Photo Credit: Twitter
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు ఏదీ కలిసిరావడం లేదు. టోర్నీలో భారత్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం పాకిస్తాన్‌తో ఓటమి మరిచిపోకముందే ఈసారి యూఏఈ జట్టు భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. గ్రూప్-సిలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈత చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ (14 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ త్రిపాఠి (7 బంతుల్లో 24) పర్వాలేదనిపించాడు. యూఏఈ బౌలర్లలో జాహిద్ అలీ మూడు వికెట్లు తీయగా, ముహమ్మద్ ఫరూక్, మొహమ్మద్ ఫరాజుద్దీన్ చెరొక వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ 4.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఖాలిద్ షా (14 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, అన్ష్ టాండన్ (12 బంతుల్లో 39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
గ్రూప్ దశలో రెండు ఓటములతో గ్రూప్-సి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన భారత్ ప్లేట్ సెమీస్ ఆడనుంది. ప్లేట్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీకి సిద్ధమైంది.
😱 UAE HUMILIATES INDIA BY 6 WICKETS! 🇦🇪🔥🇮🇳 A shocking defeat for India in the Hong Kong Sixes 2026! 💔 India scored 94/6 in 6 overs, but UAE chased down the 95-run target to seal a stunning 6-wicket victory! 🏆💥 Image Credt: Fancode #INDvsUAE #HongKongSixes2026 #TeamIndia https://t.co/apoJFk3gq4
— CricInformer (@CricInformer) October 31, 2026
🏏🔥 T NATARAJAN SHINES WITH A BLISTERING 38 OFF 14 BALLS AGAINST UAE! 🇮🇳💥 What a sensational batting performance by India's T Natarajan in the Group C clash of the Hong Kong Sixes 2026! 🚀🏏 Natarajan emerged as India's standout batter, smashing 38 runs off just 14 balls, including 3 fours and 4 massive sixes, at an impressive strike rate of 271.43! 🤯🔥 Despite India's batting struggles, Natarajan delivered a fearless counterattack against the UAE bowling attack! 💪 Image Credit: Fancode #INDvsUAE #HongKongSixes2026 #TNatarajan #TeamIndia
— CricInformer (@CricInformer) October 31, 2026
ఇదీ చదవండి: ఆసీస్ టార్గెట్ 288.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు


