breaking news
ICC U19 Mens World Cup 2026
-
World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..! -
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్‌కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు. అంతా మనోళ్లే అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. మ్యాచ్ రద్దున్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
వైభవ్ విఫలం.. ఇంగ్లండ్ చేతిలో తప్పని ఓటమి
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 వార్మప్ మ్యాచ్‌లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్- ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అభిజ్ఞాన్ కుందు హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (14).. మిడిలార్డర్లో విహాన్ మల్హోత్రా (10) నిరాశపరిచారు.ఇలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.రాణించిన బౌలింగ్ ఆల్రౌండర్లుఅభిజ్ఞాన్కు తోడుగా బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆర్ఎస్ అంబరీష్ (48), కనిష్క్ చౌహాన్ (45 నాటౌట్) రాణించారు. మిగిలిన వారిలో హర్వన్ష్ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్ పటేల్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్-19 జట్టు 295 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్‌డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్ పటేల్ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ డాకిన్స్ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.థామస్ ధనాధన్‌ఇక ఖిలాన్ పటేల్.. మరో ఓపెనర్ జోసఫ్ మూర్స్ (46), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ మేయస్ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ థామస్ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గెలుపుమరో ఎండ్ నుంచి కెలెబ్ ఫాల్కనర్ (29 నాటౌట్) థామస్‌కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్-19 జట్టుపై ఇంగ్లండ్ గెలుపొందింది. చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్-2026 ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్ పీక్ సారథ్యం వహించనున్నాడు.ఇక వరల్డ్‌కప్ ఆడే ఆసీస్ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.పాల్గొనే జట్లు ఇవేకాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్-19 మెన్స్ వరల్డ్‌కప్ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్-బి నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా పోటీపడతాయి.కెప్టెన్ ఎవరంటే?ఇక గ్రూప్-సి నుంచి ఇంగ్లండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్-డి నుంచి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్ బ్యాటర్ ఒలీవర్ పీక్ సారథిగా వ్యవహరించబోతున్నాడు.భారత్‌తో ఫైనల్లో సత్తా చాటిసౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో ఒలీవర్ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశాడు.అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు -
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే


