Bigg Boss 10 : బిగ్‌షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌, డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీళ్లే | Bigg Boss 10 Telugu: Episode 46, Day 45 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 : తన్నుకున్నంత పని చేసిన షాలిని, దక్షి.. విజేతగా రాంప్రసాద్‌

Oct 22 2026 10:27 AM | Updated on Oct 22 2026 10:27 AM

Bigg Boss 10 Telugu: Episode 46, Day 45 Highlights

షాలిని రీఎంట్రీ ఇవ్వడం ఒకెత్తు అయితే.. ఆమె చేసిన హంగామా మరో ఎత్తు. టాస్క్‌లో భాగంగా దక్షిపై బూతులతో రెచ్చిపోయింది. ఒకానొక దశలో వాట్‌..వాట్‌ అంటూ పైపైకి వెళ్లింది. ఇంకా ఎపిసోడ్‌ 46లో జరిగిన హైలెట్స్‌పై ఓ లుక్కేయండి.

→ ఎలిమినేట్‌  అయిందని చెప్పిన షాలిని మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను సీక్రెట్‌ రూమ్‌  నుంచి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ అంతా షాకయ్యారు. ఇక రోహిత్‌ అయితే..ఆనందంతో ఆమెను గట్టిగా హగ్‌ చేసుకోని, బుగ్గపై ముద్దు పెట్టాడు. అనంతరం ఎప్పటిమాదిరే షాలిని తనదైన స్టైల్లో ఆట మొదలు పెట్టింది.

→ ఇక హౌస్‌మేట్స్‌కి బిగ్‌బాస్‌ బిగ్‌  షాక్‌ ఇచ్చాడు. ఈ వారం కేవలం ఆడియన్స్‌ ఇచ్చే ఓట్ల ద్వారనే కాకుండా నేరుగా మరో ఎలిమేషన్‌ ఉంటే అవకాశం ఉందని చెప్పాడు. అంతేకాదు ఇప్పటి వరకు సభ్యుల ఆట తీరుని పరిశిలించి సభ్యులను ఎల్లో లెవల్‌, రెడ్‌ లెవల్‌గా విభజించాడు. రెడ్‌ లెవన్‌ లో ఉన్నవారు ఆడియన్స్‌  ఇచ్చే ఓట్లతో పాటు నేరుగా చేసే ఎలిమినేషల్‌లో ఉంటారని, ఎల్లోలో ఉన్నవారు కేవలం ఆడియన్స్‌ ఇచ్చే తీర్పు ద్వారనే ఎలిమేట్‌ అవుతారని చెప్పాడు.

→ రెడ్ లెవల్ కంటెస్టెంట్స్‌లో ఝాన్సీ, రామ్ ప్రసాద్, రోహిత్, శ్వేత, సుధీర్, ఆర్కే, షాలిని, వంశీ ఉన్నారు. ఎల్లో లెవల్ కంటెస్టెంట్స్‌లో త్రిగున్, నరేష్, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, అమన్, శివ కుమార్ ఉన్నారు.

→ గ్రీన్‌లెవల్‌..అంటే తన కొత్త అవతారం గోట్‌ అని. అక్కడికి వెళ్లినవారికి కేవలం ఈ వారమే కాదు వచ్చేవారం కూడా ఎలిమినేషన్‌ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పాడు. గ్రీన్‌ లెవల్‌ వెళ్లడానికి ఓ టాస్క్‌ ఇచ్చాడు.

→ టాస్క్‌లో భాగంగా  సర్కిల్ మధ్యలో ఉంచిన బోన్‌ను బజర్ మోగగానే దక్కించుకున్నవారికి బాక్సులు పగలగొట్టే అవకాశం లభించింది. ఆ బాక్సుల నుంచి ఎల్లో కలర్ వస్తే బిగ్‌బాస్ చెప్పిన నిబంధనల ప్రకారం గేమ్‌లోని ఇతర సభ్యులను తొలగించే అవకాశం కూడా ఉండేది.

→ టాస్క్ సందర్భంగా దక్షిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలం కూడా వాడబోయి చివరిక్షణంలో కంట్రోల్‌ అయింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఇతర సభ్యులు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

→ ఈ టాస్క్‌లో చివరికి రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్య జరిగిన ఫైనల్ రౌండ్‌లో రామ్ ప్రసాద్ పైచేయి సాధించి విజేతగా నిలిచాడు.దీంతో రెడ్‌లో ఉన్న రాంప్రసాద్‌.. ఎల్లో లెవల్‌కి ప్రమోట్‌ అయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement