Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ చిక్కుల్లో పడ్డాడు. బుధవారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడి నగ్న చిత్రాలు ప్రత్యక్షమవ్వడం వివాదానికి దారి తీసింది. బాత్‌రూంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అద్దం ముందు నిలబడి ప్రైవేట్ పార్ట్స్ కనిపించడకుండా టవల్ అడ్డుపెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియా యాప్ స్పాప్‌చాట్‌లో వెలుగు చూశాయి.
తన న్యూడ్ ఫొటోలను స్పాప్‌చాట్‌లో షేర్ చేయడంతో పాటు, కొంతమంది అమ్మాయిలను నగ్న చిత్రాలను కూడా పంపాలని అడిగినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అతడి చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తాజాగా వైరల్‌గా మారాయి.
ఏఐతో మార్ఫింగ్ చేశారా?
అయితే ఆ ఫొటోలు నిజంగా గుర్నూర్ బ్రార్‌వేనా లేక ఏఐ సాయంతో మార్ఫింగ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఎవరైనా ఆకతాయిలు కావాలని చేశారా లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ, దీనివల్ల క్రికెటర్ గుర్నూర్ బ్రార్ ఇబ్బందుల్లో పడ్డాడు. సోషల్‌మీడియాలో లీకైన తన ఫొటోలపై అటు గుర్నూర్ బ్రార్ కానీ.. ఇటు బీసీసీఐ కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో కచ్చితంగా అవి నకిలీ ఫొటోలే కావొచ్చని కొంతమంది అభిమానులు నిర్థారణకు వస్తున్నారు.

PC: Twitter
అయితే కొంతమంది అభిమానులు మాత్రం గుర్నూర్ బ్రార్‌ను తప్పుబడుతున్నారు. కెరీర్ ఆరంభ దశలో ఉన్న ఒక క్రికెటర్ ఇలాంటి గలీజు పనులు చేయడమేంటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం చేసుకొని గుర్నూర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గుర్నూర్ బ్రార్ మన్మీత్ కౌర్ అనే యువతితో ప్రేయాయణం నడుపుతున్నట్లు ప్రచారంలో ఉంది.
ఎవరీ గుర్నూర్ బ్రార్?
గుర్నూర్ బ్రార్ పంజాబ్‌కు చెందిన ఒక ఫాస్ట్ బౌలర్. గుర్నూర్ ఈ ఏడాది జూన్ 13న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అతను దేశీయ క్రికెట్‌లో కూడా బాగా రాణించాడు.
2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో పంజాబ్ తరపున ఆడుతూ, అతను ఏడు మ్యాచ్‌లలో 26 వికెట్లు తీశాడు. అతను 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత గుర్నూర్ బ్రార్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.
🚨 GURNOOR BRAR’S PRIVATE CHATS LEAKED..!!! 🤯 Leaked screenshots allegedly show Gurnoor Brar asking girls for nude pictures while sharing his own explicit photos. Should BCCI step in and investigate this matter? 👀 https://t.co/kinf6qtON9
— Sourabh (@xzx_slipknot) November 1, 2026
Latest Tea On Gurnoor Brar 💀 https://t.co/Lglq8Z7WzM
— CricXGoat (@GoatXCric) November 1, 2026
ఇదీ చదవండి: అతడిని ఆడించి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్


