ఒమన్ వేదికగా జరగనున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య రాయ్‌చందానీ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా యష్‌వర్ధన్ సింగ్ చౌహాన్ వ్యవహరించనున్నాడు.
ఈ జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లకు చోటు దక్కింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న జట్టు నుంచి బీసీసీఐ కేవలం ఒకే మార్పు చేసింది. చిగురుపాటి వెంకట స్థానంలో ఇషాన్ సూద్‌ను జట్టులోకి తీసుకుంది.
ఈ ఖండాంతర టోర్నమెంట్ నవంబర్ 5 నుండి 14 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ గ్రూప్-ఎలో దాయాది పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లతో కలిసి ఉంది.
భారత్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 6న మస్కట్‌లోని ఓసీసీ టర్ఫ్ 1 మైదానం వేదికగా తలపడనుంది. అనంతరం నవంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో యంగ్ ఇండియా అమీతుమీ తెల్చుకోనుంది.
ఆసియాకప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే
నవంబర్ 6: భారత్ వర్సెస్ నేపాల్ (మస్కట్‌లోని ఓసీసీ టర్ఫ్ 1 మైదానం)
నవంబర్ 8: భారత్ వర్సెస్ పాకిస్థాన్
నవంబర్ 10: భారత్ వర్సెస్ యూఏఈ
నవంబర్ 12: సెమీఫైనల్స్
నవంబర్ 14: ఫైనల్ మ్యాచ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2026కు భారత జట్టు:
లక్ష్య రాయ్‌చందానీ (కెప్టెన్), యష్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), వి. యష్‌వీర్, ఆర్యన్ సవసాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షవిన్ వినోద్, ఇషాన్ సూద్.


