Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆక్లాండ్‌లో అడుగుపెట్టాడు. అయితే ఆక్లాండ్ విమానాశ్రయంలో కోహ్లి అడుగుపెట్టిన సంగతి తెలుసుకున్న అభిమానులు అతడిని చూడటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, కరచాలనం కోసం ఎగబడ్డారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని కోహ్లిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.
అయితే కోహ్లి రాక విషయాన్ని ముందే తెలుసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు ఐదుగురు భద్రతా సిబ్బందిని నియమించినప్పటికీ, కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో రెట్టింపు భద్రతా సిబ్బందిని బరిలోకి దింపి అభిమానులను కట్టడి చేయాల్సి వచ్చింది.
ఇక కోహ్లి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడెన్ పార్క్ మైదానానికి చేరుకొని టీమిండియా జట్టుతో కలిశాడు. అలా ఉదయం న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లి.. సాయంత్రానికి గ్రౌండ్‌లో దిగి సీరియస్‌గా ప్రాక్టీస్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లి, ఆ తర్వాత నెట్స్‌లో కఠోర సాధన చేశాడు.
నవంబర 4 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆక్లాండ్‌కు చేరుకున్నారు. తాజాగా కోహ్లి కూడా వీరితో కలవడంతో సీనియర్ జట్టు కన్నుల పండువగా కనిపిస్తోంది. అయితే గిల్ గురువారం భారత టీ20 జట్టుతో కలిసి శిక్షణ తీసుకుంటూ కనిపించాడు. ఈ నేపథ్యంలో శిక్షణ సమయంలో గిల్ నుదుటిపై 'టెంపుల్' అనే ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నేడు ఇదే ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ నాలుగో టీ20లో తలపడుతున్నాయి. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో 199 పరుగుల టార్గెట్‌ను 13.2 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులతో రాణించగా, వైభవ్ 19 బంతుల్లోనే 45 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. గాయంతో రెండు, మూడు టీ20లకు దూరమైన ఇషాన్ కిషన్ నాలుగో టీ20కి తిరిగి జట్టులోకి రాగా, వైభవ్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.
VIRAT KOHLI & ROHIT SHARMA IN TODAY'S BATTING PRACTICE SESSION AT AUCKLAND.🐐🥹 (RevSportz). - The RoKo is coming to Rule! https://t.co/vcyQFHY6Ch
— Tanuj (@ImTanujSingh) October 30, 2026
Virat Kohli reached Auckland. https://t.co/zhaZCBmvfu
— Nikhil. (@ishowwhyrat) October 30, 2026
Virat Kohli hits the Nets at Eden Park, Auckland. He has landed few hours ago here in NZ. #ViratKohli #TeamIndia https://t.co/DeDg7iLyQu
— Ankan Kar (@AnkanKar) October 30, 2026
ఇదీ చదవండి:


