మళ్లీ పెళ్లికి రెడీ ‍అయిన లేడీ సింగర్ | Singer Rimi Tomy Second Marriage And Fiance Name | Sakshi
Sakshi News home page

Rimi Tomy: జిమ్ ట్రైనర్‌తో సింగర్ రెండో పెళ్లి.. పోస్ట్ వైరల్

Nov 3 2026 12:35 PM | Updated on Nov 3 2026 1:11 PM

Singer Rimi Tomy Second Marriage And Fiance Name

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు అనే మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మహిళా గాయని మరో వివాహానికి సిద్ధమైంది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అధికారికంగానే తన ప్రణయం గురించి ప్రకటించింది.

(ఇదీ చదవండి: బాలకృష్ణతో సినిమా.. రొమాంటిక్ సీన్లపై హీరోయిన్ విమర్శలు)

మలయాళంలో సింగర్, వ్యాఖ్యతగా గుర్తింపు తెచ్చుకున్న రిమి టోమీ.. 1997 నుంచి కెరీర్ ప్రారంభించింది. టీవీ షోలతో మొదలుపెట్టి, 2002 నుంచి సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె గతంలో వ్యాపారవేత్త రాయిస్ కిళక్కూడన్‌ని 2008లో పెళ్లాడింది. దాదాపు 11 ఏళ్లుగా కలిసే ఉన్న వీళ్లిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. తొలి బంధం ముగిసిన ఆరేడేళ్లకు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది.

ముంబైకి చెందిన జిమ్ ట్రైనర్ లిబి మ్యాథ్యూస్‌తో గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న రిమీ.. తాజాగా ఈ నెలలోనే తన పెళ్లి జరగనుందని వెల్లడించింది. కాకపోతే తేదీ ఎప్పడనేది చెప్పలేదు. స్వతహాగా సింగర్ అయినప్పటికీ 2013లో వచ్చిన '5 సుందరికళ్', 2015లో రిలీజైన 'థింకల్ ముత్తల్ వెల్లి వేరే' సినిమాల్లో రిమి టోమీ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement