మమితా బైజు.. ఇప్పుడు సౌత్‌ఇండియాలో ఈ పేరు ఒక సంచలనం. ప్రేమలు మూవీతో మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహోమ్ కుటుంబం యూనిట్‌తో భారీ విజయాలను అందుకుంది. ఈ ఏడాదిలో అత్యధిక హిట్లు అందుకున్న దక్షిణాది బూటీ మమితనే. తాజాగా ఈ బ్యూటీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఇండస్ట్రీ మొత్తం మార్మోగుతున్న మమిత అనే పేరు..తనది కాదని..ఓ పొరపాటు వల్ల అసలు పేరు మారిపోయి ఈ పేరు స్థిరపడిందని వెల్లడించింది.
(చదవండి: సారా అలీఖాన్‌ని అన్‌ఫాలో చేసిన ఓరీ..కారణం ఇదేనట!)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మమిత మాట్లాడుతూ... ‘నేను పుట్టినప్పుడు అమ్మనాన్నలు పెట్టిన పేరు నమిత. కానీ బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ‘నమిత’ కాస్తా ‘మమిత’గా రాశారు. ఈ విషయాన్ని మా వాళ్లు నాలుగైదేళ్ల వరకు గమనించలేదు. చివరికి నన్ను స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు సర్టిఫికెట్‌లో పేరు చూసి షాక్ అయ్యారు. కాకపోతే అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోవడంతో చేసేదేమీ లేక వాళ్లకి ఇష్టం లేకున్నా ఆ పేరునే కొనసాగించారు. అలా నా పేరు నమిత నుంచి మమితగా మారిపోయింది’ అని మమిత చెప్పుకొచ్చింది. నమిత కొత్త సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుత ఆమె తమిళంలో ‘ఇరందు వానమ్’తో పాటు మలయాళంలో ‘హలో డియర్’ చిత్రంలో నటిస్తోంది.


