసిన జోకులు ఎన్నో అని చెప్పవచ్చు. నిజానికి ఆమె ముక్కు మీద ఓ వేయిసార్లు జోకులు వేసి ఉంటారేమో. ఆమెపైనే కాదు.. ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా స్కిట్ల పేరుతో బోలెడు కామెంట్లు చేసేవారు. వాటిని సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా చాలాసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎదో రకంగా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని ఈ ప్రోగ్రామ్స్‌లోని నటులు కూడా వాటిని భరిస్తూనే ఉంటారని చెప్పవచ్చు. -
ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్? స్పందించిన నటుడు
కమెడియన్, నటుడు ఆటో రాంప్రసాద్ అరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రామ్ ప్రసాద్ ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్న ఫొటో ఒకటి లీకైంది. ఇందులో అతడు సర్జికల్ క్యాప్ పెట్టుకుని కనిపంచాడు. దీంతో రాంప్రసాద్ క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు అతడు త్వరగా కోలుకోవాలని ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా తన అరోగ్యంపై వస్తున్న పుకార్లపై రాంప్రసాద్ స్పందించాడు. చదవండి: ప్రకాశ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండో బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు జబర్దస్త్ షో నటులు పాల్గొన్నారు. అందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌ను తన ఆరోగ్యంపై ప్రశ్నించగా.. అది నిజం కాదని స్పష్టం చేశాడు. ‘నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను తలకు క్యాప్ పెట్టుకోవడంతో అంతా నాకేదో అయ్యిందని ఆందోళన పడ్డారు. నాకు ఏం కాలేదు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. అందుకే క్యాప్ పెట్టుకున్నా. చదవండి: ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ అంతే నాకేం కాలేదు. నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారుగా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది నవంబర్ రాంప్రసాద్ తలకు సర్జరీ క్యాప్ పెట్టుకుని ఆస్పత్రిలో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి రాం ప్రసాద్‌కు ఏమైందీ, ఎందుకు క్యాప్ పెట్టుకున్నాడంటూ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అతడు క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నాడని, గుండు కావడంతో క్యాప్ పెట్టుకున్నాడంటూ పుకార్లు గుప్పుమన్నాయి. కాగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోలో తనదైన కామెడీ, ఆటో పంచులతో రాంప్రసాద్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు!
దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరితాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్ 1897 జూన్ 11వ తేదీన, అష్ఫాఖ్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జన్మించారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖ్ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటివి. బిస్మిల్ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చినా వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్ మొదట్లో అష్ఫాఖ్‌ను ఒక పట్టాన నమ్మలేదు, కాని అచంచలమైన అష్ఫాఖ్ దేశ భక్తికి, అంకిత భావానికి బిస్మిల్ చలించి పోయాడు. ఇద్దరూ యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావ జాలాన్ని తుత్తునియలు చేశారు. మాతృదేశ స్వాతంత్య్ర ఉద్యమ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1925 ఆగస్టు 9వ తేదీన అష్ఫాఖుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి మరికొందరు విప్లవకారులు కలిసి ‘కకోరీ’ గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాతో పోతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖజానాకే గురి పెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంత పనైతే, ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించి నట్లయింది. సెప్టెంబర్ 26న రాంప్రసాద్ బిస్మిల్‌ను అరెస్టుచేశారు. అష్ఫాఖ్ తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బనారస్‌లో అజ్ఞాత జీవితం గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో మిత్రుడు చేసిన నమ్మక ద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాఖ్, రాంప్రసాద్ బిస్మిల్లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణ మిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. ఇద్దరినీ వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. భూప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ అష్ఫాఖ్, బిస్మిల్ల త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ – ముస్లిం ఐక్యతను చాటుతూ... మతోన్మాదులకు సవాల్ విసురుతూనే ఉంటుంది! (క్లిక్ చేయండి: వారధి కట్టాల్సిన సమయమిది!) – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌లను ఉరితీసిన రోజు) -
ఆటో రాంప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం..
సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. జబర్దస్త్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న "పీప్ షో" చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. "పీప్ షో" చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్ హీరో పెళ్లి..! -
ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి!
టీవీ కమెడియన్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఈ రోజు ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది నటీనటుల మధ్య అవినాష్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. చదవండి: పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్ ఇక అవినాష్, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్ రాంప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్లో చానల్ ద్వారా విడుదల చేసి అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ ‘సారీ అవినాష్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అలాగే అరియాన, దివితో పాటు పలువురు నటీనటులు పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్ View this post on Instagram A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad) -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసులో మంగళవారం మరో నలుగురిని పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కోగంటి సత్యం, టెక్కెం శ్యామ్‌సుందర్ అలియాస్ శ్యామ్, బాలనాగ ఆంజనేయప్రసాద్, ఎం.ప్రీతం అలియాస్ బాజీ, పులివర్తి రామును సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. రాంప్రసాద్ ప్రతి కదలికను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రిక ఆనంద్(28), హత్య జరిగిన రోజు అదే ప్రాంతంలో ఉండి ఎవరూ రాకుండా కాపుగాసిన శ్రీరామ్ రమేశ్(29), షేక్ అజారుద్దీన్(30), పత్తిపాటి నరేష్(28)లను సోమవారంరాత్రి జూబ్లీహిల్స్, అయ్యప్ప సొసైటీలోని కోగంటి సత్యంకు చెందిన గెస్ట్‌హౌస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంప్రసాద్ కదలికలు తెలుసుకునేందుకు ఆనంద్‌ను నియమించిన తిరుపతి సురేశ్, మరో నిందితుడు వెంకట్రాంరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐదో నిందితుడు ఆనంద్ నెలరోజులుగా పంజగుట్ట దుర్గానగర్‌లోని ఓ గదిలో ఉంటూ రాంప్రసాద్ కదలికలపై నిఘా పెట్టాడు. ఏ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు, పంజగుట్టలోని కార్పొరేట్ ఆఫీస్‌కు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళతాడు అనే విషయాలు తెలుసుకుని తిరుపతి సురేశ్‌కు చెప్పేవాడు. సురేశ్ ఈ సమాచారాన్ని కోగంటి సత్యంకు చేరవేసేవాడు. ఆనంద్ సూచనల మేరకే దుర్గానగర్‌ను హత్యకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు పోలీసులు చెప్పారు. హత్య చేసేందుకు వెళ్లిన నిందితులకు సురేశ్ బొలెరో వాహనం సిద్ధం చేశాడు. హత్య అనంతరం నిందితులను అదే వాహనంలో జూబ్లీహిల్స్ వరకు తీసుకువెళ్లి పారిపోయేలా చేశాడు. త్వరలోనే సురేశ్‌ను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
స్కెచ్చేశాడు.. చంపించాడు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చిత్తు కాగితాల వ్యాపారిగా ప్రస్థానం మొదలెట్టిన కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం రూ. కోట్లు టర్నోవర్ చేసే స్టీల్ వ్యాపారి స్థాయికి ఎదిగాడు. మరోవైపు భూకబ్జాలకు పాల్పడటం, స్థల వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం.. ప్రత్యర్థులను తుదముట్టించడం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ఏ–1 రౌడీషీటర్‌గా ఎదిగాడు. ఈ తరహా ఆరోపణల నేపథ్యంలో బెజవాడలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సత్యంపై 21 కేసులు నమోదయ్యాయి. సత్యం ఆగడాలు మితిమీరడంతో పోలీసులు అతడిపై ఏ–1 రౌడీషీట్ తెరిచారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన స్పర్థల నేపథ్యంలో స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్‌ను కోగంటి సత్యం తుదముట్టించినట్టు తేలడం నగరంలో కలకలం రేపింది. పక్కా స్కెచ్ అమలు.. తేలప్రోలు రాంప్రసాద్, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో రూ.70 కోట్లను కోగంటి సత్యంకు రాంప్రసాద్ బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించేవిధంగా సెటిల్మెంట్ చేశారు. రుణ మొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చకపోవడంతో కోగంటి సత్యం ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రాంప్రసాద్‌ను హతమార్చాలనే నిర్ణయానికొచ్చి తన అనుచరుడు శ్యామ్‌ను ఆశ్రయించాడు. రాంప్రసాద్ హత్య కేసులో ఏ–3గా ఉన్న ఆంజనేయ ప్రసాద్ అంతకుముందు తన మామగారి మెడికల్‌షాపు కేసు విషయమై సత్యంను కలిశాడు. అతడి అవసరాలను ఆసరాగా చేసుకున్న శ్యామ్ హత్య ప్రణాళిక గురించి అతడికి తెలిపాడు. హత్య కేసును అతనిపై రానివ్వకుండా చూసుకుంటామని, మెడికల్ షాపు వ్యవహారంలో అతనికి న్యాయం చేస్తామని నమ్మబలకడంతో రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఆంజనేయ ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇలా మొత్తం రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు పథక రచన చేశారు. ఇందులో ఆంజనేయ ప్రసాద్‌కు శ్యామ్ రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదే కేసులో ఏ–7 నిందితునిగా ఉన్న చంద్రిక ఆనంద్‌కు రూ.3 లక్షలు ఇచ్చాడు. కాగా కోగంటి సత్యం ఏ–6 నిందితుడైన తిరుపతి సురేష్‌కు రూ.25 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 6న పంజాగుట్ట సమీపంలో వ్యాపారి రాంప్రసాద్‌ను నిందితులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రాంప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య వైదేహి ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. ఏ–1 నిందితుడైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగిలిన ఆరుగురు నిందితులు తిరుపతి సురేష్, చంద్రిక ఆనంద్, శ్రీరామ్ రమేష్, షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, పత్తిపాటి నరేష్, వెంకట రామ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. కేసును పక్కదోవ పట్టించేలా.. కోగంటి సత్యం సూచన మేరకు అతని అనుచరుడు శ్యామ్ మీడియాతో పాటు పోలీసులకు ఈ హత్యతో సత్యంకు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు చెప్పాడు. శ్యామ్ మాటలపై పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. రాంప్రసాద్ నుంచి డబ్బు రాకపోవడంతో రాంప్రసాద్‌ను హత్య చేయిస్తే.. అతడి బావమరిది తనకు ఇవ్వాల్సిన రూ.12 కోట్లు అయినా భయపడి ఇస్తాడని ఆశించి కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
కోగంటే సూత్రధారి!
సాక్షి, హైదరాబాద్/అమరావతి బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితమే ఆయన హత్యకు నిందితులు కుట్ర పన్నినట్లు ప్రధాన నిందితుడైన కోగంటి సత్యం విచారణలో వెలుగుచూసింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో హత్య అమలు వాయిదా పడింది. రాంప్రసాద్ కదలికలపై మొత్తం మూడుచోట్ల రెక్కీ నిర్వహించిన నిందితులు.. కుట్ర అమలుకు అనుకూలంగా ఉంటుందనే పంజగుట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నారని బయటపడింది. ఈ కేసులో కోగంటి సత్యం సహా మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి వరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ హత్య పథక సూత్రధారి కోగంటి సత్యమే అని కూడా నిర్ధారణకు వచ్చారు. రాంప్రసాద్‌ను చంపేందుకు కిరాయి హంతకులకు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. రంగంలోకి దిగిన ప్రధాన అనుచరుడు.. విజయవాడకు చెందిన కామాక్షి స్టీల్స్ వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాలు, మధ్యలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం.. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం తదితర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్‌ను హత్య చేయాలని కోగంటి సత్యం నిర్ణయించుకున్నాడు. ఆ పనిని తన ప్రధాన అనుచరుడైన శ్యామ్‌కు అప్పగించాడు. ఎన్నికల కారణంగా పోలీసుల తనిఖీలు విస్తృతంగా ఉండడం.. రాంప్రసాద్ ఆచూకీ స్పష్టంగా తెలియకపోవడంతో కోగంటి సత్యం తన పథకాన్ని వాయిదా వేశాడు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత శ్యామ్, సురేష్‌లు తమ అనుచరుడైన ఆనంద్‌ను రంగంలోకి దింపి రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టే బాధ్యత అప్పగించారు. గది అద్దెకు తీసుకుని గాలింపు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆనంద్ ఓ గది అద్దెకు తీసుకుని గాలింపు మొదలు పెట్టాడు. చివరకు రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టిన అతను.. పరిగిలో రాంప్రసాద్ నిర్వహిస్తున్న అభిరామ్ స్టీల్స్ ఫ్యాక్టరీ, గచ్చిబౌలిలోని నివాసం, పంజగుట్టలోని కార్పొరేట్ కార్యాలయాలను గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్, సురేష్‌లు.. హైదరాబాద్ వచ్చి ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఫ్యాక్టరీ వద్ద దాడిచేస్తే కార్మికులు చూసి తమను పట్టుకోవడం, ఎదురుదాడి చేయడం లేదా రాంప్రసాద్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశం ఉందని భావించారు. ఇంటి వద్ద కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉండటంతో అక్కడ కూడా దాడి చేయకూడదని నిర్ణయించుకున్నారు. పంజగుట్టలో అభిరామ్ స్టీల్స్ కార్యాలయం సమీపంలో ఉన్న దేవాలయం వద్దే అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కోగంటి సత్యంకి చెప్పడంతో అతడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన శ్యామ్, చోటు, రమేష్ తదితరులు గత శనివారం రాత్రి రాంప్రసాద్‌ను మట్టుబెట్టారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం పది మందికి పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోగంటి సత్యం, శ్యామ్, చోటు, రమేష్, ఆనంద్, సురేష్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. నిందితుల్ని శుక్రవారం అరెస్టుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే హత్యకు వినియోగించిన వాహనాలు, ఆయుధాలు, సెల్ఫోన్లు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులపై నేరం నిరూపించడానికి అవసరమైన ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు తీరు తెన్నుల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు నిందితులకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. రోడ్డు ప్రమాదం తర్వాతే హత్యకు ప్రణాళిక రెండు నెలల కిందట మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అప్పట్లో దీనిపై ఆయన ఎవరిపై అనుమానం వ్యక్తంచేయలేదు. అయితే, ఈ ప్రమాదం వెనుక రాంప్రసాద్ హస్తమున్నట్లు గుర్తించిన సత్యం.. మరోవైపు కామాక్షి స్టీల్స్ వ్యాపార లావాదేవీల వివాదం తీవ్రరూపం దాలుస్తుండడంతో భవిష్యత్తులో అతని నుంచి తనకెదురయ్యే ముప్పును తప్పించుకునేందుకే రాంప్రసాద్ హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం రూ. కోటి వరకు సత్యం సుపారీ ఇచ్చినట్లు.. ఈ చెల్లింపులన్నీ శ్యామ్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉంటే.. రెండు దశాబ్దాలుగా స్టీలు వ్యాపార రంగంలో ఉన్న కోగంటి సత్యంపై విజయవాడ నగరంలో మొత్తం 24 కేసులున్నాయి. ఏ–1 రౌడీషీట్ కూడా ఉంది. వైజాగ్, విజయవాడలో ఆస్తి, వ్యాపార తగాదాలు ఉన్నాయి. ఇందులో మూడు కేసులు మినహా అన్ని కేసులు కొట్టేశారు. -
సుపారీ ఇచ్చింది సత్యమే..
సాక్షి, హైదరాబాద్: స్టీల్ వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్‌ను హత్య చేయించింది తానేనని పోలీసుల అదుపులో ఉన్న కోగంటి సత్యం అంగీకరించాడు. ఈ హత్యకు విజయవాడలోని కామాక్షి స్టీల్స్‌కు సంబంధించిన వివాదమే కారణమని తేలింది. ఈ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకోవడంతో మరింత ముదిరింది. సెటిల్మెంట్ చేసుకున్న డబ్బు ఇవ్వకపోవడం, టీడీపీ నేతల మద్దతుతో కేసులు పెట్టి వేధిస్తుండటంతో కోగంటి సత్యం విసిగివేసారి పోయినట్టు సమాచారం. దీంతో తన ప్రధాన అనుచరుడు శ్యామ్‌తోనే హత్యకు పథక రచన చేసినట్లు, ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలిచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సత్యంసహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. 20 శాతం వాటా విక్రయం... విజయవాడకు చెందిన కోగంటి సత్యం కామాక్షి స్టీల్ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. కొన్నేళ్లక్రితం టీడీపీ నేత బొండా ఉమాను వర్కింగ్ పార్ట్నర్గా చేర్చుకున్నాడు. పెట్టుబడి లేకపోయినా సంస్థలోనే ఉండి, దాని వ్యవహారాలు పర్యవేక్షించేందుకు 20 శాతం వాటాను ఉమాకిచ్చాడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించిన ఉమా తన 20 శాతం వాటాను 2013లో రాంప్రసాద్‌తోపాటు ఆయన మేన బావమరిది ఊర శ్రీనివాస్‌కు విక్రయించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని వైశ్యా బ్యాంక్ నుంచి కామాక్షి స్టీల్స్ పేరిట భారీ మొత్తంలో రుణం తీసుకోవడం, దాని కిస్తీలు సక్రమంగా చెల్లించకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో 2014లో సెటిల్మెంట్ చేసుకున్న కోగంటి సత్యం, రాంప్రసాద్‌లు వ్యాపారం నుంచి వేరుపడ్డారు. ఆ సమయంలో తనవల్ల జరిగిన నష్టానికి, ఇతర అప్పులకు సంబంధించి రూ.25 కోట్లు చెల్లిస్తానంటూ రాంప్రసాద్ సెటిల్మెంట్ డీడ్ రాసిచ్చారు. రాంప్రసాద్‌కు బొండా మద్దతు... బొండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో సత్యం, రాంప్రసాద్ మధ్య స్పర్థలు మరింత ముదిరాయి. సెటిల్మెంట్ డీడ్‌ను బేఖాతరు చేసిన రాంప్రసాద్‌కు బొండా మద్దతు పెరిగింది. తమ మధ్య జరిగిన వివాదాలకు, వ్యవహారాలకు సంబంధించి సత్యం విజయవాడలోని ఏ ఠాణాకెళ్లినా కేసు నమోదయ్యేది కాదు. ఈ చర్యలతో విసిగిపోయిన సత్యం అదునుకోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. 2017లో రాంప్రసాద్ కుటుంబంతో కలసి హైదరాబాద్‌కు చేరారు. ఖాజాగూడలో ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్ పేరుతో సంస్థనేర్పాటు చేశారు. ఇటీవలే గచ్చిబౌలిలో కొత్త ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. 2 నెలల క్రితమే... దాదాపు 2 నెలలక్రితమే రాంప్రసాద్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్న సత్యం ఈ పనిని తన అనుచరుడు, రాంప్రసాద్ పెట్టిన కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్యామ్‌కు అప్పగించాడు. ఖర్చులకోసం రూ.10 లక్షలిచ్చాడు. రంగంలోకి దిగిన శ్యామ్ ఈ హత్యకోసం తన స్నేహితుడైన సురేష్‌తోపాటు ఆనంద్, ఛోటు, రమేష్‌లను తనతో కలుపుకున్నాడు. రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టాల్సిన బాధ్యతను ఆనంద్కప్పగించాడు. నగరానికి వచ్చిన ఆనంద్ తనకు భారీ మొత్తంలో స్టీలు కావాలంటూ ఫోన్ చేయగా.. రాంప్రసాద్ తన పంజగుట్ట కార్యాలయం చిరునామా చెప్పి అక్కడకు రావాలని సూచించాడు. ఈ క్రమంలో పరిగిలోని రాంప్రసాద్ సంస్థ, గచ్చిబౌలిలోని ఇల్లు గురించి కూడా ఆనంద్ తెలుసుకున్నాడు. హత్య.. అనంతర ప్రక్రియకు పథక రచన... రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఛోటు, రమేష్‌తో కలసి శ్యామ్ రంగంలోకి దిగాడు. అందుకవసరమైన కత్తుల్ని విజయవాడలోని తన వాటర్ ప్లాంట్‌లోనే తయారు చేయించాడు. హత్యానంతరం పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోవాలని, ఏ దశలోనూ సత్యం పేరు బయటకు రానీయకూడదని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఊర శ్రీనివాస్ పేరు చెప్పాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 2న విజయవాడ నుంచి కుటుంబంతోసహా తిరుపతి వెళ్లిన సత్యం అక్కడ్నుంచీ నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. 5న విజయవాడ నుంచి వాహనంలో బయల్దేరిన శ్యామ్, సురేష్, ఛోటు, రమేష్ డ్రైవర్‌తో కలసి ఆనంద్ వద్దకు చేరుకుని బస చేశారు. 6వ తేదీ రాత్రి అదే వాహనంలో పంజగుట్టలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకెళ్లారు. సురేష్ కాస్త దూరంలో ఆగిపోగా.. మిగిలిన ముగ్గురూ రాంప్రసాద్పై దాడి చేశారు. తమ ‘పని’ పూర్తయ్యాక పోలీసులకు లొంగిపోవాలని భావించిన శ్యామ్, ఛోటు, రమేష్ కంగారుపడి ఎవరికి వారుగా పారిపోయారు. వీరు వచ్చిన వాహనం తీసుకుని డ్రైవర్ విజయవాడ వెళ్లిపోయాడు. ఆనంద్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసుల విచారణలో అసలు కథ బయటికి... పథకం ప్రకారం ముందు సత్యం, ఆ తర్వాత శ్యామ్, ఛోటు, రమేష్ మీడియా ముందుకొచ్చి ఊర శ్రీనివాస్ పేరు బయటకు తెచ్చారు. అయితే రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సత్యంతోపాటు శ్యామ్, రమేష్, ఛోటులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కథంతా బయటికొచ్చింది. విజయవాడ వెళ్లిన ప్రత్యేక బృందం వాహనంతోపాటు డ్రైవర్‌ను పట్టుకుని తీసుకొచ్చింది. ప్రస్తుతం సత్యంను టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మిగిలిన నలుగురినీ పంజగుట్ట అధికారులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆనంద్, సురేష్కోసం గాలిస్తున్నారు. -
రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్ : క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసును హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి రాంప్రసాద్పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యంను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. సంచలన విషయాలను రాబట్టారు. (చదవండి : హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య ) ఆరు నెలల ముందే రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల ముందే కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని రెంట్‌కు తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కోగంటి సత్యం డైరెక్షన్లోనే హత్య జరిగింది. తన పాత్రను బయటపెట్టకుండా కోగంటి జాగ్రత్త పడ్డాడు. రాంప్రసాద్ హత్యకు కోగంటి రూ.30 లక్షలు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కోగంటి వాడిన 5 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ స్టీల్ వ్యాపారి బన్సల్ , హైదరాబాద్ కు చెందిన సియోట్ కంపెనీ ఓనర్లతో పాటు మరొకొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించనున్నారు. (చదవండి : టాస్క్‌ఫోర్స్ అదుపులో కోగంటి సత్యం) కాగా రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ నిందితుడు శ్యామ్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే ఈ హత్యకు కోగంటికి సంబంధం ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. రాంప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని పేర్కొన్నాడు. -
క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న రాంప్రసాద్ హత్య
-
టాస్క్‌ఫోర్స్ అదుపులో కోగంటి సత్యం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో జరిగిన తెలప్రోలు రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యంను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి రాంప్రసాద్పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యం.. అక్కడినుంచే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన కోసం గాలించిన ప్రత్యేక బృందాలు హబ్సిగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. ఇదంతా జరుగుతుండగానే.. సోమవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి వచ్చారు. విజయవాడకు చెందిన టెక్కెం శ్యాంప్రసాద్ అలియాస్ శ్యామ్‌తో పాటు అతడి అనుచరులు ఛోటు, రమేష్ మీడియాకు రహస్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంలో శ్యామ్ మాట్లాడుతూ తానే మిగిలిన ఇద్దరితో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని వెల్లడించాడు. రాంప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రంగంలోకి దిగానని పేర్కొన్నాడు. ఆఫీసులో ఉంటాడని తెలిసే.. శనివారం రోజున పంజాగుట్టలోని కార్యాలయానికి రాంప్రసాద్ వస్తాడనే విషయాన్ని తమకు ఊర శ్రీనివాస్ చెప్పాడని శ్యామ్ వెల్లడించాడు. దీంతో హత్యకు పథకం వేశామని, విజయవాడలో ఉన్న తన వాటర్ ప్లాంట్‌లోనే మూడు కత్తుల్ని ప్రత్యేకంగా తయారు చేయించానని వెల్లడించాడు. వాటిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రాంతంలో బస చేశామని, దాదాపు 15రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే శనివారం రాత్రి కాపుకాసి కత్తులతో దాడి చేశామని వివరించాడు. హత్యానంతరం అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు వెళ్ళిపోయామని తెలిపాడు. సోమవారం లొంగిపోవాలని నిర్ణయించుకుని వచ్చామని శ్యామ్ చెప్పాడు. ఈ కేసుతో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. విజయవాడకు చెందిన శ్యామ్‌పై అక్కడ రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు చెప్పారు. గతంలో రాంప్రసాద్ కిడ్నాప్, హత్యాయత్నం కేసులో కోగంటి సత్యంతో కలిసి జైలుకు కూడా వెళ్ళాడంటున్నారు. ఈ కేసు తర్వాతే సత్యం ఇతడితో విజయవాడలోని తన కార్యాలయానికి పక్కనే వాటర్ ప్లాంట్ పెట్టించాడని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్యామ్ హఠాత్తుగా వచ్చి లొంగిపోవడం, హత్య కేసులో సత్యం పాత్ర లేదంటూ చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకోవడానికే సత్యంతో పాటు పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురినీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క విజయవాడలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చిన కోగంటి సత్యం పెద్దల్లుడు కృష్ణారెడ్డిని కూడా ఇక్కడే ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. -
‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. అయితే హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ తానే హత్య చేశానని శ్యామ్ నేరం ఒప్పుకోవడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి శ్యామ్ భార్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం నా భర్త పని ఉందని బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి వాటర్ ప్లాంట్‌ను నేను చూసుకుంటున్నాను. అయితే రాంప్రసాద్‌ని నా భర్త హత్య చేశాడనే విషయం నాకు తెలీదు. కానీ రాంప్రసాద్ మా మీద పెట్టిన కేసులు వల్ల ఆర్థికంగా నష్టపోయి.. మానసిక ఇబ్బందులు పడ్డాం. రాం ప్రసాద్ పెట్టిన కేసుల వల్ల పోలీసులు అర్థరాత్రి మా ఇంటికి వచ్చి సోదాలు జరిపి ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, డబ్బు, నగలు పట్టుకుపోయారు. రాంప్రసాద్ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడ’ని తెలిపారు. -
ప్రారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త మలుపు
-
హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య
సాక్షి, హైదరాబాద్/అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ (49) హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఆయన దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా పంజగుట్ట వద్ద దుండగులు కత్తులతో పొడిచా రు. తీవ్రగాయాల పాలైన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని భట్టిప్రోలుకు చెందిన రాంప్రసాద్ తన ఇద్దరు పిల్లలు అఖిల్, నిహారి, భార్య వైదేహితో కలిసి 2017లో హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం ఖాజాగూడలో నివాసం ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని పంజ గుట్ట దుర్గానగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రతీ శనివారం కార్యాలయం మూసే సమయంలో దాని పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లడం ఆయనకు అలవాటు. ఈ శనివారంరాత్రి 8:20 సమయంలో దైవదర్శనం అనంతరం బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపుకాసి ఉన్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దీంతో రాంప్రసాద్ అక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న రాంప్రసాద్‌ను అంబులెన్స్‌లో సోమాజి గూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. పోలీసులు ఘటనాస్థలిలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ కాలనీ మొత్తం చీకటిగా ఉండటంతో నిందితులను స్పష్టంగా గుర్తించలేకపోయారు. కిరాయి హంతకుల పనిగా పోలీసులు నిర్థారించారు. అయితే దుండగులు పారిపోయిన కారు నంబర్ గుర్తించారు. ఆ కారు చిత్తూరుకు చెందిన చిరునామాతో ఉంది. కారు నంబర్ ప్లేట్ మార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు.. రాంప్రసాద్ భార్య వైదేహి ఫిర్యాదు మేరకు విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోగంటి సత్యంతో ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు వైదేహి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యంపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం విజయవాడకు ప్రత్యేక బృందాన్ని పంపారు. హత్య జరిగిన సమయానికి కోగంటి సత్యం పంజగుట్ట ప్రాం తంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలు కాస్తా రాజకీయ వైరంగాను మారడంతో రాంప్రసాద్ హత్య దర్యాప్తు ఒకే కోణంలో చూడలేమని పోలీసులు చెబుతున్నా రు. సత్యం ప్రతి వారం పటమట పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈవారం రాకపోవడం తో ఆయన ఎక్కడికి వెళ్లారనేది ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపా రు. ఆదివారంరాత్రి పంజాగుట్ట పోలీసులు సత్యం పెద్ద అల్లుడు పొచంపల్లి కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు. బొండా ఉమా భాగస్వామి.. కోగంటి సత్యం ఎండీగా ఉంటూ కామాక్షి స్టీల్ ట్రేడర్స్ పేరుతో విజయవాడలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2008లో ఈ సంస్థలో రాంప్రసాద్‌తో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు కూడా భాగస్వామిగా ఉండేవారు. 2013లో వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో రాంప్రసాద్, బొండా ఉమ బయటకు వెళ్లిపోయారు. బొండా ఉమా, రాంప్రసాద్ తనను మోసం చేశారని కోగంటి సత్యం అప్పట్లో ఆరోపించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్, సత్యం విజయవాడలోని కృష్ణలంకలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బొండా ఉమా సహకారంతో రాంప్రసాద్ కిడ్నాప్ కేసు పెట్టారని సత్యం ఆరోపించారు. అప్పట్లో సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోగంటి సత్యంపై రౌడీషీట్ కూడా తెరిచారు. పథకం ప్రకారం నన్ను ఇరికిస్తున్నారు ‘‘రాంప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు. పథకం ప్రకారం కొందరు నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. నాపై రాంప్రసాద్ కుటుంబం ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేను బొండా ఉమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే ఆయన కక్షగట్టారు. కామాక్షి స్టీల్స్‌లో నాతో పాటు బొండా ఉమా కూడ వ్యాపార భాగస్వామిగా ఉండేవారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బొండా ఉమ తన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించారు. రాంప్రసాద్ నాకే రూ. 26 కోట్లు ఇవ్వాలి. రాంప్రసాద్‌ను చంపితే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు అడిగినప్పుడల్లా నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు ఉదయం టీవీలో వార్తలు చూసే వరకూ కూడ రాంప్రసాద్ హత్యకు గురైన విషయం నాకు తెలియదు. రాంప్రసాద్‌కు అతని బావమరిదితో కూడ గొడవలున్నాయి. చాలా మందికి రాంప్రసాద్ డబ్బులు ఇవ్వాలి. మూడు రోజుల క్రితం నేను తిరుపతికి వెళ్లాను. అక్కడి నుంచి ఫిజియోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాను. హత్య విషయంలో తెలంగాణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎక్కడికి నేను పారిపోలేదు. అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలి’’. – మీడియాతో కోగంటి సత్యం. -
‘ఆ హత్యకేసులో బోండా ఉమ ప్రమేయం ఉంది’
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. శనివారం పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై కోగంటి సత్యంకు సంబంధం ఉందని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాంప్రసాద్ నుంచి తనకు 26 కోట్లు రావాలని, అలాంటప్పుడు తానేలా హత్యచేస్తానని ప్రశ్నించారు. నాపై కక్ష్యపూరితంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యకేసులో బోండా ఉమా, ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని అన్నారు. గతంలో కూడా ఏబీ వెంకటేశ్వర రావుతో కలిసి బోండా ఉమా తనపై తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. తానేమీ అజ్ఞాతంలో లేనని, ఫిజియోథెరపీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. -
పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపారా లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా రాంప్రసాద్‌కు విజయవాడకు చెందిన బిజినెస్ పార్టనర్ నుంచి బెదిరింపులు వస్తూ ఉండేవని, వాటా నిమిత్తం న్యాయంగా రావాల్సిన 50 కోట్లకు సంబంధించి అతగాడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రాంప్రసాద్‌ను చంపేశారని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రాంప్రసాద్ హత్య విజయవాడలోనూ కలకలం రేపుతోంది. ఆర్ధిక లావాదేవీలతోనే మాజీ వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం...రాంప్రసాద్ హత్యకు స్కెచ్ వేసాడన్న కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు దృష్టి పెట్టారు. అయితే రాంప్రసాద్ హత్యకు కోగంటికి ఎలాంటి సంబంధం ఆయన అనుచరులు చెబుతునన్నారు. కాగా పటమటలోని కోగంటి సత్యం నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అయితే కోగంటి సత్యం ప్రతి వారం పటమట పీఎస్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈ వారం రాకపోవడం వల్లే ఆయన కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపారు. -
భారీగా అక్రమ ఆస్తులు
పశ్చిమగోదావరి , తణుకు: పెద్ద ఎత్తున ఆక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్న కేంద్ర అటవీశాఖ అభివృద్ధి మండలి ఉన్నతస్థాయి అధికారి (ఉత్తరప్రదేశ్ క్యాడర్) ముత్యాల రాంప్రసాదరావు నివాసంలో మంగళవారం దాడులు చేసిన సీబీఐ అధికారులు దీనికి కొనసాగింపుగా బుధవారం జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తణుకులోని రాంప్రసాదరావు ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయన భార్య ఆకుల కనకదుర్గతోపాటు ఆమె వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న గణపతిశాస్త్రి, మరికొందర్ని విచారించి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బంగారంతోపాటు రూ. 25 లక్షల నగదు, గత మూడేళ్లలో క్రయ విక్రయాలు చేసిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం తణుకులో దాడులు నిర్వహించిన సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఆయన పని చేసిన ప్రాంతంతోపాటు ఢిల్లీలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. మంగళవారం పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయానికి ఆకుల కనకదుర్గ ఆమె పీఏ గణపతిశాస్త్రిని బుధవారం తీసుకువెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించిన బినామీల వివరాలను సేకరించిన అధికారులు వారిని విచారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారం రోజులుగా సీబీఐ అధికారులు రెక్కీ నిర్వహించిన విషయాన్ని పసిగట్టిన రాంప్రసాదరావు కుటుంబ సభ్యులు కీలక డాక్యుమెంట్లు, పెద్ద ఎత్తున బంగా>రాన్ని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మరికొంత దాచిపెట్టినట్లు సమాచారం. వీరు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలను సైతం అధికారులు పరిశీలించారు. కేంద్ర మంత్రి ద్వారా ఒత్తిడి..? వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంప్రసాదరావుకు జాతీయ స్థాయిలో రాజకీయంగా పలుకుబడి ఉన్నట్లు చెబుతుంటారు. అంతే కాకుండా రాష్ట్రంలో కొందరు టీడీపీ పెద్దలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో గతంలోనూ ఇతని అక్రమ సంపాదనపై విచారించిన విజిలెన్సు, ఏసీబీ అధికారులు తర్వాతి కాలంలో చేతులెత్తేశారు. తాజాగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగి బయటపడిన అక్రమ ఆస్తులను మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లుగా లెక్కకట్టారు. ఈ మేరకు రాంప్రసాదరావుపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి ఒకరు పరోక్షంగా రాంప్రసాదరావుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నాలుగైదు రోజుల పాటు జరగాల్సిన తనిఖీలు కేవలం ఒక్కరోజుకే పరిమితం చేశారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీకి చెందిన కొందరు పెద్దల ద్వారా కేంద్రమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ దిశగా ఈ వ్యవహారం నీరుగార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడులు సమయంలో సైతం రాంప్రసాదరావు కుటుంబ సభ్యులు ఏం కాదనే ధీమాను ప్రదర్శించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. -
హోలీ వేడుకల్లో అపశ్రుతి
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాల్లో మునిగితేలిన ఇద్దరు యువకులు రంగులు కడుక్కోవడానికి గోదావరిలో దిగి నీట మునిగి గల్లంతయ్యారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మొరాంపూడి రాంప్రసాద్(19), బోటా రమేష్(19) స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి గోదావరికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు యువకుల బంధువుల రోదనలతో గోదావరి తీరం ఉద్వేగంగా మారింది. -
మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది
‘‘హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా నేను హీరోగా ఫీలవ్వలేదు. ఒక సాధారణ నటునిగానే ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ప్రత్యేక పాత్రలు పోషిస్తుంటే నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నటనను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’’ అన్నారు నరేశ్. దాదాపు ఇరవై ఏళ్ల పాటు కథానాయకునిగా వెలిగిన ఆయన... ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నరేశ్ విలేకరులతో ముచ్చటించారు.నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు: నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. 2014 నాకు మంచి ఫలితాలనిస్తోంది. ‘దృశ్యం’ నాకు మంచి పేరు తెస్తోంది. సందీప్ కిషన్ హీరోగా కన్మణి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే నితిన్-కరుణాకరన్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నా. ‘లక్ష్మీ రావె మా ఇంటికి’లో కూడా నాది మంచి పాత్ర. అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నా సినిమా కెరీర్ చాలా వరకూ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావడం పునర్జన్మ వచ్చినట్లయ్యింది. నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు. టైమ్ కూడా కలిసి రావాలి. మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది.మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు: త్వరలోనే మా అబ్బాయి నవీన్ హీరోగా పరిచయం కానున్నాడు. కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకత్వంలో అడ్డాల చంటి ఆ సినిమా నిర్మిస్తున్నారు.


