పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.
మూడు బెర్తులు ఖరారు
జింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
నాలుగో జట్టు ఏది?
ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.
ముక్కుకు గాయం
ఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది.
ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సచిన్ సూచనలు
మరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్‌లైన్‌లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు.
చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!


