breaking news
Zimbabwe
-
కేకేఆర్ జట్టులోకి డేంజరస్ బౌలర్
జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్లింగ్ ముజరబాని మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అవకాశం దక్కించుకున్నాడు. 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు ముజరబానిని ఎంచుకుంది. గత డిసెంబరులో తమ జట్టు నుంచి తప్పించిన ముస్తఫిజుర్ రహమాన్ స్థానంలో కేకేఆర్ ముజరాబానికి అవకాశం కల్పించింది. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ముజరబాని తమ పేస్ బౌలింగ్ బృందంలో కీలకంగా మారతాడని కేకేఆర్ ఆశిస్తోంది. 89 అంతర్జాతీయ టి20ల్లో అతను 7.24 ఎకానమీతో 106 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 29 ఏళ్ల ముజరబాని మొత్తం 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్ ఎయిట్స్ దశకు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2025లో లుంగీ ఎన్గిడి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముజరబానిని తమ టీమ్‌లోకి తీసుకుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకున్నా... విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టులో అతను భాగమయ్యాడు.చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్ -
న్యూజిలాండ్ ఘన విజయం
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వే మహిళల జట్టుతో ఇవాళ (మార్చి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డునెడిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే ఇదే డునెడిన్ వేదికగా మార్చి 11న జరుగనుంది.వన్డే సిరీస్‌కు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా న్యూజిలాండే 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వే మహిళల జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. కెప్టెన్ అమేలియా కెర్ (9.1-1-34-7) విజృంభించడంతో 29.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కెర్‌కు పెన్ఫోల్డ్ (4-1-17-3) సహకరించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ముపచిక్వ (32) మినహా ఒక్కరు కూడా కనీసం 15 పరుగుల మార్కును తాకలేకపోయారు. నలుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. బంతితో విజృంభించిన కెర్ (45) బ్యాట్‌తోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించింది. కెర్‌కు మరో ఓపెనర్ ఇసబెల్లా గేజ్ (20), మ్యాడీ గ్రీన్ (27 నాటౌట్), బ్రూక్ హల్లీడే (7 నాటౌట్) సహకరించడంతో న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే బౌలర్లలో మజ్విషయా, చటోంజ్వాకు తలో వికెట్ దక్కింది. -
టీ20 ప్రపంచకప్‌పై యుద్ద ప్రభావం
అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద ప్రభావం భారత్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్ జట్టు భారత్‌లోనే హాల్ట్ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. మరోవైపు విండీస్‌లాగే మరో జట్టు కూడా భారత్‌లోనే ఇరుక్కుపోయింది. విండీస్‌లాగే సూపర్-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌లో హాల్ట్ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్‌లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్‌తో పాటు గ్రూప్-1లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్-4కు అర్హత సాధించాయి.తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది. -
నాకౌట్కూ అజేయంగానే...
న్యూఢిల్లీ: గత మెగా ఈవెంట్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈ టి20 ప్రపంచకప్‌ను కసిమీద ఆడుతోంది. లీగ్ దశలో గ్రూప్ ‘డి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా అజేయంగా ‘సూపర్–8’కు చేరింది. ‘సూపర్–8’లోనూ తమ జోరు కొనసాగిస్తూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నాకౌట్ పోరుకు సై అంటోంది. దక్షిణాఫ్రికా ఇదివరకే సెమీస్ చేరడంతో.... జింబాబ్వేతో ఆదివారం జరిగిన గ్రూప్–1 ‘సూపర్–8’ నామమాత్రమైంది. అయినప్పటికీ సమష్టి ఆటతీరుతో మెరిపించిన మార్క్రమ్ బృందం 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా ఏడో విజయం నమోదు చేసింది. కోల్‌కతాలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు. దక్షిణాఫ్రికాతో పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (43 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. కార్బిన్ బాష్, మఫాక చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి గెలిచింది. బ్రెవిస్ (18 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ సిక్స్‌లతో విరుచుకుపడగా, జార్జ్ లిండే (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. బ్రెవిస్ అవుటయ్యాక లిండే, స్టబ్స్ ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసిన జింబాబ్వే కెప్టెన్ రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (బి) మఫాక 7; బెనెట్ (సి) మార్క్రమ్ (బి) నోర్జే 15; మైయెర్స్ (సి) బ్రెవిస్ (బి) లిండే 11; సికందర్ రజా (సి) మిల్లర్ (బి) మఫాక 73; బర్ల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్గిడి 5; మున్యోంగా (బి) బాష్ 2; మడండె (నాటౌట్) 26; ఇవాన్స్ (బి) బాష్ 8; మసకద్జా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–66, 4–82, 5–87, 6–126, 7–146. బౌలింగ్: లిండే 3–0–22–1, మఫాక 4–0–21–2, ఎన్గిడి 4–0–29–1, నోర్జే 4–0–29–1, బాష్ 4–0–40–2, మార్క్రమ్ 1–0–11–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) సికందర్ రజా 4; డికాక్ (సి) మరుమని (బి) సికందర్ రజా 0; రికెల్టన్ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 31; బ్రెవిస్ (సి) బర్ల్ (బి) సికందర్ రజా 42; మిల్లర్ (సి) మైయెర్స్ (బి) ముజరబాని 22; స్టబ్స్ (నాటౌట్) 21; లిండే (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–1, 2–14, 3–43, 4–93, 5–101. బౌలింగ్: సికందర్ రజా 4–0–29–3, ముజరబాని 3.5–0–32–1, ఇవాన్స్ 3–0–22–1, క్రెమర్ 2–0–27–0, మసకద్జా 2–0–23–0, బర్ల్ 2–0–12–0, బెనెట్ 1–0–9–0. 5 టి20 ప్రపంచకప్ చరిత్రలో సికందర్ రజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన జాబితాలో విరాట్ కోహ్లి (8), ఆడమ్ జంపా (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, జయవర్ధనే, సికందర్ రజా (5 చొప్పున) ఉన్నారు. -
T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాదే గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీకి రెడీ అయ్యింది.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ క్లైవ్ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0) విఫలమైనా.. రికెల్టన్ (31), బ్రెవిస్ (42), మిల్లర్ (22), స్టబ్స్ (21 నాటౌట్), లిండే (30 నాటౌట్) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్ ఈవాన్స్ (3-0-22-1) వికెట్లు తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. -
T20 WC 2026: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సికందర్ రజా విధ్వంసం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా, క్లైవ్ మదండే (26 నాటౌట్) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0)ను ఔట్ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 30-2గా ఉంది. రికెల్టన్ (19), బ్రెవిస్ (7) క్రీజ్‌లో ఉన్నారు. -
IND vs ZIM: వెస్టిండీస్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు..
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు. బెన్నెట్ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్‌కు... జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్రేట్లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఇంగ్లండ్ X న్యూజిలాండ్ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
-
నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..
-
భారీ విజయం కావాలి
టి20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీమ్ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు రన్‌రేట్‌పై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్‌తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్‌కు ఇంకా అవకాశం మిగిలి ఉంటుంది! చెన్నై: వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు జరిగే ‘గ్రూప్–1’ పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి రన్‌రేట్‌లో బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్ ఆశలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాలపరంగా జింబాబ్వేకంటే భారత్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజేయమేమీ కాదని తేలగా... పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురి పెట్టింది. సామ్సన్‌కు చాన్స్! గత మ్యాచ్ ఆడిన తుది జట్టు నుంచి కనీసం రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో విఫలమైన సంజు సామ్సన్ను ఇప్పుడు టీమ్ వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత్ టాప్–3 ఎడంచేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. మూడు డకౌట్ల తర్వాత గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఆఫ్‌స్పిన్నర్‌కే అవుటయ్యాడు. దాంతో కుడిచేతి వాటం సామ్సన్ను టాపార్డర్‌లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సామ్సన్ను ఆడించేందుకు తిలక్ వర్మ లేదా రింకూ సింగ్‌లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో అక్షర్ పటేల్‌ను కాకుండా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించి తీవ్ర విమర్శలపాలైన మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్లీ అక్షర్‌ను టీమ్‌లోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లలో ఎక్కువ మంది కుడిచేతి వాటంవారే కావడం అక్షర్ రాకకు మార్గం సుగమం చేసింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు అభిషేక్‌కు ఇది సరైన సమయం కాగా... సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. బౌలింగ్ విషయంలో భారత్‌కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, అర్‡్షదీప్‌లతో పాండ్యా పేస్ భారం మోస్తుండగా... ప్రధానాస్త్రం వరుణ్ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంతగడ్డపై ఇప్పుడు వరుణ్ వరల్డ్ నంబర్‌వన్ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు. రజాపై భారం... జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్‌కు సంబంధించి ఎలాంటి ఒత్తిడీ లేదు. లీగ్ దశలో ఆ్రస్టేలియాను, సొంతగడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్‌పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తోంది. ప్రధాన పేసర్లయిన ఎన్గరవా, ముజరబాని పవర్‌ప్లేలో వికెట్లు తీసి శుభారంభం అందించగలరు. లెగ్ స్పిన్నర్ క్రీమర్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. టోర్నీలో జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్న బెన్నెట్‌తో పాటు ర్యాన్ బర్ల్ కీలకం కానున్నారు. జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రాడ్ ఇవాన్స్ తన మీడియం పేస్‌తో టోర్నీలో ప్రభావం చూపించగా, ప్రధాన గెలుపు భారం కెపె్టన్ సికందర్ రజాపైనే ఉంది. బ్యాటింగ్‌లో ముందుండి నడిపిస్తున్న రజా, తన ఆఫ్‌స్పిన్‌తో నిలకడగా రాణించాడు. విండీస్‌తో గత పోరులో భారీ తేడాతో ఓడినా... జింబాబ్వే పట్టుదలగా ఆడితే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు.పిచ్, వాతావరణం చిదంబరం స్టేడియంలోని పిచ్‌లు ఈ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించాయి. బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.1 టి20 వరల్డ్ కప్‌లో భారత్, జింబాబ్వే మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. 2022లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో గెలిచింది.1 భారత్‌లో భారత్‌తో టి20ల్లో జింబాబ్వే తలపడటం ఇదే తొలిసారి. గతంలో భారత గడ్డపై జింబాబ్వే 5 టెస్టులు, 19 వన్డేల్లో టీమిండియాను ఎదుర్కొంది.భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, దూబే, పాండ్యా, రింకూ/ తిలక్, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్, బుమ్రా. జింబాబ్వే: రజా (కెప్టెన్), మరుమని, బెన్నెట్, మైర్స్, బర్ల్, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎన్‌గరవ -
దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం.. ఈ మ్యాచ్‌పై మన కన్ను
అహ్మదాబాద్: భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్‌కు ముందు జరిగే మరో సమరంపై కూడా టీమిండియా అభిమానుల దృష్టి నిలిచింది. ‘గ్రూప్–1’లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి. ఈ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీఫైనల్ స్థానంపై గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదు! జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం . -
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు
జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ పేరిట ఉండేది. మలింగ, అదైర్ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్.. మలింగ, అదైర్ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్, మలింగ, అదైర్‌ను సమీపించేందుకు పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిక్ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్ ఈవాన్స్-రిచర్డ్ నగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్ చరిత్రలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక ఈవాన్స్, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్ 5, నగరవ ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించారు. షమార్ జోసఫ్ వేసిన 17వ ఓవర్లో ఈవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్ బాదాడు.ప్రపంచకప్ రికార్డుఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్ నెదర్లాండ్స్-ఐర్లాండ్ మ్యాచ్ పేరిట ఉండేది. ఆ మ్యాచ్‌లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ఓ ప్రపంచకప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వద్ద ఔట్ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో బెన్నెట్ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు బెన్నెట్ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
WI vs ZIM: హెట్‌మైర్ ‘సూపర్’ షో
టాస్ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్‌మైర్ బ్యాటింగ్‌కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్‌నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్‌లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్–8’లో విండీస్‌కు భారీ విజయాన్నిచ్చింది. ముంబై: వెస్టిండీస్ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్‌కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్–8’ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్‌మైర్ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్‌గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. గుడకేశ్ మోతీ (4/28), హోసిన్ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్; అదేరోజు భారత్‌తో జింబాబ్వే ఆడతాయి. హెట్ ‘ఫైర్’ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), షై హోప్ (14) వికెట్లను కోల్పోయిన విండీస్ హెట్‌మైర్, పావెల్ ధనాధన్ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన కరీబియన్ బ్యాటర్‌గా రికార్డును నెలకొల్పాడు. హెట్‌మైర్ బాదిన మొత్తం 7 సిక్స్ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్‌మైర్ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్‌ను రెండోసారి క్యాచ్ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్‌ఫోర్డ్ (13 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫర్డ్ (10 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), హోల్డర్ (4 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) దంచేయడంతో విండీస్ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. హెట్మైర్జింబాబ్వే విలవిల ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్ (5), బర్ల్ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్ (28), కెప్టెన్ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్ ఎన్‌గరవ (7 నాటౌట్) అండతో బ్రాడ్ ఇవాన్స్ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవ 9; షై హోప్ (సి) బెనెట్ (బి) ఇవాన్స్ 14; హెట్‌మైర్ (సి) బెనెట్ (బి) క్రిమర్ 85; పావెల్ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 31; షెఫర్డ్ (సి) బర్ల్ (బి) ఎన్‌గరవ 21; హోల్డర్ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. బౌలింగ్: ఎన్‌గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్ 4–0–46–1, క్రిమర్ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్ 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (సి) హెట్‌మైర్ (బి) ఫోర్డ్ 14; బెనెట్ (బి) హోసిన్ 5; మైయెర్స్ (బి) మోతీ 28; బర్ల్ (సి) హెట్‌మైర్ (బి) హోసిన్ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్ (సి) హోసిన్ (బి) ఫోర్డ్ 43; క్రిమర్ (సి అండ్ బి) హోల్డర్ 0; ముజరబాని (సి) జోసెఫ్ (బి) హోసిన్ 0; ఎన్‌గరవ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్: హోసిన్ 4–1–28–3, ఫోర్డ్ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్ 3–0–35–0, హోల్డర్ 3–0–25–1. -
వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసం.. ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు బ్రాండెన్ కింగ్(9), షాయ్ హోప్(14) విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్‌మైర్ అయితే జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్‌మైర్ కేవలం బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అతడితో పాటు రావ్మన్ పావెల్(59), రూథర్ ఫర్డ్(31), షెఫర్డ్(21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలరల్లో నగారవ, ముజర్బానీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. క్రీమర్, ఎవెన్స్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఏకంగా మూడు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హెట్‌మైర్ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్‌మైర్ స్కాట్లాండ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు హెట్‌మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్‌లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకోంది. -
వెస్టిండీస్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.జింబాబ్వే జట్టులోకి నగరవ రాగా.. విండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్ వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. మరి సూపర్-8లో ఎవరు బోణీ కొడతారో వేచి చూడాలి.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీవెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్ -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలన విజయం సాధిస్తుందా..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 23) వెస్టిండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఏ జట్టూ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. గ్రూప్ దశలో ఇరు జట్లు టాపర్లుగా నిలిచి సూపర్-8లోకి ప్రవేశించాయి. వెస్టిండీస్.. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లపై విజయాలు సాధించి ఫైనల్-8కు అర్హత సాధించగా.. జింబాబ్వే గ్రూప్ దశలో పెను సంచలనాలే సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే.. తమ కంటే మెరుగైన శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై విజయం సాధించగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన విండీస్, జింబాబ్వే.. గ్రూప్ దశలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో నేటి మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీసే ఫేవరెట్ అయినా, జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ఎడిషన్‌లో వారి ఆటతీరు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరు విజయాల కోసం శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతున్నారు. వారి ప్రధాన ఆయుధాలు కెప్టెన్ సికందర్ రజా, పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ. వీరిద్దరు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ టోర్నీలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు మరోసారి శుభారంభాన్ని ఇస్తే జింబాబ్వే భారీ స్కోర్ చేయగలుగుతుంది. ముజరబానీకి తోడుగా ఫామ్‌లో ఉన్న బ్రాడ్ ఈవాన్స్ కూడా రాణిస్తే.. విండీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ప్రస్తుత ప్రపంచకప్‌లో కలిసికట్టుగా ఆడుతూ వరుస విజయాలు నమోదు చేసింది. గ్రూప్ దశలో ఈ జట్టు ఒక్క బలమైన జట్టుపైనే (ఇంగ్లండ్) విజయం సాధించినప్పటికీ.. చిన్న జట్లపై వారి విజయాలను తీసిపారేయడానికి వీల్లేదు. ఆ మ్యాచ్‌ల్లో విండీస్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. మరోసారి అదే ప్రదర్శనలు పునరావృతమైతే తొలిసారి సెమీస్‌కు చేరాలనుకున్న జింబాబ్వేకు ఆశాభంగం కలగవచ్చు. గత నాలుగు మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించిన హోప్, హెట్‌మైర్, షెపర్డ్, మోటీ, హోల్డర్, షమార్ జోసఫ్‌పై విండీస్ మరోసారి భారీ అంచనాలు పెట్టుకుంది. గత మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రొమారియో షెపర్డ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం విండీస్ బలాన్ని మరింత పెంచుతుంది. 70 (విండీస్)-30 (జింబాబ్వే) అంచనాలు ఉన్న ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్‌పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్‌లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించారు. -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.ఈ గ్రూప్‌లో జింబాబ్వే.. ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్‌లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (62), పవన్ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 22, కుసాల్ మెండిస్ 14, కమిందు మెండిస్ 7, దసున్ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్) పరుగులు చేశారు. దుషన్ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్, గ్రేమీ క్రీమర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ తీశాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్ బెన్నెట్ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ సికందర్ రజా (45) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ మరుమణి (34), ర్యాన్ బర్ల్ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్ తీశారు. -
ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు...
పల్లెకెలె: ఆ్రస్టేలియాకు షాక్. అప్పుడు జింబాబ్వే సంచలనంతో షాక్ ఇస్తే, ఇప్పుడు వానొచ్చి మరో షాక్ ఇచ్చింది. జింబాబ్వే–ఐర్లాండ్ల మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడటంతో ఈ లీగ్ మ్యాచ్ రద్దయ్యింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. ఫలితంగా సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే 5 పాయింట్లతో తాజా టి20 ప్రపంచకప్‌లో సూపర్–8కు అర్హత సంపాదించింది. ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే ఆ్రస్టేలియా మెగా ఈవెంట్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందకుండా గ్రూప్ దశలోనే ఆ్రస్టేలియా వెనుదిరగడం ఇదే ప్రథమం. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ జరగాల్సింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ ఎంతకీ మొదలవలేదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మ్యాచ్ జరిగే అవకాశమే లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లు... టీమిండియాకు సూపర్–8లో ముందుగా ఎదురుపడే ప్రత్యర్థి కూడా జింబాబ్వేనే! ఈ నెల 26న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పరాభవాల ప్రభావంతో... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్‌లో మాత్రం సూపర్–8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై అధారపడాల్సిన స్థితికి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిన కంగారూ ఒక్క ఐర్లాండ్‌పై గెలిచి 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం ఒమన్‌తో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిస్తే 4 పాయింట్లతో ఆసీస్ ఇంటికి పయనమవుతుంది. పది టి20 ప్రపంచ కప్‌లలోనూ ఆడిన ఆస్ట్రేలియా లీగ్ దశలో నిష్క్ర మించడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో సెమీఫైనల్ చేరిన ఆసీస్... 2009లో గ్రూప్ దశలో వెనుదిరిగింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సెమీఫైనల్లో ఓడింది. 2014, 2016లలో సూపర్–10లో ఓyì.... 2021లో తొలిసారి విజేతగా అవతరించింది. 2022లో సూపర్–12లో, 2024లో సూపర్–8లో వెనుదిరిగింది. -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్‌కప్‌లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్‌ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్‌గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్‌ప్లేలో 29 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్‌వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్‌కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్‌పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్‌లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్ X ఒమన్‌వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్‌కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్‌ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్‌లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్‌కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్‌లో (ఒమన్) టేలర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమయంలో టేలర్ కుడి కాలి హామ్‌స్ట్రింగ్‌తో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్ స్థానాన్ని బెన్ కర్రన్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రాత్మక ఆటగాడుటేలర్కు ప్రపంచ క్రికెట్లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్‌వెల్ (31) విఫలయత్నం చేశారు. -
ఆసీస్‌పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్‌వెల్ (31) విఫలయత్నం చేశారు. -
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) ధాటికి ఒమన్ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్ కలీమ్, కెప్టెన్ జతిందర్ సింగ్, షా ఫైసల్ తలో 5 పరుగులు, షకీల్ అహ్మద్ 4, జితెన్ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్ మీర్జా, కరన్ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) రాణించారు. మరుమని 21, సికందర్ రజా 5 (నాటౌట్) పరుగులు చేయగా.. డియాన్ మైర్స్ డకౌటయ్యాడు. ఒమన్ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్ ముజరబానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్‌డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. -
WC: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును జమ చేసుకున్నాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్, యూత్ వన్డేల్లో అతి పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ ఫైనల్‌కు చేరింది.55 బంతుల్లో సెంచరీఇందులో భాగంగా శుక్రవారం నాటి టైటిల్ పోరులో ఇంగ్లండ్‌తో తలపడుతున్న ఆయుశ్ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ (9) విఫలం కాగా.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నెమ్మదిగా ఆరంభించినా వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చర పిడుగు.. 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.That's a BIGGIEEEE! 🤯🔥Vaibhav Sooryavanshi is unstoppable at the moment as he scores a MASSIVE SIX off Farhan Ahmed while the 100 run-stand between Boss Baby & Ayush! 🔥🙌🏻ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/O876Ot9LrZ— Star Sports (@StarSportsIndia) February 6, 2026ఈ క్రమంలో ఐదు సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఎడిషన్‌లో ఇరవై సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఏకంగాఇ 175 పరుగులు సాధించాడు. అయితే, లమ్స్‌డన్ బౌలింగ్‌లో థామస్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ డబుల్ సెంచరీ చేయకుండానే నిష్క్రమించాడు.అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏వైభవ్ సూర్యవంశీ- 2026లో 20*🏏డెవాల్డ్ బ్రెవిస్- 2022లో 18🏏ఫిన్ అలెన్- 2016, 2018లో కలిపి 18🏏జాక్ బర్న్‌హామ్- 2016లో 15🏏మైకేల్ హిల్-2008లో 14🏏నికోలస్ పూరన్- 2014లో 14.వరల్డ్‌కప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ఇంగ్లండ్బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్ కీపర్/కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ -
World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..! -
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద సంచలనాలు ఇవే..!
టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు. ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.మెగా టోర్నీ అయిన ప్రపంచకప్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నమోదైన టాప్-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.తొలి ఎడిషన్‌లోనే..!పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్ హీరోలుగా నిలిచారు.ఇంగ్లండ్‌కు నెదర్లాండ్స్ షాక్రెండో ఎడిషన్‌లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై చిన్న జట్టు నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్ ఇంగ్లండ్‌ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్ హీరోలుగా నిలిచారు.పెను సంచలనాల ఎడిషన్2022 ఎడిషన్‌లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.పాక్‌ను మట్టికరిపించిన పసికూన2024 ఎడిషన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన యూఎస్ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్‌కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ప్రదర్శనలు చేసి యూఎస్ఏకు చారిత్రక విజయాన్ని అందించారు. ఇదే ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్‌లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్‌తో పాటు యూఎస్ఏ, నేపాల్ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది. -
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
-
పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్‌కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
సంచలన ప్రదర్శన.. గర్జించిన సికందర్ రజా
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్ రాయల్స్ ఆల్‌రౌండర్, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా చివరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్ డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్ డేవిడ్ వీస్‌పై ఎదురుదాడి చేశాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్సర్ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రూబిన్ హెర్మన్‌ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.SIKANDAR RAZA, THE FINISHER OF PAARL ROYALS 🥶- He smashed an iconic six when they needed 2 from the final ball. pic.twitter.com/SrjGLFL31e— Johns. (@CricCrazyJohns) January 14, 2026వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్ అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్స్ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్ తొలి 5 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్ రాయల్స్ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు. అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్ ప్లేస్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఉంది. జోబర్గ్ సూపర్ కింగ్స, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్‌టౌన్ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.స్కోర్‌ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (66), లియామ్ లివింగ్‌స్టోన్ (32 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు.అనంతరం డాన్ లారెన్స్ (63), రూబిన్ హెర్మన్ (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్ రజా (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
జింబాబ్వే కెప్టెన్ ఇంట తీవ్ర విషాదం
జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్ల సికందర్ రజా పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రజా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్‌గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్‌లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. పాకిస్తాన్లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అప్పటికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. -
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే -
SL Vs ZIM: రాణించిన సికందర్ రజా.. కష్టాల్లో శ్రీలంక
పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో ఇవాళ (నవంబర్ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49), కెప్టెన్ సికందర్ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.మరుమణి 10, బ్రెండన్ టేలర్ 11, ర్యాన్ బర్ల్ 18, మున్యోంగ డకౌట్, ముసేకివా 11, బ్రాడ్ ఈవాన్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్ తీశారు.52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకఅనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక (0), కుసాల్ మెండిస్ (6), కుసాల్ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్ (9) ఔట్ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్‌లో ఉన్నారు.కాగా, పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ జరిగింది. నవంబర్ 18న జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.బెన్నెట్ (49), మరుమణి (30), సికందర్ రజా (34 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.లక్ష్య ఛేదనలో పాక్ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్ జమాన్ (44), ఉస్మాన్ ఖాన్ (37 నాటౌట్) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్ నవాజ్ (21 నాటౌట్) బ్యాట్‌తోనూ రాణించి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్, టాంజానియా, వెస్టిండీస్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్-6, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.గ్రూప్‌లు..గ్రూప్-ఏ- భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్గ్రూప్-బి- జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్గ్రూప్-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంకగ్రూప్-డి- వెస్టిండీస్, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా View this post on Instagram A post shared by Zimbabwe Cricket (@zimbabwe.cricket)చదవండి: టీమిండియాకు భంగపాటు -
జింబాబ్వేతో మ్యాచ్.. బాబర్ ఆజామ్ అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే, శ్రీలంకతో ముక్కోణపు టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పేలవంగా ఆరంభించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆజామ్ కేవలం మూడు బంతులే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఈ పాక్ మాజీ కెప్టెన్ దొరికిపోయాడు. బాబర్ ఆజమ్‌కు గత ఆరు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఇది మూడో డక్. ఈ క్రమంలో అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డౌకౌటైన రెండో పాక్ ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇంతకుముందు ఈ అవాంఛిత రికార్డు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అఫ్రిదిని ఆజామ్ అధిగమించాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ ఆక్మల్, యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌లు సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు. ఆయూబ్, ఆక్మల్ టీ20ల్లో ఇప్పటివరకు పది సార్లు డకౌటయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ ఆటగాళ్లు వీరే..👉సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్‌ల్లో)👉ఉమర్ అక్మల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్‌ల్లో)👉షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్‌ల్లో)👉 కమ్రాన్ అక్మల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్‌ల్లో)👉మహ్మద్ హఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్‌ల్లో)👉మహ్మద్ నవాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్‌ల్లో) -
పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌ను పాకిస్తాన్ విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాక్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (36 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సికందర్ రజా (24 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మరుమని (22 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా, సల్మాన్ మీర్జా, సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి విజయం సాధించింది. ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (12 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (22; 1 ఫోర్, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (1), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్‌కు భారత్ -
చెలరేగిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఇవాళ (నవంబర్ 18) ప్రారంభమైన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. రావల్పిండి వేదికగా పసికూన జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ తొలుత ఇబ్బంది పడింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (49), తదివనషే మరుమణి (30) జింబాబ్వేకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. ఆతర్వాత పాక్ బౌలర్లు లైన్లోకి రావడంతో జింబాబ్వే పతనం మొదలైంది. ఓ పక్క పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో కెప్టెన్ సికందర్ రజా (34 నాటౌట్) ఒంటిపోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించింది. ఓపెనర్లు బెన్నెట్, మరుమణి, సికందర్ రజాతో పాటు జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రెండన్ టేలర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ర్యాన్ బర్ల్ (8), టోనీ మున్యోంగా (3), తషింగ ముసేకివా (2), బ్రాడ్ ఈవాన్స్ (2), టినోటెండా మపోసా (1), రిచర్డ్ నగరవ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (4-0-22-2), అబ్రార్ అహ్మద్ (4-0-28-1), సైమ్ అయూబ్ (4-0-31-1), షాహీన్ అఫ్రిది (4-0-34-1), సల్మాన్ మీర్జా (3-0-21-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలుత వీరంతా ధారాలంగా పరుగులు సమర్పించుకున్నా, ఆతర్వాత కుదురుకున్నారు. ముఖ్యంగా అబ్రార్, నవాజ్ జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ టోర్నీలో పాక్, జింబాబ్వేతో పాటు శ్రీలంక పాల్గొంటుంది. చదవండి: టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..! -
