'జైలర్ 2' కారణంగా రచ్చ.. చిరంజీవా? రజనీకాంతా? | After Jailer 2 Release Rajinikanth Vs Chiranjeevi Trolls Latest | Sakshi
Sakshi News home page

Rajinikanth vs Chiranjeevi: సోషల్ మీడియాలో రచ్చ.. చిరు vs రజనీ

Oct 19 2026 2:38 PM | Updated on Oct 19 2026 2:58 PM

After Jailer 2 Release Rajinikanth Vs Chiranjeevi Trolls Latest

'జైలర్ 2' రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రజనీకాంత్ మేనియాతో నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఎక్కడచూసినా రజనీకాంత్ ఎలివేషన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ రజనీని పొగుడుతున్న కొందరు నెటిజన్లు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి తెలుగు సీనియర్ హీరోలని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'ప్రేమలు 2'.. మాకు ఏడాది వేస్ట్ అయిపోయింది.)

'జైలర్ 2'లో రజనీకాంత్‌కి అదిరిపోయే ఎలివేషన్లు పడినమాట వాస్తవమే. అంతమాత్రాన రజనీ మాత్రమే తోపు అని అనలేం. ఎందుకంటే చిరంజీవి కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. కాకపోతే ఇప్పుడు ఆయన తగ్గ మూవీస్ పడట్లేదంతే.

అయితే 'జైలర్ 2'లోని కొన్ని సీన్స్‌లో కనిపించిన స్వాగ్, స్టైల్ రజనీకి మాత్రమే సాధ్యం, చిరంజీవి వల్ల కాదు అనే ట్రోల్స్ కనిపిస్తున్నాయి. వీటిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇందులో రజనీది ఏముంది? జస్ట్ నడుచుకుంటూ వచ్చాడు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నెల్సన్ డైరెక్షనే దీనికి కారణం కదా అని మెగా ఫ్యాన్స్ లాజిక్స్ లాగుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

సోషల్ మీడియా ట్రోల్స్ కాసేపు పక్కనబెడితే ఎవరు గొప్ప అనే చర్చ అసలు అనవసరం. ఎందుకంటే రజనీకాంత్ స్థాయి వేరు చిరంజీవి స్థాయి వేరు. ఎవరి ఇండస్ట్రీలో వాళ్లు మిగతా హీరోలు అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. రజనీకాంత్ గురించే చెప్పుకొంటే కొన్ని దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తున్నారు. 'బాషా' సినిమా దగ్గర ఇప్పుడొచ్చిన 'జైలర్ 2' వరకు చాలా మటుకు డబ్బింగ్ కావడంతో తెలుగులోనూ అతడి స్టైల్, మేనరిజం నచ్చి కోట్లాదిమంది అభిమానిస్తున్నారు.

రజనీకాంత్ తోపు యాక్టర్ అయ్యిండొచ్చు గానీ రీసెంట్ టైంలో 'జైలర్' రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. 2018లో వచ్చిన రోబో 2.0 తర్వాత పెట్ట, దర్బార్, అన్నాత్తే లాంటి సినిమాలు మన దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. 2023లో 'జైలర్'తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. మళ్లీ లాల్ సలామ్, వేట్టయాన్, కూలీ చిత్రాలతో డౌన్ అయ్యారు. ఇప్పుడు 'జైలర్ 2'తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ మూవీ హిట్ ఊపులో ఉన్న రజనీ ఫ్యాన్స్.. చిరంజీవిని ట్రోల్ చేస్తూ తమ అభిమాన హీరోల పరువు తీస్తున్నారు. ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఏ హీరో ఎక్కువ కాదు ఏ హీరో తక్కువ కాదు. ఎవరికి వాళ్లు ఆయా ఇండస్ట్రీలో టాప్ స్టార్సే!

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్'లో హిట్ పాట వీడియో రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement