గంభీర్ (ఫైల్ ఫొటో.. PC: Sonysports)
టీమిండియా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఏడాది మొత్తం భారత పురుషుల క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో ఆటలో తలమునకలై ఉంటుంది. ఒక్కోసారి విరామం లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు మానసికంగా అలసిపోతూ ఉంటారు. గతంలో కొంతమంది ఈ విషయం గురించి బహిరంగంగానే మాట్లాడారు.
మానసిక అలసట సహజం
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. ఒక్కోసారి మానసికంగా నేను అలసిపోతూ ఉంటాను. అయితే, ఒత్తిడిని ఎలా జయించాలో నాకు బాగా తెలుసు. అందుకు నా మనసు, శరీరాన్ని ఎప్పటికప్పుడు మరింత దృఢంగా మార్చుకుంటాను.
నేను కూడా మనిషినే
అలాగే నేను ఇక్కడిదాకా ఎదిగాను. ఎంతటి ఒత్తిడినైనా నేను భరించగలను. అయితే, నేను కూడా మనిషినే కాబట్టి.. ఒక్కోసారి మానసికంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
నా డిక్షనరీలో ఆ పదానికి తావు లేదు
అదే విధంగా.. ‘‘నా డిక్షనరీలో.. నా డైరెక్టరీలో.. నా దృక్పథంలో భయం అన్న మాటకు తావు లేదు. అసలు నా జీవితంలో ఆ మాట లేనేలేదు. మేము ప్రొఫెషనల్స్. కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాల్సిన అవసరం మాకు ఎంతమాత్రం లేదు.
భారీ స్థాయిలో అంచనాల నడుమ
అయితే, విరామం లేని షెడ్యూల్ వల్ల ఒక్కోసారి కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉండటం అంతతేలికైన పనేమీ కాదు. ప్రతి ఒక్కరి దృష్టి మనమీదే ఉంటుంది. ప్రతీ మ్యాచ్ గెలవాలనే అభిమానులు కోరుకుంటారు. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.
ప్రస్తుతానికి నేనైతే నా హెడ్‌కోచ్‌గా నా పనిని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు ఒక్కోసారి అలసిపోతూ ఉంటా. కానీ వెంటనే దాని నుంచి కోలుకుంటా’’ అని గంభీర్ తాను ఎల్లవేళలా పట్టువీడకుండా పనిలో ముందుకు సాగిపోతూ ఉంటానని పేర్కొన్నాడు.
కివీస్ పర్యటనలో బిజీగా టీమిండియా
కాగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. 3-2తో భారత్ గెలిచింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
ఇక గంభీర్ మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఒకే సమయంలో రెండు సిరీస్‌లలో భారత జట్లు తలపడాల్సి వచ్చినప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇవీ చదవండి: ఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియన్స్‌గా అఫ్గానిస్తాన్
అతడి ఖేల్ ఖతం.. భారత వన్డే జట్టులోకి తిరిగి రాలేడు: మాజీ క్రికెటర్
A captain's moment, shared with the next generation! 💙 Shreyas Iyer lifts the trophy after India's 3-2 series win, then hands it over to the youngsters to have their moment in the spotlight. A lovely gesture to cap off a memorable T20I Leg of the New Zealand Tour! 🏆👏 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI on 4th Nov, 7:30 AM onwards, LIVE on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 1, 2026


