నవ్విస్తూనే క్లాస్‌ పీకిన నాగ్‌.. వర్షిణికి దిమ్మతిరిగే కౌంటర్‌! | Bigg Boss Telugu 10 Day 48 Promo | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu Promo: నరేశ్‌ ఆట తీరుపై ప్రశంసలు..

Oct 24 2026 5:10 PM | Updated on Oct 24 2026 5:15 PM

Bigg Boss Telugu 10 Day 48 Promo

బిగ్‌బాస్‌ తెలుగు 10లో 48వ రోజు ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగనుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఆటతీరుపై స్పందించారు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ఆయన ఈసారి సరదాగా ఎంట్రీ ఇచ్చి టీమ్‌ సభ్యులకు షాక్‌ ఇచ్చారు. మొదట కొందరి ఆటతీరును ప్రశంసించిన నాగ్‌.. ఆ తర్వాత మరికొందరిపై అసహనం వ్యక్తం చేశారు.

గుండెలు పగిలేలా నవ్వుతున్నారని
నరేశ్‌ ఆటను చూసి ప్రేక్షకులు గుండెలు పగిలేలా నవ్వుతున్నారని నాగార్జున ప్రశంసించారు. అనంతరం దేబ్జానీ ఆటతీరును కూడా మెచ్చుకున్నారు. దీంతో మొదట సరదాగా సాగిన ఈ ప్రోమో.. ఆ తర్వాత కంటెస్టెంట్లకు నాగార్జున క్లాస్‌ తీసుకోవడంతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముఖేశ్‌ మాట్లాడే విధానంపై నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత వర్షిణి ఆటతీరుపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. ఆటలో ఎవరినైనా ఛాలెంజ్‌ చేయొచ్చని, అయితే ఆడేటప్పుడు మనలోని కసి కనిపించాలని సూచించారు.

నీతూను ఉద్దేశించి 
నీతూను ఉద్దేశించి వర్షిణి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నాగార్జున గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘నీతూ.. నువ్వేం పీకుతావ్‌ అని అన్నావ్‌ కదా.. గేమ్‌ ఆడి ఏం పీకిందో చూపించింది కదా’ అంటూ ప్రశ్నించారు. దీంతో వర్షిణి ఆటతీరుపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. ఇదే సమయంలో వర్షిణి తిరిగి రావడం రాంప్రసాద్‌కు ఇష్టమేనా అని నాగార్జున ప్రశ్నించారు. దీనికి ఆయన లేదని సమాధానం చెప్పడంతో అక్కడ ఏం జరిగిందన్న ఆసక్తి నెలకొంది. కాగా  వర్షిణి, నీతూ మధ్య వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

 ఇదీ చదవండి: స్టార్‌ హీరోలకు ధీటుగా లేడీ సూపర్‌స్టార్‌ క్రేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement