టీమిండియా కొంపముంచిందే అతడే.. ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే? | India Vs New Zealand 5th T20I, Naman Dhir Costly Drop Catch Of Tim Seifert Turns The Match, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియా కొంపముంచిందే అతడే.. ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే?

Nov 1 2026 5:09 PM | Updated on Nov 1 2026 5:43 PM

Naman Dhirs Dropped Catch Proves Costly as NZ Win 5th T20I by 7 Wickets

హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్‌ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌ 18 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్‌ విజయంలో ఓపెనర్‌ టిమ్ సీఫెర్ట్‌ (50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93), గ్లెన్ ఫిలిప్స్‌ (65) కీలక పాత్ర పోషించారు.

చెత్త బౌలింగ్‌తో పాటు కీలక సమయంలో క్యాచ్‌ డ్రాప్‌ కావడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదేమో! ఆ క్యాచ్ ఎవ‌రిదో కాదు కివీస్‌కు ఓంటి చేత్తో విజ‌యాన్ని అందించిన సీఫెర్ట్‌ది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత ఆటగాడు నమన్‌ ధీర్‌ అతనికి లైఫ్ ఇచ్చేశాడు.

అసలేం జరిగిందంటే?
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మూడో ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతమైన బంతితో ఫిన్‌ అలెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత తన తర్వాతి ఓవర్‌లోనూ అర్ష్‌దీప్‌ కివీస్‌ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

ఆ ఓవర్‌లో మూడో బంతిని అర్ష్‌దీప్‌ ఆఫ్‌ స్టంప్‌కు వెలుపల లెంగ్త్‌ డెలివరీగా సంధించగా.. సీఫెర్ట్‌ దాన్ని ఆఫ్‌ సైడ్‌ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ బయటి అంచుకు తాకి డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న నమన్‌ ధీర్‌ సునాయసమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

ఈ తప్పిదం భారత్‌కు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఫెర్ట్‌ ఆ తర్వాత మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు బాది కివీస్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

కాగా అంతకుముందు నాలుగో టీ20లోనూ గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్‌ను నమన్ ధీర్‌ జారవిడిచాడు. ఆ మ్యాచ్‌లో అతడు ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో వరుస మ్యాచ్‌లలో కీలక క్యాచ్‌లు వదిలేసిన నమన్ ధీర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement