Photo Credit: BCCI Twitter
టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. శ్రేయస్ ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో 19 సార్లు టాస్ నెగ్గి తొలి స్థానంలో ఉండగా, వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ, పాక్ ఆటగాడు సల్మాన్ అలీ అగాలు కెప్టెన్‌గా తమ తొలి 25 మ్యాచ్‌ల్లో చెరో 17 సార్లు టాస్ నెగ్గి రెండో స్థానంలో ఉన్నారు.
కాగా శ్రేయస్ తన తొలి 25 మ్యాచ్‌ల్లో ఇన్నిసార్లు టాస్ నెగ్గడం కూడా అతడికి ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. టాస్‌లు గెలిచినట్లే మ్యాచ్‌లు గెలవడంలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రేయస్ కెప్టెన్‌గా 25 మ్యాచ్‌ల్లో 14 మ్యాచ్‌లు గెలవగా, ఎనిమిదింటిలో ఓటమి చవిచూశాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ టాస్ గెలవడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 6 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (26), ఫిన్ అలెన్ (12) క్రీజులో ఉన్నారు. అంతకముందు మయాంక్ యాదవ్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (3)తో పాటు డారిల్ మిచెల్ (24) వికెట్లను పడగొట్టి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్, మయాంక్ యాదవ్ జట్టులోకి రాగా.. వైభవ్ సూర్యవంశీ, భువనేశ్వర్ కుమార్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు.
🚨 MOST TOSSES WON AS CAPTAIN AFTER 25 MATCHES IN INT'L CRICKET: Shreyas Iyer - 19*. Darren Sammy - 17. - Captain Shreyas Iyer has the Most in History! 🔥 https://t.co/a4j6HeCqgZ
— Tanuj (@ImTanujSingh) October 30, 2026
Ravi Shastri on the mic at the toss. Some things never go out of style! 😎 Watch the HERO VIDA India Tour of New Zealand, 4th T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/ZpRCP8ufRK
— Sony Sports Network (@SonySportsNetwk) October 30, 2026
ఇదీ చదవండి:


