సమ్మర్‌ హాలిడేస్‌ చిరునవ్వు తెప్పిస్తుంది: శ్రీకర్‌ నయన్‌ | Director Srikar Nayan Talk About Summer Holidays Movie | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ హాలిడేస్‌ చిరునవ్వు తెప్పిస్తుంది: శ్రీకర్‌ నయన్‌

Nov 3 2026 12:27 PM | Updated on Nov 3 2026 1:07 PM

Director Srikar Nayan Talk About Summer Holidays Movie

‘‘ఈ మధ్య కాలంలో వరుసగా రక్తపాతం, యాక్షన్, వయొలెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు చూసి ప్రేక్షకులు విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో మా ‘సమ్మర్‌ హాలిడేస్‌’  వంటి ఫీల్‌ గుడ్‌ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మంచి భావోద్వేగాలతో సాగే మా చిత్రం ప్రేక్షకుల మొహంలో చక్కని చిరునవ్వు తెప్పిస్తుంది’’అని డైరెక్టర్‌ శ్రీకర్‌ నయన్‌ తెలిపారు. మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో, వాసుకి, రాజీవ్‌ కనకాల, హర్షిణి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘సమ్మర్‌ హాలిడేస్‌’. శ్రీకర్‌ నయన్‌ దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదల కానుంది. 

(చదవండి: డిస్కో శాంతి రీఎంట్రీ.. ఈ సినిమా చేయడానికి కారణమదే)

ఈ సందర్భంగా డైరెక్టర్‌ శ్రీకర్‌ నయన్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది విశాఖపట్నం. కాలేజ్‌ డేస్‌లోనే షార్ట్‌ ఫిలింస్‌ తీశాను. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చి ‘తెల్లవారితే గురువారం’తో పాటు మరికొన్ని చిత్రాలకు  దర్శకత్వశాఖలో పనిచేశాను. ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డిగారి ద్వారా ధీరజ్‌గారిని కలిసి, తొలుత ఒక థ్రిల్లర్‌ కథ చె΄్పాను. ఆ తర్వాత చెప్పిన ‘సమ్మర్‌ హాలిడేస్‌’ కథ నచ్చడంతో నాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. 

రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్న ఇద్దరు పిల్లలు వేసవిలో స్నేహితులు అయితే ఎలా ఉంటుంది? అనే ΄ాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. అరుణ్‌ అమ్మమ్మ ΄ాత్రలో జయసుధగారు నటించారు. అరుణ్, జయసుధగారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ మూవీలో వందమంది పిల్లలు నటించారు. మాది పిల్లల సినిమా కాదు.. పిల్లలు నటించిన పెద్దల సినిమా. అరుణ్, రోహన్‌ గోదావరి యాస నేర్చుకుని నటించారు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement