అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో శ్రేయస్ సేన ఈ ఫీట్ సాధించింది.
ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 11 సిక్సర్లు బాది ఈ ఘనత నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 40 టీ20 మ్యాచ్‌లలో భారత్ మొత్తం 400 సిక్సర్లు సాధించింది. తర్వాత స్ధానాల్లో ఆస్ట్రియా (24 మ్యాచ్‌ల్లో 224 సిక్సర్లు), వెస్టిండీస్ (21 మ్యాచ్‌ల్లో 224 సిక్సర్లు) ఉన్నాయి.
కాగా ఈ ఏడాది భారత్ సాధించిన 400 సిక్సర్లలో ఒక్క న్యూజిలాండ్‌పైనే ఏకంగా 142 సిక్సర్లు బాదడం గమనార్హం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై ఒక టీమ్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే.
ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు వీరే
అభిషేక్ శర్మ: 86 సిక్సర్లు
ఇషాన్ కిషన్: 60 సిక్సర్లు
సంజూ శాంసన్: 50 సిక్సర్లు
టీమిండియా ఓటమి
కాగా ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. 192 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే చేధించింది. కివీస్ విజయంలో టిమ్ సీఫెర్ట్(93), గ్లెన్ ఫిలిప్స్(65) కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
చదవండి: ఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియన్స్‌గా అఫ్గానిస్తాన్


