IND vs NZ 4th T20I: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ | IND vs NZ 4th T20I: New Zealand Scripts History Highest T20I totals vs IND | Sakshi
Sakshi News home page

IND vs NZ 4th T20I: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Oct 30 2026 5:21 PM | Updated on Oct 30 2026 5:55 PM

IND vs NZ 4th T20I: New Zealand Scripts History Highest T20I totals vs IND

గ్లెన్‌ ఫిలిప్స్‌ (PC: Blackcaps X)

సొంతగడ్డపై టీమిండియాతో టీ20 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత న్యూజిలాండ్‌ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. ఆక్లాండ్‌ వేదికగా శుక్రవారం నాటి నాలుగో టీ20లో కివీస్‌ ఘన విజయం సాధించింది. భారత జట్టుపై ఏకంగా 87 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసకర శతకం
ఈడెన్‌ పార్క్‌ వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసకర శతకం (49 బంతుల్లో 107; 6 ఫోర్లు, 10 సిక్సర్లు) బాదగా.. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ మెరుపు అర్ధ శతకం (25 బంతుల్లో 65) సాధించాడు.

259 పరుగుల భారీ స్కోరు
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉండేది. ఇటీవల సౌతాంప్టన్‌లో జరిగిన టీ20 సందర్భంగా భారత్‌పై ఇంగ్లండ్‌ 257/3 స్కోరు నమోదు చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ విధించిన 260 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టీమిండియా 87 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 

తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ టీమిండియా ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ (35) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ నాలుగు వికెట్లతో చెలరేగి టీమిండియాను దెబ్బకొట్టాడు.

అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే
👉న్యూజిలాండ్‌- 2026లో ఆక్లాండ్‌ వేదికగా 259/7 
👉ఇంగ్లండ్‌- 2026లో సౌతాంప్టన్‌ వేదికగా 257/3
👉వెస్టిండీస్‌- 2026లో రాంచి వేదికగా 252/4
👉వెస్టిండీస్‌- 2026లో హైదరాబాద్‌ వేదికగా 247/3
👉ఇంగ్లండ్‌- 2026లో వాంఖడే వేదికగా 246/7
👉వెస్టిండీస్‌- 2016లో లాడర్‌హిల్‌ వేదికగా 245/6.

చదవండి: IND vs NZ: అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement