చ‌రిత్ర సృష్టించిన ర‌షీద్ ఖాన్‌ | Rashid Khan Becomes-1st-Bowler In-History Complete 200 Wkts-Men's T20Is | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన ర‌షీద్ ఖాన్‌

Oct 30 2026 7:43 AM | Updated on Oct 30 2026 7:51 AM

Rashid Khan Becomes-1st-Bowler In-History Complete 200 Wkts-Men's T20Is

Photo Credit : Twitter

అఫ్గానిస్తాన్ స్టార్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జ‌రిగిన రెండో టీ20లో వికెట్ తీయ‌డం ద్వారా అంత‌ర్జాతీయ టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మార్క్ చేరుకున్న తొలి క్రికెట‌ర్‌గా ర‌షీద్ ఖాన్ ప్రపంచ రికార్డు సాధించాడు.

120 ఇన్నింగ్స్‌ల్లో ర‌షీద్ ఈ మైలురాయిని అందుకోవ‌డం విశేషం. అత‌డి ఖాతాలో రెండు ఐదు వికెట్ల హాల్స్ ఉండ‌గా.. టీ20ల్లో (5/3) బెస్ట్ ఫిగ‌ర్స్ న‌మోదు చేశాడు. అంతేకాదు అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న ఏకైక క్రికెట‌ర్‌గానూ ర‌షీద్ చ‌రిత్ర‌కెక్కాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్లు:
👉ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్‌)- 120 ఇన్నింగ్స్‌ల్లో 200 వికెట్లు 
👉ఆదిల్ ర‌షీద్ (ఇంగ్లండ్)- 146 ఇన్నింగ్స్‌ల్లో 171 వికెట్లు
👉ఎహ్స‌న్ ఖాన్ (హాంకాంగ్ )- 116 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
👉ఇష్ సోదీ (న్యూజిలాండ్ )-135 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
👉టిమ్ సౌథీ (న్యూజిలాండ్‌)- 123 ఇన్నింగ్స్‌ల్లో 164 వికెట్లు

ఓవ‌రాల్ టీ20 క్రికెట్‌లోనూ ర‌షీద్ ఖాన్ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. 551 మ్యాచ్‌ల్లో ర‌షీద్ ఖాన్ 742 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, విండీస్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ 617 మ్యాచ్‌ల్లో 658 వికెట్ల‌తో రెండో స్థానంలో, విండీస్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లతో మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. వీరి త‌ర్వాత ఇమ్రాన్ తాహిర్ (సౌతాఫ్రికా) 593 వికెట్లు, ఆండ్రీ ర‌సెల్‌(వెస్టిండీస్‌) 540 వికెట్లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 19 ప‌రుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జ‌య్ (50 బంతుల్లో 116; 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) వీరోచిత శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. ఇయాస్ అహ్మ‌ద్ (27 బంతుల్లో 52) అర్థ‌సెంచ‌రీ, ఆఖ‌ర్లో ర‌షీద్ ఖాన్ (6 బంతుల్లో 25 నాటౌట్‌; 4 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో కుంద‌య్ మ‌టిగిము, బ్రాడ్ ఎవ‌న్స్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం ఛేద‌న‌లో జింబాబ్వే 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ సికంద‌ర్ ర‌జా (56 బంతుల్లో 106 నాటౌట్‌, 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) అజేయ సెంచ‌రీ సాధించ‌గా, తఫాద్జ్వా త్సిగా (31 నాటౌట్‌) మిన‌హా మిగ‌తావారు రాణించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో అబ్దుల్లా అహ్మ‌ద్‌జ‌య్ రెండు వికెట్లు తీయ‌గా, ఫ‌రీద్ అహ్మ‌ద్‌, అజ్మ‌తుల్లా, ర‌షీద్‌ఖాన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: జింబాబ్వేను శ‌త‌క్కొట్టిన ఆఫ్గన్‌ బ్యాట‌ర్‌.. టీ20 సిరీస్‌ కైవసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement