పెళ్లికి రమ్మని పిలిస్తే : భారీ సర్‌ప్రైజ్‌, నెటిజన్లు క్యూ! | Chinese man invites internet strangers to his wedding check deets inside | Sakshi
Sakshi News home page

పెళ్లికి రమ్మని పిలిస్తే : భారీ సర్‌ప్రైజ్‌, నెటిజన్లు క్యూ!

Nov 2 2026 12:36 PM | Updated on Nov 2 2026 1:16 PM

Chinese man invites internet strangers to his wedding check deets inside

‘దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు’ తనకు ఎవరూ లేరు, దిక్కులేని వాడిని బాధపడేవారిని  ఓదార్చేందుకు పెద్దలు  చెప్పే మాట ఇది. చైనాకు చెందిన 24 ఏళ్ల అనాథ యువకుడు షియావో షియావో షు (Xiao Xiao Xu) కథ నెట్టింట పలువురి హృదయాలను హత్తుకుంది. తన పెళ్లికి ఏ బంధువులూ రారేమోనన్న భయంతో, అతడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను తన పెళ్లికి  ఆహ్వానించాడు.   వచ్చిన మంచి మనసున్న అతిథులను చూసి షాకయ్యాడు. అంతేనా అతనికి భారీ సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు. ఏం జరిగింది అంటే..

యున్నాన్ ప్రావిన్స్‌లోని జావోటాంగ్ ప్రాంతానికి చెందిన షియావో షు మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి వేరే వివాహం చేసుకోవడంతో అతడు, అతని అన్నయ్య కలిసి పెరిగారు. పెళ్లి కోసం డబ్బులు దాచుకున్నప్పటికీ, శుభకార్యానికి బంధువులెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆహ్వానం పంపాడు.

ఇదీ చదవండి: రూ. 114 కూలీ : ఇపుడు రూ.1.80 లక్షల కోట్ల కంపెనీ
 

అంతే నెటిజన్లు నుంచి అనూహ్య స్పందన లభించింది. ఉచితంగా విందు భోజనాలు వండటానికి  కొంతమంది షెఫ్‌లు వచ్చారు, పెళ్లి  బారాత్‌కు భారీ కార్లతో  కాన్వాయ్ ఏర్పాటైంది. ఇంటి డెకరేషన్‌ నుంచి  వంటకాలకు కావలసిన దినుసులు దాకా, స్వీట్లు,పళ్లు, పూలు, ఒకటీ రెండూ కాదు సర్వహంగులతో ఊరంతా, అపరిచితులంతా కలిసి సహాయం చేశారు.

నెటిజనుల గొప్ప మనసు, వైభవంగా పెళ్లి, 
ఆ యువకుని చిన్న ఆహ్వానంతో ఆ గ్రామంలో ఇది ఒక పెద్ద పండగలా మారిపోయింది.  కనీవినీ ఎరుగని రీతిలో వారి పెళ్లి 'శతాబ్దపు వివాహం'గా మారింది. మొత్తం వివాహ వేడుకను కలిసికట్టుగా అంగరంగ వైభవంగా జరిపించారు. ఓ అతిథి అయితే ఏకంగా బెంజ్ కారు గిఫ్ట్‌ ఇచ్చి మరింత సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. దీనికి సంబంధించిన  వీడియో వైరల్‌గా మారింది. కొత్త దంపతులకు జీవితంలో  ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభుతులను మిగిల్చారు. 

నెటిజన్ల స్పందన
"మానవత్వం అంటే ఇది," "సోషల్ మీడియాను ఇలాంటి మంచి పనులకే ఉపయోగించాలి" అంటూ నెటిజన్లు ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement