ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన షాలినిని సర్‌ప్రైజ్ చేసిన హోస్ట్ నాగార్జున.. ఆమెని సీక్రెట్ రూంలో పెట్టాడు. ఆమె అలా ఉండగా మరోవైపు సోమవారం రావడంతో యధావిధిగా నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. నీతూ vs వర్షిణి, శివ్ vs రోహిత్ రచ్చ ప్రోమోల్లో ప్రధానంగా కనిపించింది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
ప్రోమోల బట్టి చూస్తే ఏడో వారం నామినేషన్లలో ఝాన్సీ, రామకృష్ణ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. శాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఆర్కేని ఝాన్సీ నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదు, కాళ్ల పట్టుకోవడంలో తప్పు లేదని ఆర్కే వాదించాడు. ఝాన్సీ కూడా సింపతీ కోసం ట్రై చేస్తుందని ఆమెలా నటించి మరీ చూపించాడు. మరోవైపు వర్షిణి టాస్క్‌లు ఆడటం లేదంటూ నీతు ఫైర్ అయింది. ముఖేశ్‌ని అడ్డుపెట్టుకొని హౌస్‌లో ఉంటోందని వర్షిణిపై నీతు సంచలన కామెంట్స్ చేసింది.
మరో ప్రోమోలో రోహిత్-సుధీర్ మధ్య వాదులాట నడిచింది. అలానే శివ్-రోహిత్ మధ్య పెద్ద గొడవే జరిగింది. మరోవైపు సీక్రెట్ రూంలోకి వెళ్లిన శాలిని.. అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని.. తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశముంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏడో వారానికిగానూ నీతు, దక్షి, రామకృష్ణ, వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'జైలర్ 2' కారణంగా రచ్చ.. చిరంజీవా? రజనీకాంతా?)


