జింబాబ్వేను శ‌త‌క్కొట్టిన ఆఫ్గన్‌ బ్యాట‌ర్‌.. టీ20 సిరీస్‌ కైవసం | Omarzai Century Powers Afghanistan-19-Run Win VS ZIM 2nd T20I | Sakshi
Sakshi News home page

జింబాబ్వేను శ‌త‌క్కొట్టిన ఆఫ్గన్‌ బ్యాట‌ర్‌.. టీ20 సిరీస్‌ కైవసం

Oct 30 2026 7:16 AM | Updated on Oct 30 2026 8:19 AM

Omarzai Century Powers Afghanistan-19-Run Win VS ZIM 2nd T20I

Photo Credit: Twitter

జింబాబ్వేతో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో సొంతం చేసుకుంది. గురువారం షార్జా వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 19 ప‌రుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ ర‌జా ఆఖ‌రిదాకా నిల‌బ‌డి అజేయ సెంచ‌రీతో మెరిసిన‌ప్ప‌టికీ జింబాబ్వేను ఓట‌మి నుంచి త‌ప్పించ‌లేక‌పోయాడు. 

మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జ‌య్ (50 బంతుల్లో 116; 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) వీరోచిత శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. ఇయాస్ అహ్మ‌ద్ (27 బంతుల్లో 52) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. ఆఖ‌ర్లో ర‌షీద్ ఖాన్ (6 బంతుల్లో 25 నాటౌట్‌; 4 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌డంతో ఆఫ్గ‌న్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. 

జింబాబ్వే బౌల‌ర్ల‌లో కుంద‌య్ మ‌టిగిము, బ్రాడ్ ఎవ‌న్స్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో జింబాబ్వే 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ సికంద‌ర్ ర‌జా (56 బంతుల్లో 106 నాటౌట్‌, 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) అజేయ సెంచ‌రీ సాధించ‌గా, తఫాద్జ్వా త్సిగా (31 నాటౌట్‌) మిన‌హా మిగ‌తావారు రాణించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో అబ్దుల్లా అహ్మ‌ద్‌జ‌య్ రెండు వికెట్లు తీయ‌గా, ఫ‌రీద్ అహ్మ‌ద్‌, అజ్మ‌తుల్లా, ర‌షీద్‌ఖాన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

38 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు..
ఒక ద‌శ‌లో 38 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డిన అఫ్గానిస్తాన్‌ను అజ్మ‌తుల్లా త‌న సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో గ‌ట్టెక్కించాడు. ఈ నేప‌థ్యంలో అజ్మ‌తుల్లా 44 బంతుల్లో టీ20ల్లో త‌న తొలి సెంచ‌రీని సాధించాడు. అజ్మతుల్లాకు ఇయాజ్ అహ్మ‌ద్ అండ‌గా నిలవ‌డంతో వీరిద్ద‌రు క‌లిసి ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 59 బంతుల్లోనే 142 ప‌రుగులు జోడించ‌డం విశేషం. 

ఇయాజ్ అహ్మ‌ద్ ఔటైన‌ప్ప‌టికీ, క్రీజులోకి వ‌చ్చిన ర‌షీద్ ఖాన్ భారీ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డడంతో ఆఫ్గ‌న్ భారీ స్కోరు సాధించింది. సెంచ‌రీతో పాటు వికెట్ ప‌డ‌గొట్టిన అజ్మ‌తుల్లాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య నామామాత్ర‌మైన మూడో టీ20 ఆదివారం జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement