Photo Credit: Twitter
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత-ఏ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతోంది. క్రైస్ట్‌చర్చి వేదికగా మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 42 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులోనూ అదే ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు.
ఫ్రేసర్ షీట్ బౌలింగ్‌లో ఎల్బీ అయిన జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుల వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (41) రాణించగా, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ అర్థసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో భారత ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది.
అయితే జర్రోడ్ మెకే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయిన సాయి సుదర్శన్ అర్థసెంచరీ మిస్ చేసుకోగా, యశ్ రాథోడ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 140 బంతుల్లో 80 పరుగులు చేసిన పడిక్కల్ ప్రేసర్ షీట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే స్మరణ్ రవిచంద్రన్ గోల్డెన్ డక్ కావడంతో 137 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం కెప్టెన్ ధ్రువ్ జురేల్ (7), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్రేసర్ షీట్ మూడు వికెట్లు తీయగా, బ్రెట్ రాండల్, జారోడ్ మెకే చెరొక వికెట్ తీశారు.
ఇదీ చదవండి: జెర్సీ నెంబర్ '45' మిస్టరీ గుట్టువిప్పిన రోహిత్ శర్మ!


