గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Reveals Dream To Surpass Gayle 175 IPL Record | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం: వైభవ్‌ సూర్యవంశీ

Mar 16 2026 2:22 PM | Updated on Mar 16 2026 2:30 PM

Vaibhav Suryavanshi Reveals Dream To Surpass Gayle 175 IPL Record

వైభవ్‌ సూర్యవంశీ (PC: Jiohotstar)

భారత క్రికెట్‌​ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్‌ –2026’ ఆదివారం ఘనంగా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకలో భారత సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు అంతా ఒక్క చోట చేరడంతో సందడి నెలకొంది.

ఫైనల్లో 175 పరుగులు
ఈ అవార్డుల కార్యక్రమంలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) హైలైట్‌ అయ్యాడు. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ పిల్లాడు.. అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక నమన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత జట్టు పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతి గొప్పగా ఉంది. వరల్డ్‌కప్‌లో గెలిచి దేశానికి ట్రోఫీ అందించడం ఆనందకరం’’ అని పేర్కొన్నాడు.

ఈ మూడింటిలో ఏది ఇష్టం? 
ఈ క్రమంలో కామెంటేటర్‌ హర్షా భోగ్లే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ స్టార్లు సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, అభిషేక్‌ శర్మలతో కలిసి వైభవ్‌ సూర్యవంశీని ప్రశ్నలు అడిగాడు. ‘ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేయడం.. లేదంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం.. ఈ మూడింటిలో నువ్వు ఏ రికార్డు సాధించాలని అనుకుంటున్నావు’’ అని వైభవ్‌ను అడిగాడు.

గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం
ఇందుకు బదులిస్తూ.. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలవడమే తన లక్ష్యమని వైభవ్‌ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2013లో వెస్టిండీస్‌ వీరుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ 175 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఈ లెఫ్టాండర్‌ పేరిటే ఉండగా.. మరో లెఫ్టాండర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టాడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం.

కాగా గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసు (14) లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే 15వ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026కు సన్నద్ధమవుతున్నాడు.

చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement