లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ ఎవరంటే చాలామంది చెప్పే పేరు మమిత. ఎందుకంట ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. వాటన్నింటితో కలిసి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ మాటేమో గానీ మలయాళంలో చేసిన 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' చిత్రం మమితకు మంచి పేరు తీసుకొచ్చింది.
(ఇదీ చదవండి: రజనీకాంత్‌కే ఇలాంటి పరిస్థితా?)
తెలుగులోనూ థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న ఈ సినిమా.. హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత మందికి చేరువయింది. సింపుల్ కథనే అందంగా తీసిన ఈ సినిమా మేకింగ్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర గంటల మూవీని 7 నిమిషాల వీడియోలో అంతా చూపించేశారు. తెర వెనక షూటింగ్‌లో భాగంగా ఎంత హంగామా నడిచిందో వీడియోగా వదిలారు. ఇదిప్పుడు నెటిజన్లని అలరిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


