'ప్రేమలు 2'.. మాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ | Director Girish AD Reacts Premalu 2 Shelved Reasons | Sakshi
Sakshi News home page

Premalu 2 Girish AD: 'ప్రేమలు 2' వల్ల ఏడాది సమయం వృథా

Oct 19 2026 12:15 PM | Updated on Oct 19 2026 1:02 PM

Director Girish AD Reacts Premalu 2 Shelved Reasons

రెండేళ్ల క్రితం వచ్చిన 'ప్రేమలు' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే మమిత బైజు వెలుగులోకి వచ్చింది. తెలుగోళ్లకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీ తీసిన దర్శకుడు గిరీష్ ఏడీ.. దీనికి సీక్వెల్ తీయాలనుకున్నాడు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి ఆపేశారు. ఇప్పుడా విషయంపై స్వయంగా డైరెక్టర్ స్పందించాడు. తన అసంతృప్తిని స్టేజీపై వ్యక్తం చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

ఇదే దర్శకుడు, మమిత బైజుతో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి, రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్‌గా నిలిచి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కొచ్చిలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు గిరీష్.. 'ప్రేమలు 2' గురించి మాట్లాడాడు.

“ఈ సినిమా(బెత్లెహెమ్ కుడుంబ యూనిట్) మొదలుపెట్టడానికి ముందు ఏడాది పాటు ‘ప్రేమలు 2’ కోసం పనిచేశాను. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. అది మాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ. దీనివల్ల మా విలువైన ఏడాది టైం వేస్ట్ అయింది. అంత సమయం కోల్పోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాతే ‘బెత్లెహెం’ ఆలోచన వచ్చింది. ‘ప్రేమలు’ హిట్ అవ్వకముందే ఈ మూవీ తీయాలనుకున్నాను. ‘ప్రేమలు’ సూపర్ హిట్ అయ్యేసరికి దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది'

'అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ప్రేమలు 2’ గతేడాది విషు పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యేది. కానీ ‘బెత్లెహెం’ సినిమా దాని తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగాం. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు' అని గిరీష్ ఏడీ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. వెక్కివెక్కి ఏడ్చేసిన రోహిత్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement