breaking news
Eden Park Stadium
-
ఉదయమే వచ్చాడు.. సాయంత్రానికి ప్రాక్టీస్ మొదలెట్టేశాడు!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆక్లాండ్‌లో అడుగుపెట్టాడు. అయితే ఆక్లాండ్ విమానాశ్రయంలో కోహ్లి అడుగుపెట్టిన సంగతి తెలుసుకున్న అభిమానులు అతడిని చూడటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, కరచాలనం కోసం ఎగబడ్డారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని కోహ్లిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.అయితే కోహ్లి రాక విషయాన్ని ముందే తెలుసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు ఐదుగురు భద్రతా సిబ్బందిని నియమించినప్పటికీ, కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో రెట్టింపు భద్రతా సిబ్బందిని బరిలోకి దింపి అభిమానులను కట్టడి చేయాల్సి వచ్చింది.ఇక కోహ్లి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడెన్ పార్క్ మైదానానికి చేరుకొని టీమిండియా జట్టుతో కలిశాడు. అలా ఉదయం న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లి.. సాయంత్రానికి గ్రౌండ్లో దిగి సీరియస్‌గా ప్రాక్టీస్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లి, ఆ తర్వాత నెట్స్‌లో కఠోర సాధన చేశాడు.నవంబర 4 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆక్లాండ్‌కు చేరుకున్నారు. తాజాగా కోహ్లి కూడా వీరితో కలవడంతో సీనియర్ జట్టు కన్నుల పండువగా కనిపిస్తోంది. అయితే గిల్ గురువారం భారత టీ20 జట్టుతో కలిసి శిక్షణ తీసుకుంటూ కనిపించాడు. ఈ నేపథ్యంలో శిక్షణ సమయంలో గిల్ నుదుటిపై 'టెంపుల్' అనే ఫిట్నెస్ ట్రాకింగ్ పరికరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.నేడు ఇదే ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ నాలుగో టీ20లో తలపడుతున్నాయి. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో 199 పరుగుల టార్గెట్‌ను 13.2 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులతో రాణించగా, వైభవ్ 19 బంతుల్లోనే 45 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. గాయంతో రెండు, మూడు టీ20లకు దూరమైన ఇషాన్ కిషన్ నాలుగో టీ20కి తిరిగి జట్టులోకి రాగా, వైభవ్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.VIRAT KOHLI & ROHIT SHARMA IN TODAY'S BATTING PRACTICE SESSION AT AUCKLAND.🐐🥹 (RevSportz). - The RoKo is coming to Rule! https://t.co/vcyQFHY6Ch— Tanuj (@ImTanujSingh) October 30, 2026 Virat Kohli reached Auckland. https://t.co/zhaZCBmvfu— Nikhil. (@ishowwhyrat) October 30, 2026 Virat Kohli hits the Nets at Eden Park, Auckland. He has landed few hours ago here in NZ. #ViratKohli #TeamIndia https://t.co/DeDg7iLyQu— Ankan Kar (@AnkanKar) October 30, 2026ఇదీ చదవండి: బ్యాటింగ్ కోచ్‌గా ఊహించని పేరు.. ముంబై కొత్త కోచింగ్ టీమ్ ఇదే20వేల కోట్లు.. ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు -
ఆక్లాండ్ (ఈడెన్ పార్క్)
ప్రపంచకప్ మరో 13 రోజుల్లో న్యూజిలాండ్‌లో అతి పెద్ద స్టేడియం ఈడెన్ పార్క్. 1910 నుంచి ఆక్లాండ్ క్రికెట్‌కు సొంత స్టేడియంగా ఉంది. 1925 నుంచి ఇక్కడ రగ్బీని కూడా నిర్వహిస్తున్నారు. ఆక్లాండ్ నగరం మధ్యలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. 1950లో ఎంపైర్ గేమ్స్‌కు, 1987లో ప్రారంభ రగ్బీ వరల్డ్ కప్, 2011లో రగ్బీ ప్రపంచకప్, 1992 ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఇది ఆతిథ్యమిచ్చింది. 1955-56లో ఇదే మైదానంలో విండీస్‌ను ఓడించిన కివీస్ టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో అత్యంత చెత్త రికార్డును కూడా న్యూజిలాండ్ మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్టులో 26 పరుగులకే ఆలౌటైంది. అధిక తేమ, ఉప ఉష్టమండల పరిస్థితుల వల్ల ఇక్కడి పిచ్ స్లో అండ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. స్టేడియం సామర్థ్యం 50 వేలు. ఇక ఆక్లాండ్ విషయానికొస్తే అద్భుతమైన, సహజసిద్ధమైన ప్రకృతి సంపద అభిమానులను కట్టిపడేస్తుంది. సుందరమైన బీచ్‌లు, రకరకాల పార్క్‌లు, సహజ సిద్ధంగా ఏర్పడిన లోయలు, కొండలు, సెలయేర్లు, ఆహార పదార్థాలు, వైన్లు, షాపింగ్ కాంప్లెక్స్, నైట్‌లైఫ్ కల్చర్, అడ్వెంచర్స్ మతిపోగొడతాయి. ఈ స్టేడియంలో ఫిబ్రవరి 28న ఆసీస్, కివీస్; మార్చి 7న దక్షిణాఫ్రికా, పాక్; 14న భారత్, జింబాబ్వేల మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో పాటు మార్చి 24న సెమీస్-1 జరుగుతుంది.


