breaking news
Bigg boss 10 Telugu
-
బిగ్‌బాస్‌లో యాక్షన్ సీన్స్.. నువ్వా నేనా అనేలా రగడ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజు రోజుకీ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్‌బాస్ ప్రేక్షకులకు అయితే టాస్కులు, గొడవలు, వ్యూహాలతో మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. అయితే నిన్న (సెప్టెంబరు 30న) ఎపిసోడ్‌లోనూ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్యాగర్ల కోసం పోటీ, అమన్-త్రిగుణ్ మధ్య గొడవ, షాలిని-రోహిత్ వాగ్వాదంతో ఎపిసోడ్ మొత్తం హీటెక్కింది. మరి 24వ రోజు ఏం జరిగిందో తెలుసుకుందామా...అమన్-త్రిగుణ్ మధ్య రచ్చ..ఈ వారం పూర్తయ్యేసరికి రెండు కంటే ఎక్కువ డ్యాగర్లు ఉండేలా ప్రయత్నించాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఆరో వారంలోకి వెళ్లేందుకు దక్కే ఇమ్యూనిటీకి ఈ డ్యాగర్లు కీలకమని స్పష్టం చేశాడు. దీంతో డ్యాగర్లను సొంతం చేసుకునేందుకు హౌస్మేట్స్ మధ్య పోటీ మొదలైంది. ఇందులో భాగంగా రెండు టీమ్‌లకు మొదట నిప్పుపై ఆధిపత్యం సాధించేందుకు ‘ఫైర్ వర్సెస్ లావా’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో రెండు టీమ్‌ల నుంచి నలుగురు చొప్పున పాల్గొన్నారు. రెడ్ టీమ్ నుంచి రోహిత్, అమన్, వంశీ, బ్లూ టీమ్ నుంచి దేబ్జానీ, ముకేశ్, త్రిగుణ్, సృష్టి బరిలోకి దిగారు. తమ టీమ్ రంగుకు చెందిన డ్రమ్స్‌ను యాక్టివిటీ రూం నుంచి తీసుకొచ్చి గార్డెన్‌లోని డ్రమ్స్ ఏరియాలో పెట్టాలి. అయితే నేలకు కాలు తగలకుండా డ్రమ్స్పై నడుచుకుంటూ వెళ్లాలనే నిబంధన పెట్టారు. రెడ్ టీమ్‌కు మొదటి బజర్కే గేమ్ ప్రారంభించే అవకాశం లభించగా.. బ్లూ టీమ్ రెండో బజర్ తర్వాత ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో అమన్, త్రిగుణ్‌ను టార్గెట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టాస్క్ కంటే వీరిద్దరి మధ్య జరిగిన గొడవే ఎక్కువగా హైలైట్ అయింది. దీంతో ఎపిసోడ్ యాక్షన్ సినిమా చేసే ఫీలింగ్ కలిగింది. చివరకు ఈ గేమ్‌లో భైరవ టీమ్ విజయం సాధించింది. దీంతో దేబ్జానీకి దక్కిన డ్యాగర్‌ను అమన్ సొంతం చేసుకున్నాడు.షాలిని-రోహిత్ మధ్య గొడవ..మరోవైపు కెప్టెన్ గదిలో ఉన్న డ్యాగర్లను తీసుకునేందుకు షాలిని ప్రయత్నించడంతో మరో వివాదం మొదలైంది. షాలిని అక్కడికి వెళ్లడాన్ని చూసిన రోహిత్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తాను ఏమీ తీసుకోలేదని చెప్పడంతో రోహిత్ ఆమెకు మద్దతుగా మాట్లాడాడు. అయితే ఆ తర్వాత షాలిని రోహిత్ దగ్గర ఉన్న డ్యాగర్‌ను తీసుకుంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయంలో రోహిత్ తనను ప్రశ్నించడంతో షాలిని కూడా ఘాటుగానే స్పందించింది. ‘భయపడి మా మీద అరుస్తున్నావ్’ అంటూ షాలిని అనడంతో రోహిత్ కూడా తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ రూంలో డ్యాగర్లు ఉన్నాయని.. ఎవరు తీసుకోవాలనుకుంటే వారు తీసుకోవచ్చని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతు ఇచ్చినందుకు రోహిత్ తర్వాత రాంప్రసాద్‌కు సారీ చెప్పాడు. ‘వాళ్లకు సపోర్ట్ చేయడం నాదే తప్పు. మీ వల్ల అందరి ముందు నేను పిచ్చోడిని అయిపోయా’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే షాలిని మాత్రం తగ్గలేదు. ‘నా గేమ్ నేను ఆడుకుంటా.. నాకు ఎవరి సపోర్ట్, దయాదాక్షిణ్యాలు అవసరం లేదు’ అంటూ రోహిత్‌కు తేల్చి చెప్పింది.వంశీ-చరణ్ కూడా..ఇక ఈ గొడవలో వంశీ కూడా జోక్యం చేసుకున్నాడు. తమ విషయంలో ఏమైనా ఉంటే తమతోనే మాట్లాడాలని, తమ కోసం రోహిత్, అపూర్వలను అనడం ఎందుకని షాలిని ప్రశ్నించింది. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు వంశీ, చరణ్ మధ్య కూడా ఎవరు ఎలాంటి గేమ్ ఆడారనే విషయంపై వాగ్వాదం జరిగింది. ఇలా డ్యాగర్ల కోసం మొదలైన ఆట.. ఒకరి తర్వాత ఒకరిని గొడవల్లోకి లాగింది. మొత్తంగా 24వ రోజు ఎపిసోడ్లో టాస్కుల కంటే గొడవలే ఎక్కువగా కనిపించడంతో బిగ్‌బాస్ హౌస్ హీటెక్కింది.ఇదీ చదవండి: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్, మహేశ్‌ల మూవీ రివ్యూ -
టీమ్ కోసం నిలబడ్డ రోహిత్ అపూర్వ ఆట అదుర్స్
-
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
బిగ్‌బాస్‌లో ప్రతి సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. ఈసారి రథం టాస్క్ ఆడించిన తర్వాత ఇది జరిగింది. సోమవారం అంతా కంటెస్టెంట్స్ రెండు జట్లుగా విడిపోయి గేమ్స్ ఆడారు. ఇందులో భైరవ టీమ్ గెలిచింది. నామినేషన్లలో చిన్నపాటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మంగళవారం(సెప్టెంబరు 29) నాడు హౌస్‌లో ఏం జరిగింది? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)సోమవారం రథం టాస్క్ మధ్యలో ఆపారు. దాన్ని తిరిగి కొనసాగించడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. రెండోసారీ భైరవ టీమే విజేతగా నిలిచింది. దీంతో వీళ్లకు రథం అమర్చే అవకాశం దక్కింది. ఈ జట్టు గెలవడంతో మరో టీమ్‌లోని ఎవరి దగ్గరైనా రెండు కత్తులు తీసుకోమని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ, సుధీర్.. ముకేశ్, త్రిగుణ్ కత్తుల్ని తీసుకున్నారు.రథం టాస్క్‌లో భైరవ టీమ్ గెలవడంతో వాళ్లకే నామినేషన్స్ చేసే అవకాశమిచ్చాడు బిగ్‌బాస్. సప్తశక్తి టీమ్ ఓడిపోవడంతో అందులో ఉన్నవాళ్లంతా నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇద్దరికి మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పడంతో నరేశ్, త్రిగుణ్లకి ఆ అవకాశం దక్కింది. టెంప్టేషన్ టాస్క్ వల్ల ముకేశ్ ముందే నామినేట్ అయ్యాడు. అపూర్వ కెప్టెన్ కాబట్టి ఆమెని నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ చెప్పాడు.తొలుత త్రిగుణ్.. రోహిత్ చేసే పనులని, మ్యానిప్యులేట్ చేసే విధానాన్ని, తన అగ్నిపరీక్ష గ్రూపిజం కారణాలు చెప్పి అతడిని నామినేట్ చేశాడు. పనులు చేయకపోవడం, బద్ధకం కారణాలుగా చెప్పాడు. నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశాడు. ప్రతిదానికి గొడవ పడుతున్నాడు. అతడితో ఏమన్నా మాట్లాడాలంటే గొడవ అవుతుందేమో అనిపిస్తుంది. ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోతున్నాడు. సంచాలక్‌గా సరిగ్గా చేయలేదు, పని విషయంలో బద్ధకం అని కారణాలు చెప్పాడు. తర్వాత భైరవ టీమ్ అంతా ఒక్కొక్కరు నామినేషన్స్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)తొలుత ఝాన్సీ వచ్చి సృష్టిని నామినేట్ చేసింది. ఓ టాస్క్ సందర్భంగా నన్ను నామినేట్ చేయకు అని అడుక్కుంది. అంత వీక్, భయం.. వెళ్లిపోతుందేమో అని అందుకే నామినేట్ చేశానని కారణాలు చెప్పింది. అమన్.. త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. అపూర్వ.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. చాలా ఇరిటేటింగ్ పర్సన్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని కారణాలు చెప్పింది. రాంప్రసాద్.. షాలినిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ ఎన్నిసార్లు చెప్పినా అదే ఆలస్యం, అలానే నిన్న జరిగిన గొడవని కారణాలుగా చూపించాడు. రాంప్రసాద్ చెబుతున్నంతసేపు షాలిని ఎప్పట్లాగే ఓవరాక్షన్ చేస్తూ అరుస్తూ మాట్లాడింది.రోహిత్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. వర్షిణి.. సృష్టిని నామినేట్ చేసింది. వంశీ.. చరణ్‌ని నామినేట్ చేశాడు. సుధీర్ కూడా చరణ్‌నే నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేశ్, చరణ్, సృష్టిలు నామినేషన్స్‌లో ఉన్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ) -
అటు ఫైటింగ్ ఇటు రొమాన్స్ ఈ రోజే హౌస్ లోకి RK?
-
బిగ్‌బాస్ 10: వెనకాల మాట్లాడే రకం కాదు.. నామినేషన్లలో రచ్చ
సోమవారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హడావుడి ఉంటుంది. కానీ ఈ వారం రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని సభ్యుల్ని విడగొట్టి.. డాగర్స్ సంపాదించుకోవడం, రథం టాస్క్ అని హౌస్మేట్స్ మధ్య బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. మంగళవారం నామినేషన్లలో హడావుడి మొదలైంది. అయితే ఇందులో అంతా కలిసి త్రిగుణ్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)తాజాగా రిలీజ్ చేసిన తొలి ప్రోమోలో చూస్తే అమన్.. త్రిగుణ్ పేరు చెప్పాడు. అరేయ్ తురేయ్ అని చాలా సార్లు అన్నావ్ అని అమన్ అంటే.. నువ్వు వద్దు అన్నాక ఒక్కసారి కూడా అనలేదని త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. అంత వీడియో వచ్చినోడివి చూసినవ్ కదా నీకు కాన్ఫిడెన్స్ లేదా? అని త్రిగుణ్‌ని ఏదో మ్యాటర్‌తో కంపేర్ చేసి అమన్ అనగానే.. నాకు లేదు, నీ అంత లేదని త్రిగుణ్ సమాధానమిచ్చాడు. నీకు లేదు అని వెరైటీగా చిందులు వేస్తూ అమన్ వెక్కిరించాడు.తర్వాత వచ్చిన త్రిగుణ్.. రోహిత్‌ని, నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశారు. తమ కారణాలు చెప్పారు. ఇల్లు సరిగ్గా లేకపోతే అమన్ మొహాన్ని అనడం ఎందుకు? అతడ్ని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు అని రోహిత్ అన్నాడు. మరోవైపు ఇంట్లో పది గొడలుంటే అందులో నాలుగు అమన్వే ఉంటున్నాయ్ అని నరేశ్ చెప్పుకొచ్చాడు. నీ మొహం చూస్తుంటే చిరాకేస్తోంది. నిన్ను చూస్తుంటే చిరాకేస్తోంది అని అంటే అలాంటి మాటలు పడటానికి రాలేదు ఎవరిక్కడ అని అమన్ సీరియస్ అయ్యాడు. వెనకాలకు వెళ్లి లాంజ్‌లో కూర్చుని డాక్యుమెంట్లు రాసుకునే టైపు కాదు. ఫ్రంట్ ఫుట్‌లో వచ్చి బ్యాటింగ్ చేసేవాడ్ని అని త్రిగుణ్ అన్నాడు. ప్రోమో చూస్తుంటే ఫుల్ ఫైర్ కనిపించింది.అయితే రెడ్, బ్లూ తమ జట్లలోని సభ్యుల్ని కాకుండా పక్క టీమ్‌లోని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టినట్లు ప్రోమో చూస్తుంటే అనిపించింది. అలానే ఎపిసోడ్లో ఇంకెన్ని గొడవలు అవుతాయోననే సందేహం కూడా కలుగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?) -
బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?
బిగ్‌బాస్ 10లో సెలబ్రిటీల్లో ఒకరిద్దరో హైలైట్ అవుతున్నారు కానీ కామనర్స్ మాత్రం కెమెరాలకు కనిపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. గొడవపడుతూ, అరిచి గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ.. వచ్చిన మూడు నాలుగు రోజులకే ఎంత హడావుడి చేయాలో అంతా చేస్తోంది. ఈమెకు తగ్గట్లే షాలిని కూడా రెచ్చిపోతోంది. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 22వ రోజైన సోమవారం(సెప్టెంబరు 29) ఎపిసోడ్లో అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు)వీకెండ్ ఎపిసోడ్ తర్వాత అపూర్వ కెప్టెన్ అయింది. ఇక సోమవారం ఎపిసోడ్.. కెప్టెన్ అపూర్వ, ముఖేష్ గొడవతో మొదలైంది. గిన్నెలు కడిగే, కెప్టెన్ గది ఖాళీ చేసే విషయమై ఇద్దరూ వాదించుకున్నారు. మీటింగ్ పెట్టి, రూల్స్ పెడితే.. అప్పుడు ఫాలో అవుతానని ముఖేష్ అంటే వెంటనే అపూర్వ మీటింగ్ పెట్టింది. అక్కడ కూడా ముఖేష్, అపూర్వ గొడవపడ్డారు. ఎందుకు ఇలా చులకనగా చూస్తున్నావ్, అగౌరవపర్చుతున్నావ్, కెప్టెన్ అంటే గౌరవం లేదా? నువ్వే అన్నావ్ కదా కెప్టెన్‌కి గౌరవం ఇవ్వాలని మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అని అపూర్వ లాజిక్ తీసింది. మధ్యలోకి ఎంటరైన త్రిగుణ్.. నేను కెప్టెన్ అని పిలవను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు.గతవారం టెన్షన్-టెంప్టేషన్ అని అల్లాడించిన బిగ్‌బాస్.. ఈసారి టోటల్ డామినేషన్ అని కొత్త ఆట మొదలుపెట్టాడు. షాలిని, శృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ ఒక జట్టు(సప్తశక్తి) అని.. మిగిలిన వాళ్లంతా మరో టీమ్(భైరవ) అని చెప్పాడు. మొదటి యుద్దంలో గెలిస్తే అదిరిపోయే ఆఫర్ ఉంటుందని బిగ్ బాస్ అన్నాడు. మొదటి ఆయుధం పంపిస్తున్నా అని ఒకరి వద్ద రెండు, అంతకంటే ఎక్కువ డ్యాగర్స్ని సంపాదించుకోవాలని చెప్పాడు. ఎక్కువ డ్యాగర్స్ ఉన్నోళ్లు ఎదుటి వారి ఆటని మార్చొచ్చని అన్నాడు. ఇందులో భాగంగా ప్రాంక్ అని చెప్పి నరేశ్ కత్తిని రాంప్రసాద్ లాక్కున్నాడు. మరోవైపు మూడు దశల్లో రథ నిర్మాణం చేయాలని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. మధ్యలో బ్రిక్స్(ఇటుకల్ని) కలెక్ట్ చేయాల్సి ఉంటుందని, ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్లకే రథానికి సంబంధించిన భాగాలు దొరుకుతాయని చెప్పాడు.ఈ టాస్క్‌కి రోహిత్, షాలిని సంచాలక్స్గా ఉంటూనే ఆడుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. రూల్స్ గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో అపూర్వ వచ్చింది. ప్రతిసారి ఇలానే మధ్యలోకి దూరుతున్నావ్ అని షాలిని అరిచేసింది. దీంతో షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. మరోవైపు ఆట ప్రారంభమైన తర్వాత శృష్టి కాలికి గాయమయ్యేసరికి ఆటను ఆపేశారు. మెడికల్ రూంలోకి వెళ్లే ముందు తన కత్తిని శృష్టి.. షాలినికి ఇచ్చింది. దీని తర్వాత అపూర్వ తన టీమ్ అంతటినీ పిలిచి షాలిని దగ్గర కత్తి ఉందని, తీసుకుందామని చెప్పింది. దీంతో రోహిత్, సుధీర్, ఝాన్సీ, అమన్ ఇలా అందరూ షాలిని మీద పడ్డారు. షాలినికి చెందిన బ్లూ టీం.. రెడ్ టీంని అడ్డుకుంది. ఇందులో భాగంగా త్రిగుణ్, రోహిత్ దారుణంగా ప్రవర్తించి మాటలు జారారు.మరోవైపు అపూర్వ, రోహిత్‌ల మీద షాలిని ఫైర్ అయింది. దీంతో అది శృష్టి కత్తి అని తెలీదు. తెలిస్తే ఇలా చేసే వాళ్లం కాదని అన్నారు. నరేష్ విషయంలోనూ మీరు ఇలానే చేశారు. ప్రాంక్ అన్నారు. ఇంత వరకు కత్తి ఇవ్వలేదు అని త్రిగుణ్ అన్నాడు. మళ్లీ ఆట ఆరంభించగానే ముఖేష్ కాలికి గాయమైంది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలిని అనేసరికి వీళ్లిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు రెడ్ టీం అంటే టీం భైరవ గెలిచింది. రథానికి మొదటి పార్ట్ అమర్చింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!) -
బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు. కానీ మిథిలేష్ అనే కుర్రాడి కారణంగా మొత్తం సీనే మారిపోయింది. షో పరువంతా పోయింది! ఇంతకీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇప్పటివరకు చాలామంది బిగ్‌బాస్‌కి వచ్చారు. కొందరు తమకున్న ఇమేజ్ చెడగొట్టుకోగా.. మరికొందరు మంచి గుర్తింపు తెచ్చుకుని బయటకొచ్చారు. కానీ ఎవరిని అడిగినా కప్పు కొట్టడమే ముఖ్యం. డబ్బులది ఏముంది ఎలా అయినా సంపాదించుకోవచ్చు, పేరు ముఖ్యం లాంటి కబుర్లు చెబుతారు. కానీ వీళ్లలో చాలామందికి తెలుసు నిజంగా వాళ్లు కప్పు కొట్టగలరో లేదో?అంతెందుకు సీజన్ చివరిరోజున కప్ కావాలా? డబ్బులు కావాలా? అని హోస్ట్ నాగార్జున అడిగితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు. తమకు కచ్చితంగా కప్ రాదని, అందుకు ఎంచక్కా సూట్ కేసు తీసుకుని లక్షాధికారులు అయిపోతుంటారు. కానీ ఈ సీజన్లో మిథిలేష్ అనే కామనర్.. కప్ కంటే తనకు డబ్బులే ముఖ్యం అని హౌస్‌లోకి వచ్చిన రెండో రోజే హోస్ట్ నాగార్జునకే ఓపెన్‌గా చెప్పి బయటకొచ్చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. ఈ ట్విస్ట్ నాగార్జున కూడా ఊహించి ఉండడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు)ఈ షోకి వచ్చేవాళ్లలో దాదాపు అందరూ చివరిరోజున వచ్చే డబ్బుల కోసమే వస్తారు అనేది పచ్చినిజం. కానీ ఎవరూ పైకి చెప్పరు. ఇదో బహిరంగా రహస్యం. అయితే డబ్బుల సూట్ కేసు తీసుకుని స్వయంగా బయటకొచ్చిన విషయంలో గతంలో సొహైల్, ఇప్పుడు ఈ మిథిలేష్ జనానికి బాగా గుర్తుండిపోతారు. హౌస్‌లో మరో మూడు నాలుగు వారాలున్నా సరే మిథిలేష్‌కి ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో! కేవలం రెండే రోజులు ఉండి.. ఎంచక్కా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. అంతెందుకు ఈ సీజన్లోనే వంద రోజులు ఉండి నెగ్గినా గానీ ఇంతకంటే ఎక్కువ డబ్బయితే రాదుగా! దీంతో సోషల్ మీడియా అంతా కూడా మిథిలేష్ సరైన పనే చేశాడని మెచ్చుకుంటున్నారు.అయితే మిథిలేష్ చాలా పెద్ద తప్పు చేశాడన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి షో ఆర్గనైజర్స్ అష్టకష్టాలు పడుతున్నారు. ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత శివాజీతో చేసిన బజ్ ఇంటర్వ్యూలోనూ ఎందుకొచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగారు. కానీ మిథిలేష్ మాత్రం కూల్‌గా వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా సమాధానమిచ్చాడు.ఇప్పటివరకు పది సీజన్లు జరిగితే అందులో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి ఎంతమంది టాప్-5కి వెళ్లారు? మీరే చెప్పండి అని ఉల్టా శివాజీకే మిథిలేష్ ఎదురుప్రశ్న వేశాడు. టాప్-5లో ప్రతి సీజన్లోనూ ఓ ఫిమేల్(సీరియల్ హీరోయిన్ లేదా సెలబ్రిటీ), ఓ ఎంటర్ టైనర్, మొదటి నుంచి మ్యానిపులేట్ చేసే వ్యక్తి ఉంటారని మిథిలేష్ చెప్పడం.. షో తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. దీనిబట్టి చూస్తే మిథిలేష్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించని బిగ్‌బాస్ టీమ్.. డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకున్నట్లే!(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్) -
బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చిన మిథిలేష్.. షాక్ ఇచ్చి రూ.15 లక్షలు తీసుకెళ్లిపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇతడు డబ్బులు తీసుకెళ్లిపోవడం మటేమో గానీ హౌస్‌లో రచ్చ రచ్చ అయిపోయింది. ఆదివారం(సెప్టెంబరు 27) ఎపిసోడ్లో అందరి రంగులు బయటపడ్డాయి. అలానే ఎలిమినేషన్ విషయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 21వ రోజు అసలేం జరిగింది?(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)మిథిలేష్.. విజేత ప్రైజ్‌మనీలో నుంచి రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడం గురించి డిస్కషన్‌తో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. హౌస్‌లోని సగం మంది ఇది తప్పునగా.. అగ్నిపరీక్ష బ్యాచ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్‌మనీ ఎందుకు ఇవ్వాలి? అని ముకేశ్, వంశీ, త్రిగుణ్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. మిథిలేష్‌కి సపోర్ట్ చేసిన వాళ్లందరినీ ముకేశ్, త్రిగుణ్ పిచ్చ తిట్లు తిట్లు తిట్టారు. చివరికి అమన్ కూడా సపోర్ట్ చేయడంతో అందరూ అమన్‌ని తిట్టారు. అమన్ – త్రిగుణ్ కొట్టుకునేంత వరకు వెళ్లారు.రూ.15 లక్షలు తీసుకుని స్టేజీకి పైకి వెళ్లిన మిథిలేష్‌ని.. వెళ్లేముందు ఒక ఐదుగురిని ఎవరి గురించి జాగ్రత్తపడాలో చెప్పమని హోస్ట్ నాగార్జున అడిగాడు. దీంతో అమన్.. రోహిత్‌తో, వర్షిణి.. ముకేశ్‌తో, వంశీ.. త్రిగుణ్‌తో, నరేష్.. రాంప్రసాద్‌తో, చరణ్.. షాలినితో జాగ్రత్త పడాలని మిథిలేష్ చెప్పాడు. తర్వాత జంగిల్ గేమ్ ఆడించారు. ఒక్కో జంతువుకి తగిలించిన గుణాన్ని ఒక్కో కంటెస్టెంట్ ఇచ్చి ఎందుకో కారణం చెప్పాలని టాస్క్ పెట్టారు.(ఇదీ చదవండి: తెలుగు యువ దర్శకుడి భార్య మృతి.. అవయవదానం)ఇందులో భాగంగా ముకేశ్.. చిలుక మెడల్ తీసుకుని అమన్‌కి ఇచ్చాడు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు. వేరేవాళ్లు చెప్పినవి వింటాడు అని కారణాలు చెప్పాడు. రాంప్రసాద్.. నెమలి మెడల్ తీసుకొని షాలినికి ఇచ్చి షో అఫ్, ఓవరాయాక్షన్ చేస్తుందని చెప్పాడు. షాలిని.. పాము మెడల్ తీసుకొని అపూర్వకి ఇచ్చి పాత గొడవలు ఉన్నాయని చెప్పింది. నరేష్.. పాండా మెడల్ తీసుకొని బద్దకం అని దేబ్జానీకి ఇచ్చాడు. అపూర్వ.. పాము మెడల్ తీసుకొని పాయిజన్నెస్ అని త్రిగుణ్‌కి ఇచ్చింది. ఇలా ఈ టాస్క్ సాగింది. తర్వాత 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ ప్రమోషన్స్ కోసం ఫహాద్ ఫాజిల్ షోకి వచ్చాడు. ఇక రోహిత్‌కి మేనల్లుడు పుట్టాడని ఆ బాబు ఫోటో చూపించడంతో తెగ ఎమోషనల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.నామినేషన్స్‌లో ఒక్కొక్కరు బతికిపోతూ చివరకు వంశీ, వర్షిణి మిగిలారు. అయితే టెంప్టేషన్ వీక్ కాబట్టి కెప్టెన్ ముకేశ్‌కి హోస్ట్ నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నువ్వు వాళ్లని కాపాడొచ్చు కానీ నీ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ పోతుంది. వచ్చేవారం నువ్వు డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటావ్. ఇవి ఒప్పుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్‌లో ఉంటారని కండీషన్ పెట్టడంతో ముకేశ్ వాటన్నింటికీ ఒప్పుకొన్నాడు. దీంతో వర్షిణి, వంశీ ఎలిమినేట్ కాకుండా బతికిపోయారు. ముకేశ్‌తో కలిసి టాస్క్ గెలిచింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అపూర్వ కొత్త కెప్టెన్ అయిపోయింది. వచ్చిన రెండు రోజుల్లోనే కెప్టెన్ అయి రికార్డ్ సృష్టించింది. నాలుగోవారం టోటల్ డామినేషన్ అవతారంలో టాస్క్‌లు జరగనున్నాయని చెప్పి ఆదివారం ఎపిసోడ్ ముగించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) -
‘నరేశ్.. రాంప్రసాద్‌తో జాగ్రత్త.. లేదంటే నీ పని అంతే..!’
వైల్డ్ కార్డ్‌గా ఇంట్లోకి వచ్చి రెండు రోజులే అయిన మిథిలేష్ 15 లక్షలు సొంతం చేసుకుని బయటకు వెళ్లాడు. వచ్చిన రెండు రోజులకే 15లక్షలు ఇవ్వడానికి అసలు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా వేస్తారు అని త్రిగుణ్అందరిపై ఫైర్ అయ్యాడు. డబ్బులు తీసుకుంటోంది ప్రొడక్షన్ నుంచి విన్నర్ డబ్బుల్లోంచి.. అని అమన్ తో ముఖేష్ అంటాడు. అది నా డబ్బు అని త్రిగుణ్ అంటే. నాది కాదా? అని అమన్ అంటాడు. మరి ఎందుకు ఇచ్చావ్.. అంత ఇవ్వాలనిపిస్తే.. గెలిచిన తర్వాత బయటకు వెళ్లి ఇవ్వాల్సి కదా అంటూ ఫైర్ త్రిగుణ్ ఫైర్ అవుతాడు. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోలా ఉంటుంది.. మిథిలేష్‌కి అలా.. నాకు ఇలా చేయాలని అనిపించింది అని అమన్ అన్నాడు. అయితే సరే మూసుకుని ఉండు అని త్రిగుణ్ అనడంతో. నువ్వు కూడా మూసుకుని ఉండు.. చేతకాకపోతే పడుకోపో అని అమన్ అనడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీరాస్థాయికి చేరుకుంటుంది. బిగ్ బాస్ ఇంట్లోంచి.. బిగ్ బాస్ ఇంట్లోంచి మిథిలేష్ బయటకు వచ్చేశారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమోని చూస్తే ‘మనుషులున్నారు. జాగ్రత్త..’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో మిథిలేష్ కంటెస్టెంట్లకు మంచి మంచి సలహాలు ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. రోహిత్ నుంచి అమన్, త్రిగుణ్ నుంచి వంశీ, ముఖేష్ నుంచి వర్షిణీ, రాంప్రసాద్ నుంచి నరేష్‌లను జాగ్రతగా ఉండమని సూచించాడు. ఇది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే వీళ్లందరి మాట పక్కన పెడితే.. రాంప్రసాద్, నరేశ్‌లు మంచి స్నేహితులు. వీరు ఇప్పుడు ఎలా ఆడుతారనేది ఆసక్తిని పెంచుతోంది.మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే..మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే.. బీబీ జంగల్ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో కింద ఉన్న మెడల్‌ను ఎవరికిస్తావని త్రిగుణ్‌ని అడగగానే అమన్‌కి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే టాస్క్‌లో రోహిత్.. త్రిగుణ్‌ని నమ్మే సమస్యేలేదని తేల్చి చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ఎలా సాగుతుందని ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు రోహిత్ మాటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్ర బృందం బిగ్‌బాస్‌లో సందడి చేసింది. అంతేకాకుండా కంటెస్టెంట్లకు టాస్క్‌లు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ రోజు ఏం జరగబోతోంది అనేది తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రూ.15 లక్షల ఆఫర్ కొట్టేసిన కంటెస్టెంట్..!
ఈ వీకెండ్ బిగ్‌బాస్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది. నాగార్జున వచ్చే ఈ ఎపిసోడ్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు బయటికొస్తాయి. అలా ప్రతి కంటెస్టెంట్ చేసిన తప్పులన్నీ ఈ వీకెండ్ షోలో నాగ్ బయటపెట్టడమే కాదు.. వారికి వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అలాంటిది ఈ వారాంతంలో నాగార్జున్ కంటెస్టెంట్సకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ గేమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హౌస్‌మేట్స్‌కు నాగార్జున ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. డబ్బులు ఆఫర్ చేసి కంటెస్టెంట్స్‌ను టెంప్టింగ్ చేశాడు.ఈ ఆఫర్‌ను చాలామంది కంటెస్టెంట్స్ తిరస్కరించారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మిథిలేశ్ చేయి ఎత్తి తాను తీసుకుంటానని ముందుకొస్తాడు. దీంతో అతనికి.. కంటెస్టెంట్లకు మధ్య మినీ వార్ నడుస్తుంది. అదే సమయంలో నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కి సెట్ కావ్.. వెళ్లు అని సూట్‌కేస్ ఇచ్చేస్తాడు. మరి మిథిలేశ్ ఆ రూ.15 లక్షలతో బయటికెళ్లాడా? లేదా అన్నది ఈ వీకెండ్ ఎపిసోడ్ హైలెట్స్‌లో చూసేద్దాం.వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మిథిలేశ్..ఈ వారంలో అపూర్వ, మిథిలేశ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వీక్ బిగ్‌బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. మొదట ఈ వారంలో హౌస్మేట్స్ వ్యవహరించిన తీరుపై నాగ్ ప్రశ్నలవర్షం కురిపించారు. రూ.15 లక్షల ఆఫర్..ఈ వీకెండ్లో సందీప్, డైరెక్టర్ జాసన్ సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. సిగ్మా ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చారు. . హీరో సందీప్, హీరో త్రిగుణ్ మంచి ఫ్రెండ్స్ కావడంతో సరదాగా మాట్లాడుకున్నారు. త్రిగుణ్ లవ్ స్టోరీ గురించి సందీప్ చెబుతూ ఆట పట్టించాడు. తర్వాత నాగ్ 16 మంది కంటెస్టెంట్స్ ముందు ఓ సూట్‌కేస్ పెట్టి అందులో మూడో వారంలోనే అందులో డబ్బు తీసుకొని మీరు వచ్చేయొచ్చని బిగ్ ఆఫర్ ఇస్తాడు. మొదట ఆ సూట్‌కేస్‌లో రూ.5 లక్షలు ఉన్నాయి? ఎవరు తీసుకుంటారని అడుగుతారు.. ఎవరు కూడా స్పందించరు. ఆ తర్వాత అమౌంట్‌ను పది లక్షలకు పెంచేస్తాడు. ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఆ అమౌంట్‌ను రూ.15 లక్షలకు పెంచేస్తాడు. ఈ డబ్బులకు టెంప్ట్ అయిన మిథిలేశ్ నేను తీసుకుంటానని చేయి పైకెత్తి రెడీ అయిపోతాడు.మిథిలేశ్‌కు నాగ్ ట్విస్ట్..ఆ సూట్ కేస్ తీసుకోవడానికి రెడీ అయిన మిథిలేశ్‌కు నాగ్ ఓ ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఆ డబ్బు మీ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని చెప్తాడు. కానీ అతన్ని బయటికెళ్లకుండా ఒప్పించాలని కంటెస్టెంట్లకు నాగ్ చిన్న పరీక్ష పెడతాడు. ఆ తర్వాత అతన్ని ఆపేందుకు కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తారు. కానీ చివరికీ మిథిలేశ్ నువ్వు బిగ్‌బాస్‌కి పనికిరావు.. డబ్బు తీసుకొని వెళ్లిపోని అని రాంప్రసాద్ కాస్తా ఆగ్రహంగానే చెప్తాడు. కానీ ఇంట్లో ఎక్కువ మందిని ఒప్పించి సూట్‌కేస్ తీసుకోమని అంటారు. దీంతో ఎక్కువమందిని ఒప్పించిన మిథిలేశ్ రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బయటకు వస్తాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ ముగుస్తుంది. -
పక్కా ప్లాన్ తో .. ఓటింగ్ లో లీస్ట్ ఎవరంటే?
-
బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ
బిగ్‌బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు. అవి లేకపోతే షోలో మజా ఉండదు. ఈ విషయం నిర్వహకులకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అని చూస్తుంటారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్లని హౌస్‌లోకి ప్రవేశపెట్టిన బిగ్‌బాస్.. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టాడు. ఇంతకీ 19వ రోజైన శుక్రవారం(సెప్టెంబరు 25) అసలేం జరిగింది? అనేది ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: తాత–నాన్నలా జేసన్ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి)ఇంట్లోని కంటెస్టెంట్స్ అందరూ వద్దనుకుని తక్కువ ఓట్లు వేసిన అపూర్వని బిగ్‌బాస్.. హౌస్‌లోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. నీకు, అపూర్వకు ఏదో ప్రాబ్లం ఉంది.. ఆమె రావడం నీకు ఇష్టం లేదని మాట్లాడుకుంటున్నారని షాలినీతో రోహిత్ అంటాడు. నేను మాట్లాడాను కానీ ఆమె మాట్లాడలేదు. అసలు ముఖేష్ అయితే ఆమె రావొద్దు అని కెమెరాల ముందుకు వెళ్లి అన్నాడు. ఇప్పుడేమో ఇలా ఉంటున్నాడు అని షాలినీ అంటుంది. ఇంతలో అక్కడొచ్చిన త్రిగుణ్.. నీకు, ఆమెకు ఏమైనా సమస్య ఉందా? అని అడిగితే.. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని షాలినీ సమాధానమిచ్చింది. మరో వైపు నరేష్ నిద్రపోయాడని బిగ్‌బాస్ హెచ్చరించడంతో.. కెప్టెన్ ఝాన్సీ ఇతడితో గుంజీలు తీయించింది.మిథిలేష్, రామకృష్ణకు సమానంగా ఓట్లు వచ్చాయని, అందుకే ఓ టాస్క్ ఇస్తున్నానని గెలిచిన వాళ్లికే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఇచ్చిన టైర్ల టాస్క్‌లో గెలిచిన మిథిలేష్ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంటి పనుల విషయంలో త్రిగుణ్, అమన్ మధ్య చిన్న గొడవ జరిగింది. కెప్టెన్ చెప్తేనే వింటా నువ్వు చెప్తే ఎందుకు వింటా అని అమన్ అంటాడు. చిరాకేస్తుందని త్రిగుణ్ అనేసరికి గొడవ మరింత ముదురుతుంది. చివరకు త్రిగుణ్ వచ్చి అమర్‌కి సారీ చెప్పడంతో సద్దుమణిగింది.ఇక హౌస్‌లోకి వచ్చిన అపూర్వ, మిథిలేష్‌కు ఓ పవర్ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ కంటెండర్లలో నుంచి ఇద్దరిని తీసేయాలని, దానికి తగిన కారణాలు చెప్పాలని అంటాడు. దీంతో మిథిలేష్.. ఝాన్సీ పేరు చెప్తాడు. శ్రష్టిని తీసేయాలని అపూర్వ ముందే ఫిక్స్ అవుతుంది. ఆమెకు సహనం లేదు. ఆ రోజు సుధీర్‌ని ఇష్టమొచ్చినట్టుగా తిట్టింది. చెత్త వేసి కొట్టిందని.. అపూర్వ, మిథిలేష్ తమ కారణాలు చెప్తారు. మరోవైపు అమన్ గురించి మాట్లాడుతూ.. అనవసరంగా ఫైర్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ కోసం చేసినట్టు అనిపించింది, కన్ఫ్యూజ్ అవుతాడు అని మిథిలేష్, అపూర్వ చెప్పారు. దీంతో కామరన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. చూస్తుంటే సెలబ్రిటీల కంటే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సామాన్యుల మధ్య పుల్లలు పెట్టాలని బిగ్‌బాస్ ఫిక్స్ అయినట్లు ఉన్నాడనిపించింది.చివరగా అపూర్వ, ముఖేష్ ఒక జట్టుగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో జంటగా ఓ గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో అపూర్వ, ముఖేష్ గెలవగా.. ముఖేష్‌కి కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. అపూర్వకి ఇమ్యూనిటీ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే అపూర్వ జాక్‌పాట్ కొట్టినట్లయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు) -
బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’
బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్ విషయంలో త్రిగుణ్ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో పక్క ఝాన్సీ లెటర్ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్ ఎదురైంది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది. అసలు ప్రేక్షకులకూ, అటు హౌస్‌మేట్స్‌కు ఎదురైన ఆ ట్విస్ట్ ఏంటి.? ఒకసారి చూద్దాం..ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికనరేశ్కు అన్యాయం జరిగిందంటూ..బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్ సందర్భంగా బజర్ విషయంలో మరోసారి రచ్చ జరిగింది. నరేశ్ బజర్ కొట్టేలా అవకాశం ఇవ్వాలని రాంప్రసాద్ తన టీమ్‌తో మాట్లాడతాడు. అయితే సైరన్ మోగిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఝాన్సీ బజర్ కొట్టగా.. లివింగ్ ఏరియాలో నరేశ్, వంశీ మధ్య పోటీ నెలకొంది. లివింగ్ ఏరియా సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ తొలుత నరేశ్ బజర్ కొట్టాడని ప్రకటించాడు. దీంతో నరేశ్ టీమ్ సంబరాలు చేసుకుంది. కానీ అమన్, రోహిత్, చరణ్ మాత్రం వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్‌కు చెప్పారు. దీంతో త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బిగ్‌బాస్ అడిగినప్పుడు వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్ చెప్పడంతో నరేశ్ మండిపడ్డాడు. తన పేరును ప్రకటించిన తర్వాత సడన్‌గా నిర్ణయం ఎలా మార్చుకుంటావంటూ ప్రశ్నించాడు. నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ సుధీర్, ముకేశ్ కూడా త్రిగుణ్‌తో వాదించారు. దీంతో బజర్ వ్యవహారం హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.లెటర్ కోసం నరేశ్‌ను టార్గెట్ చేసిన ఝాన్సీఆ తర్వాత ఝాన్సీ, వంశీ బజర్ మోగించడంతో ఇద్దరికీ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఝాన్సీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్ ఝాన్సీకి కాల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘మీ నాన్న రాసిన లెటర్ మీ కోసం వచ్చింది. అది మీకు దక్కాలంటే నరేశ్ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను దూరం చేయాలి. లేదంటే రాంప్రసాద్‌కు వచ్చిన ఫొటోను వదులుకోవాలి’ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఝాన్సీ నరేశ్ లెటర్‌ను దూరం చేసేందుకు నిర్ణయించుకుంది. ‘నరేశ్‌కు టెన్షన్ ఇస్తా’ అంటూ అతడి లెటర్‌ను వదులుకుంది. మరోవైపు తన తండ్రి రాసిన లెటర్‌ను చదివిన ఝాన్సీ భావోద్వేగానికి గురైంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ఆడియన్స్ అనుకునేలోపే.. !ఇక హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరిగా వారి ఆటతీరుపై మెసేజ్‌లు రావడంతో.. అవి ఆడియన్స్ నుంచి వచ్చినవని అందరూ భావించారు. కానీ బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అగ్నిపరీక్షలో పోరాడి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ప్రయత్నించిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేశాడు. ముగ్గురినీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనేది హౌస్‌మేట్సే నిర్ణయించాలి అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలు తమను ఎందుకు హౌస్‌లోకి తీసుకోవాలో వివరించారు. ఈ క్రమంలో త్రిగుణ్, రాంప్రసాద్, ముకేశ్‌లతో వారికి వాగ్వాదం జరిగింది. తెలుగు మాట్లాడడంపై త్రిగుణ్‌తో వారితో వార్కి దిగాడు. ఈ తరుణంలో నీకు అసలు తెలుగు వచ్చా వస్తే పద్యం పాడు అంటూ మిథిలేష్‌పై త్రిగుణ్ రెచ్చిపోయాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం కనిపించింది.ఇదీ చదవండి: రజినీకాంత్ ‘జైలర్2’ పాటకు.. డేవిడ్ భాయ్ డ్యాన్స్ మాత్రం..ముగ్గురిలో ఎవరు? హౌస్మేట్స్ ఓటింగ్..వాదనలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ముగ్గురినీ బయటకు పంపించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కీలక నిర్ణయం అప్పగించాడు. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్ సూచనల మేరకు హౌస్మేట్స్ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. ఆ ఓట్లను బిగ్‌బాస్ చెప్పిన బాక్స్‌లో వేశారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ
బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం టెమ్టేషన్స్, ఎమోషన్స్ రెండూ తారాస్థాయికి చేరినట్లు తాజా ప్రొమో చూస్తే అర్థమవుతోంది. లివింగ్ రూం హౌస్‌లో ముందుగా బజర్ నొక్కింది వంశీ అని త్రిగుణ్ చెప్పగా, నొక్కింది నేనే అని నరేశ్ వాదించాడు. ‘నేను చెప్పినా వినకపోతే నేనేం చేస్తా?’ అంటూ నరేశ్ ప్రశ్నించగా, ‘నేను చూసిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటా’ అని త్రిగుణ్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆమె ఎవరిని ఎంచుకుంటుంది?ఇక కెప్టెన్సీ కంటెండర్‌గా మారేందుకు ఝాన్సీ, వంశీకి ఇచ్చిన టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగినట్లు ప్రొమోలో కనిపించింది. అయితే అసలు ట్విస్ట్ తరువాతే వచ్చింది. ఝాన్సీని పిలిచిన బిగ్‌బాస్.. ‘నీ మనసుకు దగ్గరైన టెమ్టేషన్ నీ చేతికి అందే ముందు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా’ అని చెప్పాడు. మొదటి ఆప్షన్‌గా నరేశ్‌కు అతని తమ్ముడు రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని, రెండో ఆప్షన్‌గా రాంప్రసాద్‌కు వారి కుటుంబంతో దిగిన ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ రెండు ఆప్షన్లు విన్న వెంటనే ఝాన్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? నరేశ్ లేఖనా? రాంప్రసాద్ ఫోటోనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!
బిగ్‌బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. గత నాలుగైదు ఎపిసోడ్ల నుంచి దేబ్జానీ పేరు మార్మోగుతోంది. ఆమె ఆడిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడే మాటలు ఒకెత్తు. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్, పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. అలా ఓ సందర్భంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం ఆమె మాట్లాడే తెలుగుపై ప్రశంసలు కురిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.బృహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ..ఓ సందర్భంలో.. శ్రీముఖి దేబ్జానీ కోసం చెప్తూ.. ‘ఆమెకు తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినా తెలుగు పాటలు బాగా పడుతుంది సార్’ అని బ్రహ్మనందంకి పరిచయం చేస్తారు. బ్రహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ.. ‘దేబ్జానీ నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. తెలుగు తెలీదు. మేము ఏం మాట్లాడుతున్నాం అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు’ అంటూ ఆమెను పొగడ్తల వర్షం కురిపించారు. అనంతరం దేబ్జానీ తెలుగులో పాడిన పాటను విని అబ్బా.. చాలు.. బాగా పాడావు, చాలా సంతోషం తల్లి అంటూ నవ్వులు పూయించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.దేబ్జానీ విషయానికి వస్తే..దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు #debjani after bb only I have seeing her , beforely i hv never seen her serial or any other programs,after bb I felt lyk she is genuine,she won't win but I want to be her until finale #BiggBossTelugu10 pic.twitter.com/iZxPw8MBRY— Butterfly 🦋🦋 (@sparkles_jiya) September 22, 2026 -
బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు
సాధారణంగా కొన్ని వారాలు అయిపోయిన తర్వాత బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మూడో వారానికే అదంతా దర్శనమిచ్చింది. హౌస్‌లో 17వ రోజైన బుధవారం(సెప్టెంబరు 24) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎవరెవరు కన్నీళ్లు పెట్టుకున్నారు?(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ)దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్ని ముకేశ్ నాశనం చేయడంతో ఈమె కుమిలి కుమిలి కుమిలి ఏడ్చింది. బాధలో ఉన్న దేబ్జానీని రాంప్రసాద్, నరేశ్ కలిసి కాసేపు నవ్వించారు. తర్వాత చెప్పినట్లు తండ్రితో ఉన్న ఫొటోని ముకేశ్ కోసం బిగ్‌బాస్.. హౌస్‌లోకి పంపించాడు. ఇదలా ఉండగానే దేబ్జానీ, రోహిత్ మధ్య పెళ్లిచూపుల పెట్టిన రాంప్రసాద్, నరేశ్ కాసేపు నవ్వించారు. నీ జీతం ఎంత? మా అమ్మాయికి నెలకు రూ.2 లక్షలు కావాలని జోకులు వేస్తూ ఫన్ జనరేట్ చేశారు. మరోవైపు వంశీ, త్రిగుణ్ వంట చేసేటప్పుడు ఓ రోజంతా వీళ్ల నోటికి ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి కెప్టెన్ ఝాన్సీ గుర్తుచేసింది. దీంతో బిగ్‌బాస్ ప్లాస్టర్స్ పంపగా.. వీళ్లిద్దరి నోటికి అవి అంటించారు.ఇక కెప్టెన్సీ కంటెండర్ కోసం మళ్లీ పోటీ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. గెలిచిన ముకేశ్, ఓడిన దేబ్జానీ ఆడేందుకు అర్హులు కాదని చెప్పాడు. వీళ్లిద్దరినే ఈ టాస్క్‌కు సంచాలకులుగా నియమించారు. ఈసారి పోటీలో వర్షిణి, అమన్ గెలవగా.. పూల్‌లో దూకి అందులో ఉన్న బ్యాగుల్లో ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. తర్వాత వాటిని తీసుకొచ్చి ఎవరి కలర్ ప్లేమ్స్లో వాళ్లు ల్యాండ్ అయ్యేలా విసరాలి. ఈ క్రమంలో ఎవరివైనా కిందపడితే వాళ్లవి కూడా తీసుకోవచ్చుని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో అమన్ గెలిచాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)అమన్‌కు ఫోన్ చేసిన బిగ్‌బాస్.. అమ్మ మీకు ఎంతో ఇష్టమైన భోజనాన్ని పంపించారు. అది మీకు కావాలంటే వేరే వాళ్లకు టెన్షన్ ఇవ్వాలి. షాలినీ, రోహిత్‌లలో ఒకరికి టెన్షన్ పెట్టాలని అనగా.. రోహిత్ పేరుని అమన్ చెప్పాడు. దీంతో రోహిత్‌కు లెటర్ని నాశనం చేయగా అతడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈసారి బజర్‌ని సుధీర్, సృష్టి మోగించగా.. వీళ్లిద్దరికీ ఓ టాస్క్ ఆడారు. ఇందులో సృష్టి గెలిచింది.టాస్క్‌లో విజయం సాధించిన సృష్టికి ఫోన్ చేసిన బిగ్‌బాస్.. మీ అమ్మ ప్రేమతో ఉత్తరం రాసింది. అది కావాలంటే ఇంటి సభ్యుల్లో ఒకరికి టెన్షన్ ఇవ్వాలి. వంశీ, త్రిగుణ్‌లో ఒకరికి వారి భార్యలు రాసిన ఉత్తరాలని అందకుండా చేయాలని చెప్పడంతో సృష్టి.. త్రిగుణ్‌కు టెన్షన్ ఇస్తానని చెప్పింది. సృష్టి త్రిగుణ్ లెటర్ నాశనం చేయడంతో ఇతడు ఎమోషనల్ అయ్యాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 7 సినిమాలు చేస్తున్నా.. రోజుకు ఎంత సంపాదిస్తానంటే?: కుమారి ఆంటీ) -
బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ
ప్రతివారం నామినేషన్స్ అంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కడలేని హడావుడి, గొడవలే. ఈసారి అంతకు మించి అన్నట్లు జరిగింది. సోమవారం సగం నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా మంగళవారం మిగతా తంతు ముగిసింది. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 16వ రోజు(సెప్టెంబరు 22) అసలేం జరిగింది? ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే: కృష్ణుడు)సోమవారం ఎపిసోడ్లో సగం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పటికీ సుధీర్-సృష్టి గొడవ ఎక్కువగా హైలైట్ అయింది. ఇందులో సృష్టి ప్రవర్తన నచ్చని రాంప్రసాద్.. అవకాశం వస్తే ఈమెని నామినేట్ చేయ్ అని నరేశ్‌తో చెప్పాడు. నాకు పాయింట్స్ లేవని నరేశ్ అంటే అంత పెద్ద పాయింట్ ఉంటే లేదు అంటావ్ ఏంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఒకర్ని కొడతా, తంతా అనడం ఎంతపెద్ద తప్పో తెలుసు కదా ఇదే పెద్ద పాయింట్ ఆ పాయింట్ మీద నామినేట్ చేయ్ అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు.త్రిగుణ్ గురించి ఝాన్సీ, సుధీర్, ముకేశ్, రోహిత్ మాట్లాడుతూ.. మొదటి వారం నన్ను చాలా హీనంగా చూశాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతి చిన్న విషయాన్ని పాయింట్ చేసి కుక్కర్ ముఖం మీద వేశాడు. త్రిగుణ్ నిజంగా శకునినే ముందు ఆడడు వెనక నుంచి ఆడిస్తాడు. వంశీని ఎలా కీలుబొమ్మ చేశాడో ఇప్పుడు సృష్టిని అలాగే తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. సృష్టి కూడా వెళ్లిపోతుంది అని రోహిత్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. దీని తర్వాత గేమ్ గురించి ముకేశ్-చరణ్ గొడవపడ్డారు.చివరి రౌండ్లో నామినేట్ చేయడానికి నరేశ్, షాలిని పోటీపడ్డారు. షాలినికి అవకాశం వచ్చింది. దీంతో వర్షిణిని నామినేట్ చేసింది. ముకేశ్‌ని గైడ్ చేస్తున్నావ్. సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావ్. అందరికీ సలహాలు ఇస్తూ గేమ్‌లో కనిపించాలని ప్రయత్నిస్తున్నావ్. అది అంత అవసరం లేదు అనిపిస్తుంది అని షాలిని తన కారణాలు చెప్పింది. తర్వాత షాలిని నామినేట్ చేసే అవకాశం సృష్టికి ఇచ్చింది. సృష్టి సుధీర్‌ని నామినేట్ చేసింది. ఒక్కసారి కూడా నన్ను వాడుకున్నాననిపించలేదా అని సృష్టి అడిగితే.. దానికి బదులిచ్చిన సుధీర్ నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా. నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పు అని.. ఎవరైనా ఏమైనా అంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పు అని కూడా అన్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో సృష్టితో అస్సలు మాట్లాడను అని కుండబద్దలు కొట్టేశాడు. అలా ఈ వారం నామినేషన్స్‌లో సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి నిలిచారు.(ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)మీ వాళ్ల నుంచి మంచి టెంప్టేషన్ పొందాలంటే ఒకరిని టెన్షలో పెట్టాల్సి వస్తుంది. లివింగ్ ఏరియాలో ఒక బజర్, గార్డెన్ ఏరియాలో ఒక బజర్ ఉంది. రెండింటిని మొదటిసారి నొక్కిన ఇద్దరు సభ్యులకు గేమ్ ఉంటుంది. గెలిచిన వాళ్లు టెంప్టేషన్ తీసుకొని టెన్షన్ ఒకరికి ఇవ్వాలి. టెన్షన్ తీసుకున్న వాళ్లు నెక్ట్ టైం గేమ్ ఆడటానికి వీల్లేదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అలా లివింగ్ ఏరియాలో ముకేశ్ బజర్ నొక్కితే.. గార్డెన్ ఏరియాలో రోహిత్ బజర్ నొక్కాడు. ఇద్దరికీ పుష్ యువర్ లిమిట్స్ గేమ్ పెట్టగా.. ఇందులో మూడు పెద్ద బాక్స్‌లను ఇద్దరూ నెట్టుకోవాలి. ఈ గేమ్‌లో ముకేశ్ గెలిచాడు. తద్వారా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంతో పాటు టెంప్టేషన్ సొంతం చేసుకున్నాడు.ముకేశ్‌ని బ్యాక్యార్డ్కు పిలిచిన బిగ్‌బాస్.. ఫోన్ చేసి మాట్లాడాడు. ఇలాంటి గేమ్ కోసమే వెయిట్ చేస్తున్నా బిగ్‌బాస్.. రోహిత్ మీద గెలవడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. టెంప్టేషన్‌గా మీ నాన్నతో కలిసి ఉన్న ఫొటో మీకు దక్కుతుంది. దీని కోసం మీరు దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్ని తనకు దూరం చేయాలి. లేదా వర్షిణికి తన ఫ్యామిలీ ఫొటో దూరం అవుతుంది. ఎవరికి ఏం దూరం చేసి వాళ్లకు టెన్షన్ ఇస్తారు అని బిగ్‌బాస్ అడిగితే ఇద్దరితో నాకు మంచి బాండ్ ఉంది. కానీ వర్షిణితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. వర్షిణి నన్ను మంచి ఫ్రెండ్ అనుకుంటుందని చెప్పి దేబ్జానీకి టెన్షన్ ఇస్తా అని ముకేశ్ అన్నాడు.ఇదే విషయం దేబ్జానీకి చెప్పమని బిగ్‌బాస్ అనడంతో ముకేశ్ దేబ్జానీకి చెబుతాడు. నీ కోసం నన్ను టెన్షన్లో పెట్టావా వేరే ఎవరి కోసమైనా అని ఆమె అడగ్గా.. వేరే వాళ్ల కోసం అని ముకేశ్ అన్నాడు. తర్వాత బిగ్‌బాస్ ముకేశ్‌కి ఇచ్చిన ఆప్షన్ గురించి చెప్పడంతో దేబ్జానీ చాలా ఏడ్చింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక) -
'బిగ్‌బాస్' త్రిగుణ్ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే..!
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత, నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్‌లో జరిగిన ఒక లైవ్ ఇంటరాక్షన్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఓటింగ్, దురదృష్టం లేదా తోటి కంటెస్టెంట్లను నిందించకుండా, వీక్షకుల తీర్పును హుందాగా కృష్ణుడు అంగీకరించాడు. తాను ఎలిమినేట్ కావాల్సిన వాడినే అని నిష్కపటంగా ఒప్పుకున్న అతను, ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, హౌస్‌లో గడిపిన సమయం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అనుభవమని అభివర్ణించాడు. తరచుగా తింటూ, నిద్రపోతూ కనిపించాడనే విమర్శలకు స్పందిస్తూ, హౌస్‌లో ఆహారం పరిమితంగా ఉండేదని, సరైన అల్పాహారం ఉండేది కాదని, కంటెస్టెంట్లు సాధారణ భోజనంతోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించాడు.రోహిత్‌తో తనకు ఏర్పడిన భావోద్వేగ బంధం గురించి కూడా కృష్ణుడు మాట్లాడాడు. తమ మధ్య మొదట్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యామన్నాడు. ఎలిమినేషన్ సమయంలో రోహిత్ భావోద్వేగంతో స్పందించిన తీరు తనను ఎంతగానో కదిలించిందని, తమ బంధం ఇంటి బయట కూడా కొనసాగుతుందని నమ్ముతున్నట్లు తెలిపాడు. రోహిత్‌ను ఒక వ్యూహాత్మక ఆటగాడిగా అభివర్ణిస్తూ, కాలంతో పాటు అతను మరింత ప్రశాంతంగా, నిలకడగా మారాడని కృష్ణుడు చెప్పాడు. అయితే, రోహిత్ ఏకాగ్రత కోల్పోకూడదని చెబుతూనే, శాలినితో అతనికి పెరుగుతున్న సంబంధం అతని ఆటను దెబ్బతీస్తుందని కూడా హెచ్చరించాడు.బలమైన పోటీదారులలో త్రిగుణ్, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించిన కృష్ణుడు, "పరిపూర్ణ బిగ్ బాస్ ఆటగాడు" గా త్రిగుణ్‌ను ఎంచుకున్నాడు. తన టాప్ 5 కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్, ఝాన్సీలను అతను అంచనా వేశాడు. సుధీర్ సృష్టితో ప్రేమాయణం నెరపటానికి ప్రయత్నిస్తున్నాడని కృష్ణుడు ఆరోపించడమే కాకుండా, ముఖేష్‌ను ఈ సీజన్ "ఉమెన్ ట్రాక్ విన్నర్" అని సరదాగా పిలవడం ద్వారా కొత్త చర్చకు ఆజ్యం పోశాడు. -
‘కంటెస్టెంట్‌గా పనికిరావు.. బయటకెళ్లి..’
బిగ్‌బాస్ ఇంట్లో మూడో వారం నామినేషన్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు..గేమ్‌ను సీరియస్‌గా తీసుకోని వాళ్లే బజర్ మోగిన తర్వాత కూడా బోర్డుపై రాస్తారంటూ ముఖేశ్ వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన చరణ్.. ‘ఈ విషయాన్ని నేను ఆడియన్‌గా బయట నుంచి చూశా’ అని చెప్పాడు. దీంతో ముఖేశ్ మరింత ఫైర్ అయ్యాడు. ‘అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు.. వెళ్లి ఆడియన్‌గానే ఉండు పో’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.మాట్లాడే దమ్ము లేదా..మరోవైపు షాలిని, వర్షిణి మధ్య కూడా వివాదం తారస్థాయికి చేరినట్లు ప్రోమోలో కనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముఖేశ్ మధ్యలో కలగజేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ‘ఏంటి.. ముఖేశ్‌తో మాట్లాడే దమ్ము లేదా?’ అంటూ షాలినిని వర్షిణి ప్రశ్నించింది. దీనికి షాలిని కూడా గట్టిగానే స్పందించింది. ఇలా ఒకవైపు ముఖేశ్-చరణ్ మధ్య మాటల యుద్ధం.. మరోవైపు షాలిని-వర్షిణి మధ్య వివాదంతో మూడో వారం నామినేషన్స్ మరింత హాట్‌గా మారాయి. మరి ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారు? నామినేషన్స్‌లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయి? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’
బిగ్‌బాస్ సీజన్ 10లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఉండగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మాటలతో యుద్ధానికి దిగారు. ముఖ్యంగా సృష్టి-సుధీర్ గొడవ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. అసలు ఇంత గొడవపడటానికి కారణం ఏంటి? నిన్నటి ఎపిసోడ్లో ఏం జరింగింది. చూద్దాం రండి.!అన్నం పెట్టేవాడికే చెత్త వేయడం ఏంటి?స్టార్ ఆఫ్ ది వీక్‌గా ముకేశ్ ఉండటంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. అయితే ముకేశ్ కారణంగా ఝాన్సీ టెన్షన్‌కు గురైందని భావిస్తే ఆమెను నామినేట్ చేయవచ్చని తెలిపారు. ఇక నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్వలప్స్ ఇచ్చి.. అందులో ఎన్ని ఓట్లు ఉంటే అంతమందిని నామినేట్ చేయాలనే టాస్క్ పెట్టారు. రాంప్రసాద్, చరణ్ ముందుగా పోటీ పడగా ఇద్దరికీ ఎన్వలప్స్ వచ్చాయి. కెప్టెన్‌గా ఉన్న ఝాన్సీ.. రాంప్రసాద్‌కు నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అతడికి వచ్చింది. రాంప్రసాద్ మొదట వంశీని నామినేట్ చేశాడు. ఫుడ్ పెట్టే సమయంలో పెద్దగా అరవడం తనకు నచ్చలేదని కారణం చెప్పాడు.అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది. వర్షిణి ఏడ్చిన విషయాన్ని వంశీ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మానిటర్‌గా ఉన్న దేబ్జానీ కూడా ఈ విషయంలో కలగజేసుకోవడంతో వంశీ-దేబ్జానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో రాంప్రసాద్.. ‘ఇది నా నామినేషన్’ అంటూ గట్టిగా చెప్పి వంశీపై చెత్త వేశాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. అన్నం పెట్టిన వాళ్ల మీదే చెత్త వేస్తున్నారంటూ సెటైర్ వేశాడు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.ఇదీ చదవండి: 10వేల మందికి అదిరిపోయే ట్రీట్! నాని ఫ్యాన్స్‌కు పండగే..సృష్టి వర్సెస్ సుధీర్.. హౌస్‌లో మరో రచ్చఇక ఎపిసోడ్లో అసలు హీట్ సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవతో వచ్చింది. త్రిగుణ్ తనను మానిప్యులేట్ చేశాడని సుధీర్ ఆరోపించాడు. గతంలో జరిగిన గొడవలన్నీ క్లియర్ అయ్యాయని.. ఇక తనకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ చెప్పడంతో సృష్టి తీవ్రంగా స్పందించింది. ‘నేను నీ వెంట పడ్డానా?’ అంటూ సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోపంలో కొడతా, పళ్లు రాలగొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ గొడవతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత సృష్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.షాలినిని టార్గెట్ చేసిన వర్షిణిఇక మరోవైపు వర్షిణి, దేబ్జానీ మధ్య పోటీ జరిగింది. నామినేషన్ చేసే అవకాశం వర్షిణికి రావడంతో ఆమె షాలినిని టార్గెట్ చేసింది. షో కోసమో లేక ప్రోమోలో కనిపించడం కోసమో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే షాలిని వ్యవహరిస్తోందని.. ఆమెది ఫేక్ పర్సనాలిటీ అని వర్షిణి ఆరోపించింది. కేవలం కంటెంట్ కోసమే కొన్ని విషయాలు చేస్తోందని చెప్పింది. దీనిపై షాలిని కూడా గట్టిగానే స్పందించింది. వర్షిణితో వాదనకు దిగింది. అనంతరం వర్షిణి తనకు వచ్చిన మరో నామినేషన్ అవకాశాన్ని సుధీర్‌కు ఇచ్చింది. దీంతో సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు.ఝాన్సీని టార్గెట్ చేసిన చరణ్చరణ్ తన నామినేషన్లో ఝాన్సీని టార్గెట్ చేశాడు. ఆమె తనతో మనస్ఫూర్తిగా ఉండటం లేదని ఆరోపించాడు. తనతో మాట్లాడుతున్న సమయంలో నిద్ర వస్తోందని చెప్పి వెళ్లిపోయి.. మరో టీమ్‌తో మాత్రం సరదాగా మాట్లాడిందని చెప్పాడు. అంతేకాకుండా గేమ్‌లో ఎవరు తనకు సపోర్ట్ చేశారనే విషయాన్ని ఇతరులకు చెప్పడం కూడా తనకు నచ్చలేదని తెలిపాడు. చివరగా రైతులకు సంబంధించిన కండువా, షర్ట్‌ను నామినేషన్స్ రోజే ధరించడం కూడా తనకు నచ్చలేదని చెప్పడంతో ఝాన్సీపై చరణ్ పెట్టిన నామినేషన్ ఆసక్తికరంగా మారింది.దేబ్జానీ నామినేషన్లో త్రిగుణ్చివరగా దేబ్జానీ.. త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఇలా ఒక్కో నామినేషన్‌తో హౌస్‌లో ఉన్న పాత గొడవలు, మనస్పర్థలు బయటకు రావడంతో 14వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సృష్టి-సుధీర్ మధ్య జరిగిన గొడవ.. వర్షిణి-షాలిని వాగ్వాదం.. రాంప్రసాద్-వంశీ నామినేషన్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ -
బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ కృష్ణుడు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
బిగ్‌బాస్‌లో ముదిరిన గొడవలు.. కొడితే పళ్లు రాలుతాయ్ అంటూ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, విభేదాలతో హౌస్‌లో వాతావరణం వేడెక్కుతుండగా.. తాజాగా సుధీర్, సృష్టి మధ్య జరిగిన గొడవ హాట్‌టాపిక్‌గా మారినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ వ్యవహారం నామినేషన్స్‌లో మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఆసక్తికరమైన పరిణామాలుహౌస్లో త్రిగుణ్ చుట్టూ కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సుధీర్.. సృష్టితో లవ్ ట్రాక్ నడిపించే విషయంలో త్రిగుణ్ వద్ద సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచీ సృష్టి మాత్రం సుధీర్‌కు కాస్త దూరంగానే ఉంటూ వస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడో వారం నామినేషన్స్‌లో సుధీర్ వ్యవహరించిన తీరుపై సృష్టి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. సుధీర్ పదేపదే మాట్లాడటంతో సహనం కోల్పోయిన ఆమె.. గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ‘గుద్దితే పళ్లు రాలుతాయ్’ అంటూ ఫైర్ అయింది. అంతేకాకుండా ‘నోరు మూసుకో’ అంటూ సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.సృష్టి పెద్దగా కనిపించలేదనికాగా రెండో వారంలో సృష్టి పెద్దగా కనిపించలేదని నాగార్జున కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వారం మాత్రం నామినేషన్స్‌లో ఆమె గట్టిగానే స్పందించినట్లు కనిపిస్తోంది. తనపై వచ్చిన మాటలకు, సుధీర్ వ్యవహారశైలికి సృష్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే గొడవ మరింత ముదరడంతో సృష్టి భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. వెక్కి వెక్కి ఏడ్చినట్లు కనిపించడంతో హౌస్‌లో పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. ఇప్పుడు సుధీర్–సృష్టి మధ్య జరిగిన ఈ నామినేషన్ గొడవ ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేంటి? సుధీర్ ఎందుకు పదేపదే సృష్టిని టార్గెట్ చేశాడు? సృష్టి అంతలా ఎందుకు ఫైర్ అయింది? అనేది పూర్తి ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే కయాదు జర్నీ -
కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన పాటలతో నాగార్జున స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులతో ముచ్చటించిన నాగ్.. వారికి ఎవరు నచ్చుతున్నారు? ఎవరి ఆట ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనకు, తనకు ఎంతో ఇష్టమైన చేనేత వస్త్రాలను ధరించినట్లు నాగార్జున తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేతను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరారు. ఇది ఇలా ఉంటే అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది?. అంతలా ఎమోషనల్ ఎందుకు అయ్యారో ఒకసారి తెలుసుకుందాం.. రండి!ఇదీ చదవండి: ‘పదో తరగతి చదివి.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’పాటలు.. డ్యాన్సులతో సందడిహౌస్లో వినోదం మొదలైంది. ఝాన్సీ ‘చెమ్కీల అంగీలేసి’ పాట పాడగా.. త్రిగుణ్, అమన్ తమదైన స్టైల్లో బిగ్‌బాస్‌పై పాట పాడి అలరించారు. అనంతరం ముకేశ్, దేబ్జానీ కలిసి ‘ఎవరెవరో’ పాటకు రొమాంటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. వర్షిణి, చరణ్ ‘వస్తున్నాయ్ ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేసి ఎపిసోడ్లో సందడి చేశారు.కృష్ణుడికి ఎండ్ కార్డ్..ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. చివరి రౌండ్లో సృష్టి, కృష్ణుడు మాత్రమే మిగలగా.. వారిలో కృష్ణుడి జర్నీకి ఎండ్ కార్డ్ పడింది. ‘నీ కోసం స్టేజ్‌పై వెయిట్ చేస్తుంటా.. వచ్చేయ్’ అంటూ నాగార్జున చెప్పడంతో కృష్ణుడు ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికారు. బయటకు వెళ్తూ కృష్ణుడు మాత్రం తన ఎలిమినేషన్‌పై బాధపడటం లేదని చెప్పారు. గత వారం తాను చాలా లోగా ఉన్నానని, సరిగ్గా ఆడలేకపోయానని అంగీకరించారు. ‘నేను ఆడలేనందుకు బాధపడటం లేదు. నేను వెళ్లిపోతానని మీకు ముందే చెప్పాను. నేను ట్రై చేశా.. కానీ ఆడలేకపోయాను. అందరూ బాగా ఆడండి. స్ట్రాంగ్ గేమ్ ఆడాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు’ అని కృష్ణుడు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఇదీ చదవండి: నన్ను బతికుండగానే చంపేశారు కదరా.. నటి భావోద్వేగం..కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్కృష్ణుడు బయటకు వెళ్తున్న సమయంలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘మీ కళ్లు మా నాన్నలాగే ఉంటాయి అన్నా. మీరు వెళ్లిపోతుంటే ఆ కళ్లను చూసే ఛాన్స్ కూడా నాకు ఉండదు’ అంటూ రోహిత్ ఏడ్చాడు. అది చూసిన కృష్ణుడు కూడా ఎమోషనల్ అయ్యారు. తనకంటే చిన్నవాళ్లను అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు విఫలమయ్యానని కృష్ణుడు చెప్పారు. ‘నేను కూడా అలా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది కాదు. నేను కూడా ఫీల్ అవుతున్నా. కోపంలో కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీ అందరికంటే పెద్దోడ్ని అయినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను’ అంటూ కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరోగ్యం గురించి కృష్ణుడు ఏమన్నాడంటే..ఎలిమినేషన్ అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన కృష్ణుడు నాగార్జునతో తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ‘నేను చేసిన మిస్టేక్ ఏంటంటే.. గత ఎనిమిది రోజులుగా షుగర్ తినడం మానేశాను. ఇలా అయితే హెల్త్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకున్నాను. కానీ వీక్ అవుతానని అనుకోలేదు. అది రివర్స్ అయ్యింది. నేను కనీసం పది కేజీల స్వీట్స్ తింటాను. సడెన్‌గా షుగర్ మానేయడంతో వీక్ అయిపోయాను. దాని ఎఫెక్ట్ చాలా చూపించింది’ అని కృష్ణుడు తెలిపారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత కూడా మెల్లగా షుగర్‌ను తగ్గించుకుంటూ రెండు నెలల్లో పూర్తిగా మానేయాలని సూచించారు.వచ్చే వారం..బిగ్‌బాస్ తెలుగు 10లో వచ్చే వారం కంటెస్టెంట్లకు మరో ఆసక్తికరమైన టాస్క్ ఎదురుకానుంది. ‘Temptation vs Tension’ పేరుతో జరగనున్న ఈ గేమ్‌లో కంటెస్టెంట్లకు ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదురవుతాయి? ఎవరెవరు టెంప్టేషన్స్కు లొంగుతారు? ఎవరెవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే వారం ఈ గేమ్ హౌస్‌లో కొత్త గొడవలకు, ట్విస్టులకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఇలా కృష్ణుడి ఎలిమినేషన్‌తో ఒకవైపు భావోద్వేగం.. మరోవైపు పాటలు, డ్యాన్సులతో ఆదివారం ఎపిసోడ్ సాగింది. ఇదీ చదవండి: ‘రామాయణ’ ఈ వెర్షన్లో 30 నిమిషాల నిడివి తగ్గింపు! -
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026 -
ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్ హైలెట్స్ ఇవే..!
బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్‌లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అన్నారు.హౌస్‌మేట్స్‌ను తమ లైఫ్‌లో జరిగిన సీక్రెట్ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.సుధీర్‌ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్‌లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్‌ను మానిపులేటర్ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్‌నే ఎన్నుకున్నారు.సంచాలక్‌గా ఇద్దరు ఫెయిల్..సంచాలక్‌గా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్‌లో చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.ఆ తర్వాత వర్షినిని సంచాలక్‌గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్‌గా మీ నిర్ణయం కరెక్ట్‌గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్‌గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్‌లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్‌లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు. ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు. -
వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఆ ఇద్దరిపై నాగ్ సీరియస్..!
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ రేస్ ముగియడంతో ఎలిమినేషన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.హౌస్‌లో సృష్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ కౌంటరిచ్చాడు. ఈ వీక్‌లో కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగ్ అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని వెనకవైపు కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. మీరిద్దరు కేవలం ప్రేక్షకుల్లాగే వీక్షించాలని నాగ్ అన్నారు. ఈ ప్రోమోలో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. నాని మూవీ ది ప్యారడైజ్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇవాల్టి ఎపిసోడ్‌పై బిగ్‌బాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. -
బిగ్‌బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్‌లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్‌గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్‌ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్‌బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్‌ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్‌లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్‌బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్‌ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్‌ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్‌ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్‌గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్‌బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్‌కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు.ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని -
కెప్టెన్సీ పోరు.. షాలిని వర్సెస్ వర్షిణి.. హౌస్‌లో మాటల యుద్దం..!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నడుస్తోంది. హౌస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కంటెస్టెంట్స్ శతవిధాల పోటీపడుతున్నారు. ఈ రేసులో ఐదుమంది పోటీలో నిలిచారు. వీరికి బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టి పరుగులు పెట్టించాడు. పదిమంది కంటెస్టెంట్స్‌ను గార్డ్స్‌గా పెట్టగా.. మిగిలిన ఐదుగురు వాళ్లను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలి.ఈ టాస్క్‌లో షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాలినిని వయసులో నువ్వు చిన్నదానివంటూ వర్షిణి అనడంతో మాటమాట పెరిగింది. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య మాటలతో బిగ్‌బాస్ హౌస్ హోరెత్తింది. ఈ ప్రోమో చూస్తుంటే కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్లో కెప్టెన్సీ ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే మీరూ కూడా బిగ్‌బాస్ చూసేయాల్సిందే. -
వర్షిణి & ముకేశ్ లవ్? చరణ్ కు బిగ్ షాక్
-
బిగ్‌బాస్‌లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రేసులో భాగంగా లెవెల్-2లో పోటీదారులకు వరుసగా టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తొలి టాస్క్‌లో రోహిత్ తన సత్తా చాటలేకపోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో దెబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్ మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలారు. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది..! ఒకసారి చూద్దాం రండి!ఇదీ చదవండి: ఈ ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! స్పీడ్ అండ్ సక్సెస్..లెవెల్-2లో మిగిలిన సభ్యులకు బిగ్‌బాస్ ‘స్పీడ్ అండ్ సక్సెస్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌ను రెండు స్టేజ్‌లుగా నిర్వహించారు. మొదటి స్టేజ్‌లో పోటీదారులు స్టార్టింగ్ పాయింట్ నుంచి టేబుల్ కింద ఉన్న సందుల్లోంచి ముందుకు వెళ్లాలి. అనంతరం టేబుల్‌పై ఉన్న గ్యాప్స్‌లో వేళ్లు పెట్టి.. పైన ఉంచిన ఐదు డిస్కుల్లో ఒక్కో డిస్క్‌ను బయటకు తీసుకురావాలి. అలా తీసుకున్న డిస్క్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎండింగ్ పాయింట్ వరకు జరిపి కిందకు పడేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న టైర్లలో కాళ్లు పెడుతూ వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. చివరికి డిస్క్‌ను నిర్ణయించిన లైన్ దగ్గర పెట్టాలి. ఇలా ఐదు డిస్కులను లైన్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత రెండో స్టేజ్ ప్రారంభమవుతుంది. రెండో స్టేజిలో లైన్ దగ్గర నిలబడి.. తాము తీసుకొచ్చిన ఐదు డిస్కులను ఎదురుగా ఉన్న టేబుల్‌పైకి ఒక్కొక్కటిగా విసిరి ల్యాండ్ చేయాలి. నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన ఇద్దరు విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. విజేతలే కెప్టెన్సీ కంటెండర్లుగా కొనసాగుతారని, చివరి స్థానంలో నిలిచిన వారు కెప్టెన్సీ రేసు నుంచి నిష్క్రమిస్తారని తెలిపాడు. ఈ టాస్క్‌కు నరేశ్‌ను సంచాలకుడిగా నియమించారు. పోటీదారులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీ పడగా.. చివరికి రాంప్రసాద్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.మళ్లీ హౌస్‌లోకి చరణ్..ఇక అందరూ ఊహించినట్లుగానే చరణ్ మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడి రాకతో హౌస్‌లో సందడి నెలకొంది. వచ్చిరావడంతోనే ఈసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తానని గట్టి పంతానే విసిరాడు. మరోవైపు నరేశ్, రాంప్రసాద్ అక్కడున్న కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ కాసేపు నవ్వులు పూయించారు. చరణ్‌కు స్పెషల్ పవర్..కొత్తగా హౌస్‌లోకి వచ్చిన చరణ్‌కు బిగ్‌బాస్ ఓ ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని కెప్టెన్సీ రేసులో పాల్గొనకుండా చేయడంతో పాటు.. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన వారిలో ఒకరితో ఛాలెంజ్ చేసి గెలిస్తే తాను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కల్పించాడు. ఈ రెండు ఆప్షన్లలో చరణ్ రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్న త్రిగుణ్‌తో ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. చివరికి త్రిగుణ్ విజేతగా నిలిచినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చీ రావడంతోనే చరణ్‌కు ఇది మొదటి అపజయం. ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే.. -
బిగ్‌బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
బిగ్‌బాస్ విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోలో కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా హౌస్‌లోకి రావడం.. షాలినీని పట్టుకుని బయటకు తీసుకెళ్లడం కనిపించింది. వారిని చూడగానే ఇంట్లోని సగం మంది కంటెస్టెంట్లు భయపడిపోయారు. దీంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.అయితే ఇదంతా నిజంగా జరిగిన ఘటన కాదని, హౌస్‌మేట్స్‌ను ఆటపట్టించేందుకు చేసిన ప్రాంక్ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే బిగ్‌బాస్ ఫార్మాట్ ప్రకారం నామినేషన్లు, ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి ప్రక్రియ లేకుండా షాలినీని తీసుకెళ్లడం వెనుక ఏదైనా టాస్క్ లేదా ట్విస్ట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.బిగ్‌బాస్ అసంతృప్తి..ఇదిలా ఉంటే.. షాలినీ విషయంలో బిగ్‌బాస్ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయపాలన పాటించడం లేదంటూ ఆమెను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో షాలినీని టార్గెట్ చేయడంతో హౌస్‌లో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.చరణ్ ఎంట్రీకి సంబంధించిన వారేనా..మరోవైపు చైత్ర కంటే చరణ్‌కే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చరణ్ త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రోమోలో కనిపించిన వ్యక్తులు చరణ్ ఎంట్రీకి సంబంధించినవారేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అసలు షాలినీని పట్టుకెళ్లడం వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? ఇది ప్రాంక్నా.. టాస్క్‌లో భాగమా? చరణ్ ఎంట్రీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్నది పూర్తి ఎపిసోడ్‌లోనే క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..) -
బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్‌బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్‌లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్‌ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్‌లో జంతువులను సరైన సీక్వెన్స్‌లో అమర్చాలి. అన్ని బ్లాక్స్‌ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్‌ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్‌ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్‌లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్‌బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్‌లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్‌లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్‌తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్‌కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టాస్క్‌కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్‌లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్‌ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్‌తో ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన డిస్క్‌లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్‌లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ వివరించారు. ఈ టాస్క్‌కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్‌లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్‌లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్‌లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్‌లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్‌గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్) -
బిగ్‌బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్‌లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్‌హాట్‌గా సాగుతోంది.తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్
ఈసారి బిగ్‌బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 10వ రోజైన మంగళవారం ఏం జరిగింది? ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నామినేషన్ల హంగామాతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. దీని గురించి మాట్లాడుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇంతలో ముకేశ్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగాడు. దీంతో దేబ్జానీ సరదాగానే ముకేశ్‌తో గొడవ పెట్టుకుంది. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని రాంప్రసాద్ ఓవైపు నుంచి ముకేశ్‌ని అడుగుతుంటే.. నేను ఉండగా మరొకరితో పూల్‌లోకి ఎలా దిగుతావ్ అని దేబ్జానీ అడిగింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఓరి నాయనో ఇదేం ప్రేమ అనకుండా ఉండలేరు.ఇక వినాయక చవితి పండగని ఇంట్లోనే అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రిని బిగ్‌బాస్ పంపించాడు. కాసేపటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్‌లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్‌లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. బెలూన్ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఎవరు కరెక్ట్‌గా రాస్తే వాళ్లు మిగతా కంటెస్టెంట్స్‌లలో ఒకరి బెలూన్ పగలగొట్టి కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు.మొదటి రౌండ్లో త్రిగుణ్ బెలూన్లు నాలుగూ వేరే మిగతావాళ్లు పగలగొట్టేయడంతో ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వరసగా రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ, ముకేశ్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా మిగిలిన ఝాన్సీ, అమన్‌లకు బుధవారం నాడు కెప్టెన్సీ పోటీ ఉండబోతుంది. గతవారం ఎలిమినేట్ అయిన చైత్ర, చరణ్ విషయంలో అనుకున్నట్లే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరిలో ఒకరిని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత ఆడియెన్స్‌కి ఇచ్చారు. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
గిన్నెలు గట్టిగా తోమిండు.. కానీ, ఈ వీక్ కెప్టెన్ ఎవరంటే?
-
త్రిగుణ్‌ని చెడుగుడు ఆడేసుకున్న సుధీర్.. నామినేషన్స్‌లో రచ్చ
తెలుగు బిగ్‌బాస్ షోలో ఈసారి తొలిసారి నామినేషన్ల సందడి గట్టిగానే వినిపించింది. గతవారం కంటెస్టెంట్స్ మధ్య పోటీలు పెట్టి హౌస్మేట్స్ అయ్యే ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలోనే చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. మరో ఎలిమినేషన్ కూడా జరగొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండానే వీకెండ్ అయిపోయింది. ఇక సోమవారం రాగానే ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలైంది. ఇంతకీ 8వ రోజైన సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ పిలిచినప్పుడల్లా ఇద్దరు హౌస్మేట్స్.. ఏర్పాటు చేసిన దారిలో నుంచి వెళ్లి ఏదో ఒక పోల్ ఎంచుకుని దానికి చుట్టి ఉన్న తాడు మొత్తాన్ని తీసి అక్కడే ఉన్న రెండు గొడ్డళ్లలో(సిల్వర్, గోల్డ్) ఒకటి ఎంచుకోవాలి. సిల్వర్ పట్టుకుంటే ఒకర్ని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. గోల్డ్ ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఓడిపోయిన వాళ్లకు ఆ రౌండ్లో ఒక నామినేషన్ ఓటు పడుతుంది. గొడ్డలిని అందుకున్న వాళ్లు ఆ రౌండ్లో ఓడిపోయిన వాళ్లతో సహా ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.తొలుత వచ్చిన ఝాన్సీ, సుధీర్‌లలో గెలిచిన సుధీర్.. గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. మొదట త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. తన దగ్గర ఒక మాట మాట్లాడి రోహిత్ దగ్గర మరొకటి చెప్పాడని.. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెబుతున్నాడని కారణం చెప్పాడు. చైత్ర విషయంలోనూ తన ఆట చూడకుండా కత్తితో పొడిచావని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత షాలిని పేరు చెప్పాడు. షాలినికి వాష్‌రూం క్లీనింగ్ ఇస్తే దాన్ని తీసుకోలేక బదులుగా పవర్ వాడుకోవడం నచ్చలేదని కారణం చెప్పాడు. తర్వాత కృష్ణుడు, దేబ్జానీ గేమ్ ఆడగా దేబ్జానీ గెలిచింది. ఈమె సిల్వర్ గొడ్డలి పట్టుకుని త్రిగుణ్‌కి నామినేట్ చేసింది. ఏమైనా ఉంటే నేరుగా చెప్పట్లేదు పక్కవాళ్ల దగ్గరకు వెళ్లి చెప్తున్నావ్. సుధీర్ గురించి నాకు చెప్పడం నచ్చలేదని కారణం చెప్పింది.వర్షిణి, రోహిత్‌లలో రోహిత్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తొలుత త్రిగుణ్ పేరు చెప్పి.. ప్రపంచం తెలిసిన నువ్వు నన్ను స్టెరాయిడ్స్ బాడీ అనడం నచ్చలేదు. అక్కడో మాట ఇక్కడో మాట నాకు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా చెత్త మేటర్ అది. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపానని అన్నారు.. ఓ ఆడపిల్ల విషయంలో మీరు అలా అనడం నాకు అస్సలు నచ్చలేదని రోహిత్ అన్నాడు. ఇలా కాసేపు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్ తన రెండో నామినేషన్ ఝాన్సీకి వేశాడు. సేఫ్ గేమ్ ఆడటం మానేయ్ అని ఆమెతో చెప్పాడు. దీనికి బదులిచ్చిన ఝాన్సీ.. నాకు నా స్టాటజీ ఉంది. నువ్వే చాలాసార్లు వాళ్లు ఏం అనుకుంటున్నారో చెప్పు అని అడిగావ్? అని రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. ఇది జరుగుతున్నప్పుడు మధ్యలోకి త్రిగుణ్ రావడంతో రోహిత్.. అతడికి గట్టిగానే ఇచ్చేశాడు.నరేశ్, షాలినిలో గెలిచిన నరేశ్.. సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలినినే నామినేట్ చేశాడు. గేమ్ సీరియస్‌గా తీసుకున్నారు మీరు ఓడిపోతే తీసుకోలేరు. చైత్రని మీరు హర్ట్ చేసి తనతో గొడవపడి చివరకు తనతోనే క్షమాపణ చెప్పించారు. ఎప్పుడూ బిగ్‌బాస్ పిలిచిన వెంటనే రారు. మీకు ఇప్పుడే వార్నింగ్ కూడా వచ్చింది అని కారణాలు చెప్పాడు. షాలిని, త్రిగుణ్ పోటీలో త్రిగుణ్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తనని టార్గెట్ చేసిన సుధీర్‌ని నామినేట్ చేశాడు. ఏమైనా ఒప్పుకుంటా కానీ వెన్నుపోటు పొడిచావ్ అంటే తీసుకోలేను. నువ్వే వచ్చి నాది సృష్టిది హైట్ సరిపోతుంది అని నువ్వే నాతో మాట్లాడావ్ నేను ఎవరికీ ఈ విషయాలు చెప్పలేదు. తోముతున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు మీనింగ్‌తో అనలేదు. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు అని త్రిగుణ్ తన అభిప్రాయాల్ని చెప్పాడు.చివరిగా నాతో ఫైట్ చేస్తే బాగా కనిపిస్తావ్ అని నాతో పెట్టుకున్నావ్ నాకు తెలుసు అని సుధీర్‌ని రివర్స్ ఎటాక్ చేశాడు త్రిగుణ్. త్రిగుణ్ తన రెండో నామినేషన్ రోహిత్‌కి వేశాడు. నువ్వేదీ తీసుకోవడం లేదు. పనిచేయవు పనిచేసే వాళ్లని చేయనివ్వడం లేదు అని త్రిగుణ్ తన కారణాలు చెప్పాడు. ఇదలా ఉండగానే మరోవైపు వర్షిణి, షాలిని గట్టిగా గొడవపడ్డారు. తర్వాత ముఖేశ్, అమన్ పోటీపడగా.. గెలిచిన అమన్ గోల్డ్ గొడ్డలి పట్టుకొని మొదట రాంప్రసాద్‌ని నామినేట్ చేశాడు. తర్వాత ఝాన్సీకి నామినేట్ చేసి మొదట నా గేమ్ బాగుంది అని చెప్పి అందరి దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావ్ అనడం నచ్చలేదు అని చెప్పాడు.రాంప్రసాద్, వంశీలలో వంశీ గెలిచి గోల్డెన్ గొడ్డలి అందుకున్నాడు. వంశీ మొదటి దేబ్జానీని నామినేట్ చేశాడు . నువ్వు ఓ పదం వాడావు నాకు అది నచ్చలేదు ఆ పదం ఇప్పుడు కూడా నాకు మాట్లాడాలి అని లేదని అన్నాడు. ఈ పదం వాడకూడదు అని నాకు తెలీదు. మేం జిమ్‌లో వాడుతుంటాం. వర్షిణి ఆ పదం వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు తెలిసింది అని దేబ్జానీ సమాధానమిచ్చింది. రెండో నామినేషన్ ముఖేశ్‌కి వేశాడు. ముఖేశ్ ఇంట్లో గడ్డం గీసుకోవడం తనకి ఇబ్బందిగా అనిపించిందని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. నరేశ్, ముఖేశ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, ఝాన్సీ, అమన్, షాలిని, సృష్టి.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్.ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే?సుధీర్.. త్రిగుణ్, షాలినిదేబ్జానీ.. త్రిగుణ్, రోహిత్త్రిగుణ్, ఝాన్సీనరేష్.. షాలిని,త్రిగుణ్.. సుధీర్, రోహిత్అమన్.. రాం ప్రసాద్, ఝాన్సీవంశీ.. దేబ్జానీ, ముఖేష్(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా 'హుషార్ పిట్టలు') -
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
బిగ్‌బాస్ సీజన్-10లో ఎలిమినేషన్స్ వేడి మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమకు నచ్చని వారి పేర్లు చెబుతూ.. అందుకు కారణాలను వివరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కాస్తా హౌస్‌లో మాటల యుద్ధానికి దారితీసినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. మరోవైపు ఎలిమినేషన్ పాయింట్స్‌లోనూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.తాజా ప్రోమోలో నరేశ్.. షాలినీని ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తూ తన కారణాలను చెప్పాడు. దీనికి షాలినీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కనిపించారు. మరోవైపు వర్షిణి, షాలినీ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో చూపించారు. వీరిద్దరి మధ్య అసలు గొడవకు కారణమేంటి? ఎలిమినేషన్ పాయింట్స్ విషయంలో ఎవరి వాదన సరైనది? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ రసవత్తరంగా మారగా.. ఎలిమినేషన్ ప్రక్రియతో మరింత వేడి పెరిగినట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరి మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లిందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
అడుగుపెట్టగానే ఫేమస్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. మరి ఆమె కోసం కొన్ని ముచ్చటైన విషయాలు తెలుసుకుందామా..!దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి లేదు. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.ఎన్నెన్నో జన్మల బంధంతో గుర్తింపు...తెలుగులో బేబ్జానీకి మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పట్లో ఈమె.. తన నటన, మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?బిగ్‌బాస్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా..ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.బిగ్‌బాస్‌లో ప్రపోజల్ హింట్..బిగ్‌బాస్‌లో తొలివారం బేబ్జానీ పేరే హైలెట్‌గా నిలిచింది. ఆమె ఆడే తీరు అలాంటిది మరి. అయితే బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్ అంటే కూడా చాలా ఇష్టమని తన మాటల్లోనే చెప్పింది. ‘ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే నాకు చాలా ఇష్టం. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు. అందుకే ఈ విషయం అతనితో చెప్పలేకపోయా. నీక కాఫీ అంటే ఎంత ఇష్టమో అతను అంటే కూడా అంతే ఇష్టం. అతని కళ్లు కూడా చాలా బాగుంటాయి’ అని బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టింది దేబ్జానీ. ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?అంతే కాకుండా తాను ఆరో తరగతి తొలసారి ఫైయిల్ కావడంతో రెండు సార్లు చదవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే నిజంగానే అతనంటే ఇష్టమా లేక గేమ్ కోసం చెప్పిందా అని సందిగ్దత నెలకొంది. ఏదీఏమైనప్పటికీ ఈ బిగ్‌బాస్‌లో దేబ్జానీ జర్నీ ఎంతవరకు సాగుతుంది?. ఈ సారి కప్ ఈమె కొడుతుందో లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామంది నామినేషన్ ప్రక్రియనే గుర్తొస్తుంది. ఎందుకంటే వారం మొత్తంలో ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది అంటే అది ఇదే. గతవారమే షో మొదలైంది కాబట్టి నామినేషన్లని నిర్వహించలేదు. కంటెస్టెంట్స్.. హౌస్మేట్స్ కావడంలో భాగంగా పోటీ జరిగింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర తొలివారం ఎలిమినేట్ అయ్యారు. మరొకరు కూడా వెళ్లిపోతారని రూమర్స్ వచ్చాయి గానీ అలాంటిదేం జరగకుండానే వీకెండ్ పూర్తయింది.(ఇదీ చదవండి: వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్)ఇక సోమవారం రావడంతో ఈ సీజన్లో తొలిసారి నామినేషన్ల హంగామా మొదలైంది. ఈసారి పెద్ద దిమ్మకు తాడు చుట్టి ఉంటుంది. తలో ఇద్దరూ ఒకకేసారి వెళ్లి ఆ తాడుని విప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా తాడుని పూర్తిగా తొలగిస్తారో వాళ్లకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా ఛాన్స్ దక్కించుకున్న సుధీర్..త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. గేమ్ ఏమేం జరగకుండా చైత్ర పేరుని నువ్వు చెప్పడం నాకు నచ్చలేదని కారణం చెప్పాడు. అలానే వాష్‌రూమ్ క్లీన్ చేయమని పనిఇస్తే.. అది చేయకుండా ఉన్న పవర్ వేస్ట్ చేసుకున్నావ్ అని షాలినిని నామినేట్ చేశాడు.మరోవైపు దేబ్జానీ కూడా త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. రోహిత్ కూడా త్రిగుణ్‌తో పాటు ఝాన్సీని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతోందని, ఏ డిస్కషన్లోనూ తనకు కనబడట్లేదని ఈమె పేరు చెప్పాడు. ఈ సందర్భంగా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ రోహిత్-ఝాన్సీ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.ప్రస్తుతం హౌస్‌లో 14 మంది ఉండగా.. వీళ్లలో ఈ వారం ఏకంగా 10 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రాంప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముకేశ్, దేబ్జానీ.. ఈ లిస్టులో ఉన్నారట. సృష్టి, వంశీ, నరేశ్, అమన్.. ఈ వారం నామినేట్ కాకుండా సేఫ్ జోన్లో ఉన్నారని సమాచారం.(ఇదీ చదవండి: ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్) -
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్‌పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్‌కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్‌ను హౌస్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్‌ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్‌లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్‌కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్‌ను రెండు టీమ్‌లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్‌లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్‌తో బిగ్‌బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్‌తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్‌ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి? -
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి మొదలైపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆడుకోవడంతో పాటు వారమంతా జరిగిన సంగతుల గురించి మాట్లాడుతారు. అలా ఈ సీజన్లో తొలివారం జరిగిన చాలా విషయాల గురించి ఆదివారం మాట్లాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో గానీ దేబ్జానీ, ముకేశ్ 'కళ్ల' కహానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.(ఇదీ చదవండి: తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!)మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు? అని చెప్పాలని నాగ్ అడగ్గా.. రామ్ ప్రసాద్, నరేశ్, ముకేశ్ తోటి కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. అయితే హౌస్‌లో వాతావరణం సీరియస్‌గా ఉండేసరికి ముకేశ్, నీ కళ్లు బాగున్నాయని నాగ్ అనడంతో అందరూ నవ్వేశారు. మీరు అన్నందుకు థ్యాంక్యూ సర్ అని ముకేశ్ అనగానే కౌంటర్ ఇచ్చిన నాగ్.. నేను అంటే ఓకే గానీ దేబ్జానీ అంటే మాత్రం ఒప్పుకోవా అని ప్రశ్నించారు.టాపిక్ తనవైపు డైవర్ట్ అయ్యేసరికి దేబ్జానీ తన మనసులో మాట బయటపెట్టింది. నాకు నిజంగా నీ కళ్లు బాగుందనిపించింది కాబట్టి చెప్పాను అని ముకేశ్‌ని చూస్తూ దేబ్జానీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముకేశ్ చాలా ఇష్టం. కానీ చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు. అటు సైడు కూడా చేస్తున్నాడు. నా దగ్గర రావట్లేదు సర్ అని గోముగా అడిగింది. త్వరలో దేబ్జానీ-ముకేశ్ మధ్య బంధం మొదలవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?) -
బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్ శనివారం గ్రాండ్‌గా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసినవారిని ప్రశ్నిస్తూనే.. బాగా ఆడినవారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు.ముందుగా కంటెస్టెంట్లతో మాట్లాడేందుకు వచ్చిన నాగార్జున కాసేపు సీరియస్‌గా కనిపించడంతో హౌస్మేట్స్ కాస్త భయపడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ వారిని పలకరించారు. దీంతో ‘అలా చూడకండి సార్.. భయంగా ఉంది’ అంటూ కంటెస్టెంట్లు చెప్పగా.. నరేశ్ కూడా అదే మాట అనడంతో ‘నీకు కూడా భయం వేసిందా నరేశ్?’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.రాంప్రసాద్, నరేశ్ రివ్యూలపై..ఇక రాంప్రసాద్, నరేశ్ కలిసి హౌస్‌లో ఎవరు ఎలా ఆడుతున్నారనే విషయంపై సరదాగా రివ్యూలు ఇచ్చారు. ఈ రివ్యూలను నాగార్జున టీవీలో వీక్షించారు. అనంతరం ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు.‘అసలు ఆట ఇప్పుడే మొదలైంది’అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలవుతుందని బిగ్‌బాస్ ముందే చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారారని, మరికొందరు ఎలిమినేట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో చరణ్, చైత్రలు ఇంకా సీక్రెట్ రూమ్‌లో ఉన్నారా? అనే అనుమానం కంటెస్టెంట్లలో ఉందని గుర్తించిన నాగార్జున.. వారితో మాట్లాడించారు. దీంతో హౌస్మేట్స్ డౌట్స్‌కు క్లారిటీ ఇచ్చారు.( ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్)షాలినీకి చరణ్ ధైర్యంచరణ్కు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఒకరితో మాట్లాడొచ్చని చెప్పారు. దీంతో చరణ్ షాలినీతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చైత్రకు కూడా ఇదే అవకాశం ఇచ్చారు. ఆమె ముకేశ్‌తో మాట్లాడింది. ‘నువ్వు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది’ అంటూ చైత్ర చెప్పింది. అనంతరం రోహిత్ ఆటతీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’ముగ్గురికి మిల్క్షేక్లుముగ్గురు హౌస్మేట్స్ రోహిత్, రాంప్రసాద్, టెంపర్ వంశీ బాగా ఆడుతున్నారని మెచ్చుకున్న బిగ్‌బాస్.. వారికి మిల్క్‌షేక్‌లు పంపించా. అయితే వారు తాగిన గ్లాసులను నాగార్జునే కడిగారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు. అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడ ఉండొద్దు’ అంటూ క్లాస్ తీసుకున్నారు. అనంతరం మిగిలిన 11 మంది ఇంకా రిస్క్‌లోనే ఉన్నారని నాగార్జున తెలిపారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.త్రిగుణ్, రోహిత్ తీరు అసహనం..ఆ తర్వాత ముకేశ్, త్రిగుణ్, వర్షిణిలను గార్డెన్ ఏరియాలోని పసుపు లైన్ దగ్గర నిల్చోమని బిగ్‌బాస్ ఆదేశించారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హౌస్‌మేట్‌గా మారబోతున్నారని నాగార్జున తెలిపారు. చివరికి నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్ ఎంపికయ్యాడు. రోహిత్, త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. రోహిత్‌కు క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌ను ఆదేశించారు. అంతేకాదు.. స్విమ్మింగ్ పూల్ చుట్టూ టైర్‌ను చేతితో ఎత్తుకుని తిరగాలని పనిష్మెంట్ ఇచ్చారు. ‘ఎంగిలి కప్పులు కడగాలి’ అనే మాట విషయంలోనూ రోహిత్‌కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంపై రోహిత్‌ను నాగార్జున ప్రశ్నించారు. ఇకపై బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను అందరూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితదేబ్జానీకి నాగార్జున ప్రశంసలుహౌస్లో తెలుగులో మాట్లాడుతున్న దేబ్జానీని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించారు. మరోవైపు రాంప్రసాద్ నవ్వించాలనే ప్రయత్నంలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్న తీరును కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఇకపై రాంప్రసాద్ అలా మాట్లాడకుండా చూసుకునే బాధ్యతను నరేశ్ తీసుకోవాలని సరదాగా చెప్పారు.షాలినీ చేసిన ఓ కామెంట్ నేపథ్యంలో రాంప్రసాద్‌ను అతడి మొదటి సంపాదన ఎంత అని నాగార్జున అడిగారు. దానికి రాంప్రసాద్ తన మొదటి సంపాదన రూ.500 అని చెప్పాడు. అనంతరం షాలినీకి సారీ చెప్పడం కోసం 500 సార్లు sorry అని రాయాలని రాంప్రసాద్‌కు పనిష్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా బేబ్జానీ సరదాగా స్పందిస్తూ.. ‘నీ మొదటి సంపాదన రూ.20 అని చెప్పాల్సింది’ అంటూ నవ్వులు పూయించింది.పోటీ మరింత ఆసక్తికరంగా..ఆ తర్వాత కంటెస్టెంట్ల మనసులోని మాట తెలుసుకునేందుకు నాగార్జున ప్రయత్నించారు. మీకు నచ్చిన ఒకరి పేరు, నచ్చని ఒకరి పేరు చెప్పాలంటూ అడగడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో మరో కీలక ప్రకటన చేశారు. లాస్ట్ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో తొలి వీకెండ్లోనే బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో రిస్క్‌లో ఉన్న వారిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. -
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్‌బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్‌లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్‌గా నిలిచింది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్‌మేట్స్‌గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్‌బాస్ ఇంకా సీక్రెట్ రూమ్‌లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్‌లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్‌ను మరింత పదును పెడతారో చూడాలి. -
Bigg Boss 10 Telugu: వర్షిణికి షాలిని షాక్..
-
బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?
సాధారణంగా బిగ్‌బాస్‌లో ఏ సీజన్ అయినా సరే ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది. ఒకటి రెండు వారాలు పూర్తయిన తర్వాత గొడవలు, ఎలిమినేషన్లతో హీట్ పెరుగుతుంది. కానీ రీసెంట్గా మొదలైన తెలుగు బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఇంతకీ ఐదో రోజైన శుక్రవారం(సెప్టెంబరు 11) అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)సింపుల్.. టఫ్ టాస్క్చరణ్ ఎలిమినేట్ కావడంతో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా హౌస్ వీడి బయటకెళ్లిపోయేసరికి సృష్టి బాధపడింది. మరోవైపు ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకున్న అమన్, రోహిత్, సృష్టి, షాలిని.. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారని తెలివిగా ఆమె వాళ్ల వైపు వెళ్లిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు మేం ఆడమని చెప్పేయగా.. హై రిస్క్‌లో ఉన్న కారణంగా చైత్రని ఆడొద్దని ఆదేశించాడు. దీంతో మిగతావాళ్లంతా మాట్లాడుకుని సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్ కోసం.. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అయ్యారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీ?రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి, అమన్‌తో చెప్పేసరికి.. ఇతడీ విషయం రోహిత్‌కి చెబుతాడు. దీంతో రోహిత్ వెళ్లి సృష్టితో మాట్లాడతాడు. ఇదంతా చూసిన షాలిని.. తన వల్లే సృష్టికి రోహిత్ దూరమైపోతున్నాడేమోనని తెగ బాధపడిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల ముగ్గురి మధ్య లవ్ స్టోరీ లాంటిది ఏమైనా మొదలవుతుందేమోనని అనిపిస్తోంది. మరోవైపు కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గేమ్‌లో గెలిచినందుకు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని అనగా అమన్ పేరు చెప్పుకొచ్చాడు.సుధీర్-వర్షిణి దొందుకు దొందేకష్టమైన టాస్క్ కోసం ఎంపికైన సుధీర్, వర్షిణిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. ఓ కేక్ స్మాష్ చేసి దీనిని ఒకరు చేశారంటే మరొకరు చేశారని కంటెస్టెంట్స్ అందరినీ నమ్మించాలని.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. అయితే ఈ టాస్క్ సరిగా ఆడలేక లోపల జరిగిన విషయాన్ని వర్షిణి, ముకేశ్‌కి చెప్పేయడంతో గేమ్ ఆడిన సుధీర్, వర్షిణి ఇద్దరూ కూడా హై రిస్క్ జోన్లోకి వెళ్లారని బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు.చైత్ర ఎలిమినేట్ఇక మహాపరీక్షలో భాగంగా హై రిస్క్‌లోకి వచ్చిన చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన బిగ్‌బాస్.. నలుగురూ మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరికి ఓటు వేయాలని చెప్పాడు. దీంతో వర్షిణి, చైత్ర పేరు.. అమన్ కూడా చైత్ర పేరు.. సుధీర్ కూడా చైత్ర పేరు చెప్పాడు. ఇక చైత్ర, సుధీర్ ఎలిమినేట్ అవ్వాలని చెప్పింది. చైత్రకు మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అయింది. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాంప్రసాద్ కామెడీ చేశాడు. ఇలా ఐదోరోజు ఎపిసోడ్ ముగిసింది. వారం కాకుండానే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. వీకెండ్లో ఇంకెలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు) -
స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?
-
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
తెలుగు బిగ్‌బాస్ 10వ సీజన్ మొదలై నాలుగు రోజులే అయింది. ఇంతలోనే ఓవైపు గొడవలతో హౌస్ హీటెక్కిపోతుంటే మరోవైపు వరస ఎలిమినేషన్లు షాకిస్తున్నాయి. సామాన్యుల కోసం పెట్టిన అగ్నిపరీక్ష పోటీలో గెలిచి ఆదివారం హౌస్‌లోకి అడుగుపెట్టిన చరణ్.. గురువారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇదలా ఉండగానే లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిందనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)ఈసారి 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో 10 మంది సెలబ్రిటీలు కాగా మిగిలిన 6గురు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్. వీళ్లని ప్రస్తుతం బ్లూ, రెడ్ టీమ్స్‌గా విభజించి గేమ్స్ పెడుతున్న బిగ్‌బాస్.. అలా హై రిస్క్ జోన్లోకి వచ్చి తక్కువ ఓట్లు పొందిన చరణ్‌ని బయటకు సాగనంపేశాడు. తాజా ఎపిసోడ్లో భాగంగా హై రిస్క్ జోన్లోకి కామరన్స్ నుంచి అమన్.. సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర వచ్చినట్లు తెలుస్తోంది.వీళ్ల ముగ్గురిలో ఈసారి సీరియల్ నటి చైత్రకు తక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఈమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఎలిమినేషన్ అంటే పూర్తిగా బయటకొచ్చేసినట్లు కాదు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్‌బాస్.. మిడ్ వీక్ బయటకొచ్చిన చరణ్, చైత్రని మళ్లీ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. తర్వాత వీళ్లిద్దరి మధ్య పోటీపెట్టి వీళ్లలో ఒకరిని ఈ ఆదివారం నిజంగానే ఎలిమినేట్ చేయనున్నారు. మరి ఆ దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు) -
బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మొదలై నాలుగు రోజులు అయిపోయింది. మహాపరీక్ష పేరుతో ఇప్పటికే హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరి నాలుగో రోజైన గురువారం(సెప్టెంబరు 10) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మిడ్ వీక్‌లోనే చరణ్ ఎలిమినేట్ అయిపోవడం, అతడి చివరి మాటలు ఎలా సాగాయనేది ఈ హైలైట్స్‌లో చూద్దాం.బ్లాక్ షీప్ ఎవరు?మహాపరీక్ష పేరుతో జరుగుతున్న పోటీ కోసం కంటెస్టెంట్స్ బ్లూ, రెడీ టీమ్స్‌గా విడిపోయారు. తాజా ఎపిసోడ్లో చెరో బృందం నుంచి ఇద్దరిని నిల్చోమని బిగ్‌బాస్ చెప్పగా బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేశ్.. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ వచ్చారు. మీ టీమ్‌లో మీరు ఎవరిని హై రిస్క్‌లో పెట్టాలనుకుంటున్నారో చెప్పమని అడగడంతో.. త్రిగుణ్, ముఖేశ్... కృష్ణుడిని, రోహిత్, వంశీ.. చైత్ర పేరు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన బిగ్‌బాస్.. ఈ నలుగురు కంటెస్టెంట్స్‌ని బయటకు పంపి 'హూ ఈజ్ ది బ్లాక్ షిప్' గేమ్ ఆడించారు. ఇందులో బ్లూ టీమ్ గెలిచింది.షాలినీ- చైత్ర మాటల వార్అయితే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సరిగా ఆడలేదని రెడ్ టీమ్‌కి చెందిన రోహిత్ ప్రశ్నించగా.. కృష్ణుడి పేరు బ్లూ టీమ్ సరిగా రాయకపోవడంతో ఓడిపోయారు. చైత్ర పేరుని రెడ్ టీమ్ సరిగా రాసి టాస్క్‌లో గెలిచారు. అలా రోహిత్, వంశీ పర్మినెంట్ హౌస్మెట్స్ అయిపోయారు. ఈ సందర్భంగా షాలినీ.. ఏదైనా పాట పెట్టమని బిగ్‌బాస్‌ని అడిగింది. చైత్ర ఓవైపు హై రిస్క్‌లో ఉంటే డ్యాన్సులు కావాలా అని రాంప్రసాద్ అడగడంతో షాలినీ-చైత్ర మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఇద్దరూ మాటమాట అనుకున్నారు. చివరకు షాలిని ఏడ్చేసింది. దీంతో అంతా వెళ్లి ఆమెని ఓదార్చారు.త్రిగుణ్ వర్సెస్ రోహిత్కిచెన్లో గిన్నెలు తోమలేదని త్రిగుణ్‌ని రోహిత్ పిలిచి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఒకరికిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అగ్రిపరీక్ష నుంచి చీప్‌గా వచ్చేశారు, నీ బాడీ మొత్తం మత్తు పదార్ధాలతో తయారైంది అని త్రిగుణ్, రోహిత్‌ని తక్కువ చేసి మాట్లాడాడు. రోహిత్‌ని డొల్లరాజా డొల్లరాజా అని పాట కూడా పాడి త్రిగుణ్ ఉడికించాడు.చరణ్ ఎలిమినేట్హై రిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చైత్ర, చరణ్‌ని పిలిచిన బిగ్‌బాస్.. ముగ్గురు మాట్లాడుకొని ఒకరు నామినేట్ అవ్వకుండా హై రిస్క్‌లో ఉంటూనే ఇంట్లో ఉంటారు అది ఎవరో మీరు నిర్ణయించుకోండి అని ఆదేశిస్తాడు. దీంతో చైత్ర లోపల ఉండాలని చరణ్.. రాం ప్రసాద్ లోపల ఉండాలని చైత్ర.. చైత్ర ఉండాలని రాం ప్రసాద్ చెప్పారు. దీంతో చైత్ర ఇంట్లోకి వెళ్లిపోయింది. మిగిలిన రాంప్రసాద్, చరణ్‌లో ఎవరు ఇంట్లో ఉండకూడదో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి చెప్పాలని బిగ్‌బాస్.. మిగిలిన కంటెస్టెంట్స్‌ని ఆదేశించాడు. ఈ ప్రొసెస్‌లో తక్కువ ఓట్లు పడిన చరణ్.. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు.కన్నీళ్లు తెప్పించిన చరణ్ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడిన చరణ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. నేను వెళ్లిపోతానని కాదు గానీ జరిగింది నాకు నచ్చలేదు. నలుగురు అగ్నిపరీక్ష వాళ్లు నాకు ఓటేశారు. ఝాన్సీ నాకు ఓటు వేయలేదు. థ్యాంక్స్ ఇది గ్రూప్ గేమ్ కాదని నిరూపించినందుకు. నన్ను రాంప్రసాద్ అన్నని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తక్కువగా కనిపిస్తా. మా టీమ్ నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు అని భావోద్వేగానికి గురయ్యాడు. అలా నాలుగో రోజు ఆట ముగిసింది. -
బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా, కానిఫడెంట్గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషాద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.కామనర్‌గా బిగ్‌బాస్‌లోకి..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో షాలిని గేమ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్‌బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక.. -
Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!
-
బిగ్‌బాస్‌లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..
బిగ్‌బాస్ ఇంట్లో మరోసారి హైరిస్క్ టెన్షన్ మొదలైంది. మహాపరీక్షలో భాగంగా రోహిత్, టెంపర్ వంశీ, ముకేశ్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో విజయం సాధించిన ఇద్దరికి హౌస్‌మేట్‌గా మారే అవకాశం కల్పించడంతో పాటు.. హైరిస్క్ జోన్లోకి ఒకరిని పంపాల్సి ఉంటుందని చెప్పాడు.విజయం కోసం ఒకరిని హైరిస్క్‌లోకి పంపే వ్యక్తి పేరును ఇచ్చిన స్లాట్‌లో సరిగ్గా అమర్చాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ టాస్క్‌లో ముకేశ్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కృష్ణుడిని హైరిస్క్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణుడు పేరును అసంపూర్తిగా అమర్చడంతో.. ఆ పేరును పరిగణనలోకి తీసుకోబోమని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఇదీ చదవండి: విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!మరోవైపు రోహిత్, వంశీలు చైత్ర పేరును హైరిస్క్ కోసం సూచించారు. ఇదే సమయంలో షాలినీ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం హౌస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. చైత్రను హైరిస్క్‌లోకి నెట్టినందుకే షాలినీ ఇలా సంబరాలు చేసుకుంటోందంటూ బ్లూ టీమ్ సభ్యులు ఆమెతో వాదించారు.దీంతో చైత్ర, షాలినీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లిందనేది ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
సార్ తోపులా ఫీల్ అవ్వకు... రోహిత్ పై వర్షిణి ఫైర్
-
Bigg Boss 10 : వర్షిణికి వాష్‌రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు గ్రూపులుగా చర్చలు, బాధ్యతల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మూడో రోజు ఎపిసోడ్లో హైరిస్క్ జోన్, కొత్త కెప్టెన్ ఎంపిక, ఇంటి పనుల పంపకం, మానిటరింగ్ విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు తనకు లభించిన ప్రత్యేక పవర్ ని షాలిని ఉపయోగించుకుంది. ఇంతకీ మూడో రోజు ఏం జరిగింది?. అసలు వర్షిణి శాశ్వతంగా వాష్‌రూమ్ కడగాల్సిన అవసరం ఏం వచ్చింది.? నిన్న జరిగిన ఎపిసోడ్ పై ఒక లక్కేద్దాం రండి..!రెండు టీమ్‌లకు షాక్.. హైరిస్క్‌లోకి ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో బ్లూ, రెడ్ టీమ్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. రెండు టీమ్‌లు విఫలమైనందుకు చెరో కంటెస్టెంట్‌ను హైరిస్క్‌లో పెట్టాలని ఆదేశించాడు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చాడు. తనను హైరిస్క్‌లో పెట్టాలని టీమ్ సభ్యులకు చెప్పాడు. రెడ్ టీమ్‌లో మాత్రం చరణ్, షాలినీలలో ఒకరిని ఎంపిక చేయాలని చర్చ జరిగింది. చివరకు టీమ్ సభ్యుల నిర్ణయంతో మేరకు చరణ్ హైరిస్క్‌లోకి వెళ్లాడు.కెప్టెన్సీ బాధ్యతలో మార్పు..హైరిస్క్‌లోకి వెళ్లిన రాంప్రసాద్, చరణ్‌లు రెండు టీమ్‌లకు సంబంధించిన కొన్ని హక్కులను కోల్పోయారు. దీంతో బ్లూ టీమ్ కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలో ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినప్పటికీ.. ఇక్కడో మ్యాజిక్ జరిగింది. రాంప్రసాద్ ప్రతిపాదనతో దేబ్జానీకి అవకాశం దక్కింది. టీమ్ సభ్యుల అంగీకారంతో ఆమె బ్లూ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.పనుల పంపకంలో వివాదం..ఇంటి పనుల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వంట పూర్తయ్యే వరకు పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కిచెన్ దగ్గరే ఉండాలంటూ త్రిగుణ్, వర్ష, సుధీర్.. రోహిత్‌కు సూచించారు. అయితే తాను ఎప్పుడూ అక్కడే ఉండటం సాధ్యం కాదని, అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చి పని చేస్తానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ రెండు టీమ్‌లకు మరో బాధ్యత అప్పగించాడు. ఒక టీమ్ ఇంటి పనులు చేయాలని, మరో టీమ్ వాటిని పర్యవేక్షించాలని చెప్పాడు. దీంతో ఏ టీమ్ ఏ బాధ్యత తీసుకోవాలనే దానిపై చర్చ మొదలైంది.రోహిత్ విషయంలో రచ్చ..బ్లూ టీమ్ తరఫున దేబ్జానీ.. తమ టీమ్ ఇంటి పనులు చేస్తుందని, రెడ్ టీమ్ మానిటరింగ్ బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము కూడా అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.మాటామాటా పెరగడంతో..రోహిత్ మాటలపై వర్ష, త్రిగుణ్, కృష్ణుడు స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధీర్‌తోనూ రోహిత్‌కు గొడవ జరిగింది. తన పని తాను చేయాల్సి ఉండగా సుధీర్ ఎందుకు చేశాడంటూ రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో ‘నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు?’ అంటూ రోహిత్ ఘాటుగా స్పందించాడు.ఎవరికి ఏ పని?చివరకు దేబ్జానీ ఇంటి పనులను కంటెస్టెంట్లకు విభజించింది. వంశీకి కుకింగ్ బాధ్యత అప్పగించి, అతనికి సహాయంగా ఝాన్సీని నియమించింది. దేబ్జానీ మానిటర్‌గా వ్యవహరించనుంది. షాలినికి వాష్‌రూమ్, అమన్‌కు లాండ్రీ, సృష్టికి హౌస్ క్లీనింగ్ బాధ్యతలు దక్కాయి. సుధీర్‌కు మానిటరింగ్ బాధ్యత, రోహిత్‌కు అంట్లు తోమే పని అప్పగించి.. అతడిని త్రిగుణ్ పర్యవేక్షించాలని నిర్ణయించారు. చైత్రకు హౌస్ క్లీనింగ్ బాధ్యత ఇచ్చారు. వర్షిణికి వాష్‌రూమ్ బాధ్యత..ఇక ఎపిసోడ్లో షాలిని తనకు లభించిన ప్రత్యేక పవర్ ని ఉపయోగించుకోవడం మరో హైలైట్‌గా నిలిచింది. తనకు కేటాయించిన వాష్‌రూమ్ క్లీనింగ్ బాధ్యతను వర్షిణికి అప్పగించింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం వాష్‌రూమ్ బాధ్యత ఆమెనే చేయాలి. వర్షిణి నవ్వుతూ తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది.30 సెకన్ల ఛాలెంజ్..అంట్లు తోముతున్న రోహిత్‌ను పర్యవేక్షించే బాధ్యత త్రిగుణ్‌కు దక్కడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. త్రిగుణ్ పిలవగానే ‘30 సెకన్లలో వస్తా’ అన్న రోహిత్.. ఆలస్యం చేసాడు. నిజానికి ఇక్కడ రోహిత్ కావాలనే అలా చేశాడు .త్రిగుణ్ ఈ విషయాన్ని బిగ్‌బాస్ దృష్టికి తీసుకెళ్లాడు.అంతటితో ఆగకుండా రోహిత్ పని చేస్తున్న విధానంపై త్రిగుణ్ సూచనలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ‘ఇలా చేయాలి.. అలా చేయాలి’ అంటూ తనను మానిటర్ చేయడంపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంట్లోని వాళ్లను కాదు.. నిన్నే మానిటర్ చేస్తున్నా’ అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా మూడో రోజుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఆధిపత్య పోరు, పనుల విషయంలో విభేదాలు బయటపడటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. -
బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగులో బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన. కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. దీంతో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)పిల్లలతో ఉన్న ఓ వీడియో..ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..‘హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by rajakumari_dayana 46 (@rajakumari_dayana) -
బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్‌బాస్10 హౌస్‌లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్‌లో పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. హైరిస్క్‌లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్‌ను హైరిస్క్‌లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్‌బాస్‌కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్‌ను యూనానిమస్‌గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్‌లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్‌రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్‌లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్‌బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్‌తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి -
అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
-
Bigg Boss 10: రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్
బిగ్‌బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్‌గా, కామ్‌గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. మరోవైపు రోహిత్‌పై యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్ టాస్క్ నుంచి నామినేషన్స్, ప్రొటెక్టివ్ బాస్ టాస్క్ వరకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.సైన్యం కోసం బ్యాగ్ టాస్క్హౌస్మేట్స్ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్‌లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్‌బాస్ ఓ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్‌లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్‌లో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా నాయకులు తమ టీమ్‌లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.మొదట ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రామ్‌ప్రసాద్‌కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్‌ను త్రిగుణ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్‌కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అనంతరం టెంపర్ వంశీకి మరో రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్‌ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్ ముందుగా తన టీమ్‌లోకి తీసుకోలేదు. రోహిత్ తనకున్న ఆప్షన్‌తో ఆమెను రాంప్రసాద్ టీమ్‌లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్ పై అలక పూనింది. ‘నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్‌ప్రసాద్ స్పందిస్తూ.. ‘రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.గ్రూప్ గేమ్‌పై వర్షిణి, చరణ్ మధ్య డిస్కషన్ఇక వర్షిణి, ఆర్జే చరణ్ మధ్య గ్రూప్ గేమ్ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్ చెప్పగా.. ‘గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్‌ను ప్రశ్నించింది. దీనికి చరణ్ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.రోహిత్ తోపులా ఫీలవుతున్నాడుఅనంతరం బిగ్‌బాస్ బ్లూ టీమ్ సభ్యులకు ఓ కీలక టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్‌ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్ తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్‌లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్ ‘గ్రూప్’ అని అనగానే రోహిత్ ట్రిగ్గర్ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్గారిని గ్రూప్ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేలోపే రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ కాస్త సీరియస్‌గానే మాట్లాడింది.రోహిత్‌పై కృష్ణుడు ఫైర్..ఆ తర్వాత నామినేషన్ బాధ్యత రెడ్ టీమ్‌కు వచ్చింది. బ్లూ టీమ్ సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్‌బాస్ రోహిత్‌కు అప్పగించాడు.రోహిత్ వరుసగా కృష్ణుడు, రామ్‌ప్రసాద్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్‌పై ఫైర్ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్‌ప్రసాద్, వర్షిణి సైతం రోహిత్‌పై మండిపడ్డారు.‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్‌లో ఫౌల్ గేమ్ఆ తర్వాత నామినేట్ అయిన పది మంది సభ్యులకు బిగ్‌బాస్ ‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో బ్లూ టీమ్ అటాకర్స్‌గా, రెడ్ టీమ్ డిఫెండర్స్‌గా టాస్క్ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్ 10 రెండో రోజు ఎపిసోడ్లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్లో పెద్దగా పస లేదనిపించింది. -
జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!
-
వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్
బిగ్‌బాస్ సీజన్ 10లో హౌస్‌మేట్‌గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్‌మేట్‌గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.రాంప్రసాద్, వర్షిణి ఎం చెప్పారంటే..బ్లూ టీమ్ నుంచి వర్షిణి, రాంప్రసాద్ కలిసి రోహిత్, చరణ్ ఫొటోలపై స్టార్ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్‌ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్‌లో మాత్రం 10 శాతం కూడా చరణ్ లేడని రాంప్రసాద్ వ్యాఖ్యానించాడు.మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్ కూడా హౌస్‌మేట్‌గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.రెడ్ టీమ్‌వాళ్ల వాదనలు ఇవీ..ఇదే టాస్క్‌ను రెడ్ టీమ్‌కు కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అందరి ముందే కారణాలు చెప్పాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ రంగంలోకి దిగాడు. రాంప్రసాద్, వర్షిణి, వినాయకుడు (కృష్ణుడు), దేబ్జానీ, త్రిగుణ్ ఫొటోలపై స్టార్ చేశాడు. వీళ్లు కూడా హౌస్‌మేట్‌గా పనికిరారని చెబుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు టాస్క్‌లో రూల్స్ అన్నీ బ్రేక్ చేశారని, ఎదుటివాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా లేదని రోహిత్ ఆరోపించాడు. ఊరికే ఓవర్ డామినేషన్ చేస్తారని, పనికిరాని వాదనలు చేస్తారని విమర్శించాడు. రోహిత్ మాటలకు వర్షిణి వెకిలిగా నవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది.రోహిత్‌కి గట్టి కౌంటర్..అక్కడితో ఆగని వినాయకుడు (కృష్ణుడు).. రోహిత్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తాను 100 శాతం ఇవ్వలేదని ఎలా అంటావంటూ ప్రశ్నించాడు. ‘యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ లీడర్.. నువ్వు ఎలా ఉండాలో మాకు చెబుతున్నావు. నువ్వు రాజు.. మేము నీ సైనికులమా?’ అంటూ రోహిత్‌పై తీవ్రంగా మండిపడ్డాడు.ఇప్పటికే టాస్క్ విషయంలో రెండు టీమ్‌ల మధ్య పోటీ తారస్థాయికి చేరగా.. రోహిత్, వినాయకుడి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని పెంచింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద వార్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? హౌస్‌మేట్‌గా మారే అవకాశం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే ఈరోజు రాత్రి 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే! -
FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?
-
వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Bigg boss 10 : బిగ్‌బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్‌బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్‌లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్‌కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్‌పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్‌బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్‌ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్‌ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్‌ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్‌గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్‌తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్‌లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్‌లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్‌ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్‌లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్‌పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్‌బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్‌కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్‌ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్‌లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్‌ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్‌ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్‌లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్‌లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్‌తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్‌బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్‌బాస్.. క్యూట్‌గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్‌బాస్‌కు సారీ చెప్పింది. దీనికి బిగ్‌బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్‌మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్‌మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్‌బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్‌లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్‌గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్‌కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్‌ను లీడర్‌గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్‌కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్‌గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్‌పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్‌లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్‌బాస్ ఇంట్లో రెండు టీమ్‌లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్‌కు రాం ప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్‌మేట్స్‌గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి. -
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)
-
స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10వ సీజన్ నిన్న (ఆదివారం) గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. వాళ్లే రాంప్రసాద్, నరేశ్‌లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్‌లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్‌బాస్ విషయానికి వస్తే..బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్మేట్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్, రాంప్రసాద్ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్‌లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: హాట్ టాపిక్‌గా నాగార్జున రెమ్యునరేషన్భేదాభిప్రాయాలు రావడం..అయితే బిగ్‌బాస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్. ఒక టాస్క్‌లో పోటీ పడటం, నామినేషన్ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ఒకవేళ గొడవ జరిగితే?ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్‌లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్‌లో బలంగా మారుతుందా? లేక బిగ్‌బాస్ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? -
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10... కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
‘గుప్పెడంత మనసు' రిషి సర్.. బిగ్‌బాస్ 10లోకి ఆగయా
ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్( ముకేశ్ గౌడ) వచ్చేశాడు. చివరి కంటెస్టెంట్‌గా లోపల అడుగుపెట్టేశాడు.రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్‌గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది. -
నటిగా మొదలుపెట్టి యాంకర్‌గా ఫేమస్ అయి.. ఎట్టకేలకు 'బిగ్‌బాస్'లోకి..
ప్రతిసారి 'బిగ్‌బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్‌ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్‌లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈమె పేరు వినిపించేది. కానీ చివరలో తూచ్ ఈమె లేదని తేలేది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్‌తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి? -
'బిగ్‌బాస్'లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ 'వినాయకుడు'
తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. 'బిగ్‌బాస్' హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు. ఇతడి అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్‌గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్‌లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి? -
Bigg Boss 10: బిగ్‌బాస్‌లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్‌లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్‌కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు. -
శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ప్రతిసారి బిగ్‌బాస్ షోలోకి కమెడియన్స్ వస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాలో పొట్టి నరేశ్ అలియాస్ కమెడియన్ నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత పదేళ్లుగా పలు షోలతో అలరిస్తున్న ఇతడు.. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బిగ్‌బాస్ 10లోకి 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్‌కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్‌లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. -
బిగ్‌బాస్ 10లోకి 'టెంపర్' విలన్
ఈసారి బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్‌తోనే అందరినీ భయపెట్టే 'టెంపర్' వంశీ.. 9వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్‌లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు. చూడటానికి రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్‌లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి? -
Bigg Boss 10: అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి..ఎవరీ అమన్?
బిగ్‌బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్‌గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్‌లోకి వెళ్లాడు. అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పోలిస్తే అమన్‌కు అంతగా పరిచయం లేకపోవడంతో.. అసలు ఎవరీ అమన్? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆకట్టుకున్న అమన్.. ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.అమన్ మసూద్ మోడల్, డిజిటల్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కంటెంట్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూ వచ్చారు. నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పాటు డిజిటల్ కంటెంట్ రంగంలోనూ యాక్టివ్‌గా ఉన్నారు.అయితే అమన్‌కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’. బిగ్‌బాస్ తెలుగు 10లో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అవకాశం దక్కించుకునేందుకు నిర్వహించిన ఈ సెలెక్షన్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకోని..ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అమన్ ఆకట్టుకుంటాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. -
బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా?
అంగరంగ వైభవంగా 'బిగ్‌బాస్' 10వ సీజన్ మొదలైంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే కమెడియన్ ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తనదైన డ్యాన్స్‌తో అలరించాడు. గతంలో ఇతడి స్నేహితులైన ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కమెడియన్ కేటగిరీలో వచ్చారు. ఫుల్ ఎంటర్టైనర్ చేశారు. మరి వాళ్లని రాంప్రసాద్ మర్చిపోయేలా చేస్తాడా లేదా అనేది చూడాలి?రాంప్రసాద్ విషయానికొస్తే ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్‌కి రైటర్‌గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్‌లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసిపోయాడు. ఇతడి టీమ్‌లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. -
‘బిగ్‌బాస్’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్ బ్యూటీ!
బిగ్‌బాస్ 10వ సీజన్లో 6వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్‌తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.ప్రతి సీజన్లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్‌ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. 10 నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి? -
బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన ఫేమస్ యాంకర్
బిగ్‌బాస్ 10లోకి యాంకర్ కేటగిరీలో సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇతడి విషయానికి వస్తే గతంలో ఓ మీడియా ఛానెల్లో యాంకర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లో ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? -
అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన లేడీ రైతుబిడ్డ
తొలి సీజన్ నుంచి బిగ్‌బాస్ షోలో సామాన్యులు పాల్గొన్నప్పటికీ మహా అయితే ఒకటి రెండు వారాలకు మించి ఉండేవాళ్లు కాదు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్, కల్యాణ పడాల లాంటి వాళ్లు ఏకంగా విజేతలయ్యారో.. కామనర్స్ అనే పదానికి విలువ పెరిగింది. వీళ్లని ఎంపిక చేసేందుకు పెట్టిన అగ్నిపరీక్ష పోటీపైనే ఆడియెన్స్‌కి ఆసక్తి కలిగింది. అలా ఈసారి జరిగిన అగ్నిపరీక్షలో నెగ్గిన సింగర్ ఝాన్సీ ఇప్పుడు సగర్వంగా బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేసింది.తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్‌తో గెలిచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి? -
టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్‌బాస్ 10లోకి వచ్చేశాడు
తెలుగు సినిమాల్లో హీరోగానే కెరీర్ మొదలుపెట్టి మధ్యలో సహాయ పాత్రలు చేసి ప్రస్తుతం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్న అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్ అలియాస్ త్రిగుణ్.. బిగ్‌బాస్ 10లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు.తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్‌బాస్‌లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. -
Bigg Boss 10: తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ బ్యూటీ!
ప్రతిసారి బిగ్‌బాస్‌లోకి సీరియల్ బ్యూటీస్ కచ్చితంగా వస్తారు. అలా ఈసారి ఆ కోటాలో వచ్చిన ముద్దుగుమ్మ దేబ్జానీ మోదక్. బిగ్‌బాస్ 10లోకి ఈమె కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇప్పటికే సీరియల్స్, షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.సీరియల్స్‌తో అలరించిన ఈమె.. బిగ్‌బాస్‌తో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి? సీరియల్ ప్రేక్షకులు, లేడీ అభిమానుల నుంచి ఈమెకు మద్ధతు లభించే అవకాశముంది. టాస్కుల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంటే టాప్ కంటెండర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. -
బిగ్‌బాస్ 10: హాట్ టాపిక్‌గా నాగార్జున రెమ్యునరేషన్
బిగ్‌బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్‌గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్‌బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్‌బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్‌బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. -
బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్‌పై అంచానాలు పెంచేస్తోంది. ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది. బిగ్‌బాస్‌లో హీరో కార్తీక్ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.నాగార్జునకు సైతం షాక్!బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్‌ను చూడలేదని బిగ్‌బాస్‌తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్‌లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.ఒకేసారి మూడు భాషల్లో..మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్‌బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్.. నాగార్జునతో వర్చువల్‌గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్‌లు, గ్రాండ్ లాంచింగ్‌తో బిగ్‌బాస్ సీజన్ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
Bigg Boss 10: హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ జాబితా, వారి నేపథ్యంతో పాటు లాంచ్ ఎపిసోడ్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇదిగో...బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే1) దేబ్జానీ మోదక్2) త్రిగుణ్3) సింగర్ ఝాన్సీ4) సుధీర్‌రెడ్డి5) అమన్6) చైత్ర రాయ్7) రాంప్రసాద్8) షాలిని9) టెంపర్ వంశీ10) సృష్టి11) జబర్దస్త్ నరేశ్12) చరణ్13) కృష్ణుడు14) వర్షిణి15) రోహిత్16 నిహర్ ముకేశ్పదహారో కంటెస్టెంట్‌గా నిహర్ ముకేశ్ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు. 16వ కంటెస్టెంట్‌గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్ రయ్ రారా’ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తూ పదహారో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు నిహర్ ముకేశ్. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా. 10 సంవత్సరాల కిందట యాక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్‌గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్‌బాస్‌లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.ముఖేశ్ విషయానికి వస్తే..రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్‌గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుందిపదిహేనో కంటెస్టెంట్‌గా రోహిత్పదిహేనో కంటెస్టెంట్‌గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్‌ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్‌కి టాస్క్ ఇచ్చారు. గ్లాస్ తీసుకెళ్లి హౌస్‌లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్ చెప్పాడు. అనంతరం వైట్ గోల్డ్ మెడల్ తీసుకుని హౌస్‌లోకి వెళ్లాడు. పద్నాలుగో కంటెస్టెంట్‌గా వర్షిణివిశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్‌బాస్‌లోకి అడుగెపెట్టింది యాంకర్ వర్షిణి. ‘ఇదొక మంచి ఫ్లాట్‌ఫాం. నేను ఇక్కడ ఫిట్ అవుతానని అనుకోలేదు.రోజు నిద్రపోయే ముందు నాకు నేను ప్రశ్నించుకున్నా. తర్వాత కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.వర్షిణి విషయానికి వస్తే..వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్‌తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?పదమూడో కంటెస్టెంట్‌గా కృష్ణుడుతెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్‌బాస్' హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్ అన్నీ హౌస్‌లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. కృష్ణుడు విషయానికి వస్తే.. అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్‌గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్‌లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?పన్నెండో కంటెస్టెంట్‌గా చరణ్ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్‌బాస్ హౌస్‌కి ఎంపికయ్యాడు చరణ్. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్ నాగార్జునతో తెలిపారు. నాగార్జున లైవ్‌లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు. వైట్ గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం చరణ్ హౌస్‌లోకి వెళ్లాడు. ఎవరీ చరణ్..ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్‌లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్‌కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.పదకొండో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ నరేశ్పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్‌కి డ్యాన్స్ వేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లోకి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్‌లో నరేశ్ అని వెతికితే బిగ్‌బాస్ నరేశ్ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. నరేశ్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్‌కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్‌లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.పదో కంటెస్టెట్‌గా సృష్టిమరో కంటెస్టెట్ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు. సృష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్ గోల్డ్ మెడల్ అందించారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీటెంపర్ సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు. సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్ చేశారు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్‌లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.చూడటానికి రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్‌లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీఎనిమిదో కంటెస్టెంట్‌గా కామనర్స్ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్ .. దీపక్, హేమంత్, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి చివరగా షాలినీని సెలెక్ట్ చేసినట్లు నవదీప్ ప్రకటించాడు. నవదీప్ సార్ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.ఏడో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ రాంప్రసాద్రాంప్రసాద్కు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్ మూమెంట్ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్‌కి రైటర్‌గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్‌లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసిపోయాడు. ఇతడి టీమ్‌లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఆరో కంటెస్టెంట్‌గా చైత్ర రాయ్ అష్టాచెమ్మా సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్ కామెంట్ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చినట్లు తెలిపారు. చైత్ర విషయానికొస్తే.. సీరియల్స్‌తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్‌లో తమిళ యాక్టర్స్ సూర్య, కార్తీ సందడి చేశారు. సర్దార్2 మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్లు బిగ్‌బాస్ షోకి వచ్చారు. ఐదో కంటెస్టెంట్‌గా అమన్బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్‌గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్‌లోకి వెళ్లాడు. సీక్రెట్ టాస్క్హోస్ట్ నాగార్జున అమన్‌కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక రెడ్ బాక్స్ ఇచ్చి.. అందులో రెడ్ డాట్ ఉందని, హౌస్‌లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్‌కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అమన్ కోసం ఒక స్వీట్ మెమోరీ అంటూ చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్ మెడల్ అందిచారు. నాలుగో కంటెస్టెంట్‌గా సుధీర్ రెడ్డినాలుగో నాలుగో కంటెస్టెంట్‌గా సుదీర్ వచ్చారు. సోషల్‌మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్ మ్యాన్‌గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్‌లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లో ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? మూడో కంటెస్టెంట్‌గా సింగర్ ఝాన్సీ గోల్డేన్ టికెట్ సాధించి సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్‌గా వచ్చారు. ‘మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా. అందరికీ తెలిసేలా నన్ను నేను నిరూపించుకునేందుకు ‘బిగ్‌బాస్’కువచ్చా. అనుకోకుండా గోల్డెన్ టికెట్ సొంతం చేసుకున్నా.‘ అని తెలిపిందిఝాన్సీ కోసం కొన్ని విషయాలు..తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్‌తో గెలిచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?రెండో కంటెస్టెంట్స్‌గా యాక్టర్ త్రిగున్ రెండో కంటెస్టెంట్స్‌గా యాక్టర్ త్రిగూన్ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్‌కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్‌లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్ ఇచ్చారు. త్రిగున్ నేపథ్యం ఇదే.. తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్‌బాస్‌లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.మొదటి కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్‌గా దేబ్జానీ మోదక్ వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. నా గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్ను. నేను ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా. ఎక్కడ వర్క్ చేసినా, రాత్రయితే ఇంటికి వచ్చేయాల్సిందే’ అని అన్నారు. దేబ్జానీకి నాగార్జున టాస్క్ ఇచ్చారు. హౌస్‌లోకి వచ్చే వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్లకు పేర్లు పెట్టాలని కొన్ని బ్యాడ్జ్‌లను అందించారు.ఎవరీ దేబ్జానీ మోదక్ కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.ఓ మ్యాజిక్ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్‌బాస్ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ సీజన్ 10’ ఎట్టకేలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్‌తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్ 6) బిగ్‌బాస్ 10 ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ 10 ప్రోమో వచ్చేసిందిబిగ్బాస్ సీజన్ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్ గ్రాండ్‌గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్‌బాస్ హోస్టులు(విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్) నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు సీజన్ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్‌తో సరికొత్త సర్ప్రైజ్లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్ 10పై భారీ చర్చ జరుగుతోంది.తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడిబిగ్గాస్ 10 లాంచింగ్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. ఈ సారి అనేక సర్ప్రైజ్లతో లాంచింగ్ ఎపిసోడ్‌ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్‌బాస్ హోస్టులంతా తెలుగు బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.గెస్టులుగా కార్తీ, ఆనంద్ దేవరకొండబిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కి తమిళ హీరో విజయ్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ దేవరకొండ స్టేజ్‌పైకి రాబోతున్నారు. ఇక సర్దార్ 2 మూవీ ప్రమోషన్స్ కోసం కార్తీ కూడా బిగ్‌బాస్ షోకి వచ్చారట.బిగ్‌బాస్ 10లోకి 16 మందిఈ సారి హౌస్‌లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.హౌస్‌లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్‌బాస్ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్ ఇదే. 1) ఆటో రాంప్రసాద్2) టెంపర్ వంశీ3) దేబ్జానీ మోదక్4)యాంకర్ వర్షిణి5) ముఖేష్ గౌడ6)చైత్రా రాయ్7) నటుడు కృష్ణుడు8) జబర్దస్త్ నరేశ్9) టెంపర్ వంశీ10)యాంకర్ సుధీర్ రెడ్డిఅగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 1) ఝాన్సీ2) రోహిత్ నాయుడు3)శ్రష్టి4) చరణ్5)అమన్ మసూద్6)షాలిని పటేల్ -
ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)
-
అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)
-
బిగ్ బాస్ 10 ఎంట్రీ పై ఆటో రాంప్రసాద్ క్లారిటీ!
బిగ్‌బాస్ సీజన్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. పలువురి సెలెబ్రెటీల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సారి ఆయన హౌస్‌లో సందడి చేయబోతున్నాడు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీపై రాంప్రసాద్ డైరెక్ట్‌గా స్పందించలేదు కానీ.. పరోక్షంగా ఎప్పుడో హింట్ ఇచ్చాడు. కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. తాజాగా తన ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాంప్రసాద్. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. తనకు సపోర్ట్ చేయాలని కోరాడు.(చదవండి: బిగ్‌బాస్ 10: ఈ సారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే?)కొత్త చాప్టర్ ప్రారంభం.. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. అనంతరం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ టీట్ చేశాడు. దీంతో ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనే వార్త నిజమని తేలిపోయింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం హౌస్‌లోకి వెళ్లేవరకు అధికారికంగా చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్ ఇలా పరోక్షంగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి రాంప్రసాద్‌తో పాటు మరో జబర్దస్త్ కమెడియన్ నరేశ్ కూడా హౌస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, యూట్యూబర్ నందు, నటుడు టెంపర్ వంశీ, వినాయుకు మూవీ హీరో కృష్ణుడు, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. #Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU ❤️🙏Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026 -
బిగ్‌బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్‌లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్‌బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్‌గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో ఝాన్సీ హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్‌ని కూడా హౌస్‌లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్‌బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్‌ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?
-
‘బిగ్‌బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
గొడవలు.. అలకలు.. అరుపులు, ఆటలు ఇవన్నీ ఉండే రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఈ మేరకు ప్రారంభ తేదిని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు 10వ సీజన్ లాంచ్ కానుంది. మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది . ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అంటూ వీడియోను పంచుకున్నారు. వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా.. ఛాలెంజ్ ప్రతీది 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశారు. స్టార్ మా, హాట్ స్టార్‌లో ప్రసారం కానున్న ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. కంటెస్టెంట్స్ వీరేనా..?గత సీజన్ మాదిరే ఈ సారి కూడా కామనర్స్‌కి ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నారట నిర్వాహకులు. వీరి కోసం కామనర్స్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది పోటీ పడగా.. చివరకు 15 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో నుంచి దాదాపు ఆరుగురిని హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది. అంతేకాదు ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ద్వారా కూడా పంపే చాన్స్ ఉందట. ఇక సెలెబెట్రీలలో ఎక్కువగా సీరియల్ యాక్టర్స్ ఉండబోతున్నారు. అలాగే బుల్లితెర కమెడియన్స్‌ని కూడా ఈ సారి ఎక్కువగానే హౌస్‌లోకి పంపిస్తున్నారట. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేశ్, నూకరాజుతో పాటు ఎక్స్‌ప్రెస్ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
మాట జాగ్రత్త.. నా గురించి తెలుసు కదా?.. బిందు మాధవికి నటరాజ్ వార్నింగ్
బిగ్‌బాస్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో బిందు మాధవితో ఆయనకు జరిగిన గొడవ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఓ నామినేషన్ టాస్క్‌లో బిందు మాధవిని ‘శూర్పణఖ’ అంటూ నటరాజ్ మాస్టర్ బాణాలు విసరడం.. అందుకు ఆమె కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం అప్పట్లో హైలైట్‌గా నిలిచింది. తాజాగా అదే అంశం మరోసారి తెరపైకి రావడంతో నటరాజ్ మాస్టర్ తీవ్రంగా స్పందించారు.ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కామనర్స్‌కు అవకాశం కల్పిస్తూ భారీ స్థాయిలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా టాప్ 15 ఫైనలిస్టులను ఎంపిక చేసి.. వారిలో కొందరిని బిగ్‌బాస్ సీజన్ 10లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపిక బాధ్యతలను బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1 విజేత బిందు మాధవి, బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనలిస్ట్ నవదీప్‌లకు అప్పగించారు.ఇదిలా ఉంటే.. అగ్నిపరీక్షకు వచ్చిన ఓ ఆర్జేకు జడ్జీలను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు. తాను బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మాత్రమే కాకుండా.. షో తర్వాత బజ్ ఇంటర్వ్యూలు చేసే స్థాయికి ఎదగాలని ఉందని అతను చెప్పడంతో అతడితో బజ్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు.‘‘శూర్పణఖ.. ఇదిగో నా బాణం’ అంటూ అప్పట్లో నటరాజ్ మాస్టర్ బిందు మాధవిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో మీకు ఎలా అనిపించిందని ఆర్జే ప్రశ్నించాడు. దీనికి బిందు మాధవి స్పందిస్తూ.. తాను చాలా ఇరిటేట్ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్ చెప్పాలని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. బిందు మాధవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లు అంటే ఏంటి? మాట జాగ్రత్త’ అంటూ బిందు మాధవిని ప్రశ్నించారు.‘ఏమన్నావ్.. అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లంటే ఏంటి? మాట జాగ్రత్త.. అలాంటోళ్లేంటి? అసలు ఏమనుకుంటున్నావ్.. ఒక ఫ్లాట్ ఫామ్‌పై కూర్చుని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తరువాత నేను కూడా చాలా ఇంటర్వ్యూలలోమాట్లాడాను. అంతా అయిపోయింది. గేమ్ ఈజ్ గేమ్ అనుకుని అంతా మార్చిపోయి.. నా పాప బర్త్ డేకి కూడా నిన్ను పిలిచాను. కానీ ఇప్పుడు వాళ్లు ఏదో ఉత్సాహంతో అడిగారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి.. అవన్నీ తట్టుకున్నాను కాబట్టే గెలిచాను అని అనాలి. నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేయించుకో.. హడావిడి చేసుకో. నీ అలాంటోళ్లు అని అంటున్నావ్ ఏంటి? అక్కడ అన్నది నేనే కదా? వాళ్లు వీళ్లైతే ఏమీ అనకుండా ఉంటారేమో. కానీ అక్కడన్నది నేను కదా. నన్ను ఆ ప్లాట్‌ఫామ్‌పై ‘అలాంటోళ్లు’ అని అన్నావ్ కదా.. ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు. నేను ఒక్కటే చెప్తున్నా.. అగ్నిపరీక్షకి వచ్చిన వాళ్లకి అవన్నీ అవసరం. అందుకే వాళ్లు భరిస్తున్నారు. మీరు ఎన్ని అన్నా పడుతున్నారు. కానీ నాకు అవసరం లేదు. నువ్వు అలాంటి వాళ్లు అంటూ నా గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పుకో. పొడిచేశాను అని చెప్పుకో. కానీ అలాంటోళ్లు ఇలాంటోళ్లు అని మాత్రం అనకు. మాట జాగ్రత్త. నేను అందరిలా కాదు ఊరుకోవడానికి. తెలుసు కదా మన గురించి’ అంటూ వీడియో ద్వారా బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Natraj Kasturinatraj (@natraj_master)


