సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'జైలర్ 2'. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన భారీ చిత్రమిది. మలయాళ నటుడు మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, హిందీ నటుడు మిథున్ చక్రవర్తి, హృతిక్ రోషన్, విద్యాబాలన్, రమ్యకృష్ణ , యోగిబాబు తదితరులు ఇందులో కీలకపాత్రలు చేశారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
అయితే మూవీకి మంచి టాక్ వచ్చినా, చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. ఇది సహజం. అలానే ఆరోపణలు రావడం గమనార్హం. ఈ ఆరోపణ మోహన్ లాల్ కాస్ట్యూమ్స్ డిజైనర్ నుంచి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోహన్ లాల్ డిజైనర్ జిషాద్ శామ్ సుదీర్ తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ.. జైలర్ 2లో మోహన్ లాల్ నటించిన పలు సన్నివేశాలను కట్ చేశారు. ఆయన రెండు డిఫరెంట్ లుక్స్ పూర్తిగా బుట్టదాఖలయ్యాయి. మన సూపర్ స్టార్ (మోహన్ లాల్)కే ఈ పరిస్థితి అయితే ఇకపై సీక్వెల్స్‌లో పనిచేయను అని ఆయన ఆరోపణలు చేశారు. ఈ పోస్ట్‌కు ఇప్పుడు మోహన్ లాల్ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఆ ప్రశాంతతని మాటల్లో వివరించలేను.. రష్మిక ఎమోషనల్ పోస్ట్)


