హాంగ్ కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఊరట విజయం లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన 11వ స్థానపు ప్లే-ఆఫ్ పోరులో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 11వ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ జట్టు 116 పరుగులు చేసింది. కెప్టెన్ అబూ హైదర్ కేవలం 13 బంతుల్లోనే 1 సిక్సర్, 5 ఫోర్లతో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే హబీబుర్ రహ్మాన్ (18), సబ్బీర్ రహ్మాన్ (13), మొహమ్మద్ రిజ్వాన్ (12) కూడా రాణించారు. భారత బౌలర్లలో కెప్టెన్ కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, రాహుల్ త్రిపాఠి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
శశాంక్ సింగ్ విధ్వంసకర అర్ధశతకం
అనంతరం 117 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. భారత బ్యాటర్లలో శశాంక్ సింగ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శాంక్ సింగ్ కేవలం 15 బంతుల్లోనే 1 ఫోర్, 7 భారీ సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు సాధించాడు. అలాగే రాహుల్ త్రిపాఠి (32 పరుగులు, 12 బంతుల్లో, 3 సిక్సర్లు, 3 ఫోర్లు) దూకుడుగా ఆడాడు.