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) పరిధిని పెంచేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండంచెల విధానానికి స్వస్తి పలికి డబ్ల్యూటీసీ ఆడే జట్లను పెంచేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్‌లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.విజేతలు వీరేతొలి సీజన్లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది.తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. కాగా టెస్టు హోదా ఉన్న ఉన్న పన్నెండు జట్ల నుంచి తొమ్మిది జట్లు మాత్రమే ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో భాగమయ్యేవి. ఇందులో టాప్-8లో ఉన్న జట్లు టైటిల్ రేసులో ఉండేవి.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా డబ్ల్యూటీసీలో చేర్చాలనే ఉద్దేశంతో ఐసీసీ.. తొలుత రెండంచెల విధానాన్ని ప్రతిపాదించింది. ఒక అంచె నుంచి భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో ఓ జట్టు.. మిగిలిన జట్లను రెండో అంచెలో చేర్చాలని యోచించింది.తీవ్ర వ్యతిరేకతఅయితే, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు వెస్టిండీస్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇంగ్లండ్ సైతం టూ-టైర్ సిస్టమ్‌ను వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదికగా తాజా ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో వెల్లడించింది.ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..ఆ వివరాల ప్రకారం.. రెండంచెల వ్యవస్థ యోచనను ఐసీసీ విరమించుకుంది. ఇందుకు బదులుగా డబ్ల్యూటీసీలోని జట్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండు పెంచాలని నిర్ణయించింది. అంటే.. వచ్చే సీజన్ (2027-29) నుంచి అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా డబ్ల్యూటీసీలో చేరతాయి.ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్లో లేవన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఐసీసీ బోర్డు డైరెక్టర్ ఒకరు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క జట్టు సంతృప్త స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.కానీ ఓ ట్విస్ట్సంప్రదాయ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం’’ అని పేర్కొన్నారు. కాగా టెస్టు మ్యాచ్ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. అయితే, చిన్న జట్లకు డబ్ల్యూటీసీ ఆడే అవకాశం ఇచ్చినా.. ఆర్థికంగా భరోసా ఇచ్చే అంశంపై ఐసీసీ స్పష్టతనివ్వలేదు.ఐర్లాండ్ వంటి పేద బోర్డులపై దీని ప్రభావం గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఖర్చును భరించే స్థోమత లేక సౌతాఫ్రికా, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ల నిర్వహణకు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
పాకిస్తాన్ ట్రై సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
నవంబర్ 17 నుంచి పాకిస్తాన్లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.అనంతరం నవంబర్ 22వ తేదీ పాకిస్తాన్-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్, 27న పాకిస్తాన్-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్ న్యామ్హురి, బ్రెండన్ టేలర్చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్ -
స్టార్ క్రికెటర్‌పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్‌కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.సీన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. అప్పటికే హెవీగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. 39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్లో 18 టెస్ట్‌లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్‌ను క్షమించేవారు కాదు.జింబాబ్వే క్రికెట్‌కు మాదకద్రవ్యాల ముప్పు జింబాబ్వే క్రికెట్లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్‌పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది. టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. చదవండి: యాషెస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
ఊడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేను (Afghanistan vs Zimbabwe) వారి సొంత గడ్డపై ఊడ్చేసింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (నవంబర్ 2) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) చెలరేగారు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (35 నాటౌట్) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ఈవాన్స్ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం అద్భుతంగా పోరాడింది. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 201 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (51), బ్రియాన్ బెన్నెట్ (47), ర్యాన్ బర్ల్ (37), ముసేకివా (28) పోరాడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అహ్మద్జాయ్ 3, ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ తలో 2, ముజీబ్, నబీ చెరో వికెట్ తీశారు.ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం -
శివాలెత్తిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో (Zimbabwe vs Afghanistan) భాగంగా ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గుర్భాజ్ (Rahmanullah Gurbaz) శివాలెత్తిపోయారు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (15 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో షాహిదుల్లా కమల్ (10) ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్ 2 వికెట్లు తీయగా.. రిచర్డ్ నగరవ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధన -
తిప్పేసిన రషీద్ ఖాన్
హరారే: స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతితో విజృంభించడంతో జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టికరిపించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 19.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. బ్రెండన్ టేలర్ (3), మయెర్స్ (6), బెనెట్ (16), ర్యాన్ బుర్ల్ (10), మున్యోంగా (19), ముసెకివా (13), ఇవాన్స్ (12) విఫలమయ్యారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ముజీబ్, అబ్దుల్లా అహ్మద్జాయ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (51 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... అజ్మతుల్లా ఓమర్జాయ్ (13 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు. వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), డార్విస్ రసూలి (17) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నామమాత్రమైన చివరి టి20 జరగనుంది. -
నబీ చెత్త రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) చెత్త రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక డకౌట్లైన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. 40 ఏళ్ల నబీ 143 ఇన్నింగ్స్‌ల కెరీర్లో 9 సార్లు ఖాతా తెరవకుండా ఔటై, రహ్మానుల్లా గుర్భాజ్‌ను అధిగమించాడు. గుర్భాజ్ 78 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 8 సార్లు డకౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్ తమతమ 67 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో తలో 7 సార్లు డకౌటయ్యారు. నిన్న (అక్టోబర్ 29) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నబీ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నబీ 2 బంతుల్లో డకౌటయ్యాడు. నబీ డకౌటైనా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఓ మోస్తరుకు మించిన స్కోరే (180/6) చేసింది. అనంతరం దాన్ని విజయవంతంగా కాపాడుకొని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (39), సెదిఖుల్లా అటల్ (25), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27), షాహీదుల్లా (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3 వికెట్లతో సత్తా చాటగా.. బ్లెస్సింగ్ ముజరబానీ 2, బ్రాడ్ ఈవాన్స్ ఓ వికెట్ తీశారు.అనంతరం ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-20-4), ఒమర్జాయ్ (4-0-29-3), అహ్మద్జాయ్ (2.1-0-20-2) ధాటికి జింబాబ్వే 16.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లయ్యారు. తొమ్మిదో నంబర్ ఆటగాడు మపోసా (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో టీ20 అక్టోబర్ 31న జరుగనుంది.చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..! -
ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
జింబాబ్వే పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తొలి విజయం నమోదు చేసింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో ఘోర పరాజయం (ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో) ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (అక్టోబర్ 29) జరిగిన టీ20లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (39), సెదిఖుల్లా అటల్ (25), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27), షాహీదుల్లా (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3 వికెట్లతో సత్తా చాటగా.. బ్లెస్సింగ్ ముజరబానీ 2, బ్రాడ్ ఈవాన్స్ ఓ వికెట్ తీశారు.అనంతరం 181 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-20-4), ఒమర్జాయ్ (4-0-29-3), అహ్మద్జాయ్ (2.1-0-20-2) ధాటికి 16.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లయ్యారు. తొమ్మిదో నంబర్ ఆటగాడు మపోసా (32) టాప్ స్కోరర్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ (24), బ్రాడ్ ఈవాన్స్ (24), టోనీ మున్యోంగా (20), తషింగ ముసేకివా (16) రెండంకెల స్కోర్లు చేశారు. రెండో టీ20 అక్టోబర్ 31న జరుగనుంది.చదవండి: టీ20 సిరీస్ విండీస్‌దే -
నిబంధన ఉల్లంఘించిన ఆఫ్ఘనిస్తాన్
తాజాగా జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఇన్నింగ్స్ 73 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్‌తో (Slow Over) బౌలింగ్ చేసినందుకు ఐసీసీ ఆఫ్ఘన్ జట్టుకు జరిమానా విధించింది. ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టింది. నిర్దేశిత సమయంలోపు ఆఫ్ఘన్ బౌలర్లు ఐదు ఓవర్లు తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఫైన్ ఇంపోజ్ చేశాడు. విచారణలో ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తప్పు ఒప్పుకోవడంతో ఎలాంటి చర్యలు లేకుండా జరిమానాతో సరిపెట్టారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్-జింబాబ్వే జట్ల మధ్య అక్టోబర్ 20న మొదలైన టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ఆ జట్టు బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు.బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్‌లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 127, రెండో ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైంది.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. అక్టోబర్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (అక్టోబర్ 29, 31, నవంబర్ 2) ప్రారంభం కానుంది.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్ -
జింబాబ్వే చరిత్రాత్మక విజయం
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే (Zimbabwe) ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. 12 ఏళ్ల తర్వాత జింబాబ్వే గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్ కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు. బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్‌లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు (Afghanistan) ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘన్ స్టార్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (37, 9) ఇబ్రహీం జద్రాన్ (19, 42) పెద్దగా రాణించలేకపోయారు. అయినా తొలి ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, రెండో ఇన్నింగ్స్‌లో జద్రానే టాప్ స్కోరర్లు కావడం విశేషం. కెప్టెన్ హష్మతుల్లా షాహీది (7, 7) రెండు ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో బషీర్ షా (32) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.స్కోర్ వివరాలు..జింబాబ్వే-359ఆఫ్ఘనిస్తాన్-127 & 159కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్ -
శతక్కొట్టిన కర్రన్.. ఫ్యామిలీలో మొదటి వ్యక్తి..!
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రన్ (Ben Curran) సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్‌లకు సోదరుడైన బెన్ కర్రన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు జింబాబ్వే తరఫున వన్డేల్లో కూడా సెంచరీ చేసిన బెన్.. కర్రన్ ఫ్యామిలీలో రెండు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కాడు.కర్రన్ కుటుంబంలో మొత్తం నలుగురు క్రికెటర్లు ఉన్నారు. సామ్, టామ్, బెన్ కర్రన్ల తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడాడు. ఇందులో 9 వికెట్లు తీసి, 2 అర్ద సెంచరీల సాయంతో 287 పరుగులు చేశాడు.బెన్ సోదరుడు సామ్ కర్రన్ ఇంగ్లండ్ తరఫున 24 టెస్ట్‌లు, 35 వన్డేలు, 63 టీ20లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మరో కర్రన్ టామ్ కూడా ఇంగ్లండ్ తరఫున 2 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడినా ఒక్క మూడంకెల స్కోర్ కూడా చేయలేదు. తండ్రి కెవిన్, సామ్ కర్రన్లు ఆల్‌రౌండర్లు కాగా.. టామ్ స్పెషలిస్ట్ బౌలర్. వీరికి టాపార్డర్‌లో బ్యాటింగ్ అవకాశాలు పెద్దగా రాలేదు.అయితే బెన్ అలా కాదు. అతను జింబాబ్వే తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్‌గా, ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. అందుకే అతనికి వన్డేల్లో, టెస్ట్‌ల్లో సెంచరీ చేసే అవకాశం దక్కింది. తండ్రి జన్మస్థలం కావడంతో బెన్ జింబాబ్వే పౌరసత్వం పొంది, ఆ దేశానికి ఆడుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బెన్ సెంచరీతో (121) చెలరేగడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు టీ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6), నిక్ వెల్చ్ (49), బ్రెండన్ టేలర్ (32), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (5), సికందర్ రజా (65) ఔట్ కాగా.. ట్సిగా (11), బ్రాడ్ ఈవాన్స్ క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ 3, ఇస్మత్ ఆలం 2, షరాఫుద్దీన్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌పై 175 పరుగుల ఆధిక్యం సాధించింది.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌటైంది. యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్‌ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
జింబాబ్వేకు అదనపు బోనస్
2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే క్రికెట్ జట్టుకు (Zimbabwe) అదనపు బోనస్ లభించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో (ICC T20 World Cup 2026 Africa Regional Qualifiers) ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నమీబియాపై (Namibia) 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆఫ్రికా క్వాలిఫయర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మరుమణి (74 నాటౌట్), డియాన్ మైర్స్ (44), ర్యాన్ బర్ల్ (26 నాటౌట్) జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు బౌలింగ్‌లో నగరవ 3 వికెట్లతో సత్తా చాటాడు.ఫైనల్లో ఓడినా నమీబియా కూడా జింబాబ్వేతో పాటు 2026 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. జింబాబ్వే గత సీజన్ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటలేక 2024 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.ఇటీవలికాలంలో సికందర్ రజా నేతృత్వంలో బాగా మెరుగుపడిన జింబాబ్వే తిరిగి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. జింబాబ్వే, నమీబియా బెర్త్‌లు ఖరారు కావడంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
టి20 వరల్డ్‌కప్‌లో నమీబియా, జింబాబ్వే
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌నకు నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి. ఆఫ్రికా రీజినల్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. సెమీఫైనల్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కెన్యాపై విజయం సాధించగా... నమీబియా 63 పరుగుల తేడాతో టాంజానియాపై గెలుపొందింది. తద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. 2026 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్, శ్రీలంక ఆతిథ్య హక్కులతో నేరుగా అర్హత సాధించగా... 2024 వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత సాధించాయి. దీంతో మొత్తం 12 జట్లు మెగా టోర్నీ బెర్త్ దక్కించుకోగా... మిగిలిన ఎనిమిది జట్లను వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జరిగిన అమెరికా క్వాలిఫయర్స్‌లో కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్ జట్లు టోర్నీకి బెర్త్ దక్కించుకోగా... తాజాగా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేశాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 17 జట్లపై స్పష్టత రాగా... ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా మరో మూడు జట్లను ఎంపిక చేయనున్నారు. -
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే 2026 టీ20 ప్రపంచకప్‌కు (T20 World Cup 2026) జింబాబ్వే (Zimbabwe) అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్ 2025లో ఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. జింబాబ్వేతో పాటు నమీబియా (Namibia) కూడా ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్‌కు చేరి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. ఉగాండ చేతిలో ఓటమి కారణంగా జింబాబ్వే గత ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.Here are the qualified teams for the T20 World Cup 2026 so far.🏏Namibia booked their spot in the 2026 T20 World Cup with a semi-final win in Harare, while Zimbabwe joined them after defeating Kenya.#T20WorldCup2026 pic.twitter.com/lOnoV1S9JD— CricTracker (@Cricketracker) October 2, 2025జింబాబ్వే, నమీబియా బెర్త్‌లు ఖరారు చేసుకోవడంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో నిన్న (అక్టోబర్ 2) జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో నమీబియా టాంజానియాపై, జింబాబ్వే కెన్యాపై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరాయి. రేపు జరుగబోయే ఫైనల్లో కెన్యా, నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ కోసం పోటీపడతాయి. చదవండి: రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్‌కు తప్పని ఓటమి -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన జింబాబ్వే ప్లేయర్
39 ఏళ్ల జింబాబ్వే (Zimbabwe) వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) లేటు వయసులోనూ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్‌లో (ICC Mens T20 World Cup Africa Regional Final 2025) బోట్స్వానాపై (Botswana) 46 శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.ఈ మ్యాచ్‌లో టేలర్ మరో 11 పరుగులు చేసుంటే టీ20ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. అయితే అనూహ్యంగా అతను 123 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్‌గా తప్పుకున్నాడు. ఈ రికార్డు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పేరిట ఉంది. రజా 2024లో గాంబియాపై 133 పరుగులు చేశాడు. గత 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టేలర్.. ఐసీసీ నిషేధం ముగించుకుని మూడేళ్ల తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు.బోట్స్వానాతో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బ్రెండన్ టేలర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (33 బంతుల్లో 65) కూడా అర్ద సెంచరీతో మెరిశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బోట్స్వానా ఆది నుంచే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులకే చేసింది. ఫలితంగా జింబాబ్వే 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. గత టీ20 వరల్డ్‌కప్‌కు (2024) అర్హత సాధించని జింబాబ్వే.. ఈసారి (2026) ఎలాగైనా వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ జట్టు 2022లో తమ చివరి ఐసీసీ టోర్నీ ఆడింది.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
విధ్వంసం సృష్టించిన అనామక ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
అంతర్జాతీయ టీ20ల్లో నమీబియాకు చెందిన జాన్ ఫ్రైలింక్ అనే అనామక ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వేతో ఇవాళ (సెప్టెంబర్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఫ్రైలింక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు.తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు.. రెండో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన అతను.. మూడో ఓవర్ గ్యాప్ ఇచ్చి, నాలుగో ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ట్రెవర్ గ్వాండు వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. ఫ్రైలింక్ ఊచకోత ధాటికి నమీబియా 4 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ తర్వాత కూడా కాసేపు మెరుపులు కొనసాగించిన ఫ్రైలింక్.. 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి 9వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రైలింక్ చేసిన 13 బంతుల హాఫ్ సెంచరీ, టీ20ల్లో నమీబియా తరఫున అత్యంత వేగవంతమైందిగా రికార్డైంది. ఓవరాల్‌గా చూస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఏరీ పేరిట ఉంది. ఏరీ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏరీ తర్వాత అత్యంత వేగవంతమైన అర్ద శతకం టీమిండియా సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. యువీ 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఫ్రైలింక్‌కు ముందు మరో ముగ్గురు 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 2019లో ఆస్ట్రియాకు చెందిన మీర్జా ఎహసాన్, 2024లో జింబాబ్వేకు చెందిన మరుమణి, ఇదే ఏడాది టర్కీకి చెందిన ముహమ్మద్ ఫహాద్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు ఫినిష్ చేశారు.ఫ్రైలింక్‌కు ముందు నమీబియా తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు లాఫ్టీ ఈటన్ పేరిట ఉంది. గతేడాది లాఫ్టీ నేపాల్‌పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, ఫ్రైలింక్ సుడిగాలి అర్ద సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నమీబియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫ్రైలింక్ ఔటయ్యాక నెమ్మదించిన నమీబియా స్కోర్ ఆఖర్లో మళ్లీ పుంజుకుంది. రూబెన్ ట్రంపల్‌మన్ (46), అలెగ్జాండర్ (20) జింబాబ్వే బౌలర్లను ఎడాపెడా వాయించారు.ఫ్రైలింక్‌ను ఔట్ చేయడమే కాకుండా మరో రెండు వికెట్లు (4-0-25-3) తీసిన సికందర్ రజా నమీబియాను కాస్త ఇబ్బంది పెట్టాడు. మపోసా, మసకద్జ, ముజరబానీ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం నమీబియా జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన జింబాబ్వే ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
స్వదేశంలో నమీబియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా జింబాబ్వేనే గెలుపొందింది. 33 పరుగుల తేడాతో పర్యాటక జట్టును ఓడించింది. నామమాత్రపు చివరి టీ20 సెప్టెంబర్ 18న బులవాయో వేదికగా జరుగనుంది.రాణించిన క్రుగర్, లాఫ్టీతొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. మలాన్ క్రుగర్ (45), లాఫ్టీ ఈటన్ (47) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (37), జాన్ ఫ్రైలింక్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చివరి ఓవర్లలో నమీబియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకుని పెద్ద స్కోర్ చేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, రిచర్డ్ నగరవ తలో 2 వికెట్లు తీయగా.. మపోసా, కెప్టెన్ సికందర్ రజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చెలరేగిన బెన్నెట్.. సత్తా చాటిన మరుమణి170 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆది నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (40), మరుమణి (50) పోటీపడి పరుగులు రాబట్టారు. అనంతరం బ్రెండన్ టేలర్ (29), ర్యాన్ బర్ల్ (24 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించడంతో జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో స్మిట్ 2, బెర్నాల్డ్ స్కోల్జ్, ట్రంపల్‌మన్ తలో వికెట్ తీశారు. ముసేకివా సిక్సర్ కొట్టి జింబాబ్వేను గెలిపించాడు. -
విధ్వంసం సృష్టించిన బెన్నెట్.. జింబాబ్వే ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నమీబియాతో ఇవాళ (సెప్టెంబర్ 15) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.ఆఖర్లో ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్ దక్కిందిఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయినా లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌ల్లో తలా కొన్ని పరుగులు చేశారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. నికోల్ లాఫ్టీ (38), జేన్ గ్రీన్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబానీ తలో 2 వికెట్లు తీసి నమీబియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మసకద్జ, నగరవ, బ్రాడ్ ఈవాన్స్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 రేపు (సెప్టెంబర్ 16) జరుగనుంది. -
జింబాబ్వే భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న నమీబియా
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం నమీబియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 15) తొలి మ్యాచ్ జరుగుతుంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్ దక్కిందిఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా కూడా ధీటుగా బదులిస్తుంది. 7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 70 పరుగులు చేసింది. జాన్ లాఫ్టన్ (20 బంతుల్లో 37), జాన్ ఫ్రైలింక్ (9 బంతుల్లో 18) ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ మలాన్ క్రూగర్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ శ్రీలంక సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో శ్రీలంక సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను 8 వికెట్ల తేడాతో లంక చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టి మారుమణి(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(28), బర్ల్(18), సీన్ విలియమ్స్(23), ముసెకివా(18) రాణించారు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా రెండు, పతిరాన, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.కమిల్ మిశ్రా విధ్వంసం..అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో చేధించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు కుశాల్ మెండిస్(33), ఫాథుమ్ నిస్సాంక(30) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆ తర్వాత యువ ఆటగాడు కమిల్ మిశ్రా(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ పెరీరా(26 బంతుల్లో 46) బ్యాట్ ఝూలిపించాడు. జింబాబ్వే బౌలర్లలో రజా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. కాగా రెండో టీ20లో శ్రీలంక అనూహ్య ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: SA vs ENG: ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్! భారత్ రికార్డు సమం -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. కోహ్లి, స్కైను అధిగమించి ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కు నెట్టాడు.నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఈ అవార్డుతో అంతర్జాతీయ టీ20ల్లో రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల సంఖ్య 17కు చేరగా.. కోహ్లి, స్కై 16 వద్ద ఉన్నారు. ఓవరాల్‌గా (ఐసీసీ సభ్య దేశాలన్నీ) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు మలేసియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్ (22) పేరిట ఉంది.కొనసాగుతున్న రజా హవాఅంతర్జాతీయ టీ20ల్లో సికందర్ రజా హవా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్లో అతను 39 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ, తన దేశం కాని దేశానికి వన్నె తెస్తున్నాడు. రజా పాకిస్తాన్లో పుట్టి, జింబాబ్వే తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.2013లో అంతర్జాతీయ టీ20 కెరీర్ మొదలుపెట్టిన రజా.. 12 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించి, టాప్ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా సత్తా చాటుతూనే, కెప్టెన్‌గా జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే మరోసారి చేసి, తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకను చిత్తు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటి తన జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రజా.. శ్రీలంకను 80 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. -
పసికూన చేతిలో పరాభవం.. శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే
పసికూన జింబాబ్వే చేతిలో శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జింబాబ్వే బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వేపై ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్.అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే సైతం ఇబ్బంది పడినా.. ఎలాగోలా 14.2 ఓవర్లలో సగం వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించింది.చెలరేగిన జింబాబ్వే బౌలర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆది నుంచే శ్రీలంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి ఒక్క బౌలర్ లంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. సికందర్ రజా (4-0-11-3), బ్రాడ్ ఈవాన్స్ (2.4-0-15-3), ముజరబానీ (3-0-14-2), సీన్ విలియమ్స్ (4-0-19-1) అత్యుత్తమంగా రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కమిల్ మిషారా (20) టాప్ స్కోరర్ కాగా.. అసలంక 18, షకన 15 పరగులు చేశారు.చమటోడ్చిన జింబాబ్వే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే తీవ్రంగా శ్రమించింది. 81 పరుగులను ఛేదించేందుకు ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లు తీసుకుంది. చమీరా (4-0-19-3), తీక్షణ (4-0-28-1), బినుర ఫెర్నాండో (3-0-14-1) జింబాబ్వే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయినా ర్యాన్ బర్ల్ (20 నాటౌట్), తషింగ ముసేకివా (21 నాటౌట్) నిలకడగా ఆడి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 సెప్టెంబర్ 7న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. అసాధారణ రికార్డు సొంతం
పొట్టి క్రికెట్లో పట్టుమని 10 పరుగులు చేసినా అందులో ఓ సిక్సర్ తప్పక ఉంటుంది. అలాంటిది హాఫ్ సెంచరీనో లేక ఆపై స్కోరో చేస్తే కనీసం రెండు, మూడు సిక్సర్లైనా ఉంటాయి. పొట్టి ఫార్మాట్లో జరిగే ఏ మ్యాచ్‌లో అయినా ఈ తంతు సహజంగా జరుగుతుంటుంది.అయితే తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ ఏకంగా 81 పరుగులు చేసినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 3) శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 57 బంతులు ఎదుర్కొని ఒక్క సిక్సర్ కూడా లేకుండా 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.ఈ క్రమంలో బెన్నెట్ ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫుల్ మెంబర్ సభ్య దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లో సిక్సర్ లేకుండా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట సంయుక్తంగా ఉండేది.బాబర్, ఫాఫ్ ఇద్దరూ గతంలో సిక్సర్ లేకుండా 79 పరుగులు చేశారు. ఈ రికార్డు జాబితాలో రికీ పాంటింగ్ లాంటి డాషింగ్ బ్యాటర్ కూడా ఉండటం విశేషం. అన్ని ఐసీసీ సభ్య దేశాలన్నిటీ పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డు మాల్వాయ్కు చెందిన సామి సోహైల్ పేరిట ఉంది. 2022లో అతను లెసోధోపై సిక్సర్ లేకుండా 94 పరుగులు చేశాడు.ఒంటరి పోరాటంశ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బెన్నెట్ ఒంటరిపోరాటం చేశాడు. జట్టులో మిగతా ఏ బ్యాటర్ ఓ మోస్తరు స్కోరైనా చేయలేకపోగా.. బెన్నెట్ ఒక్కడే దాదాపు సెంచరీ (87) చేసినంత పని చేశాడు. బెన్నెట్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఓ మోస్తరుకు మించిన స్కోర్ (175/7) చేసింది.అనంతరం బౌలర్లు మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఒక్క ఓవర్ జింబాబ్వే కొంపముంచింది. మపోసా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కమిందు మెండిస్ 26 పరుగులు పిండుకుని శ్రీలంకను గెలిపించాడు. అంతకుముందు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (55), కుసాల్ మెండిస్ (38) ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా లంక గెలుపుకు దోహదపడ్డాయి.ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. -
లంకను గెలిపించిన కమిందు.. గట్టి పోటీ ఇచ్చిన జింబాబ్వే
2 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరగ్గా, ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతోంది. వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-0 క్లీన్ స్వీప్ చేసినప్పటికీ జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో గట్టి పోటీనిచ్చింది.అదే పోరాటాన్ని జింబాబ్వే టీ20 సిరీస్‌లోనూ కొనసాగిస్తుంది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్‌లో 175 పరుగులు చేసి, ఆతర్వాత చివరి ఓవర్ వరకు ఆ స్కోర్‌ను కాపాడుకోగలిగింది. వన్డే సిరీస్ తరహాలోనే శ్రీలంక తొలి టీ20లోనూ గెలుపు కోసం చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్లు మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క ఓవర్ దెబ్బకొట్టింది. మపోసా వేసిన 18వ ఓవర్లో కమిందు మెండిస్ 26 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ శ్రీలంక చేతుల్లోకి వచ్చేసింది.అప్పటివరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. ఆ ఒక్క ఓవరే జింబాబ్వే చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఆతర్వాత కమిందు.. హేమంత సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (16 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆడిన కమిందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.అంతకుముందు బ్రియాన్ బెన్నెట్ (57 బంతుల్లో 81; 12 ఫోర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్నెట్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ సికందర్ రజా (28), ర్యాన్ బర్ల్ (17), తషింగ ముసేకివా (11) రెండంకెల స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు పడగొట్టగా.. తుషార, తీక్షణ, హేమంత తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (55), కుసాల్ మెండిస్ (38) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి లంక గెలుపుకు గట్టి పునాది వేశారు. అయితే వీరిద్దరు ఔట్ కాగానే శ్రీలంక ఇరకాటంలో పడింది. స్వల్ప వ్యవధిలో మరో 4 వికెట్లు కోల్పోయింది. ఒత్తిడిలో కమిందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి లంకను గెలిపించాడు. ఆ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 2, ముజరబానీ, మపోసా, బ్రాడ్ ఈవాన్స్, సికందర్ రజా తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది. -
నిబంధన ఉల్లంఘించిన శ్రీలంక.. గెలిచిన ఆనందం ఎంతో సేపు లేకుండా..!
రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వేను వారి సొంత దేశంలో ఓడించి (2-0తో) విజయానందంలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నిన్న (ఆగస్ట్ 31) జరిగిన రెండో వన్డేలో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ లంక జట్టుకు జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (ఓ ఓవర్ వెనుకపడింది). ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ కిందికి వస్తుంది. దీంతో శ్రీలంక జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధించారు. ఐసీసీ విధించిన ఈ పెనాల్టీని లంక కెప్టెన్ అసలంక స్వీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో జింబాబ్వే క్లీన్ స్వీప్ అయినా మంచి మార్కులే కొట్టేసింది. తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకకు జింబాబ్వే ఆటగాళ్లు ముచ్చెమటలు పట్టించారు. రెండు మ్యాచ్‌ల్లో దాదాపుగా ఓడించినంత పని చేశారు. రెండు వన్డేల్లో శ్రీలంక అతి కష్టం మీద చివరి ఓవర్లో బయటపడింది.నిన్న జరిగిన రెండో వన్డేలో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్ మూడో బంతికి గెలుపునందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పథుమ్ నిస్సంక (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) అద్భుతమైన శతకంతో, కెప్టెన్ అసలంక (61 బంతుల్లో 71; 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కదంతొక్కినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అంత సులువుగా ఓటమిని ఒప్పుకోలేదు.అంతకుముందు తొలి వన్డేలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ జింబాబ్వే 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర్ రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మధుష్క చివరి ఓవర్లో చెలరేగకపోయుంటే జింబాబ్వేనే మ్యాచ్ గెలిచేది. -
శతక్కొట్టిన నిస్సంక.. ఉత్కంఠ పోరులో శ్రీలంక గెలుపు
జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 31) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బెన్ కర్రన్ (95 బంతుల్లో 79; 9 ఫోర్లు), సికందర్ రజా (55 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు తీయగా.. అషిత ఫెర్నాండో 2, దిల్షన్ మధుష్క, జనిత్ లియనాగే చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) అద్భుతమైన శతకంతో కదంతొక్కినా, చివరి ఓవర్లో విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. నిస్సంకకు జతగా కెప్టెన్ అసలంక (61 బంతుల్లో 71; 7 ఫోర్లు) కూడా రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఈవాన్స్ తలో 2 వికెట్లు తీయగా.. ముసుకు ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ సిరీస్‌లో తొలి వన్డేలోనూ జింబాబ్వే గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకు పోరాడినా ఆ జట్టుకు ఓటమైతే తప్పలేదు. ఈ సిరీస్‌లో ఓడినా జింబాబ్వేకు మంచి మార్కులే పడ్డాయి. తమకంటే మెరుగైన శ్రీలంకపై జింబాబ్వే అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటింది.తొలి వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో హరారే వేదికగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక ఆసియా కప్ ఆడేందుకు నేరుగా యూఏఈకి వెళ్లనుంది. -
ప్రపంచ క్రికెట్లో మరో స్టార్.. 'ఆ నలుగురికి' ఛాలెంజ్ విసురుతున్న లంక బ్యాటర్
27 ఏళ్ల శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ పథుమ్ నిస్సంక ప్రపంచ క్రికెట్లో మరో బ్యాటింగ్ స్టార్‌గా రూపాంతరం చెందుతున్నాడు. ఇతగాడు ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, నయా ఫ్యాబ్ ఫోర్లో ఒకడిగా ఉండేందుకు పూర్తి స్థాయి అర్హుడినంటూ సవాళ్లు విసురుతున్నాడు.ఇప్పటివరకు 18 టెస్ట్‌లు, 71 వన్డేలు, 65 టీ20లు ఆడిన నిస్సంక.. టెస్ట్‌ల్లో 45 సగటున 4 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 1305 పరుగులు.. వన్డేల్లో 42 సగటున డబుల్ సెంచరీ, 7 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 2730 పరుగులు.. టీ20ల్లో 121.66 స్ట్రయిక్‌రేట్‌తో 14 అర్ద సెంచరీల సాయంతో 1854 పరుగులు చేసి అతి తక్కువ మంది ఆల్ ఫార్మాట్ బ్యాటర్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు.నిస్సంక ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 76 పరుగులతో (92 బంతుల్లో 12 ఫోర్లు) రాణించిన అతను.. ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతమైన శతకంతో (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ తన జట్టును గెలుపు తీరాల వరకు చేర్చాడు.నిస్సంక తాజా ప్రదర్శన తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానుల మధ్య నయా ఫ్యాబ్ ఫోర్‌పై చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ, రూట్, విలియమ్సన్, స్మిత్ ఫ్యాబ్ ఫోర్‌గా కీర్తించబడుతున్నారు. వీరి కెరీర్లు చరమాంకానికి ఉన్న దశలో, నయా ఫ్యాబ్ ఫోర్ ఎవరనే చర్చ జరుగుతుంది.రేసులో చాలామంది యువ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ నయా ఫ్యాబ్ ఫోర్ రేసులో ముందున్నారు. వీరితో పాటు కెమరూన్ గ్రీన్, జేకబ్ బేతెల్ పేర్లు అడపాదడపా వినిపిస్తున్నా.. పోటీ మాత్రం గిల్, యశస్వి, బ్రూక్, రచిన్ మధ్యే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫ్యాబ్ ఫోర్లో ఉండేందుకు తాను కూడా అర్హుడినేంటూ పథుమ్ నిస్సంక ముందుకొచ్చాడు. తన అసమాన ప్రతిభతో నయా ఫ్యాబ్ ఫోర్లో బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా మారాడు. ఫార్మాట్లకతీతంగా గణాంకాలు అతన్ని ప్రధాన పోటీదారుగా మారుస్తున్నాయి. ఇదే ప్రదర్శనలను అతను మున్ముందు కూడా కొనసాగిస్తే, తప్పక నయా ఫ్యాబ్ ఫోర్లో ఒకడిగా కీర్తింబడతాడు. ప్రస్తుతానికైతే నిస్సంక నలుగురి మధ్య ఉన్న పోటీని ఐదుగురి మధ్యకు మార్చాడు. -
రాణించిన కర్రన్, సికందర్ రజా.. శ్రీలంకకు కఠిన సవాల్ విసిరిన జింబాబ్వే
హరారే వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే శ్రీలంక జట్టుకు కఠిన సవాల్‌ను విసిరింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేసింది. టాస్ ఓడినా శ్రీలంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. ఓపెనర్ బెన్ కర్రన్ (95 బంతుల్లో 79; 9 ఫోర్లు), సికందర్ రజా (55 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కర్రన్, సికిందర్ రజాతో పాటు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. వికెట్‌కీపర్ క్లైవ్ మదండే 36, బ్రియాన్ బెన్నెట్ 21, బ్రెండన్ టేలర్, కెప్టెన్ సీన్ విలియమ్స్ తలో 20, మున్యోంగా 10, బ్రాడ్ ఈవాన్స్ 8, నగరవ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లు ఏకంగా 19 వైడ్లు వేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు తీయగా.. అషిత ఫెర్నాండో 2, దిల్షన్ మధుష్క, జనిత్ లియనాగే చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఒ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఈవాన్స్ ఆదిలో ఇబ్బంది పెట్టాడు. జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద నువనిదు ఫెర్నాండోను (14), 68 పరుగుల వద్ద కుసాల్ మెండిస్‌ను (5) ఈవాన్స్ ఔట్ చేశాడు. 20 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయాక శ్రీలంక జట్టు జాగ్రత్తగా ఆడుతుంది. పథుమ్ నిస్సంక, సదీర సమరవిక్రమ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయమైన 55 పరుగులు జోడించారు. 26 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 126/2గా ఉంది. నిస్సంక 77, సమరవిక్రమ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి.కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను ఓడించినంత పని చేసింది. శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. లేకపోయుంటే జింబాబ్వే సంచలన విజయం సాధించేది. జింబాబ్వే ఆటగాళ్ల పట్టుదల చూస్తుంటే రెండో మ్యాచ్‌లోనూ హోరాహోరీ తప్పేలా లేదు. పోరాడేందుకు వారు మంచి స్కోరే చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి శ్రీలంకకు అనుకూలంగా ఉన్నా, మ్యాచ్ సాగేకొద్ది ఏమైనా జరగవచ్చు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత
జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ ఇటీవలికాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో దారుణంగా విఫలమైన బ్రెండన్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకి మరోసారి వార్తల్లోకెక్కాడు.ఈసారి అతడు జింబాబ్వే తరఫున చారిత్రక మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇవాళ (ఆగస్ట్ 31) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బ్రెండన్ అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో బ్రెండన్‌కు ముందు ఆండీ ఫ్లవర్ (320 ఇన్నింగ్స్‌ల్లో 11580 పరుగులు), గ్రాంట్ ఫ్లవర్ (337 ఇన్నింగ్స్లోల 10028 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించారు. జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన బ్రెండన్ తన కెరీర్లో 320 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనతను ఓ వంద మాత్రమే సాధించారు. జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు (11) చేసిన ఆటగాడిగా రికార్డు కలిగిన బ్రెండన్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య తర్వాత అత్యధిక వన్డే కెరీర్ (21 ఏళ్లు) కలిగిన ఆటగాడిగానూ రికార్డుల్లో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బ్రెండన్ టేలర్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బెన్ కర్రన్ (79), సికందర్ రజా (59 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పర్యాటక శ్రీలంక 7 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. -
శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమి
జింబాబ్వే పర్యటనను శ్రీలంక విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 7 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆతిథ్య జట్టుపై లంకేయులు పై చేయి సాధించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక దూసుకెళ్లింది.మదుషంక హ్యాట్రిక్..కాగా 299 పరుగుల లక్ష్యఛేదనలో 49 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 289/5తో నిలిచింది. జింబాబ్వే విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా... ఆఖరి ఓవర్ వేసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్షాన్ మదుషంక (4/62) శ్రీలంకను గెలిపించాడు.తొలి మూడు బంతులకు వరుసగా సికందర్ రజా (87 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రాడ్ ఇవాన్స్ (0), రిచర్డ్ నరావా (0)ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేయగలిగిన జింబాబ్వే 7 పరుగుల తేడాతో ఓడింది.నిశాంక, జనిత్ హాఫ్ సెంచరీలు..అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. నిశాంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు), జనిత్ లియనాగె (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులకు పరిమితమైంది. బెన్ కరన్ (90 బంతుల్లో 70; 8 ఫోర్లు), కెప్టెన్ సీన్ విలియమ్స్ (54 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే చివర్లో ఒత్తిడికి తట్టుకోలేకపోయిన జింబాబ్వే జట్టు పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: టైటాన్స్ ఓటమితో మొదలు -
అవినీతి కేసులో నిషేధం.. రీఎంట్రీలో చెత్త రికార్డు
అవినీతి కేసులో దాదాపు నాలుగేళ్లు నిషేధాన్ని ఎదుర్కొని శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న మ్యాచ్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే వెటరన్ స్టార్ బ్రెండన్ టేలర్.. తొలి మ్యాచ్‌లోనే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మూడు బంతులు ఆడి డకౌటయ్యాడు. తద్వారా జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో తతెండ టైబు, ప్రాస్పర్ ఉత్సేయతో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. టైబు, ఉత్సేయ, బ్రెండన్ వన్డేల్లో తలో 16 సార్లు డకౌట్లయ్యారు. ఈ జాబితాలో గ్రాంట్ ఫ్లవర్ (18) అగ్రస్థానంలో ఉండగా.. ఎల్టన్ చిగుంబర (17) రెండో ప్లేస్‌లో నిలిచాడు.భారీ అంచనాలతో వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ తొలి మ్యాచ్‌లోనే తస్సుమనడంతో జింబాబ్వే అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్రెండన్ ఫీల్డింగ్ సమయంలోనూ నిరాశపరిచాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే (రెండో ఓవర్) గాయపడి మైదానాన్ని వీడాడు. అయితే గాయం చిన్నదే కావడంతో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. మూడు బంతుల్లోనే పెవిలియన్ బాట పట్టాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన 39 ఏళ్ల బ్రెండన్‌కు జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్లలో ఒకడిగా పేరుంది. ఇతను 206 వన్డేల్లో 11 సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 6684 పరుగులు చేశాడు. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆటగాడిగాపై సహజంగానే అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలకు బ్రెండన్ నీరుగార్చాడు.శ్రీలంకతో మ్యాచ్‌లో 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం నాలుగో బంతికే బ్రెండన్ టేలర్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో జింబాబ్వే తొలి ఓవర్లో ఖాతా కూడా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బెన్ కర్రన్, కెప్టెన్ సీన్ విలియమ్స్ అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి జింబాబ్వేను ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. 57 పరుగుల వద్ద విలియమ్స్ ఔట్ కాగా.. కర్రన్ (70 నాటౌట్), సికందర్ రజా (7) ఛేదనను కొనసాగిస్తున్నారు. 25.4 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 140/3గా ఉంది. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 2, కమిందు మెండిస్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. -
విధ్వంసం సృష్టించిన కమిందు, లియనాగే.. శ్రీలంక భారీ స్కోర్
రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. లియనాగే, మెండిస్ ఆరో వికెట్‌కు 83 బంతుల్లో 137 పరుగులు జోడించి, స్కోర్‌ను 300 పరుగుల సమీపానికి చేర్చారు. ఇన్నింగ్స్ చివరి బంతికి కమిందు ఔట్ కాకపోయుంటే స్కోర్ 300 దాటేదే.ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. 13 బంతులు ఆడిన ఓపెనర్ నిషాన్ మధుష్క డకౌటయ్యాడు. ఆతర్వాత నిస్సంక.. కుసాల్ మెండిస్ (38), సదీర సమరవిక్రమతో (35) ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుసాల్‌తో 100 పరుగులు, సమరవిక్రమతో 30 పరుగులు జోడించాడు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఆఖర్లో కమిందు, లియనాగే చెలరేగి భారీ స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 2 వికెట్లు తీయగా.. బ్లెస్సింగ్ ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, సికందర్ రజా, సీన్ విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, శ్రీలంక జట్టు 2 మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో రెండో వన్డే ఆగస్ట్ 31న, మూడు టీ20లు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరుగనున్నాయి. ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు ఈ సిరీస్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఈ సిరీస్ పూర్తైన వెంటనే శ్రీలంక నేరుగా యూఏఈకి వెళ్లనుంది. జింబాబ్వే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్.. మ్యాచ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే గాయంతో వైదొలిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కూడా గాయం కారణంగానే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఎర్విన్ స్థానంలో వన్డే సిరీస్‌లో సీన్ విలియమ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. -
నాలుగేళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ.. 2 ఓవర్లు కూడా ఆడకుండానే..!
స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 29) తొలి వన్డే ప్రారంభం కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే స్టార్ ప్లేయర్, వికెట్‌కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ గాయాలపాలయ్యారు. ఎర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. టేలర్ స్థానంలో క్లైవ్ మదండే వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన టేలర్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే వికెట్‌కీపింగ్ చేస్తుండగా.. అతడి చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. అవినీతి కేసులో టేలర్ మూడున్నరేళ్ల నిషేధాన్ని ఇటీవలే పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు తొలి వన్డే ప్రారంభానికి ముందే గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌కు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ఎర్విన్ వన్డే సిరీస్ మొత్తానికే దూరమైనట్లు మాత్రం ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వే-శ్రీలంక మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 36 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (76), నిషాన్ మధుష్క (0), కుసాల్ మెండిస్ (38), సదీర సమరవిక్రమ (35) ఔట్ కాగా.. కెప్టెన్ చరిత్ అసలంక (6), జనిత్ లియనాగే (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సకందర్ రజా, సీన్ విలియమ్స్ తలో వికెట్ తీశారు. -
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ గురువారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమయ్యాడు.బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్బంగా గాయపడిన హసరంగా ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు ఆసియాకప్-2025 సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అసలంక సారథ్యంలోని లంక జట్టు ఇప్పటికే జింబాబ్వేకు చేరుకుంది.ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో లంకేయులు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నారు. శుక్రవారం నుంచి హరారే వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి 7 మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఆసియాకప్ సన్నాహాకంగా శ్రీలంకకు ఉపయోగపడనుంది. ఈ సిరీస్ ముగిశాక శ్రీలంక జట్టు నేరుగా జింబాబ్వే నుంచి దుబాయ్‌కు చేరుకోనుంది. ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 13న అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ఖండంత టోర్నీ కోసం తమ జట్టును శ్రీలంక క్రికెట్ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.జింబాబ్వే సిరీస్‌కు లంక జట్టుచరిత్ అసలంక(కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, నువానీదు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశ్రా, విషెన్ హలంబాగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్న, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, మతీషా పతిరాన, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండోచదవండి: నేను ఆడడం ఎవరికైనా సమస్యా? నా రిటైర్మెంట్ అప్పుడే: షమీ -
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్ చరిత్ అసలంక కాగా.. పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, నిషాన్ మధుష్క, దుష్మంత చమీరా, దిల్షన్ మధుషంక, అసిత ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే సభ్యులుగా కొనసాగారు. చివరిగా బంగ్లాదేశ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో సభ్యులుగా ఉన్న అవిష్క ఫెర్నాండో, ఎషాన్ మలింగకు ఈ జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడిన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. టాపార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. నువనిదు చివరిగా గతేడాది న్యూజిలాండ్‌తో వన్డేలో ఆడాడు. ఈ జట్టులో 22 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ పవన్ రత్నాయకేకు కూడా చోటు దక్కింది. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటడంతో రత్నాయకే తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.కాగా, శ్రీలంక జట్టు రెండు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆగస్ట్ 29 నుంచి జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. ఆగస్ట్ 29, 31 తేదీల్లో హరారే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో ఇదే హరారే వేదికగా టీ20లు కూడా జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం లంక జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.జింబాబ్వేతో వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (సి), పథుమ్ నిస్సంక, నిషాన్ మధుష్క, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, నువనిదు ఫెర్నాండో, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, దునిత్ వెల్లలగే, మిలన్ రత్నాయకే, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ఆసిత ఫెర్నాండో, దుష్మంత చమీరా, దిల్షన్ మధుశంక -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. టెస్టుల్లో అతి పెద్ద విజయం!
జింబాబ్వే పర్యటనను న్యూజిలాండ్ అద్బుతమైన విజయంతో ముగించింది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జింబాబ్వేను ఇన్నింగ్స్ అండ్ 359 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. టెస్టుల్లో పరుగుల పరంగా న్యూజిలాండ్ ఇదే అతి పెద్ద విజయం. అంతేకాకుండా ఈ భారీ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. నిప్పులు చెరిగిన హెన్రీఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ మాట్ హెన్రి 5 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రెండన్ టేలర్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.ముగ్గురు మొనగాళ్లు..అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 601/3 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) ,హెన్రీ నికోల్స్(150 నాటౌట్),రచిన్ రవీంద్ర(165 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరి ముగ్గురుతో పాటు విల్ యంగ్(74) పరుగులతో రాణించాడు.దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు జింబాబ్వే కంటే 476 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే 117 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ 5 వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, డఫీ తలా రెండేసి వికెట్లు సాధించారు.మూడో జట్టుగా..కాగా ఈ విజయంతో న్యూజిలాండ్ మరో రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించిన మూడో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1958లో ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. తాజా గెలుపుతో విండీస్‌ను కివీస్ అధిగమించింది. కాగా అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్ధానంలో ఉంది. 1938లో 579 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఇంగ్లీష్ జట్టు ఓడించింది.చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై బ్యాన్!? -
న్యూజిలాండ్ శతకాల మోత
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు సెంచరీలతో విజృంభించారు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 174/1తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... చివరకు 130 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 601 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153; 18 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (245 బంతుల్లో 150 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (139 బంతుల్లో 165 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదంతొక్కారు. నైట్‌వాచ్‌మన్ జాకబ్ డఫీ (36; 6 ఫోర్లు) త్వరగానే అవుట్ కాగా... కాన్వే, నికోల్స్ మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కాన్వే 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు వరకు టెస్టు మ్యాచ్ తరహాలో సాగిన పోరును... రచిన్ వన్డేలాగా మార్చేశాడు. ధనాధన్ షాట్లతో రెచ్చిపోతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో నికోల్స్ కాస్త నిధానంగా ఆడగా... రచిన్ మాత్రం జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు. నికోల్స్ 166 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరగా... రవీంద్ర చూస్తుండగానే 104 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ జంట ఆఖరి సెషన్ చివరి గంటలో చెలరేగిపోయింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. సెంచరీ నుంచి 150కి చేరేందుకు రవీంద్ర 29 బంతులు మాత్రమే తీసుకున్నాడంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రచిన్, నికోల్స్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 256 పరుగులు జోడించారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, ట్రేవర్, మసెకెసా తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌట్ కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ 476 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
అరుదైన మైలురాయిని తాకిన డెవాన్ కాన్వే
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ వెటరన్ బ్యాటర్ టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 పరుగుల మార్కును తాకాడు. 79 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఇటీవలికాలంలో పేలవ ఫామ్‌లో ఉండిన కాన్వే.. ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 88 పరుగులు చేశాడు. 2021లో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన కాన్వే.. తన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్ కెరీర్లో 29 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 4 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. జింబాబ్వేను 125 పరుగులకు కుప్పకూల్చిన ఆ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. కాన్వేతో (79) పాటు జేకబ్ డఫీ (8) క్రీజ్‌లో ఉన్నారు. విల్ యంగ్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.అంతకుముందు మ్యాట్ హెన్రీ (15-3-40-5), జకరీ ఫోల్క్స్ (16-5-38-4) విజృంభించడంతో జింబాబ్వే 125 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మూడున్నరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ విన్సెంట్ మసేకెసా 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ కొసం న్యూజిలాండ్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
న్యూజిలాండ్ జట్టుకు మరో బిగ్ షాక్
జింబాబ్వేతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 7) ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు వరుస షాక్‌లు తగిలాయి. తొలుత పేసర్ విలియమ్ ఓరూర్కీ వెన్ను గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోగా.. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేయలేక సిరీస్ నుంచి వైదొలిగాడు. ఓరూర్కీకి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్‌ను ఎంపిక చేసిన న్యూజిలాండ్ సెలెక్టర్లు.. లాథమ్‌కు రీప్లేస్‌మెంట్‌గా 23 ఏళ్ల ఆక్లాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను సెలెక్ట్ చేశారు.లిస్టర్ ఇదివరకే జట్టులో చేరిపోగా.. జొహనెస్‌బర్గ్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న జాకబ్స్‌ను హుటాహుటిన జట్టులో చేరాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ సారధిగా కొనసాగనున్నాడు. లాథమ్ భుజం గాయంతో బాధపడుతుండటంతో సాంట్నర్ తొలి టెస్ట్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టెస్ట్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ ఉగ్రరూపం దాల్చి జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. హెన్రీ ధాటికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హెన్రీ, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఆ మ్యాచ్‌లో ప్రస్తుతం గాయపడిన పేసర్ విలియమ్ ఓరూర్కీ కూడా పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయలేకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) కూడా రాణించారు. కాన్వే చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. -
చెలరేగిపోయిన మ్యాట్ హెన్రీ.. పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాట్ హెన్రీ (15.3-3-39-6), నాథన్ స్మిత్ (14-8-20-3) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) రాణించడంతో 307 పరుగులు చేసింది. బ్లెస్సింగ్ ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు.158 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఈ ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేసింది. మిచెల్ సాంట్నర్ (17.1-6-27-4), మ్యాట్ హెన్రీ (21-5-51-3), విలియమ్ ఓరూర్కీ (10-4-28-3) ధాటికి 165 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన సీన్ విలియమ్స్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం 8 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 2.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 7 నుంచి ప్రారంభం కానుంది. -
రాణించిన కాన్వే, మిచెల్.. న్యూజిలాండ్ 307 పరుగులకు ఆలౌట్
బులవాయో (జింబాబ్వే): బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 92/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 96.1 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.డెవాన్ కాన్వే (170 బంతుల్లో 88; 12 ఫోర్లు), డారిల్ మిచెల్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించగా... విల్ యంగ్ (70 బంతుల్లో 41; 4 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (34; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రచిన్ రవీంద్ర (2), బ్లండెల్ (2), బ్రేస్‌వెల్ (9) విఫలమయ్యారు.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని 3, చివాంగ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.బెనెట్ (18), బెన్ కరన్ (11) పెవిలియన్ చేరగా... నిక్ వెల్చ్ (2 బ్యాటింగ్), మసెకెసా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ, రూర్కె చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న జింబాబ్వే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
నిప్పులు చెరిగిన మ్యాట్ హెన్రీ.. విలవిలలాడిపోయిన పసికూన
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (జులై 30) తొలి టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ధాటికి 149 పరుగులకే ఆలౌటైంది. హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో జింబాబ్వే ప్లేయర్ల భరతం పట్టాడు. 15.3 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనితో పాటు మరో పేసర్ నాథన్ స్మిత్ (14-8-20-3) కూడా చెలరేగడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్ సిగా (30), నిక్ వెల్చ్ (27), బెన్ కర్రన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మ్యాట్ హెన్రీకి 30 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఇది ఐదో 5 వికెట్ల ప్రదర్శన. హెన్రీ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత పేసర్లలో బుమ్రా, హాజిల్‌వుడ్ మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హెన్నీ 30 టెస్ట్‌ల్లో 126 వికెట్లు, 91 వన్డేల్లో 165 వికెట్లు, 25 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. హెన్రీ అడపాదడపా బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. ఇతని పేరిట టెస్ట్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జింబాబ్వేలోనే ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది విజేతగా అవతరించింది. ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. -
39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్
జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ 39 ఏళ్ల లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అవినీతి మరియు డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ విధించిన మూడున్నర సంవత్సరాల బ్యాన్‌ను పూర్తి చేసుకొని జింబాబ్వే టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం జింబాబ్వే సెలెక్టర్లు టేలర్‌ను జట్టులోకి తీసుకున్నారు.2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి 15 వేల యూస్ డాలర్లు ముడుపులు (జింబాబ్వేలో టీ20 లీగ్ లాంచ్ చేసే విషయంలో) తీసుకున్నందుకు గాను, అలాగే నిషేధిత ఉత్ప్రేరకమైన కొకైన్‌ను వాడినందుకు గాను టేలర్‌పై 2022 జనవరిలో ఐసీసీ మూడున్నరేళ్ల బ్యాన్ విధించింది. టేలర్ ఇప్పుడు ఆ బ్యాన్‌ను పూర్తి చేసుకొని త్వరలో జాతీయ జట్టుకు ఆడనున్నాడు.టేలర్ జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన అతను మూడు ఫార్మాట్లలో 9938 పరుగులు చేసి జింబాబ్వే తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీలు (17) చేసిన బ్యాటర్ టేలరే కావడం విశేషం. టేలర్ తనపై బ్యాన్ విధించక ముందు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో (టెస్ట్‌ల్లో) వరుసగా 92, 81, 49 పరుగులు స్కోర్ చేశాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఇవాళే (జులై 30) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న జింబాబ్వే 46 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. సిగా (19), క్రెయిగ్ ఎర్విన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బకొట్టాడు. -
న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు 32వ కెప్టెన్ అవుతాడు.లాథమ్ ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్ సమయానికి లాథమ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.సాంట్నర్ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జులై 30 నుంచి ఆగస్ట్ 3- తొలి టెస్ట్ (బులవాయో)ఆగస్ట్ 7 నుంచి 11- రెండో టెస్ట్ (బులవాయో)జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్, విలియమ్ ఓరూర్కీ, అజాజ్ పటేల్, జేకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మ్యాచ్ హెన్రీ -
పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పసికూన, ఆతిథ్య జింబాబ్వేతో ఇవాళ (జులై 24) జరిగిన నామామాత్రపు మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ రాబిన్సన్ 10, మార్క్ చాప్మన్ 0, బెవాన్ జాకబ్స్ 0, మిచెల్ సాంట్నర్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరిగిన ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 134 పరుగులకే (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. జేకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ తలో 2, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో జార్జ్ లిండే (23 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడాడు. కెప్టెన్ డస్సెన్ 14, రూబిన్ హెర్మన్ 10, డెవాల్డ్ బ్రెవిస్ 13, డ్రి ప్రిటోరియస్ 1, సైమ్‌లేన్ 11, కొయెట్జీ 0, ముత్తుసామి 8, ఎన్ పీటర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (19), రచిన్ రవీంద్ర (3), మార్క్ చాప్మన్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. డారిల్ మిచెల్ (20 నాటౌట్) సహకారంతో సీఫర్ట్ న్యూజిలాండ్‌ను గెలిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సైమ్‌లేన్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 24న జరుగబోయే నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వే న్యూజిలాండ్‌తో తలపడనుంది. జులై 26న హరారేలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి. -
చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. సిక్సర్లతో విరుచుకుపడిన సీఎస్కే స్టార్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (జులై 14) హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జార్జ్ లిండే (3-0-10-3), లుంగి ఎంగిడి (4-1-15-1), నండ్రే బర్గర్ (4-0-22-1), ఎన్ పీటర్ (3-0-22-1), కార్బిన్ బాష్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. 5 SIXES BY DEWALD BREVIS IN HIS RETURN TO T20I. 🤯🔥 pic.twitter.com/avZKMovpRj— Johns. (@CricCrazyJohns) July 14, 2025జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. రజాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (30), ర్యాన్ బర్ల్ (29) రెండంకెల స్కోర్లు చేశారు. మదెవెరె 1, క్లైవ్ మదండే 8, తషింగ ముసేకివ 9, మున్యోంగ 0, మసకద్జ 1 (నాటౌట్) పరుగుకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి బంతికే చిచ్చరపిడుగు లుహాన్ డ్రి ప్రిటోరియస్ డకౌటైనా, రుబిన్ హెర్మన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (17 బంతుల్లో 41; ఫోర్, 5 సిక్సర్లు) సౌతాఫ్రికా విజయానికి పునాది వేశారు. కార్బిన్ బాష్ (23 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. అతనికి జార్జ్ లిండే (3 నాటౌట్) సహకరించాడు. సౌతాఫ్రికా 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన బ్రెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా తరఫున అతనికి ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (11), కెప్టెన్ డస్సెన్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, ట్రెవర్ గ్వాండు 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో జింబాబ్వే, సౌతాఫ్రికా సహా న్యూజిలాండ్ కూడా పాల్గొంటుంది. తదుపరి మ్యాచ్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య హరారే వేదికగా జరుగనుంది. -
అరుదైన క్రికెటర్.. 34 ఏళ్లకే రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ ఆటగాడు పీటర్ మూర్ ఒకరు. మూర్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐర్లాండ్ తరఫున వరల్డ్‌కప్ ఆడాలన్న కలతో ఆ దేశానికి వలస వెళ్లిన మూర్.. ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.ఐర్లాండ్‌కు ఆడకముందు మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. మూర్ 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. నాటి నుంచి మూర్ జింబాబ్వే ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు సాధించాడు.అనంతరం మూర్ ఐరిష్ మూలాలు (నాన్నమ్మ) ఉండటంతో ఐర్లాండ్‌కు వలస వెళ్లాడు. 2023 మూర్ ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి ఆ దేశం తరఫున 7 టెస్ట్‌లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున 2024 జులైలో అతని అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. నాడు మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై మూర్ 79 పరుగులు చేశాడు. అతను చివరిగా అంతర్జాతయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్లో మూర్ తన చివరి మ్యాచ్‌ను నిన్ననే (జులై 10) ఆడాడు. ఐరిష్ దేశవాలీ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మూర్.. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినా దేశవాలీ, టీ20 లీగ్‌ల్లో కొనసాగుతునాని చెప్పాడు. -
న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్‌లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్ (225) అలెన్‌దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది. -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. తప్పుకొన్న కేన్ విలియమ్సన్
ఈ నెలాఖరులో జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జులై 8) ప్రకటించారు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడనుంది. ఇతరత్రా ప్లేయింగ్ కమిట్మెంట్స్ కారణంగా కేన్ ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేన్ ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ కోసమే కేన్ జింబాబ్వే సిరీస్‌ను వద్దనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జింబాబ్వే సిరీస్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా తప్పుకొన్నాడు. ఫ్రాంచైజీ కమిట్మెంట్స్ కారణంగా మైఖేల్ బ్రేస్‌వెల్ జింబాబ్వే సిరీస్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఈ సిరీస్ సమయంలో బ్రేస్‌వెల్ హండ్రెడ్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉన్నందున అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగనుంది. కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. లెఫ్ట్మార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా యువ పేసర్ మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. ఫిషర్ దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. ఫిషర్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జులై 30 నుంచి న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తొలి టెస్ట్ జులై 30న, రెండో టెస్ట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు బులవాయో వేదికగా జరుగుతాయి. -
అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ ఈ ఫీట్ సాధించాడు. WIAAN MULDER BECOMES THE FIRST TEST CAPTAIN TO SCORE TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT...!!! 🦁 pic.twitter.com/SujzdKo0Ht— Johns. (@CricCrazyJohns) July 7, 2025ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.వీరేంద్ర సెహ్వాగ్-278 బంతుల్లోవియాన్ ముల్దర్-297హ్యారీ బ్రూక్-310మాథ్యూ హేడెన్-262వీరేంద్ర సెహ్వాగ్-364ఈ ట్రిపుల్‌తో ముల్దర్ టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 314 పరుగుల స్కోర్ వద్ద హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఆమ్లా తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కడపటి వార్తలు అందేసరికి ముల్దర్ 350 పరుగులు కూడా పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు (ముల్దర్‌తో కలిసి) మాత్రమే ఈ ఘనత సాధించారు. 108 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా స్కోర్ 593/5గా ఉంది. ముల్దర్ 350 (324 బంతుల్లో 48 ఫోర్లు, 3 సిక్సర్లు), వెర్రిన్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేసిన ముల్దర్జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ముల్దర్ తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన ముల్దర్ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. -
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన మరో ప్లేయర్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు
టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీసిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. తాజాగా మరో ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో చెలరేగాడు. వియాన్ ముల్దర్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్‌తో సత్తా చాటాడు. జింబాబ్వేతో ఇవాళ (జులై 6) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ముల్దర్ టీ విరామం సమయానికి 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టెస్ట్‌లో ముల్దర్ కేశవ్ మహారాజ్ సారథ్యంలో ఆటగాడిగా సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ముల్దర్ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. తొలి టెస్ట్ సందర్భంగా కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఇదివరకే తనను తాను నిరూపించుకున్న ముల్దర్‌కు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసే అవకాశం కూడా దక్కింది. 27 ఏళ్ల ముల్దర్ 21 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 31 సగటున 930 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 35 వికెట్లు పడగొట్టాడు. ముల్దర్ దక్షిణాఫ్రికా జట్టులో ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా స్థిరపడ్డాడు. 25 వన్డేల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 276 పరుగులు, 22 వికెట్లు.. 11 టీ20ల్లో 105 పరుగులు, 8 వికెట్లు తీశాడు. ముల్దర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం కూడా చేశాడు. 2025 సీజన్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. ఇందులో 9 పరుగులు చేసి, వికెట్లేమీ తీయలేదు. ముల్దర్ ఇటీవల డబ్ల్యూటీసీ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 33 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. డబ్ల్యూటీసీ గెలిచిన జట్టులోని సీనియర్లకు విశ్రాంతినిచ్చి కేశవ్ మహారాజ్‌ను సారధిగా నియమించింది. ఈ సిరీస్‌లో సీనియర్లు లేకున్నా సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో అదిరిపోయే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు చెలరేగడంతో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ 59 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. వియాన్ ముల్దర్ 154, తొలి టెస్ట్ సెంచరీ హీరో లుహాన్ డ్రి ప్రిటోరియస్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మరో ఆటగాడు డేవిడ్ బెడింగ్హమ్ (82) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టోని డి జోర్జి 10, అరంగేట్రం ఓపెనర్ లెసెగొ సెనోక్వానే 3 పరుగులకు ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 2, మసకద్జ ఓ వికెట్ పడగొట్టారు. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు మరో కొత్త కెప్టెన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్‌ను తాత్కాలిక సారధిగా నియమించారు. జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్‌లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్‌ను నియమించారు. కెరీర్లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్‌లే ఆడిన వియాన్ ముల్దర్‌ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు. జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్‌లు ఆడలేదు. తొలి టెస్ట్‌తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్మెంట్ జింబాబ్వే టూర్‌కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్‌ను కెప్టెన్‌గా నియమించింది.అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్‌లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్‌లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్‌రౌండర్‌గా రాణించాడు. బ్యాటింగ్‌లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్‌లో 3,1 వికెట్లు తీశాడు.గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్‌ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్‌లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు.కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు. -
రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 40వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాష్‌కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్ (106, 6/26), ఏ ఫాల్కనర్ (123. 5/120), జాక్ కల్లిస్ (110, 5/90), జాక్ కల్లిస్ (139 నాటౌట్, 5/21) ఈ ఘనత సాధించారు.జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో బాష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ సహా డ్రి ప్రిటోరియస్ (153), ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ఛాంపియన్‌లా ఆడి కొత్త టెస్ట్ సైకిల్‌ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్, రబాడ లాంటి వారు ఈ సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్ విలియమ్స్ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది. -
సెంచరీతో కదంతొక్కిన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామానికి ముందు ముల్దర్ 149 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముల్దర్‌కు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. గతేడాది అక్టోబర్‌లో ముల్దర్ బంగ్లాదేశ్‌పై అజేయ శతకం బాదాడు.ముల్దర్ ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముల్దర్ తాజా ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎస్ఆర్హెచ్లో చేరాడు. ఎస్ఆర్హెచ్ ముల్దర్‌ను 75 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. ముల్దర్ ఐపీఎల్ 2025లో 2 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఓ ఓవర్ మాత్రమే వేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 415 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. వియాన్ ముల్దర్ 142, కైల్ వెర్రిన్ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ తప్పించుకుంది. జింబాబ్వేను సీన్ విలియమ్స్ (137) అద్బుత సెంచరీతో గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన ముల్దర్ బంతితో కూడా రాణించాడు. 16 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్, కోడి యూసఫ్ తలో 3 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్ తర్వాతి స్థానంలో సీన్ విలియమ్స్
బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్‌కు టెస్ట్‌ల్లో ఇది ఆరో శతకం. సెంచరీ అనంతరం కూడా విలియమ్స్ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్ట్ హర్ట్‌గా (తలకు గాయం) వెనుదిరగాడు. బెన్నెట్ ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్మెంట్. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్ కోడి, వియాన్ ముల్దర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.ప్లవర్ సరసన విలియమ్స్ఈ మ్యాచ్‌లో సెంచరీతో విలియమ్స్ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్ ఫ్లవర్, బ్రెండన్ టేలర్ సరసన చేరాడు. ఫ్లవర్, టేలర్, విలియమ్స్ టెస్ట్‌ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. -
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్‌గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్‌కు 200వ టెస్ట్ వికెట్. కేశవ్ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309), కల్లిస్ (291), ఫిలాండర్ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్ విలియమ్స్ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్ 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. -
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. తద్వారా ఆ దేశ దిగ్గజాల సరసన రికార్డు బుక్కుల్లో చోటు దక్కించుకున్నాడు. గతంలో మార్క్ బౌచర్ (122 నాటౌట్), డాల్టన్ (117), ముర్రే (109), డేవ్ రిచర్డ్సన్ (109), విన్స్లో (108), జేపీ డుమిని (100 నాటౌట్) సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు చేశారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బాష్‌కు ముందు అరంగేట్రం ఆటగాడు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (153) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మరో అరంగేట్రం ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు.MAIDEN INTERNATIONAL HUNDRED FOR CORBIN BOSCH WHILE BATTING AT 8 🥶 pic.twitter.com/Md4Qv3DwNN— Johns. (@CricCrazyJohns) June 28, 2025ప్రిటోరియస్, బాష్ సెంచరీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సీన్ విలియమ్సన్ (56), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (30) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 305 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 19 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4 పరుగులకు ఔటయ్యారు. అరంగేట్రం బౌలర్ కోడి యూసఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఇటీవలే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన సౌతాఫ్రికా తమ ద్వితియ శ్రేణి జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు
తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్‌ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం(జూన్ 28) నుంచి ప్రారంభమైంది.తొలి రోజు ఆటలో సఫారీ బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాళ్లు లువాన్-డ్రి ప్రిటోరియస్(153), బాష్(100 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగగా.. డెవాల్డ్ బ్రెవిస్( 41 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అరంగేట్రంలోనే బ్రెవిస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బేబీ ఏబీడీ కేవలం 38 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు. బ్రెవిస్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ తన డెబ్యూ టెస్టులో 29 బంతులు, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతల్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కానీ ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే కావడం గమనార్హం.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్ -
టెస్ట్ అరంగేట్రం చేయనున్న సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తన జాతీయ జట్టు సౌతాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రేపటి నుంచి జింబాబ్వేతో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్టులో బ్రెవిస్ చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జూన్ 27) ప్రకటించింది. సీనియర్ల గైర్హాజరీలో రెండు మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా సారధిగా కేశవ్ మహారాజ్ ఎంపికయ్యాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్‌లో మహారాజ్ యువ దక్షిణాఫ్రికా జట్టును ముందుండి నడిపిస్తాడు. ఓపెనర్లుగా టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ బరిలోకి దిగనుండగా.. వన్ డౌన్లో వియాన్ ముల్దర్, నాలుగో స్థానంలో డేవిడ్ బెడింగ్హమ్, ఐదో స్థానంలో లుహాన్ డ్రి ప్రిటోరియస్, ఆరో స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కైల్ వెర్రిన్, ఆల్‌రౌండర్ కోటాలో కార్బిన్ బాష్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కేశవ్ మహారాజ్, పేసర్లుగా కోడి యూసఫ్, క్వేనా మఫాకా బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌తో పాటు డ్రి ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రం చేస్తాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించాక సౌతాఫ్రికా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడం ద్వారా సౌతాఫ్రికా చిరకాల కల నెరవేర్చిన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుత సెంచరీ చేసిన మార్క్రమ్, అదే మ్యాచ్‌లో చెలరేగిన రబాడ, ఆల్‌రౌండర్ జన్సెన్, బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. వీరందరికి క్రికెట్ సౌతాఫ్రికా విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్ తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పేస్ విభాగాన్ని ముందుండి నడిపిస్తారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. రెండు టెస్ట్‌లు బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. రెండో టెస్ట్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది.జింబాబ్వేతో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా తుది జట్టు..టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్హమ్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ (కెప్టెన్), కోడి యూసఫ్, క్వేనా మఫాకాజింబాబ్వే జట్టు..క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, తనకా చివాంగా, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, క్లైవ్ మదాండే, విన్సెంట్ మసెకేసా, వెల్లింగ్టన్ మసకద్జా, ప్రిన్స్ మస్వౌరే, కుండై మతిగిము, బ్లెస్సింగ్ ముజరబానీ, న్యూమ్యాన్ న్యామ్హురి, తఫద్జా సిగ, నికోలస్ వెల్చ్, సీన్ విలియమ్స్ -
టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు
ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్ట్‌లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలు (టెస్ట్‌ల్లో) సహా చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్‌ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్‌ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్‌లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్‌ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.డ్రా అయినా చేసుకోవాల్సింది..!తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది.టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్‌ల వివరాలు..ఇంగ్లండ్‌తో- ఓటమి (టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024) -
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా తొడ కండరాల గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం ధ్రువీకరించింది. అతడి స్ధానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న కేశవ్ మహారాజ్‌కు జట్టు పగ్గాలను సౌతాఫ్రికా క్రికెట్ అప్పగించింది.కాగా బావుమా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. తొడ కండరాల నొప్పితో బాధపడతూనే తన బ్యాటింగ్‌ను టెంబా కొనసాగించాడు. తన విరోచిత పోరాటంతో సౌతాఫ్రికాకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అయితే అతడు గాయం కాస్త తీవ్రమైనది కావడంతో బావుమా నుంచి జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. అదేవిధంగా ఈ సిరీస్‌కు ఐడైన్ మార్క్రమ్, కగిసో రబాడ కూడా దూరంగా ఉండనున్నారు. బావుమా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులో చేరే అవకాశముంది. ఆ తర్వాత అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో ప్రోటీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు అదే తొలి సిరీస్ కానుంది. జూన్ 28 నుంచి జింబాబ్వే-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.జింబాబ్వేతో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టుడేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ (రెండో టెస్టు మాత్రమే), లువాన్-డ్రే ప్రిటోరియస్, లెసెగో సెనోక్వానే, ప్రెనెల్ సెనోక్వానే -
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ప్రకటన.. సీఎస్కే చిచ్చరపిడుగుకు చోటు
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపిక కాగా.. ఐదు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తొలిసారి టెస్ట్ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. అతనితో పాటు మరో విధ్వంసకర బ్యాటర్ లుహాన్-డ్రి-ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. జింబాబ్వే సిరీస్‌లో బ్రెవిస్, ప్రిటోరియస్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా ఉంటారు. భారీ హిట్టర్లుగా పేరున్న వీరు టెస్ట్ ఫార్మాట్లో ఏమేరకు రాణిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో బ్రెవిస్, ప్రిటోరియస్తో పాటు లెసెగొ సెనొక్వానే (బ్యాటర్), కోడి యూసఫ్ (ఫాస్ట్ బౌలర్), ప్రెనెలన్ సుబ్రాయన్ (ఆఫ్ స్పిన్నర్) ఉన్నారు. స్పిన్నర్ జుబేర్ హంజా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న జట్టులోని ఎనిమిది మందికి (బవుమా, బెడింగ్హమ్, కార్బిన్ బాష్, జోర్జి, కేశవ్ మహారాజ్, ముల్దర్, ఎంగిడి, వెర్రిన్) మాత్రమే ఈ జట్టులో చోటు దక్కింది. జన్సెన్, రబాడ, మార్క్రమ్, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌కు విశ్రాంతి కల్పించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదివరకే లండన్‌కు చేరుకుంది.జింబాబ్వేతో సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్-జూన్ 28-జులై 2 (బులవాయో)రెండో టెస్ట్-జులై 6-10 (బులవాయో)జింబాబ్వే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రి-ప్రిటోరియస్, ప్రీటోరియస్, లెసెగొ సెనొక్వానే, ప్రెనెలన్ సుబ్రాయన్, కైల్ వెర్రిన్, కోడి యూసుఫ్. -
ఇంగ్లండ్ ఘన విజయం
నాటింగ్‌హామ్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో 22 ఏళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... జింబాబ్వే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో శనివారం మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే చివరకు 59 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (82 బంతుల్లో 88; 16 ఫోర్లు), సికందర్ రజా (68 బంతుల్లో 60; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో పోరాడారు. ఈ జంట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే... ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకునేలా అనిపించినా... ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ జంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది. బెన్ కరన్ (37), వెస్లీ మధెవెరె (31) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ ఇర్విన్ (2), బెనెట్ (1), తఫద్జా (4), బ్లెస్సింగ్ ముజర్బానీ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 565/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
22 ఏళ్ల తర్వాత...
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌కు ఇక ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్ వుంది. మేటి జట్లతో కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడాల్సి ఉంది. అలాంటి ఇంగ్లండ్ జట్టు తమ సొంతగడ్డపై జింబాబ్వేలాంటి కూనతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. 22 ఏళ్ల తర్వాత జింబాబ్వేతో జరుగుతున్న ఈ ఏకైక టెస్టును ఆతిథ్య జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం సన్నాహక మ్యాచ్‌గా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలోనే ఇక్కడ పర్యటించేందుకు భారత్ వస్తోంది. అనంతరం ఈ సీజన్లోనే ఆ్రస్టేలియా గడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇవన్నీ కూడా ఐదేసి మ్యాచ్‌ల పూర్తిస్థాయి సిరీస్‌లు. ఈ 10 టెస్టులకు ముందు ఇంగ్లండ్ ఓ క్రికెట్ కూనపై నాలుగు రోజులు ప్రతాపం చూపనుంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కానీ ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఇచ్చే ప్రాధాన్యత అంతా తదుపరి సన్నద్ధం కోసమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గురువారం నుంచి జరిగే ఈ సంప్రదాయ పోరులో జింబాబ్వే ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి. 18 ఏళ్ల క్రితం కేప్‌టౌన్‌లో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికీ అసలైన టెస్టు మ్యాచ్‌ను జింబాబ్వే చివరిసారిగా 2003లో ఆడింది. ఆ సిరీస్‌లోనే 20 ఏళ్ల అండర్సన్ పేస్ బౌలర్‌గా అరంగేట్రం చేశాడు. ఇన్నేళ్లలో ఓ వెలుగువెలిగిన అండర్సన్ రిటైర్ కూడా అయ్యాడు. మరోవైపు జింబాబ్వే మాత్రం దేశంలోని రాజకీయ అస్థిరత, ఆరి్థక సంక్షోభం, క్రికెట్ బోర్డులో మితిమీరిన ప్రభుత్వ జోక్యం తదితర సమస్యలతో సతమతమైంది. ఆరేళ్ల పాటు పూర్తిగా టెస్టు క్రికెట్‌కు దూరమైంది. 2005 నుంచి 2011 అసలు సంప్రదాయ సమరమే లేకుండా గడిపిన జింబాబ్వే ఆ తర్వాత కూడా పూర్తిస్థాయి సిరీస్‌లను ఆడే అవకాశాన్ని కోల్పోయిందనే చెప్పాలి. 2022 నుంచి 2024 వరకు ఈ జట్టు కేవలం నాలుగంటే నాలుగు టెస్టులే ఆడిందంటే జింబాబ్వే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.» జింబాబ్వే రెండోసారి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంతకుముందు 2017లోనూ దక్షిణాఫ్రికాతో కూడా జింబాబ్వే నాలుగు రోజుల టెస్టు ఆడింది. » మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండోసారి నాలుగు రోజుల టెస్టు ఆడబోతుంది. 2023లో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ తొలిసారి నాలుగు రోజుల టెస్టులో పోటీపడింది. ఈ రెండింటికంటే ముందు 1973లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదటిసారి నాలుగు రోజుల టెస్టు జరిగింది.14 జింబాబ్వే జట్టు 1992 నుంచి ఇప్పటి వరకు మొత్తం 123 టెస్టులు ఆడింది. 14 టెస్టుల్లో విజయం సాధించి, 79 టెస్టుల్లో ఓడిపోయింది. 30 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.3 ఇంగ్లండ్ జట్టుతో ఓవరాల్‌గా జింబాబ్వే 6 టెస్టులు ఆడింది. 3 టెస్టుల్లో ఓడిపోయి, 3 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో రేపటి నుండి (మే 22) ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఎసెక్స్ సీమర్ సామ్ కుక్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో జేమీ స్మిత్ ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా వ్యవహరించనున్నాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టాపార్డర్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ కొనసాగనున్నారు. పేస్ విభాగంలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, సామ్ కుక్ ఉండనున్నారు. ఇంగ్లండ్ జింబాబ్వేతో చివరిసారిగా 2003లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ హోం సమ్మర్లో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కానుంది.ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ల్లో మొదటిగా వన్డేలు (3), ఆతర్వాత టీ20లు (3) జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం కూడా ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్‌తో సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలోనే భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తలపడుతుంది.జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్‌లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
Miss World Zimbabwe మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది. ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది. మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.అందుకే సోషల్ మెంటల్ హెల్త్‌ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను. అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్‌గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.– హనుమాద్రి శ్రీకాంత్ -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సౌతాఫ్రికా కీలక నిర్ణయం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా సైతం తొలిసారి ట్రోఫీ ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్‌కు ముందు జింబాబ్వేతో సౌతాఫ్రికా నాలుగు రోజుల టెస్టు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే ఆఖరి వారంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశముంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నహాకాల్లో భాగంగా ప్రోటీస్ జట్టు జూన్ 3న ససెక్స్‌తో కూడా తలపడనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. గ్రూపు స్టేజి ముగిసిన తర్వాత కొంతమంది సఫారీ ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. మిగిలిన ప్లేయర్లు మే 25న ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టులో చేరనున్నారు. ఈ ఫైనల్‌కు ముందు మరో గుడ్ న్యూస్ సౌతాఫ్రికాకు అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. తొలుత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రబాడ దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిషేదం ఎత్తేయడంతో సౌతాఫ్రికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి -
ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) చరిత్రపుటల్లోకెక్కాడు. ఆసియాలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజు శతకం బాదడంతో పాటు ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా మెహదీ హసన్ మిరాజ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్ పర్యటన (Zimbabwe tour of Bangladesh)కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో తొలి టెస్టులో బంగ్లాదేశ్ జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోఅయితే, చట్టోగ్రామ్ వేదికగా రెండో టెస్టు (Ban vs Zim 2nd Test)లో మాత్రం ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (162 బంతులలో 104; 11 ఫోర్లు, 1 సిక్స్; 5/32) బ్యాటింగ్‌లో సెంచరీ బాదడంతో పాటు... జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.మెహదీ హసన్ దూకుడుగత టెస్టులో బంగ్లాదేశ్‌ను ఓడించి నాలుగేళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో తొలి విజయం ఖాతాలో వేసుకున్న జింబాబ్వే దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. ఓవర్‌నైట్ స్కోరు 291/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... చివరకు 129.2 ఓవర్లలో 444 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ సహకారంతో మెహదీ హసన్ మిరాజ్ శతకంతో చెలరేగిపోయాడు.చివర్లో అతడికి తైజుల్ ఇస్లామ్ (20), తన్జీమ్ హసన్ (80 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. మెహదీ హసన్ దూకుడుతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగుల ఆధిక్యం లభించింది. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకెసా 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ (103 బంతుల్లో 46; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (25), వెల్లింగ్టన్ మసకద్జ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన మెహదీ హసన్ మిరాజ్... బంతితోనూ విజృంభించి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతరుల్లో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన మిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టెస్టుల్లో 2068 రన్స్, 205 వికెట్లుకాగా ఖుల్నాకు చెందిన మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన అతడు రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. 2016లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మెహదీ హసన్ మిరాజ్.. ఇప్పటి వరకు 53 టెస్టులు, 105 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.టెస్టుల్లో 2068 పరుగులు చేయడంతో పాటు 205 వికెట్లు తీశాడు. అదే విధంగా.. వన్డేల్లో 1617 పరుగులు సహా 110 వికెట్లు.. టీ20లలో 354 పరుగులు సహా 14 వికెట్లు మెహదీ హసన్ మిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో రెండు, వన్డేల్లో రెండు శతకాలు సాధించాడు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని -
మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. చటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేను ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(67), నిక్ వెల్చ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నయీమ్ హసన్ రెండు, తాంజిమ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 444 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(120), మెహిదీ హసన్ మీరాజ్(104) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు ముష్ఫికర్ రహీం(40), మోనిమల్(33), షకీబ్(41) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకేసా 5 వికెట్లు పడగొట్టగా.. ముజారబానీ, వెల్లింగ్టన్ మసకడ్జా బెన్నట్ తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా జింబాబ్వే ఆట తీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లా బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 111 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లతో చెలరేగగా.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్లలో బెన్ కుర్రాన్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో బంగ్లా సమం చేసింది. -
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు వారి సొంతగడ్డపై పసి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (52) టాప్ స్కోరర్‌గా నిలవగా..బెన్ కుర్రాన్(44) పరుగులతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహాది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత దక్కిన తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో తమ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) పర్వాలేదన్పించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో(60), జాకీర్(58), మోమినల్(47) మినహా మిగితా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజయం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛటోగ్రామ్ వేదికగా జరగనుంది. -
సంచలన విజయం దిశగా జింబాబ్వే
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్ జట్టు.. సిల్హెట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్.బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే స్కోర్ 117/2గా ఉంది. బ్రియాన్ బెన్నెట్ (52), సీన్ విలియమ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జింబాబ్వే కీలకమైన 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 67/1 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే మరో 206 పరుగులు జోడించి 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవండతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ సొంతగడ్డపై భారీ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
రెచ్చిపోయిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలైంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ 40, బెన్ కర్రన్ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్ అత్యల్ప స్కోర్లు (టెస్ట్‌ల్లో)ఢాకా- 107 (2001)సిల్హెట్- 143 (2018)సిల్హెట్- 169 (2018)సిల్హెట్- 191 (2025)ఢాకా- 211 (2005) -
ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది. ఏడు ఒలింపిక్ పతకాలు... ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్‌లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది. -
జింబాబ్వేదే టి20 సిరీస్
హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్‌బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బెనెట్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్‌బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్‌గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్‌బెల్ (అలిస్టర్ క్యాంప్‌బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్‌బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. మెక్‌బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 4, ఆండీ మెక్‌బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్‌బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్‌కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్‌తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
రాణించిన ఐరీష్ కెప్టెన్.. జింబాబ్వే లక్ష్యం 292
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్... ఆతిథ్య జట్టు ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం మూడో రోజు 83/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్ 93.3 ఓవర్లలో 298 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (60; 2 ఫోర్లు), లార్కన్ టక్కర్ (58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ 4, ట్రెవర్ వాండు, వెస్లీ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కలిపి 292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే... మూడో రోజు ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు కైటానో (14; 3 ఫోర్లు), బెన్ కరన్ (4), నిక్ వెల్చ్ (5) వికెట్లను పారేసుకోగా... ఆట నిలిచే సమయానికి బ్రియాన్ బెన్నెట్ (15 బ్యాటింగ్, 1 ఫోర్), ట్రెవర్ వాండు (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడేర్, బారీ మెకార్తీ, మాథ్యూ హంఫ్రేస్ తలా ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్నప్పటికీ జింబాబ్వే విజయానికి 254 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లున్నాయి.చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్ -
సంచలనం.. అరంగేట్రంలోనే టీమ్ కెప్టెన్‌గా
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌తో లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్‌బెల్ తనయుడు జోనాథన్ కాంప్‌బెల్ జింబాబ్వే తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జింబాబ్వే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కాంప్‌బెల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారంణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో 27 ఏళ్ల జోనాథన్‌కు జట్టు పగ్గాలను జింబాబ్వే టీమ్ మెనెజ్‌మెంట్ అప్పగించింది. తద్వారా కాంప్‌బెల్ ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో ప్లేయర్‌గా కాంప్‌బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ ఉన్నాడు. హౌటన్ 1992లో హరారే వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే సారథిగా వ్యవహరించాడు.ఇక ఓవరాల్‌గా 21వ శతాబ్దంలో డెబ్యూలోనే టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో ప్లేయర్‌గా జోనాథన్ కాంప్‌బెల్ రికార్డులకెక్కాడు. కాంప్‌బెల్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్‌తో జరిగిన టెస్టులో తన అరంగేట్రంలోనే కెప్టెన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత స్ధానాల్లో నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్‌ఫీల్డ్ (2018లో ఐర్లాండ్), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు. వీరిందరూ అరంగేట్రంలోనే తమ జట్ల టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. జోనాథన్ కాంప్‌బెల్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 34 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలతో సహా 1,913 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 42 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు:జింబాబ్వే (ప్లేయింగ్ XI): బెన్ కుర్రాన్, టకుద్జ్వానాషే కైటానో, నిక్ వెల్చ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్‌బెల్(కెప్టెన్), వెస్లీ మాధవెరె, న్యాషా మాయావో(వికెట్ కీపర్), న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజారబానీ, ట్రెవర్ గ్వాండుఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పీటర్ మూర్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, క్రెయిగ్ యంగ్చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్‌లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసంఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధీటుగా బదులిచ్చినాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.13 నిమిషాల్లోనే ఖేల్ ఖతంలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత
బులవాయో: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (124 బంతుల్లో 110 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్ విలియమ్స్ సెంచరీ సాధించాడు.ఓవర్‌నైట్ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.ఓవర్‌నైట్ బ్యాటర్లలో విలియమ్స్ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్... తర్వాత వచ్చిన బెనెట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్ న్యామ్హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్, జియావుర్ రహ్మాన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్ (3), అబ్దుల్ మాలిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించగా.. రహ్మత్ షా (49 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. -
సీన్ విలియమ్స్ అజేయ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా జింబాబ్వే
బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కరన్ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 49 పరుగులు జతచేశారు. కరన్ నిష్క్రమించాక వచ్చిన సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.కైటానోతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్ ఇర్విన్ (94 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 2, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు. -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి.. సిరీస్ అఫ్గాన్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్‌తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించిన పసికూన
బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్‌పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి జింబాబ్వే క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్ గెలవగా.. పాక్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్రపుటల్లోకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ముఖీమ్ 2.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున టీ20ల్ల ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఉమర్ గుల్ రెండు సార్లు 5/6 గణాంకాలు నమోదు చేశాడు. పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గానూ ముఖీమ్ రికార్డుల్లోకెక్కాడు. ముఖీమ్, గుల్, ఇమాద్ వసీం (5/14) పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించారు. ముఖీమ్ తన ఏడో టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం.ముఖీమ్ దెబ్బకు జింబాబ్వే టీ20ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను (57) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ మరో 87 బంతులు మిగిలుండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని (58) ఛేదించింది. టీ20ల్లో బంతుల పరంగా పాక్‌కు ఇది భారీ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ముఖీమ్ 5, అబ్బాస్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (21), మరుమణి (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అనంతరం 20 పరుగుల వ్యవధిలో జింబాబ్వే 10 వికెట్లు కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 5.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. సైమ్ అయూబ్ (36), ఒమైర్ యూసఫ్ (22) అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 5న జరుగనుంది. -
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్‌లో భారత్‌దే విజయం


