Mahabubnagar
-
మెరిసిన రిషి విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎఫ్‌సెట్ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని రిషి కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో వెయ్యిలోపు 11 మంది ర్యాంకులు సాధించారు. సమీరాబేగం 180, అమూల్య 221, నందినిరెడ్డి 348, మనస్విత 404, నుజత్ 446, హప్స మెహిన్ 457, మాలిహ తహనీయత్ 684, అదిబామైహిన్ 725, తహనీయత్ 648, ఆదిబామైహిస్ 725, ప్రసన్నలక్ష్మి 895, సాయిశ్రీ 1000, రూపశ్రీ 1,006 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో కిరణ్ 1,109, నరహరి 1,213, సయ్యద్ మిస్సవుద్దీన్ 1,801, కిషోర్‌కుమార్ 1,951, సంతోష్ 2,456, జోతిర్నాథ్ 2,513 ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, చైర్పర్సన్ చంద్రకళ, అధ్యాపకులు తదితరులు అభినందించారు. -
విద్యుదాఘాతంతో బాలుడు మృతి
కొత్తకోట రూరల్: గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ట్రానన్స్‌ఫార్మర్ వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఐదేళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మండలంలోని కానాయపల్లిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల జ్యోతి, యాదగిరి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, చిన్న కుమారుడు తరుణ్(5) ఆదివారం ఇంటి సమీపంలో రోడ్డుపక్కన ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఎర్త్ వైర్ కాలుకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బాలుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడి ప్రాణం పోయిందంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందంగౌడ్ ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. బాలుడి మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బావపై కత్తితో దాడి చేసిన బావమర్ది కొల్లాపూర్: బావపై బామర్ది కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్ గ్రామానికి చెందిన కటికే విజయ్ తన భార్యను నిత్యం వేధిస్తూ కొట్టేవాడు. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భార్యను కొట్టాడు. ఈ విషయాన్ని ఆమె పుట్టింటివారికి సమాచారం ఇచ్చింది. ఆమె తమ్ముడు అదేరోజు రాత్రి బావ కళ్లలో కారం పొడి చల్లి కొట్టి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడు విజయ్ రక్తస్రావంతో బయటకు పరుగులు తీసి స్థానికుల సహాయంతో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయ్ అత్తను, మరదలిని అదుపులోకి తీసుకున్నామని బామర్ది పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడ పట్టుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి ఉప్పునుంతల: మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మద్దెల చెన్నమ్మ(64) మహిళ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఏఎస్ఐ రెడ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నమ్మ ఈనెల 9న గ్రామ శివారులోని పెద్దకుంట వద్దకు ఉపాధి పనులకు వెళ్లి తిరిగి తన భర్త మద్దెల పెద్దులయ్యతో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కిందపడి తలకు బలమైన రక్త గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు మద్దెల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఎప్‌సెట్‌లో విద్యార్థుల ‘ప్రతిభ’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఈమేరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో మహబూబ్ ఇరామ్ 290, సరిత 326, సాహితి 444, మనీష 468, మనీష్ 520, ఆనంద్ 782, సుభప్రద 817, సహస్ర 957, కె.సహస్ర 985 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో తనూజ 948, భరత్‌కుమార్‌రెడ్డి 1,026, ఫహదుద్దీన్ 1,316, సాయికీర్తన్ 1,479, వికాస్‌రెడ్డి 1,876, భానుప్రసాద్ 2,466, సాయిఫరూక్గౌడ్ 2,644, శ్రీ హరిహరణ్ 3,336, విజయలక్ష్మి 3,436వ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్లో 5వేలలోపు ర్యాంకులు సాధించిన వారు 48, ఇంజినీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారు 64మంది ఉన్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణయ్య తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘కృష్ణా జలాల్లో జిల్లాకు అన్యాయం చేస్తే ఉద్యమం’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన నీటివాటాలో అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల విరివిగా విడుదల చేయాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల పూర్తికి కృషిచేయడానికి ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు.. కాని డిండికి నీటితరలింపును అడ్డుకుంటామనే నినాదంతో ముందుకు పోవాలన్నారు. డిండి లిఫ్ట్‌కు బదులుగా గొట్టిముక్కుల ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. పాల మూరు జిల్లాను కరువు రహితంగా మార్చేందుకు సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు రాఘవచారీ, బెక్కం జనార్దన్, చెన్నకిష్టన్న, పరమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
పోయేదంతా బంగారమే..
● సెలవుల్లో కుటుంబ సభ్యులు ఊరెళ్లినప్పుడు ఆభరణాలకు రంగులు, మెరుగులు అద్దుతాం అంటూ ఇళ్లకు వచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వచ్చినవారి ప్రాంతం, వారి గుర్తింపు కార్డులు చూడాలి. ● మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇల్లు, గదులు అద్దె కోసం వచ్చినవారికి లేవని చెప్పడమే శ్రేయస్కరం. ● అనుమానాస్పద వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తుంటే 100కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. మహబూబ్‌నగర్ క్రైం: ప్రస్తుతం పసిడి ధరలు అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు అదేస్థాయిలో చోరీలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో దాచుకున్న బంగారం, వెండి, నగదును పెద్దఎత్తున దోచుకెళ్తున్నారు. తీర్థయాత్రలు, స్వగ్రామాలు, ఇతర శుభకార్యాలయాలకు వెళ్తున్న వారు ఇళ్ల్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు కన్నం వేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు నలుగురిలో గుర్తింపు కోసం కష్టపడి దాచుకున్న బంగారం, అవసరాలకు కూడబెట్టుకున్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ఒక్కరాత్రిలో దోచుకుంటే.. ఆర్థికంగా వారు కొన్నేళ్లు వెనక్కు వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తోంది. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ ఏడాదిన్నర కాలంలో 232 కేసులు నమోదు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా దొంగతనాలు బాధితులు కోల్పోయేది రూ.కోట్లలో.. రికవరీ రూ.లక్షల్లో నగర శివారు కాలనీలతోపాటు దొంగల హల్చల్ అరికట్టడంలో విఫలమవుతున్న పోలీస్ శాఖ ఎక్కువ రోజులు ఊరెళ్తే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మంచిది. ప్రధాన ద్వారాలు కాకుండా ఇతర ద్వారాలు ఉంటే వాటికి తాళం వేస్తూ మిగతా వాటికీ లోపలి భాగాలకు తాళం వేయాలి. అలా వేయడంతో ఇంట్లోని వాళ్లు ఊరు వెళ్లారనే అనుమానం రాకుండా ఉంటుంది. ఇంట్లో లేకున్నా గదుల్లో విద్యుత్ దీపాలు వేసి ఉంచాలి. దీంతోపాటు తాళం వేసిన ద్వారాలకు పరదాలు, కర్టెన్లు వేస్తే కనబడకుండా ఉంటాయి. విలువైన ఆభరణాలు, నగదు వెంట తీసుకెళ్లా లి. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. రాత్రిపూట ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మహిళలు తక్కువగా ఆభరణాలు ధరించాలి. ఊరెళ్లే ముందు బైక్‌లు ఆరుబయట, ప్రహరీ లోపల, ఇంటి ముందు పెట్టి వెళ్లకూడదు. వాహనానికి జాగ్రత్తగా తాళం వేసి సుపరిచితుల ఇళ్లలో పెట్టడం చాలా మంచిది. -
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూ
రండి.. విశేషాలు పంచుకుందాం మీరు ఫొటోలు, విశేషాలు, గీసిన చిత్రాలను 94415 43232 నంబర్‌కు వాట్సప్ చేయండి. వీటిని ప్రచురించి మీ సందడిని అందరితో పంచుకునేలా చేస్తాం. -
నేటి నుంచి మ్యూజియం వారోత్సవాలు
అలంపూర్: అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలు ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వారసత్వ శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు ఆదేశాల మేరకు పర్యటక శాఖ, తెలంగాణ వారసత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులపాటు ప్రత్యేక వారోత్సవాల కార్యక్రమాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మ్యూజియంలోకి సందర్శకులకు, పర్యాటకులకు ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న నరసింహస్వామి ఆలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సందర్శకులకు, స్థానిక ప్రజలకు అలంపూర్ చరిత్ర ప్రాముఖ్యత, పురావస్తు విశేషాలు గురించి అధికారులు నిపుణులతో వివరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్వీకుల వారసత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాన్ని పర్యాటకులు, ప్రజలు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
ఎప్‌సెట్‌లో సత్తాచాటిన వాగ్దేవీ విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవీ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులు రబ్షా 1,946, సన 3,982, కౌషిక్ 4,035, మౌనిక 4,522, తిరుపతమ్మ 5,853, పాయల్సింగ్ 6,461, సంజన 7,140, అజీజ్ 9,805, స్ఫూర్తి 9,927, సాధించారు. వీరితోపాటు 15వేల ర్యాంకులోపు 24, 20వేలలోపు 35 మంది ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సాధించాలన్న తపన విద్యార్థుల్లో ఉంటే సాధింపజేసే సంకల్పం అధ్యాపకుల్లో ఉందని, ఇంతటి ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులను అభినదిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్‌రెడ్డి, షాకీర్, సతీష్‌రెడ్డి, హుస్సేన్, రత్నాకర్, గోవిందరాజులు, షబ్బీర్ అహ్మద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ● ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు ● ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు సరఫరా ● పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. 50 శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. మిగతా విత్తనాలు పూర్తి ధరకే.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. విత్తనాలు సిద్ధం.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్‌నగర్ -
అమ్మ ప్రోత్సాహం.. నాన్న సహకారం
నారాయణపేట రూరల్: తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎప్ సెట్) ఫలితాల్లో నారాయణపేటవాసి ప్రతిభ చాటాడు. పట్టణంలోని గాయిత్రీనగర్కు చెందిన ఉపాధ్యాయ దంపతుల కుమారుడు శేర్ గురుచరణ్రెడ్డి 122.411432 మార్కులతో రాష్ట్రస్థాయిలో 82వ ర్యాంక్ సాధించాడు. తల్లి పారిజాత ఊట్కూరు బాలికల పాఠశాలలో పీఈటీ, తండ్రి దామరగిద్ద మండలం కానుకుర్తి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం. గురుచరన్డ్డి నారాయణపేటలో టెన్త్ పూర్తిచేసి 9.5జీపీఏ పొంది, ఇంటర్ హైదరాబాద్‌లో చదువుకుని 985మార్కులు సాధించాడు. డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, ఎంఈఓలు, తపస్ నాయకులు అభినందించారు. పరీక్ష అనంతరం గురుచరణ్ రెడ్డికి తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి తీపి కబురు చెప్పారు. గురుచరన్రెడ్డి మాట్లాడుతూ.. తన విజయం వెనక అమ్మ ప్రోత్సాహం, నాన్న సహకారం ఉందన్నారు. -
అథ్లెటిక్స్ సరదా..
● జిల్లా కేంద్రంలో మొదలైన అథ్లెటిక్ శిబిరం ● ఖేలో ఇండియా, జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహణ ● ఆసక్తి కనబరుస్తున్న బాలబాలికలు ● జూన్ 7వరకు నిర్వహణ నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీస్టేడియంలో విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారు అథ్లెటిక్ క్రీడల్లో రాణించడంమే లక్ష్యంగా ఖేలో ఇండియా, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతనెల 27వ తేదీన అథ్లెటిక్ శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు కోచింగ్‌ను అందిస్తున్నారు. 50 మందికిపైగా హాజరు స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్ అథ్లెటిక్ క్యాంప్‌కు ప్రతిరోజు 50మందికి పైగా క్రీడాకారులు హాజరై ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారికదేవి ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుంటున్నారు. అండర్–08 నుంచి అండర్–14 వరకు బాలబాలికలకు అథ్లెటిక్స్‌లో ఉన్న ప్రధాన ఆటలు 100, 200, 400 మీటర్ల రన్నింగ్, హైం జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో తదితర వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు, సాయత్రం 5గంటల నుంచి 7గంటల వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు క్రీడాకారులకు అరటి పండ్లు, బిస్కెట్లు అందజేస్తున్నారు. గ్రౌండ్లో రన్నింగ్ చేస్తున్న విద్యార్థులు -
నాగుపాము కలకలం
పాన్‌గల్: మండలంలోని చింతకుంట గ్రామంలో ఆదివారం నాగుపాము కలకలం సృష్టించింది. స్థానికుల తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదగిరిస్వామి ఇంటి ఆవరణలో కోళ్ల కోసం ఏర్పాటు చేసిన గూటిలోకి నాగుపాము చేరింది. ఈ క్రమంలో అక్కడ పొదుగుతున్న కోడిపెట్టను కాటువేయడంతో కోడి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం 9 గుడ్లను నాగుపాము మింగేసింది. గుడ్లని మింగేసి కదల్లేని స్థితిలో ఉన్న పామును గమనించిన యాదగిరిస్వామి సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించగా, ఆయన తన బృందంతో కలిసి పామును పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు చిలుక కుమార్‌సాగర్, స్వామిగౌడ్ పాల్గొన్నారు. అమ్మవారి చెంత భక్తుల సందడి నవాబుపేట: మండలంలోని పర్వాతాపూర్ మైసమ్మ ఆలయం చెంత భక్త జన జాతర కొనసాగింది. ఆదివారం పెద్ద ఎత్తున జనం మైసమ్మ అడవికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. దీంతో అడవి మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. ఆదివారం సెలవు పైగా అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో మైసమ్మ ఆలయం మొత్తం కిటకిటలాడింది. కాగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజారులు భక్తులకు దర్శనం ఇప్పించారు. డ్రిప్ పైపుల అపహరణ గద్వాల క్రైం: వ్యవసాయ పొలాల వద్ద నిల్వ ఉంచిన డ్రిప్ పైపులను అపహరించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాలు.. గద్వాల మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన రంగన్న, మునిస్వామి, కిష్టన్న గ్రామ శివారులోని తమ పొలాల్లో రూ.2 లక్షల విలువ చేసే డ్రిప్ పైపులను నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామున పైపులను చోరీ చేశారు. చోరీపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. పల్లెప్రకృతివనం దగ్ధం తెలకపల్లి: మండలంలోని లక్నారంలో ప్రమాదవశాత్తు పల్లె ప్రకృతి వనానికి నిప్పంటుకుని దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లె ప్రకృతి వనం చెత్తచెదారం నిండిపోయింది. శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లు కాలిబూడిదయ్యాయి. కార్యదర్శికి సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన జడ్చర్ల పుర కమిషనర్
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపల్ నూతన కమిషనర్‌గా గిరీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా ఉన్న లక్ష్మారెడ్డిని బదిలిచేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో గిరీష్‌ను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఆయన మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే క్షేత్రస్థాయిలో పర్యటించి.. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన నాయకులను కలిసి మాట్లాడారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సంజీవయ్య కాలనీలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. పాతబస్టాండ్, నాగర్‌కర్నూల్ రోడ్లలో జరుగుతున్న మురుగు కాల్వల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని, అంకితభావంతో పనిచేసి మార్పు తీసుకువద్దామని కోరారు. సమావేశంలో మేనేజర్ లక్ష్మన్న, ఏఈ గాయత్రి, ఆర్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్‌కు ఆదివారం భారీఎత్తున ధాన్యం వచ్చింది. దాదాపు 20 వేల బస్తాల ధాన్యం రాగా.. ఇందులో ఆర్ఎన్ఆర్ 17481 బస్తాలు, 1010 రకం 3 బస్తాలు వచ్చింది. కాగా.. ఆర్ఎన్ క్వింటాల్ రూ.2,566, కనిష్టంగా రూ.2,100 ధర లభించింది. అలాగే 1010 రకం క్వింటా గరిష్టంగా రూ.1,812, కనిష్టంగా రూ.1,769 ధర పలికిందని కార్యదర్శి రమేష్ తెలిపారు. నేటినుంచి క్రీడా వారోత్సవాలు ● 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు -
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. -
జడ్చర్ల ఘటన.. ప్రేమోన్మాది మృతి
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో యువతిని హత్య చేసిన యువకుడు తేజ మృతిచెందాడు. నిన్న యువతి వైష్ణవిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు.. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు.ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆ యవకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు.మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు. దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొన్నాడు. -
ఏడు తరాలకు సజీవ సాక్ష్యం
700 ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో అంతు చిక్కని మహా వృక్షంగా ఎదిగింది. నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న మహా (మర్రి) వృక్షం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. నిండు వేసవితాపం నుంచి ప్రజలకు చల్లటి నీడనిస్తూ వారిని తన నీడలో సేద తీరేందుకు పిల్లలమర్రి తన ఒడిలో చేర్చుకుంటోంది. మహబూబ్‌నగర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్నిక్ స్పాట్‌లా అందరిని అలరిస్తుంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగు లాంటి ఈ భారీ మర్రివక్షం వయస్సు సుమారు 700 ఏళ్లు ఉంటుందని చెబుతారు. పిల్లలమర్రి ఎదుట ఉన్న పురావస్తు ప్రదర్శనశాలలో పూర్వపు రాజులు, రాణులు వాడిన వస్తువులతో పాటు పలు రకాల చారిత్రక అనవాళ్లుగా చెప్పబడే రాతి విగ్రహాలను భద్రపర్చారు. 10 వేల సంవత్సరాల కిందటి రాతివిగ్రహాలు ఉన్నాయి. 18, 19 శతాబ్దాలోల శాతవాహనుల కాలంలో వాడుకల్లో ఉన్న నాణేలను మ్యూజియంలో ఉంచారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో బయటపడిన శిలాలను మ్యూజియంలో భద్రపరిచారు. -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
వెల్దండ(ఊర్కొండ): ఊర్కొండపేట శివారులోని బావిలో ఈతకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన కాలే అనిల్(20) ఊర్కొండపేటలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో గ్రామశివారులోని బావిలో తన సోదరుడు, స్నేహితులతో కలసి ఈతకు వెళ్లాడు. అప్పటివరకు సరదాగా స్నేహితులతో కలసి ఈతకొట్టిన అనిల్ ఒక్కసారిగా కనిపించలేదు. స్నేహితుడు కనిపించడంలేదని గుర్తించిన వారు బావిలో వేతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది శ్రీనివాస్, చంద్రశేఖర్, గణేష్, రాహుల్, తిరుపతయ్య, సంతోష్ బావిలో గాలింపు చేపట్టారు. మృతదేహం లభించడంతో ఫైర్ సిబ్బంది సీపీఆర్ చేసినా అప్పటికే యువకుడు మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చేతికందిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుడికి తల్లిదండ్రులు అరుణమ్మ, కృష్ణయ్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, ఎల్.రవికుమార్ మాట్లాడుతూ ఎంపికలకు దాదాపు 160మందికి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–11, 13, 15, 17, 19 బాలబాలికలు, పురుషులు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలకు ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. నిరంతరం సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా క్రీడాకారులు షటిల్ బ్యాడ్మింటన్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్, ప్రవీణ్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ ఎజాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కపోతతో 6వేల కోళ్లు మృతి
● పౌల్ట్రీ ఫాంకు నిలిచిన విద్యుత్ సరఫరా ● కోళ్ల మృతితో రూ.12లక్షల నష్టం అమరచింత: పౌల్ట్రీ ఫాంలో పెంచుతున్న ఫారం కోళ్లకు విద్యుత్ సరఫరా లేని కారణంగా ఉక్కపోత భరించలేక 6వేల కోళ్లు మృతిచెందిన ఘటన మండలంలోని నందిమళ్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజాసింహారెడ్డి ఎకరం పొలంలో రెండుషెడ్లు వేసుకుని వాటిలో కోళ్లు పెంచుతున్నాడు. 10వేల కోళ్లను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వేసవి కావడంతో కూలింగ్ కోసం స్ప్రింక్లర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేసుకుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పోషిస్తున్నాడు. శనివారం ఉదయం షెడ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విషయాన్ని లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని.. విద్యుత్ స్తంభానికి వైర్ తెగిందని తెలిపినా నిర్లక్ష్యం చేశాడని వెల్లడించారు. వేసవికాలం కావడంతో తీవ్రమైన ఎండ వేడిమికి కోళ్లు తట్టుకోలేకపోయాయి. కాపాడుకుందామని ప్రయత్నించినా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఉక్కపోతతో మృతిచెందినట్లు పేర్కొన్నాడు. ఇలా వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుంటే రైతు తట్టుకోలేక పోయాడు. వాటికి బలికించుకుందామనే సమయంలోనే సాయంత్రం నాలుగు గంటల వరకు 10వేల కోళ్లలో 6వేల కోళ్లు మృతిచెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని సర్పంచ్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఘటనకు పూర్తి బాధ్యత ట్రాన్స్‌కో అధికారులు వహించాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన కోళ్లు.. ఎకరం పొలంలో రెండు షెడ్లు వేసుకుని 10వేల కోళ్లు పెంచుకుంటున్నా. సదరు కంపెనీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కోళ్ల సరఫరా చేస్తున్నా. శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే 6వేల కోళ్లు చనిపోయాయి. దీంతో రూ.12లక్షల నష్టం కలిగింది. అప్పులు చేసి ఫౌల్ట్రీ ఫాం నడుపుతున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజాసింహారెడ్డి, పౌల్ట్రీ ఫాం నిర్వాహకుడు, నందిమళ్ల -
3కిలోల గంజాయి స్వాధీనం
● బిహార్ నుంచి బాలానగర్‌కు సరఫరా ● కిలో రూ.5వేలకు తెచ్చి రూ.60వేలకు విక్రయం రాజాపూర్(బాలానగర్): బిహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి బాలానగర్ మండలంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్యాకెట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని శనివారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి శనివారం కేసు వివరాలను వెల్లడించారు. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన ఉపేందర్ 18ఏళ్లుగా బాలానగర్ మండల కేంద్రంలో ఉంటూ పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు గంజాయికి అలవాటుపడ్డ ఉపేందర్ బీహార్ నుంచి కిలో రూ.5వేలకు తీసుకొచ్చి బాలానగర్‌లో ప్యాకెట్లుగా చేసి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కో ప్యాకెట్ రూ.400–500 వరకు విక్రయిస్తున్నాడు. శనివారం బాలానగర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించగా.. ఇంటిముందున్న స్కూటీలో 3.150 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని విచారించగా.. బీహార్‌లో కిలో గంజాయి రూ.5వేలకు తీసుకొచ్చి ఇక్కడ కిలో రూ.60వేలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పట్టుపడ్డ గంజాయితోపాటు స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసునమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి, ఎస్ఐలు నాగరాజు, కార్తీక్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రకాష్, ప్రవీన్, పాషా పాల్గొన్నట్లు తెలిపారు. గంజాయి సేవించిన, విక్రయించిన తమకు 9030019949–8712658866కి సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
గోవా వెళ్తుండగా రోడ్డు ప్రమాదం వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన నలుగురు కారులో గోవాకు వెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెబ్బేరుకు చెందిన తోకల రాజశేఖర్, మహేష్, భానుప్రకాష్, శంకర్ నలుగురు కలిసి శుక్రవారం రాత్రి కారులో గోవాకు బయలుదేరారు. మార్గమధ్యంలో హుబ్లీ వద్ద రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో తోకల రాజశేఖర్(44), మహేష్ (39) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు భానుప్రకాష్, రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందిన తోకల రాజశేఖర్‌కు కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మహేష్‌కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాలకు వీరే ఆధారంగా ఉండంతో వారి మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో పెబ్బేరులో విశాదం అమలుకుంది. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
సోమశిల అందాలు నల్లమ అందాలు తిలకిస్తూ జలజల పారుతున్న కృష్ణానదిలో బోటు ప్రయాణం చేయాలంటే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలకు వెళ్లాల్సిందే. సప్తనదుల సంగమం, పురావస్తు మ్యూజియం ఉన్నాయి. కృష్ణానది మధ్యలో ఉండే మహాభారత కాలం నాటి సంగమేశ్వరాలయం ఇక్కడే ఉంది. కొల్లాపూర్ నుంచి సోమశిల 9 కిమీ. ఆర్టీసీ బస్సులు, వాహనాలు అందుబాటులో ఉంటాయి. నాగర్‌కర్నూల్ నుంచి 57కిమీ, మహబూబ్‌నగర్ నుంచి 100కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధ్యాత్మికం కురుమూర్తి దేవాలయం అలంపూర్‌కు ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పురాతన ఆలయాలు, శిల్పకళా ఖండాలు ఇక్కడి ప్రత్యేకత. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం ఇక్కడే ఉంది. బాలబ్రహ్మేశ్వరస్వామి, నవబ్రహ్మ ఆలయాల సముదాయాలతో ఆధ్యాత్మికత ఇక్కడ వెల్లివిరుస్తోంది. అలంపూర్ క్షేత్రం మహబూబ్‌నగర్ నుంచి 125 కిలోమీటర్లు ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మరో ప్రముఖమైన క్షేత్రం కురుమూర్తి దేవాలయం. అమ్మాపూర్ సంస్థానాదీశులు ఈ ఆలయాన్ని కట్టించారు. శిలారూపం దాల్చి ప్రత్యక్షరూపంలో కురుమూర్తి రాయుడిగా భక్తులతో విశేష పూజలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత ఇక్కడ జరిగేదే పెద్దది. మహబూబ్‌నగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. -
శిల్పకళా నిలయం...రంగనాథుడి ఆలయం
శ్రీరంగాపూర్ ఆలయం 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. సుమారు 350 ఏళ్ల క్రితం సూగూరు రాజవంశీయులు శ్రీరంగాపూర్ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోని నేళమాలిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారు పూతతో పూచీన అపురూప దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. ఆలయం సమీపంలోగల రంగసముద్రం చెరువు మధ్యలో కృష్ణ విలాస్ అనే రాజుల విడిది భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మహబూబ్‌నగర్ నుంచి 85 కిలోమీటర్లు పెబ్బేర్ ఉంటుంది. అక్కడి నుంచి శ్రీరంగాపూర్క్షేత్రం 12 కిలోమీటర్లు ఉంటుంది. -
టిప్పర్ కింద పడి వ్యక్తి మృతి
మక్తల్: ఒండుమట్టి తరలించే టిప్పర్, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మక్తల్ మండలం గొల్లపల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. మక్తల్ మండలం మంతన్గోడ్కు చెందిన సంగంబండ హన్మంతు(60) బైక్‌పై మక్తల్‌కు వస్తుండగా.. మక్తల్ చెరువు నుంచి ఒండును తరలిస్తున్న టీప్పర్ ఢీకొంది. దీంతో ముందు టైర్లకింద బైక్, హన్మంతు పడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుపుకున్న మక్తల్ పోలీసులు ఘనటా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మక్తల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని బోరున విలపించారు. కూమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ధన్వాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఏంనోనిపల్లి స్టేజీ వద్ద హైదరాబాద్– మక్తల్ హైవేలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరికల్ మండలం బుడ్డగానితండాకు చెందిన సోమ్లానాయక్ (45) తండానుంచి గుండిగడ్ల శివారులో కౌలుకు తీసుకున్న భూమి వద్దకు బైకుపై వెళ్తున్నాడు. ఏంనోనిపల్లి శివారు వద్ద ముందు అగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెట్టుపై నుంచి పడి కూలీ మృతి మహబూబ్‌నగర్ క్రైం: కొబ్బరి చెట్టుకున్న టెంకాయలు కోయడానికి వెళ్లిన ఒక కూలీ అదుపు తప్పి నిచ్చెనపై నుంచి పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. టికొండ గ్రామానికి చెందిన శ్రీశైలం(40) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కొబ్బరి చెట్టుకు టెంకాయలను కోయడానికి నిచ్చెన వేసుకొని ఎక్కాడు. చెట్టు పూర్తిగా ఎక్కిన తర్వాత నిచ్చెన విరిగిపోవడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి..
రెండు, మూడు రోజుల్లో వరి కొనుగోళ్లు ప్రారంభిస్తారని నేను, నా తమ్ముడు కలిసి ఐదు ట్రాక్టర్ల ధాన్యం యార్డుకు తీసుకువచ్చాను. వర్షం రావటంతో ఆరబెట్టిన ధాన్యం వరద నీళ్లలో కొట్టుకుపోయింది. నాతో పాటు చాలా మంది రైతులు ఇదే పరిస్థితి. మక్కలు అయితే చాలా రోజుల నుంచి వచ్చి కొనకపోవటంతో వరదనీటిలో కొట్టుకుపోయి తడిసి ముద్దయ్యాయి. తడిసిన మక్కలు, వరిని కొనుగోలు చేయాలి. – భీమాస్వామి, గంగాపురం, జడ్చర్ల మార్కెట్‌కు 1వ తేదీ తెచ్చాను.. యార్డుకు ఐదు ట్రాక్టర్ల మక్కలు మే 1వ తేదీ తీసుకొచ్చాను. గన్నీ బ్యాగ్‌లు లేవని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టారు. నేనే సొంతంగా బయట గన్నీ బ్యాగ్‌లు తెచ్చి మక్కలు నింపి పెడితే.. ఈ రోజు కొనడానికి వచ్చారు. వేలిముద్ర రావడం లేదని వెళ్లిపోయారు. తీరా సాయంత్రం వర్షం వచ్చి ధాన్యం తడిసింది. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలి. – సుధాకర్, కోడ్గల్ రైతులకు న్యాయం జరగడం లేదు అమ్మబోతే అడవి.. ఆరబెట్టబోతే అధోగతి అన్న విధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాకు కిలో చొప్పున కట్ చేస్తూ మిల్లర్లు దగా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక తూకం సకాలంలో వేయక ఎన్నో అవస్థలు పడుతూ ధాన్యాన్ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్షం రావడంతో తడిసి ముద్దయింది. ఎంత నష్టం జరిగిందో తెలియదు. రైతులకు న్యాయం జరగడం లేదు. – అంజిలయ్య, రైతు, మహమ్మదాబాద్ ● -
కలవరం.. కలకలం
● యువతి హత్యతో ఉలిక్కిపడిన జడ్చర్ల ● అపస్మారక స్థితిలో ప్రేమోన్మాది జడ్చర్ల: జడ్చర్లలో నడిరోడ్డుపై ఓ ఉన్మాది.. యువతిని దారుణహత్య చేసిన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు.. ఎక్కడా.. అంటూ జనం ఆరా తీశారు. బాదేపల్లిలోని నిమ్మబాయిగడ్డ నుంచి ఎర్రసత్యం కాలనీలో ఉంటున్న తన ఇంటికి వెళుతున్న యువతి వైష్ణవి(23)ను గుట్టుగా వెంటాడుతు వచ్చిన ఓ యువకుడు(30) కత్తితో విచక్షణ రహితంగా దాడి చయడంతో.. సీసీ రోడ్డుపై ఆ యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రక్తం మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు వదలింది.రక్తం మరకలతో పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంటాడి పట్టుకొని తాళ్లతో చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. కొందరు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ● వైష్ణవి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నిందితుడితో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి వారితో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా యువతి దారుణహత్యను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా..వైష్ణవి హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, తదితరులు బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
కూలిన ఇళ్లు.. రోడ్డుపై వరద
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్య కాలనీలో రెండు ఇళ్లు కూలిపోయాయి. బాధితులను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకరికి రూ.25వేల ఆర్థికసహాయం చేశారు. వర్షం కారణంగా ప్రధాన రోడ్డుపై వరదనీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద ముంపు నివారణ కాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా 4వ వార్డులో మురికినీరు ఇళ్ల ముందు నుంచి ప్రవహించింది. బాదేపల్లి మార్కెట్లో పంట తడిసిపోయిన ధాన్యంను ఎమ్మెల్యే పరిశీలించారు. యార్డులో రైతులతో మాట్లాడి..మక్కలు, వరి చివరి గింజ కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇటీవల కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ఈ సెలవుల్లో కుటుంబసమేతంగా ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్‌నగర్ – వివరాలు 8లో.. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
● ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● అంతర్జాతీయ ప్రమాణాలతో టీపీఎస్‌ల నిర్మాణానికి చర్యలు ● ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య ● వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే వి ద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో మంచి స్పందన వచ్చింది. డేటా ఆధారిత ఎంపిక.. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో టీపీఎస్‌కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఒక్కో టీపీఎస్‌కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రానుంది. ప్రైవేటు స్కూళ్లకు ఽధీటుగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్‌ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్‌లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్‌గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
అడ్డాకుల/భూత్పూర్: వరి ధాన్యం కొనుగోళ్లను అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శనివారం ఆమె మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి, భూత్పూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హరిప్రియతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన తేమ శాతం ఉండేలా చూసుకుని రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులతో ఆరా తీశారు. రహదారుల వెంట ఉన్న వరి కుప్పలను ముందుగా కొనుగోలు చేసి ఐదారు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి రక్షించేందుకు తగినన్ని టార్ఫాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. డీఎస్ఓ శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్ధ డీఎం రవినాయక్, తహసీల్దార్ రాజునాయక్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ మమత, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ వెంకటేష్, జీపీఓ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య ఉన్నారు. -
రైతుల కష్టం నీటి పాలు
జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ● మార్కెట్, కొనుగోళ్లు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌స్తంభాలు ● అకాల వర్షం వల్ల అన్నదాతలకు అపార నష్టం మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/జడ్చర్ల టౌన్/మహమ్మదాబాద్/గండేడ్/అడ్డాకుల/భూత్పూర్: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురవడంతో రైతులు పంట నేలపాలైంది. జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, హన్వాడ, నవాబుపేట, మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, మూసాపేట, అడ్డాకుల, భూత్పూర్ మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మేందుకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆకాశం మేఘామృతమై ఈదురుగాలులు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకునేందుకు ప్రయత్నించగా.. ఈదురు గాలు లు, వర్షం ధాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బందిపడ్డారు. చాలాచోట్ల కాంటా వేసిన బస్తాలు తడిసి పోయాయి. రాశుల కిందికి వర్షపు నీరు చేరింది. ● జిల్లా కేంద్రంలో సాయంత్రం 5.45గంటల నుంచి 6.15 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12 విలీన గ్రామాలలోని మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారాయి. జడ్చర్లలోని గంగాపురం రోడ్డులో ఉన్న కాటన్మార్కెట్లో ధాన్యం తడిసిపోగా.. పట్టణంలో పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లకొమ్మలు కరెంట్ వైర్లపై తెగిపడడంతో విద్యుత్‌సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాటన్ మార్కెట్లో కొద్దిరోజులుగా మొక్కజొన్నలు కొనుగోళ్లు ఆలస్యం కావటంతో పెద్ద ఎత్తున యార్డులోనే రైతులు అక్కడే ఆరబోసి పెట్టారు. అకస్మాత్తుగా వర్షం రావటంతో మక్కలు, వరి కొట్టుకుపోంది. తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. సంచుల్లో ఉన్న ధాన్యం, మక్కలు సైతం తడిపిముద్దయ్యాయి. వర్షం తగ్గిన తరువాత కొట్టుకుపోయిన ధాన్యంను చాటలతో తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. ● మహమ్మదాబాద్ మండలంలో నంచర్ల కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొకర్లాబాద్ గాధిర్యాల్ రోడ్డుపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. గండేడ్ మండలంలోని బల్సుర్‌గొండ, రంగారెడ్డిపల్లి, వెన్నాచేడ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిపోయింది. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. ● అడ్డాకుల, మూసాపేట మండలాల్లో రోడ్లు, పొలాల వెంట రైతులు నిల్వ చేసిన వరి ధాన్యం తడిసి పోయింది. ఇంకా వరి కోతలు పూర్తి కాని చోట పంట నేలకొరిగింది. భూత్పూర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. -
ప్రేమే కారణమా..?
యువతి హత్యకు ప్రేమనే కారణమని పలువురు భావిస్తున్నారు. యువతిని కత్తితో పొడిచి పారిపోతున్న సమయంలో స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమయ్యిందా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా దాడికి పాల్పడ్డానని పేర్కొన సదరు యువకుడు యువతి వైష్ణవికి పెళ్లి కుదరడం, మరో రెండు నెలల్లో పెళ్లి అయిపోతుందన్న సమాచారం ఉండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అయితే వైష్ణవి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు కొట్టి పారేస్తున్నారు. అయితే నిందితుడు ఆపస్మారక స్థితి నుంచి బయటపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, మహబూబ్‌నగర్: జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ యవకుడు.. యువతి ప్రాణం తీశాడు. యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. -
కానిస్టేబుల్ అదృశ్యం.. కేసు నమోదు
బల్మూర్: మండలంలోని తోడెళ్లగడ్డకు చెందిన పిట్టల మోహన్ అనే కానిస్టేబుల్ అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదు చేసినుట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మోహన్ భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా ఈ నెల 13న తన స్వ గ్రామానికి వచ్చా డు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో పెళ్లి విషయంలో ఘర్షణ పడి ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి పోయాడు. అనంతరం తాను హైదరాబాద్‌లో ఉనా ్ననని బీబీనగర్ మండలం గూడు రుకు చెందిన సరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఫోన్లో సమాచారం ఇచ్చి ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కానిస్టేబుల్ తండ్రి పిట్టల శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పాతికేళ్లకు కుటుంబం చెంతకు..
● 24 ఏళ్ల క్రితం తప్పిపోయినగద్వాల జిల్లా వాసి ● గుర్తించి కుమారులకు అప్పగించిన కామారెడ్డి పోలీసులు కామారెడ్డి క్రైం: మానసిక స్థితి సరిగా లేక సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు కుటుంబం చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా పుటాన్పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఆయన మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో కుటుంబాన్ని చేరలేకపోయాడు. చిన్నచిన్న పనులు, భిక్షాటన చేసుకుంటూ ఎక్కడపడితే అక్కడ జీవించాడు. ఆరోగ్యం, మానసిక పరిస్థితి సక్రమంగా లేని స్థితిలో గురువారం రాత్రి కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి ఆయనను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాస్త కోలుకున్నాక అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చి వాకబు చేయించారు. వివరాలు సరైనవే అని తేలడంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కామారెడ్డికి పిలిపించారు. శుక్రవారం ఉదయం సత్యనారాయణ ఇద్దరు కుమారులు శివశంకర్, జ్ఞాన చారి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఇంతకాలం ఎక్కడ ఉన్నావని, ఎలా ఉన్నావని తండ్రిని అడిగారు. సత్యనారాయణ వద్దనుంచి సరైన సమాధానం రాకపోగా, కొడుకులను చూసిన ఆనందంలో బోరున విలపించాడు. చాలాచోట్ల గాలించినా అప్పట్లో తమ తండ్రి ఆచూకీ దొరకలేదని సత్యనారాయణ కుమారులు తెలిపారు. ఇంత కాలానికి తండ్రి ఆచూకీ లభించినందుకు సంతోషంగా ఉందంటూ కామారెడ్డి సీఐ నరహరి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తండ్రిని వెంట తీసుకుని వెళ్లారు. -
యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఖుష్బుగుప్తా పేర్కొన్నారు. పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారం భోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడంతో భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తిస్తే వాటికి నివారణ సులువవుతుందన్నారు. కొన్ని ఆరోగ్య పరీక్షలను నిర్ణీత సమయాల్లో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యువత సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయడంతో అనేక లాభాలు ఉంటాయన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువుతోపాటు ఆరోగ్యం, సామాజిక బాధ్యత, సేవవంటి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీటితోపాటు ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను కలెక్టర్‌తోపాటు వీసీ పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు అధ్యాపకులు పాల్గొన్నారు. -
డీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా భోజనం
అమరచింత పట్టణంలో వందేమాతరం ఫౌండేషన్, విజ్ఞాన వారథి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం టిఫిన్‌తోపాటు రెండుపూటల భోజన వసతి కల్పించాలని కోరారు. దీంతో తమ డీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా క్యాంపు చివరిరోజు వరకు భోజన సదుపాయం కల్పించి విద్యార్థుల విద్యావికాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. – దేశాయి ప్రకాశ్‌రెడ్డి, డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, అమరచింత ● -
బావిలో దూకి మహిళ మృతి
ధరూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురైన వివాహిత బావిలో దూకి మృతిచెందిన ఘటన మండలంలోని అల్వాల్పాడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, పద్మమ్మ(48)దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద వాడైన వంశీ యాప్ లోన్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుని అప్పుల పాలవుతున్నారని భావించి ఇంట్లో తల్లి మందిలించింది. ఈ క్రమంలో పద్మమ్మ అత్త కలుగజేసుకుని నీవు నెత్తికెక్కించుకోవడం వల్లే వాడిలా తయారయ్యాడు.. అంతా నీవల్లే అంటూ మందలించడంతో క్షణికావేశానికి లోనై గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో వ్యవసాయ బావికి వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటంబ సభ్యులు అటూఇటు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఉదయం సొంత బావి వద్ద ఆమె చెప్పులు కనిపించడంతో అనుమానంతో బావిలో గాలించారు. పెద్ద ఎత్తున నీళ్లు ఉండడంతో గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేకపోయింది. నాలుగు మోటార్లు, ఒక ఫైరింజన్ మోటారు సహాయంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీటిని తోడేశారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో మృతదేహం బయటకు తీశారు. పంచనామా నిర్వహించిన పోలీసులు శవాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ హుస్సేన్ తెలిపారు. -
సంస్కారంతో కూడిన విద్య అవసరం
విద్యార్థులకు విద్యతోపాటు సంస్కారం, దేశభక్తిని పెపొందించే విధంగా వందేమాతరం ఫౌండేషన్ ద్వారా శిక్షణ తరగతులను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాం. మూడో తరగతి విద్యార్థుల నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల వరకు శిబిరంలో చేర్చుకుని వారికి చదువుతోపాటు వివిధ కళల నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తున్నాం. 16 శిక్షణ శిబిరాలలో మొత్తం 3వేలమంది విద్యార్థులకు 96మంది వలంటీర్లతో తరగతులను నిర్వహిస్తున్నాం. నెలపాటు విద్యార్థులకు ఇంటి పనులతోపాటు స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రి, గురువు, పెద్దలను గౌరవించే విధంగా వారిలో ప్రేరణ కలిగిస్తున్నాం. – మాధవరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం
జడ్చర్ల: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు. జడ్చర్ల–దివిటిపల్లి మధ్య పట్టాలపై శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (48) రైలు కింద పడి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో మరణించాడా లేక ఆత్మహత్య చేసుకున్నడా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్క, బ్లూ కలర్ లుంగి ధరించి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు 87126 58597 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మల్దకల్: శ్రీరంగాపురం మండలంలోని జానంపేటకు చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన విష్ణువర్దన్ సాగర్ (38) ఈనెల 8న అయిజలో జరిగే వివాహానికి హజరయ్యేందుకు వెళ్తుండగా మల్దకల్ మండలం అమరవాయి–బూడిదపాడు గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కర్నూలు ఆస్పత్రికి అనంతరం ఈనెల 12న హైదరాబాద్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య అనితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బస్‌స్టాప్‌లో యాచకుడి మృతి భూత్పూర్: పట్టణంలో అమిస్తాపూర్ సమీపంలోని రాజీవ్ స్వగృహ ఎదుట గల బస్‌స్టాప్‌లో ఓ యాచకుడు (56) మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా రాజీవ్ స్వగృహ చుట్టుపక్కల భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. శుక్రవారం ఉదయం రాజీవ్ స్వగృహకు చెందిన కాలనీ వాసులు వాకింగ్ చేస్తుండగా బస్టాండ్‌లో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలాన్ని పరిశీలించిన పోలీసులు ఎండ తీవ్రత తట్టుకోలేక నిద్రిస్తున్న చోటనే మరణించి ఉండొచ్చని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే భూత్పూర్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. -
పొరపాటున వేరే సెంటర్‌కు వెళ్లారు..
గట్టు: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇద్దరు విద్యార్థినులకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని మానవపాడు గురుకుల పాఠశాల గట్టు అని ఉండగా, పొరపాటున వారు తల్లిదండ్రులతో కలసి మానవపాడుకు చేరుకున్నారు. తీరా మానవపాడు గ్రామంలో గురుకుల పరీక్షా కేంద్రం లేదని విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి గట్టులోనే ఉన్న మానవపాడు గురుకుల పరీక్ష కేంద్రానికి బైకుపై బయలు దేరారు. సుమారుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి వీరు గట్టుకు చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో విద్యార్థినులు 10: 30 గంటలకు కేంద్రానికి చేరుకున్నారు. పొరపాటున మానవపాడుకు వెళ్లామని, పరీక్షా కేంద్రం విషయంలో అయోమయానికి గురైనట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు విద్యార్థినులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థినులు బాధతో వెనుతిరిగి వెళ్లారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 504 మంది విద్యార్థులకుగాను 492 మంది, గట్టులోనే ఉన్న మరో కేంద్రం మానవపాడు గురుకుల పాఠశాలలో 336 మంది విద్యార్థినులు ప్రవేశ పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మానవపాడు మండల కేంద్రం అనుకొని అక్కడికి వెళ్లిన విద్యార్థులు గట్టులోని మానవపాడు గురుకుల పాఠశాల కేంద్రానికి ఆలస్యంగా చేరిక పరీక్ష కేంద్రంలోకి అనుమతించని అధికారులు -
రండి.. విశేషాలు పంచుకుందాం
మీరు ఫొటోలు, విశేషాలు, గీసిన చిత్రాలను 94415 43232 నంబర్‌కు వాట్సప్ చేయండి. పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. వీటిని ప్రచురించి మీ సందడిని అందరితో పంచుకునేలా చేస్తాం. -
రైతాంగాన్ని విస్మరించిన కాంగ్రెస్
● మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లేనిపోని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని.. ఈ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తగినన్ని కేంద్రాలు, సంచులు, లారీలు ఏర్పాటు చేయకుండా.. మద్దతు ధర చెల్లించకుండా, తరుగు పేరుతో దోపిడీ చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగం శ్రేయస్సు, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్‌తో నారా్ల్పూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీలు నవీన్ కుమార్‌రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు గౌడ్, ఇంతియాజ్, వాల్యనాయక్, హనుమంతు నాయుడు, రాజేశ్వర్‌గౌడ్, నర్సింహులు పాల్గొన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా.. : నిరంజన్‌రెడ్డి గతంలో తెలంగాణలో యాసంగిలో ఐదారు లక్షల ఎకరాలే సాగయ్యేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదే యాసంగిలో బీఆర్ఎస్ హయాంలో 59.44 లక్షల ఎకరాలు సాగైందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి పథకాలు ఇందుకు దోహదం చేశాయి. నీళ్లు ఇవ్వకుంటే అంత సాగు సాధ్యమయ్యేదా? 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏమైనా సాగు పెరిగిందా? అదనంగా సాగు నీరు ఇచ్చే ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా? పాలమూరు ప్రాజెక్ట్‌లపై ఇప్పటికై నా ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రవాణా కోసం నిర్వహించిన టెండర్లలో పెద్ద స్కాం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం: లక్ష్మారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్లు కేసులు వేసి పాలమూరు ప్రాజెక్ట్ ఆపాలని చూసినా 90 శాతం పనులు పూర్తి చేశాం. నార్లాపూర్‌లో కేసీఆర్ ఒక పంప్ ప్రారంభించారు.. మేము తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఐదు నెలల్లో పూర్తి చేసేవాళ్లం. -
‘పాలమూరు’ కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్‌తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్‌లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్‌లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్‌రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి దశలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్‌లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్‌లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్‌లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
ప్రజలను మోసం చేసిన మోదీ..
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రంలోని మోదీ ప్రభు త్వం ప్రజలను మోసం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే నిత్యవసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలకు పెట్రో ల్, డీజిల్ ధరల పెంపు మరింత భారం కానుంది. మంచి రోజులు అంటూ చెప్పుకునే ప్రధానమంత్రి మోదీ ధరలు పెంచితీవ్ర ఆర్థిక భారం మోపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయి ల్ ధరలు పెరిగిందనే సాకుతూ ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదు. ధరల పెరుగుదలను పునఃసమీక్షించాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. – సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు పెంచడం సరికాదు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరికాదు. ప్రభుత్వం ఆదాయం కోసం తీసుకునే నిర్ణయాలు మా లాంటి వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కష్టకాలంలో గిరాకీలు లేక నానా అగచాట్లు పడుతున్నాం. ఇంధన ధరలు పెరుగుదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వాలు పునరాలోచించి పెరిగిన ధరలను తగ్గించాలి. – ఎ.రామస్వామి, ఆటో డ్రైవర్, మహబూబ్‌నగర్ వాహనాలు నడిపే పరిస్థితి లేదు పట్టణానికి రావాలంటే ఆటోలు, బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో బైక్ వినియోగిస్తా. పెరిగిన పెట్రోల్ ధరలు చూస్తే బైక్ నడిపే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇంధన ధరలు పెరిగితే అన్నింటి ధరలు పెరుగుతాయి. – చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్, చిన్నచింతకుంట -
ఉన్నత విద్యపై దృష్టి సారించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): టెన్త్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పదో తరగతి, ఇంటర్, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురేసి విద్యార్థులకు రూ.10వేల నగదు, మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసి, సన్మానించారు. టెన్త్ ఫలితాల్లో వందశాతం సాధించిన 57 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శాలువాతో సన్మానించి, ఆయా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమష్టి కృషితో జిల్లాలో ఎస్ఎస్సీ ఫలితాల్లో 92.70 శాతం ఉత్తీర్ణత సాధించగలిగామన్నారు. ఇంటర్, డిగ్రీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా అవకాశాలపై విద్యాశాఖ ద్వారా మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మేయర్ గుమ్మాల మమత మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో టెన్త్ పరీక్షలు ముఖ్యమైన తొలిమెట్టు అని అన్నారు. డీఈఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ విద్య విజయోత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని 180 పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల టాపర్లకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేసి, సన్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ రాజశేఖర్‌రెడ్డి, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 12,721 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది.ఽ అదేవిధంగా 4,066 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు వచ్చింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌రకం క్వింటా గరిష్టంగా రూ.2,589, కనిష్టంగా రూ.1,601, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,199, కనిష్టంగా రూ.5,411, ఆముదాలు గరిష్టంగా రూ.6,285, కనిష్టంగా రూ.6,215,ఽ పొద్దుతిరుగుడు రూ.6,072, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,921, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. -
జడ్చర్లలో ‘ఏసీబీ’ కలకలం
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో పది మంది సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషర్ లక్ష్మారెడ్డి తన చాంబర్లోనే ఉండగా.. మిగతా సిబ్బంది ఎవరి పనుల్లో వారు నిమ్మగ్నమవ్వగా.. మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారుల బృందం కార్యాలయంలోకి ప్రవేశించింది. సిబ్బంది మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో వివిధ పనులకు సంబంధించి వచ్చిన వారిని విచారించి, వారిని సోదా చేసి బయటకు పంపారు. నగదు స్వాధీనం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సందర్భంగా కమిషనర్, సిబ్బంది వద్ద ఎలాంటి నగదు లభించనట్లు తెలిసింది. అయితే అక్కడకు వచ్చిన వారిలో మున్సిపల్ కాంట్రాక్టు పనులు చేసే జావీద్ వద్ద రూ.48 వేలు, కృష్ణారెడ్డి వద్ద రూ.15వేలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరి వద్ద కూడా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ● కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఎల్ఆర్ఎస్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజినీరింగ్ తదితర విభాగాలపై దృష్టి సారించి ఆ దిశగా విచారించారు. భవన నిర్మాణ అనుమతుల్లో అవకతకవకలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పన్నుల రూపేనా వచ్చిన ఆదాయంపై విచారించారు. ఇందుకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న పలు రికార్డులను సీజ్ చేయగా మరికొన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. వారి ఫోన్లను స్వాధీన పర్చుకున్న తరువాత ఫోన్ పే, గూగుల్ పే ఖాతాలను పరిశీలించి అధిక మొత్తంలో అనుమానాలు వచ్చిన వారి బ్యాంకు ఖాతాలను కూడా నిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం. అంతులేని అవినీతి జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో అంతులేని అవినీతి పెరిగిందని, ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఖర్చు చేసిన నిధులు, భవన నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు గుట్టు రట్టవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపల్ పరిధిలో వెంచర్లు, అపార్ట్మెంట్ల మార్టిగేజ్ రిలీజ్‌పై కూడా ఏసీబీ నజర్ పెట్టే పరిస్థితి ఉంది. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుల అంతుస్థుల భవనాలకు సంబంధించి భారీగా అవినీతి జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. చాలాచోట్ల సెల్లార్లకు అనుమతులు లేకున్నా అక్రమంగా డబ్బులు ముట్టజెప్పి సెల్లార్లు నిర్మించారు. ఇక రోడ్ల మరమ్మతుల పేరిట భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కసారిగా కలకలం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న సమాచారంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. గతంలో నగర పంచాయతీ, మేజర్ జీపీగా ఉన్న కాలంలో సైతం అవినీతి యథేచ్ఛగా సాగుతున్నా ఏసీబీ అధికారులు ఏనాడు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే పాలకమండలి పదవీకాలం ముగిసిన వారం రోజులకే ఏసీబీ దాడులకు దిగడం చర్చనీయాంశగా మారింది. ఫిర్యాదుల ఆధారంగానే తనిఖీలు: ఏసీబీ డీఎస్పీ మున్సిపల్ కార్యాలయంలో అవినీతిపై తమకు అనేక ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. మున్సిపల్లోని ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అవకతవకలు తేలితే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. అధికారులు, ఉద్యోగులు పనులకు సంబంధించి ప్రజలనుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీలో ఏసీబీ ఇన్స్పెక్టర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు సిబ్బంది మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం పలు రికార్డుల సీజ్, స్వాధీనం అవినీతి ఆరోపణ నేపథ్యంలోనే దాడులు.. -
ప్రజలపై ఆర్థిక భారం మోసిన కేంద్రం
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి ఎన్నికల ముగిసిన వెంటనే ఒక్కసారిగా ధరలు పెంచి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపింది. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు పెరిగినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ధరలు నియంత్రించి ప్రజలపై అదనపు భారం పడకుండా చూసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి దాని ప్రభావం నిత్యావసరాల వస్తువుల ధరలపై పడుతుంది. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ధరల పెంపును పునఃసమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి. – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ -
ప్రజలతో అవసరం తీరిందని..
ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.. ఇక ప్రజలతో అవసరం తీరిందని కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెంచేసింది. ఈ విషయంలో రాహుల్‌గాంధీ గత నెలలో ముందుగానే హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలతో వ్యాపారం చేస్తుందని, నష్టం అనేది రాకుండా ధరలు పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై పెను భారం పడుతుంది. రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువులపై ప్రభావం చూపుతుంది. వెంటనే పెంచిన పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలి. – మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ధరలు తగ్గించాలి పెట్రోల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ తప్పనిసరిగా మా రింది. ఇలాగే ధరలు పెంచుకుంటూ పోతే పేదలు, మధ్యతరగతి వారు బైక్‌లను మూలన పడేయాల్సిందే. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. – కడియాల మోహన్, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధరల పెంపును సమీక్షించాలి పెట్రో ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారుతోంది.పెంపు ప్రభావం అన్ని రంగాలపై నా పడుతోంది. పెట్రో ధరల పెంపుపై ప్రభుత్వాలు సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇకనైనా ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి పెట్రో ల్, డీజిల్ అమ్మకాలను తీసుకొస్తే రేట్లు తగ్గి ప్రజలపై భారం తగ్గుతుంది. నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. – బి.రాజేశ్వర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ -
మా పొలాన్ని కాపాడాలి..
‘మా కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం ఈ చిన్న పొలమే. ఎకరం భూమిలోనే చిన్న షెడ్డు వేసుకుని.. గేదెలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు భారత్‌మాల రోడ్డు పేరుతో 30 గుంటల భూమి పోతే మాకు మిగిలేది ఏముంటుంది? మా పిల్లలను ఎలా పోషించాలి? మా జీవితం ఎలా కొనసాగాలి? మొదట రోడ్డు వేరే వైపు తీస్తామని చెప్పారు. ఇప్పుడు మా పొలం మీదుగా తీసుకొస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం మంచిదే కానీ పేద రైతుల బతుకులు నాశనం కాకూడదు. మాకు ఉన్నది ఇదొక్కటే బతుకుదెరువు. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకుని రోడ్డు మార్గాన్ని మార్చాలని, మా పొలాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం..’ అని మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన గొల్ల నర్సిములు యాదవ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. -
గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు
నారాయణపేట: ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారని, మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టీలెవెల్ వ్యాపారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారని, ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం తప్పదన్నారు. గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి తర్వాత మోసం చేసి జెండా ఎత్తేస్తారన్నారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేసి మోసపోవద్దన్నారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వనపర్తి రూరల్: బొలేరో, బైకు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన బుదవారం అర్ధరాత్రి పెబ్బేరు మండల కేంద్రంలోని గోశాల దగ్గర చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... పెబ్బేరు మండలం, వైశాఖపూర్ గ్రామానికి చెందిన మెకానిక్ కురువ నాగేష్ (28) బైక్‌పై పెబ్బేరులోని తన మెకానిక్ షాపునకు వచ్చి పనులు ముగించుకొని రాత్రి బైక్‌పై గ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో పట్టణంలోని గోశాల దగ్గర ముందు వెళ్తున్న బొలేరో వాహనం యూటర్న్ తీసుకుంటుండగా వెనకాల వస్తున్న నాగేష్ బైక్‌ను అదుపు చేయలేక బొలేరోను ఢీకొట్టాడు. ప్రమాదంలో తల, కాళ్లకు బలమైన రక్త గాయాలు కాగా వెంటనే 108లో వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతుడి అన్న రాఘవేంద్ర గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
త్వరలో 151 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
● నేటితో ముగియనున్న ఆప్షన్ల స్వీకరణ ● బదిలీల ప్రక్రియ పారదర్శకంగాఉంటుంది: డీపీఓ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో మొత్త 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతానికి మించి బదిలీలు చేయడానికి వీలులేదు. దీంతో 151 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. బదిలీలపై ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులతో బుధవారం జిల్లా పంచాయతీ అఽధికారి వెంకట్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. కార్యదర్శుల బదిలీలు పారదర్శకంగా చేపడుతామని వారికి హామీ ఇచ్చారు. జీఓ 38 ప్రకారం నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్యదర్శులు, ఇతర ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. 40 శాతం మంది ఉద్యోగులకు బదిలీల్లో పరిగణలోకి తీసుకుంటారు. రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన వానిరి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపడుతారు. ఇప్పటికే ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేశారు. దీనికి ప్రకారం ఈనెల 15వ తేదీ వరకు ఉద్యోగులు తాము కోరుకునే స్థానాలను ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తును పరిశీలిస్తారు. ఈనెల 25వ తేదీ నుంచి బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. -
పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములుకావాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీయూలో చదివి వివిధ స్థాయి ల్లో విద్యార్థులు పనిచేయడం గొప్ప విషయమని, జీవితంలో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, విజయాలు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతు న్న విద్యార్థులకు మార్గదర్శనం కావాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, దానితో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, అనురాధారెడ్డి, మాళవి, కరుణాకర్‌రెడ్డి, నూర్జహాన్, కృష్ణయ్య పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలబుల్’కు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పలు బెస్ట్ అవైలబుల్ స్కీంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కులం, ఆదాయం, బోనాఫైడ్ సర్టిఫికెట్లతో జూన్ 6వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీన లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,415 దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,415, కనిష్టంగా రూ.2,329గా ధరలు లభించాయి. మార్కెట్‌కు కేవలం 500 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ● నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జొన్నలు క్వింటా గరి ష్టంగా రూ.5,026, కనిష్టంగా రూ.4,856 ధర పలికాయి. వడ్లు సోన గరిష్టంగా రూ.2,521, కనిష్టంగా రూ.1,663 ధర లభించింది. బ్లాక్ స్పాట్ల పరిశీలన మహబూబ్‌నగర్ క్రైం: ఇటీవల నగరంలో తర చూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ లో భాగంగా గురువారం రాత్రి అదనపు ఎస్పీ రత్నం ఆధ్వర్యంలో మున్సిపల్, ఆర్అండ్బీ అధికారుల బృందం బ్లాక్ స్పాట్ ఏరియాలను సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రమాదాలని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదనంగా చేపట్టాల్సిన భద్రత చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు. రహదారులపై హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, ఎస్ఐ విజయ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీస్తాం
మూడేళ్ల నుంచి ఇండోర్ స్టేడియంలో వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరంలో చాలామంది కొత్తవారే. వారికి ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నాం. కొత్తవారైనా వారిలో చాలా మంది మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గురిస్తాం. రెగ్యూలర్ శిక్షణ తీసుకుంటే మెరుగైన క్రీడాకారులుగా ఎదగవచ్చు. విద్యార్థులను ప్రోత్సహించడానికి వేసవి శిబిరం ముగింపు అనంతరం టోర్నీ నిర్వహిస్తాం. – రాజగోపాల్, కోచ్ ● -
వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
అయిజ: మతిస్థిమితంలేని వ్యక్తి వడదెబ్బతో మృతిచెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామస్తులవారి కథనం ప్రకారం.. మతిస్థిమితంలేని వ్యక్తి హిందీ మాట్లాడుతూ.. 10రోజులుగా మండలంలోని ఎక్లాస్పురం, దేవబండ శివార్లలో తిరుగుతూ ఉన్నాడు. గురువారం ఎండ తీవ్రతకు తాలలేక మండలంలోని దేవబండ సమీపంలోని భారత్ మాల రోడ్డుకు సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మృతిచెందాడు. ఎస్ఐ మల్లేష్ పోలీస్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ శిబిరం
బేసిక్ అంశాలపై దృష్టి మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈ ఏడాది పలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇండోర్ స్టేడియంలో వేసవి షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ శిబిరంలో 45 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు బేసిక్ అంశాలపై శిక్షణా ఇవ్వడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముందుగా వార్మప్, ఫిట్నెస్ అనంతరం రాకెట్స్ ఎలా పట్టుకోవాలి, స్వింగ్ ఎలా ఇవ్వాలో, లిఫ్టింగ్, సర్వీస్ చేయడం, నిలబడే విధానంపై శిక్షణ అందజేస్తున్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విద్యార్థులకు ప్రత్యేక మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. -
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిలో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సుమారు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో భాగంగా రూ.2.5 కోట్ల వ్యయంతో పలు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మయూరీ పార్క్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ట్రెక్కింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు, టూరిస్టుల కోసం తాత్కాలిక కాటేజీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఫారెస్ట్ ఏరియా పరిమితులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. కురుమూర్తి, మన్యంకొండ, పిల్లలమర్రి వంటి ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2028లో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల దృష్ట్యా జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 150 పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించినట్లు చెప్పారు. సీఎం వాటిని ఆమోదిస్తూ ప్రధాన దేవాలయాలన్నింటిని అభివృద్ధి చేయాలని సూచించినట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్భూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ దేవ్లీ మేఘ్యనాయక్, జిల్లా పర్యాటక అధికారి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, ప్రశాంత్, రమేష్‌రెడ్డి, తిరుమల వెంకటేశ్, రవి, అశ్వాక్, హకీం, రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి -
పాతతరం ఆటలతో కాలక్షేపం
ఎప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండే చిన్నారు.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నాయనమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పాతతరం ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ వామనగుంటలు (వాన గుంతల ఆట), అష్టా–చెమ్మా, పులి–మేక, పచ్చీస్ పాళీ, వైకుంఠపాళి, చదరంగం.. తదితర పురాతన సాంప్రదాయ బోర్డు గేమ్ ఆటలు ఆడుతూ సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంతో పాటు లింగాలలో చిన్నారులు వానగుంతల ఆట ఆడుతూ సందడి చేస్తున్నారు. – కందనూలు/లింగాల -
పోలీసుల తనిఖీల్లో గంజాయి లభ్యం
కల్వకుర్తి రూరల్: పోలీసుల తనిఖీలలో 25 గ్రాముల గాంజా పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కల్వకుర్తి మండలం మార్చాలా గ్రామ సమీపంలో ఉన్న సూర్యలత కాటన్ మిల్, ఊరుకొండ పేట కాటన్ మిల్లులో నివాసం ఉంటున్న కార్మికుల క్వార్టర్లలో సోదాలు నిర్వహించారు. కల్వకుర్తి మిల్లులో 10 గ్రాముల గాంజా లభించగా ఊరుకొండ పేట మిల్లులో 15 గ్రాముల గాంజా లభించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువకులు గాంజా, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కల్వకుర్తిలో 360 క్వార్టర్లు, ఊరుకొండ పేటలో 500 మంది వ్యక్తులను తనిఖీ చేశామని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ తనిఖీలలో పలువురు ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
‘హైలెవల్’.. ముమ్మరం
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. తగ్గనున్న దూరం.. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. 18 నెలల్లో పూర్తి... జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు -
కొర్విపాడులో పట్టపగలే చోరీ
మానవపాడు: పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని కొర్విపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పరుశరాముడు రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. దీంతో దొంగలు తాళం పగులగొట్టి రూ.50వేలు నగదు, బంగారు కమ్మలు, పట్టీలు చోరీ చేశారు. సాయంత్రం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. సర్పంచ్ ఇంట్లో చోరీ ఇటిక్యాల: సర్పంచ్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని ఉదండాపురంలో చోటు చెసుకుంది. బాధితుడు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన సర్పంచ్ గొల్ల మహేష్ బుధవారం రాత్రి తన ఇంటి మేడపై నిద్రించాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియ ని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని సుమారు రూ.2.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి ఇంట్లోకి వెళ్లగా.. బీరువా తెరచి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు నగదు పోయిందని గుర్తించి పో లీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం సిబ్బంది ఘటన స్ధలాన్ని చేరుకొని ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. 40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత రాజాపూర్: బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ శివారులో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు. మోతిఘనాపూర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ బొలేరో వాహనాన్ని పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ బియ్యం ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాగిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. -
మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలి
● కలెక్టర్ ఖుష్బూ గుప్తా జడ్చర్ల: మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బుగుప్తా ఆదేశించారు. జడ్చర్లలో అకాల వర్షం శీర్షికన వచ్చి గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హరిప్రియతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గన్నీబ్యాగులు తదితర సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో లారీలు రాకపోవడం, హమాలీల సమస్యతోపాటు గోదాంలు ఖాలీగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా తాము కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొనడం లేదని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వర్షం వస్తే మొక్కజొన్నకు తీరని నష్టం కలుగుతుందని, బుధవారం కురిసిన వర్షానికి మొక్కజొన్న తడిసిపోయిందని వెంటనే కొనుగోలు చేసి తమ ఇబ్బందులను తీర్చాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో సకాలంలో మొక్కజొన్నను కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు చేసిన బస్తాలను మార్కెట్షెడ్లలోనే నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సింగిల్‌విండో అధికారులు, పాలకమండలి సభ్యులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డులో గోదాములకు సంబంధించిన వివరాలను సంబంధిత కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం రహెమున్నిసా భేగం, తహసీల్దార్ నర్సింగరావు, సింగిల్‌విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, మార్కెట్ సెక్రటరీ అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఉన్న భూమి పోతే బతుకేది ఎట్లా..
మేము నలుగురు అన్న దమ్ములం. మా నలుగురికి కలిపి 15 మంది సంతానం ఉన్నారు. 20 ఏళ్ల కిందట జాతీయ రహ దారి విస్తీర్ణంలో రెండు ఎకరాల భూమి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న రెండున్నర ఎకరాల భూమి మొత్తం పోతుంది. కూరగాయలు, ఆకుకూరలు, వరి వేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు మా భూమిని రోడ్డుకోసం తీసుకుంటే మేము ఎట్లా బతికేది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వేరే చోటకు మార్చాలి. – గొల్ల కృష్ణయ్య, రైతు, అన్నాసాగర్ భూములివ్వం.. పోరాటం చేస్తాం మా ముగ్గురు అన్నదమ్ములం.. మూడు ఎకరాల భూమి అంతా కో ల్పోతున్నాం. అన్నాసాగర్–హస్నాపూర్ రెండు గ్రామాల శివారు నుంచి భారత మాలరోడ్డుకు అలైన్మెంట్ చేస్తున్నట్లు మాకు గతంలోనే తెలుసు. ఇప్పుడు మళ్లీ మా పొలం నుంచి సర్వే చేయడం తగదు. వేరే చోట కు మార్చేదాకా సర్వేను అడ్డుకుంటాం. మేము భూములు ఇవ్వం. పోరాటాలకు చేస్తాం. – ఎండీ జహంగీర్, రైతు, అన్నాసాగర్ రైతులు ఆందోళన చెందొద్దు.. భారత్ మాల భూ నిర్వాసితులు వారి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కలెక్టర్‌కు ప్రత్యామ్నాయం అవకాశాలు ఉంటే పరిశీలించాలని సూచించాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారత్‌మాల రహదారి నిర్మాణానికి చర్యలు చేపడతాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్ ● -
అలలపై జీవన నావ
●కొనుగోలు కేంద్రం ఉంటేనే మాకు గిట్టుబాటు మేము ప్రాణాలకు తెగించి చేపలు పడుతున్నాం. కానీ దళారుల వల్ల ఆశించిన లాభం రావడం లేదు. గోపన్‌పేట వద్దే ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే, మాకు సరైన ధర దక్కుతుంది. రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. మంత్రి వాకిటి శ్రీహరి దీనిపై చొరువ తీసుకోవాలి. – వెంకట్‌స్వామి, రామన్‌పాడు, మత్స్యకారుడు కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలి చేపలు పట్టిన వెంటనే విక్రయించకపోతే పాడయ్యే అవకాశం ఉంది. జలాశయం సమీపంలో చిన్నపాటి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లేదా ఐస్ ఫ్యాక్టరీ అందుబాటులోకి తెస్తే, వేట ముగిశాక చేపలు నిల్వ చేసుకునే వీలుంటుంది. మార్కెట్ సౌకర్యం పెంచితే రామన్‌పాడు చేపలు తెలంగాణ వ్యాప్తంగా బ్రాండ్‌గా మారుతాయి. – ఆంజనేయులు, మత్స్యకార సంఘం సభ్యుడు మదనాపురం: అది కేవలం జలాశయం మాత్రమే కాదు.. వేల కుటుంబాల ఆశల దీపం. తెల్లవారుజామున అలల సవ్వడితో పాటు మత్స్యకారులు వలలు విసిరిన చప్పుడు అక్కడ నిత్యకృత్యం. మండలంలోని రామన్‌పాడు జలాశయం ఇప్పుడు మత్స్య సంపదకు కేరాఫ్ అడ్రస్. రామన్‌పాడులో చేపల వృద్ధి మూడు రకాలుగా జరుగుతుంది. ఏటా సుమారు 3 లక్షల చేప పిల్లలను అధికారులు ఈ జలాశయంలో వదులుతారు. దీంతో పాటు వర్షాకాలంలో ఊకచెట్టు వాగు, సరళాసాగర్ దిగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు సహజ సిద్ధంగా చేప పిల్లలు వచ్చి చేరుతాయి. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా వచ్చే ప్రవాహం ప్రాజెక్టులోకి నిరంతరం కొత్త రకం చేపలను మోసుకొస్తుంది. వేల కుటుంబాలకు జీవన ధార రామన్‌పాడు రిజర్వాయర్ నమ్ముకుని కేవలం చేపలు పట్టడమే కాకుండా.. అనుబంధ రంగాల ద్వారా 2 వేల పైచిలుకు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఆత్మకూరు, అజ్జకొల్లు, రామన్‌పాడు, బాలకిష్టాపురం, గోపన్‌పేట, కరివెన గ్రామాల మత్స్యకారులు పగలు, రాత్రి తేడా లేకుండా అలలపై పోరాటం చేస్తూ.. జీవనోపాధి పొందుతున్నారు. చేపల ప్రత్యేకత ఇక్కడి చేపలకు మార్కెట్లో డిమాండ్ భారీగా ఉంటుంది. కాల్వలు, వాగులు, కృష్ణానది నుంచి వచ్చే స్వచ్ఛమైన ప్రవహించే నీటిలో పెరగడం వల్ల ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఎటువంటి కృత్రిమ మేత లేకుండా సహజ సిద్ధమైన నాచు, పురుగులను తిని పెరగడం వల్ల వీటికి పోషక విలువలు ఎక్కువ. బొచ్చె, రాహు, మోసు వంటి రకాలతో పాటు స్థానిక వాగు చేపలు ఇక్కడ ప్రత్యేకం. రామన్‌పాడులో జల పుష్పాలు.. మత్స్యకారుల ఇంట కాసుల పంట కృష్ణమ్మ వరదతో వచ్చే కొత్త రకం చేపలు సహజ సిద్ధమైన నాచు,పురుగులే ఆహారం మార్కెట్లో భారీ డిమాండ్ -
సంగమేశ్వరం చూసొద్దాం..
నేను.. మా విహారం హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు ఎం.దీపక్‌కుమార్. నేను మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదవాలి. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య జయంత్కుమార్తో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని జట్రపోల్ దేవాలయం మరియు సోమశిల నది మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని ఈ వేసవి సెలవుల్లో సందర్శించాను. మీరు కూడా ఇలాంటి ప్రాంతాలను సందర్శించి.. మన దేశ చారిత్రక ప్రాంతాలు, దేవాలయాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. నేను చూసిన సంగమేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. కృష్ణ, భవనాసి, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలపహరిణి.. ఈ ఏడు నదులు ఇక్కడ కలుస్తుండడంతో దీన్ని సప్తనదుల సంగమంగా పిలుస్తారు. ఏటా శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గినప్పుడే.. ఈ ఆలయం బయటపడుతుంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు ఎనిమిది నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. మీ కూడా ఈ వేసవిలో చూసేయండి. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
గట్టు : మండల పరిధిలోని ఇందువాసి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీ తోలు తిమ్మప్ప (55) గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వారిగా తోటి కూలీలతో కలసి తోలు తిమ్మప్ప గ్రామ శివారులోని గంగంబావి కుంట వద్ద పనులకు వెళ్లాడు. ముఖ హాజరు తీసుకుంటున్న క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు హుటాహుటిన గ్రామంలోని వైద్యుని దగ్గరకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. ఈ ఘటనతో తిమ్మప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఓ స్వాములు, ఫీల్డ్ అసిస్టెంట్ షణ్ముకం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బావిలో పడి వృద్ధుడు మృతి కొల్లాపూర్: పట్టణంలోని చుక్కాయిపల్లి కాలనీకి చెందిన గొర్ల నర్సింహ(62) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నర్సింహ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం చుక్కాయిపల్లి చెరువు సమీపంలోని బావిలో నర్సింహ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. బావిలో పడి వ్యక్తి మృతి అమ్రాబాద్: ఈత పడేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోపడి వ్యక్తి మృతి చెందిన ఘటన పదర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. పదరకు చెందిన నారుమొల్ల కుమార్ (40) బుధవారం మధ్యాహ్నం తన పిల్లలకు ఈత నేర్పేందుకు గ్రామ సమీపంలోని ట్యాంకు బావికి వెళ్లారు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు పిల్లలను ఒడ్డున ఉంచి ముందుగా బావిలో దిగి ఈతకొట్టాడు. రెండోసారి దూకిన కుమార్ తిరిగి పైకి రాలేదు. కొద్ది సేపు చూసిన పిల్లలు గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో కొంతమంది అక్కడికి చేరుకొని బాధితుడిని బావిలోంచి బయటకు తీశారు. నీటిలో మునిగి చాలా సేపు కావడంతో అప్పటికే మృతి చెందాడు. అయితే మద్యం తాగి ఉండటం వల్లే మృతి చెంది ఉండొచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ నాగరాజుగౌడ్ తెలిపారు. -
ఆటల్లో మేటి.. ఫుట్‌బాల్‌తో సాటి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలోని ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందజేసి వారిని మేటీ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏనుగొండ, జడ్చర్ల మినీ స్టేడియం, కోడ్గల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, గార్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, వేపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో ఫుట్‌బాల్ వేసవి శిక్షణా శిబిరాల్లో 150కిపైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ వేసవి ఫుట్‌బాల్ శిక్షణా శిబిరాలను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ పర్యవేక్షిస్తున్నారు. గార్లపహాడ్లో 40మంది శిక్షణ కోయిలకొండ మండలం గార్లపహాడ్లో వేసవి ఫుట్‌బాల్ శిబిరంలో దాదాపు 40 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అభంగపట్నం 15మంది, గార్లపహాడ్ నుంచి 25మంది శిక్షణకు హాజరవుతున్నారు. వీరిలో 30మంది విద్యార్థులు మొదటిసారి ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటుండడం విశేషం. ఉదయం 6గంటల నుంచి 8:30 గంటల వరకు కోచ్‌లు ప్రేమ్‌కుమార్, రాములు విద్యార్థులకు ప్రత్యేక ఫుట్‌బాల్ శిక్షణ ఇస్తున్నారు. మొదట ఫిట్నెస్ అనంతరం బేసిక్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. బాల్ టచ్, పాసింగ్, డ్రిల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. వారంలో ఆరురోజులు సీనియర్ రెండు, జూనియర్ రెండు జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిపిస్తున్నారు. శిక్షణ అనంతరం ప్రతి రోజు అరటిపండ్లు, చిక్కిలు, బిస్కట్లు అందజేస్తున్నారు. ఫుట్‌బాల్ ఆటంటే ఎంతో ఇష్టం. మొదటిసారి వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. శిక్షణ శిబిరంలో రెగ్యూలర్‌గా పాల్గొంటున్న. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలని ఉంది. అందుకు నిరంతరం ప్రాక్టిస్ చేస్తా. – వర్ష, గార్లపహాడ్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న. ఫుట్‌బాల్‌లో ఎక్కువగా డిఫెన్స్ ఆడుతున్న. ఇక్కడ శిక్షణ శిబిరం బాగుంది. కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా. – భువనేశ్వర్, గార్లపహాడ్ వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో మొదటిసారిగా పాల్గొంటున్న. ఫార్వార్డ్‌లో శిక్షణ తీసుకుంటున్న. మా గ్రామంలో ఫుట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటా. – మౌనిక, గార్లపహాడ్ శిక్షణా చాలా బాగుంది వేసవి ఫుట్‌బాల్ శిక్షణ చాలా బాగుంది. కొత్తగా వచ్చిన మాలాంటి వారికి కోచ్‌లు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. ప్రతిరోజు ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్న. వేసవి వరకు కాకుండా ఇకనుంచి నిరంతరం ఫుట్‌బాల్ ఆడుతా. – గౌతమ్, అభంఘపట్నం వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొత్తగా వస్తున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ఫిట్నెస్ చేయించడంతోపాటు బాల్ డ్రిల్, గేమ్‌పై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. – ప్రేమ్‌కుమార్, కోచ్ జాతీయ జట్టుకు ఆడాలని ఉంది జిల్లాస్థాయి సీఎం కప్‌లో ఆడాను పాలమూరులో ఆరుచోట్ల ఫుట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరాలు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శిక్షణ పొందుతున్న వందలాది మంది విద్యార్థులు -
సీఎం, కేంద్ర మంత్రి చీకటి స్నేహితులు
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్ ప్రధాన నిందితుడిగా నమోదైన పోక్సో కేసు నీరుగారేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చీకటి స్నేహమే ప్రధాన కారనమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేసినా గంటల తర్వాత నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. ఆ తర్వాతే పోక్సో కేసు నమోదు చేయటం, ప్రధాన నిందితుడిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలంటూ నిందితుడి తండ్రికి బదులు మేనమామకు నోటీసీలు జారీ చేయటం లాంటి చర్యలను ఉదాహరణగా చెప్పవచ్చని వివరించారు. బాధితురాలి తల్లి తన కూతురిని హింసించిన విధానాన్ని స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్న తర్వాత కూడా.. అరెస్టు చేయటానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఉంటుందని ఏ చట్టంలో ఉందో చెప్పాలని సైబరాబాద్, కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. బాహాటంగా కేంద్రమంత్రి బాధితులను కార్నర్ మీటింగ్‌లో భయబ్రాంతులకు గురి చేసేలా ప్రసంగాలు చేస్తుంటే.. పోలీస్‌శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మైనర్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరస్ చేస్తూ.. వారిని మానసింగా హింసకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం స్వయంగా పోలీసులు ఉన్నతాధికారులకు సంకేతాలిచ్చారని, అందువల్లే.. పోలీసులు ఐదురోజులుగా అరెస్టు చేయటం లేదన్నారు. నిందితుడు రహస్యంగా దేశం దాటి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు బాదితులను శాంతిపంజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..అధికారం ఉందని చట్టవ్యతిరేక పనులు చేయవచ్చా అని ప్రశ్నించారు. అధికారులు న్యాయవ్యవస్థ, చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బి.లక్ష్మయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, కర్రెస్వామి, హరిబాబు, నీలస్వామి, హేమంత్, చిట్యాల రాము, జోహెబ్, భాస్కర్, కౌన్సిలర్లు సౌజన్య, ఎ.అరుణ, శిరీష, నందిమల్ల శారద, జ్యోతి, నాగమ్మ, కవిత, పవిత్ర, భాను, సరస్వతి ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ -
అతివేగంతోనే అనర్థం
ఇరుకై న రోడ్డులో మలుపు ప్రస్తుతం బొలెరో వాహనం బోల్తాపడిన చోట రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు కొంత మలుపు ఉంటుంది. దీంతో వేగంగా వచ్చే వాహనాలను మలుపు దగ్గర సడెన్‌గా అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మార్గంలో కొత్తగా వచ్చే వాహనదారులకు మలుపు పెద్ద సమస్యగా మారింది. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాద బాధితులది అందరూ దేరవకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం కావడంతో విషయం తెలుసుకుని ఎమ్మెల్యే సాయంత్రం ఆస్పత్రికి చేరుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాకు సూచించారు. ‘పాలమూరు నగరంలో వరుస ప్రమాదాలతో ప్రజలు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితమే బైపాస్ రోడ్డులో బైక్– కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన ఘటన మరువక ముందే తాజాగా పెళ్లి బృందం వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి.. ఓ బాలుడు దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటికై నా పోలీస్ శాఖతో పాటు అర్అండ్బీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా రోడ్లపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా చైతన్యం తీసుకురావాలి.’ – మహబూబ్‌నగర్ క్రైం అప్పటి వరకు పెళ్లి వేడుకల్లో ఆనందంగా గడిపి.. భోజనాలు చేసిన తర్వాత తిరిగి స్వగ్రామానికి రెండు బొలెరో వాహనాల్లో బయలుదేరిన పెళ్లి బృందాలకు ఆ ప్రయాణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహబూబ్‌నగర్ నగరంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చిన్నచింతకుంట మండలం దమాగ్నపూర్ గ్రామానికి చెందిన ఈశం సత్యన్నగౌడ్, శంకరమ్మ దంపతుల కూతురు నవనీతకు భూత్పూర్ మండలం పాతమొల్గర గ్రామానికి చెందిన నరేష్‌గౌడ్‌తో బుధవారం పెళ్లి జరిగింది. ఈ క్రమంలో దమాగ్నపూర్ గ్రామం నుంచి పాత మొల్గరలో జరిగిన పెళ్లి వేడుకకు బంధువులు, గ్రామస్తులు రావడానికి సత్యన్నగౌడ్ రెండు బొలెరో వాహనాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి వేడుక ముగిసిన తర్వాత రెండు వాహనాలు వెనువెంటనే బయలుదేరాయి. ఇందులో ఒక బొలెరో వాహనం వేగంగా వస్తూ నూతన కలెక్టరేట్ దగ్గర అదుపుతప్పి అక్కడ ఉన్న మలుపులో ఉన్న బ్రిడ్జిని మొదట ఢీకొట్టుకొని ఆ తర్వాత రోడ్డుకు పక్కనే ఉన్న రేలింగ్ తగిలి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 20 మంది వరకు ఉండగా 13మందికి గాయాలు కాగా దమాగ్నపూర్కు చెందిన బాలుడు సాయి వర్షిత్(7) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడు అభిరామ్గౌడ్, మండ్ల కొండన్న, నారాయణగౌడ్లను హైదరాబాద్‌కు తరలించారు. అలాగే మరో బాలుడు కిరణ్‌కు జనరల్ ఆస్పత్రిలోని పీఐసీయూలో, పద్మ, సురేందర్‌గౌడ్, తిరుపతయ్య, నర్సింహులుగౌడ్, రాజు, రామకృష్ణ, కృష్ణవేణి, రాధ, వరలక్ష్మి, భరత్, డ్రైవర్ దుర్గ, అన్షికలకు ఆస్పత్రి క్యాజువాలిటీలో చికిత్స అందిస్తున్నారు. మిన్నంటిన ఆర్తనాదాలు పెళ్లి నుంచి బయలుదేరిన బొలెరో వాహనం బోల్తా పడటంతో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలుడితోపాటు గాయపడిన వారి కుటుంబ సభ్యులు, మహిళలు ఇతర వాహనంలో ఉండటంతో వారందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో తగిలిన రక్త గాయాలను చూసి బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. గాయపడిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకుని పెళ్లి జరిగిన ఇంట్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి. మలుపు దగ్గర అదుపు చేయలేక బ్రిడ్జిని ఢీకొట్టిన బొలెరో వాహనం ఒక బాలుడి దుర్మరణం, 13 మందికి తీవ్రగాయాలు క్షతగ్రాత్రులకు జనరల్ ఆస్పత్రిలో చికిత్స ముగ్గురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలింపు -
రండి.. విశేషాలు పంచుకుందాం
మీరు ఫొటోలు, విశేషాలు, గీసిన చిత్రాలను 94415 43232 నంబర్‌కు వాట్సప్ చేయండి. పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. వీటిని ప్రచురించి మీ సందడిని అందరితో పంచుకునేలా చేస్తాం. -
బడి.. పిలుస్తోంది
జిల్లాలో నేటినుంచి ప్రొ.జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపే లక్ష్యం ● ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలతో ఆకట్టుకునేలా చర్యలు ● ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆదేశాలు ● ఇప్పటికే జనగణన, విద్యా వారోత్సవాల్లో బిజీగా ఉపాధ్యాయులు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంచడమే లక్ష్యంగా గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటలు, చదువులు, వివిధ కార్యక్రమాల్లో సాధించిన విజయాలతో పాటు విద్యార్థులకు అందించే సదుపాయాలను చూపించి ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు పొందేందుకు కృషి చేయాల్సి ఉంది. ఈ మేరకు వీఆర్‌ఈ (విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్ట్రర్) అడ్మిషన్ రిజిస్ట్రార్, పెన్ (పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్)లను నవీకరించి అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంది. గురువారం నుంచి బడిబాట ప్రారంభం కానుండగా.. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యా వారోత్సవాల్లో భాగంగా పలు పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జనగణనలో కూడా పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల గుర్తింపు.. కిందిస్థాయి అంగన్వాడీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని, అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలి. వీటితోపాటు సమీప నివాస ప్రాంతాలు, పని ప్రదేశాల్లో బాల, బాలికలు, దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫాం వంటివాటిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఇందుకోసం పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు చేర్పించేందుకు కృషి చేస్తాం. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేస్తాం. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ బడిబాటలో భాగంగా గ్రామంలోని అందరిని భాగస్వాములు చేసి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలను భాగస్వాములుగా చేయాల్సి ఉంది. వీటితోపాటు పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, అమ్మ ఆదర్శ కమిటీల సమావేశం, అంగన్వాడీ టీచర్ల సమవేశాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువతతో సమావేశం నిర్వహించాలి. గ్రామసభలు, అవగాహన ర్యాలీల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంపొందించాలి. డోర్ టు డోర్ క్యాంపెన్, సామూహిక అక్షరాభ్యాసం, స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాలను నెల రోజుల బడిబాటలో భాగంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
అన్ని శాఖల్లోనూ ఇదే తీరు..
ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
నిలకడగా ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. కొనసాగిన అమ్మకాలు.. మార్కెట్ బయట రైతులు యథావిధిగా ఉల్లి అమ్మకాలు సాగించారు. ధరలు పెరగడంతో రైతులు రూ.600 నుంచి రూ.650 వరకు 50 కిలోల బస్తాను విక్రయించారు. చాలామంది రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలు తెచ్చి సాయంత్రం వరకు అమ్మకాలు సాగించారు. ఎక్కువగా వినియోగదారులు ఉల్లి బస్తాలను కొనుగోలు చేశారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,674 బస్తాల ధాన్యం, 8,433 బస్తాల మొక్కజొన్న యార్డుకు రావడంతో ఆవరణంతా కిక్కిరిసిపోయింది. కాగా ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,539, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,642, కనిష్టంగా రూ.5,329, ఆముదాలు గరిష్టంగా రూ.6,239, కనిష్టంగా రూ.6,206, పొద్దుతిరుగుడు రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,872, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, మినుములు రూ.6,600 చొప్పున వచ్చాయి. ● గరిష్టంగా రూ.1,500.. కనిష్టంగా రూ.వెయ్యి -
పైసలిస్తేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు ● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వైనం ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కిన వైనం ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభు త్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. -
రూ.110 కోట్లతో ‘కురుమూర్తి’ అభివృద్ధి
చిన్నచింతకుంట: రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధి తమ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కురుమూర్తిస్వామి ఆలయాన్ని విస్మరిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన వెంటనే రూ.110 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. బుధవారం కురుమూర్తిస్వామి ఆలయ నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితోపాటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమూర్తిస్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, స్వామివారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తాన్నారు. యాదాద్రి తరహాలో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచే కాకుండా దాతల సహకారంతో నిధులు రాబట్టి అభివృద్ధి పనులు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిధులతో ఘాట్ రోడ్డు నిర్మాణం, రాజగోపురం వద్ద రేకుల షెడ్డు పనులు చేపడుతున్నామన్నారు. స్నేహ చికెన్ కంపెనీ సహకారంతో ప్రధాన ఆలయం వద్ద మహామండపం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నూతన పాలక మండలి బాధ్యతాయుతంగా పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి వెళ్లలేని భక్తులు కురుమూర్తిస్వామిని దర్శించుకుంటున్నారని చెప్పారు. తిరుమల మాదిరిగానే కురుమూర్తిలోనూ అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు. కురుమూర్తిస్వామి ఆలయ నూతన పాలక మండలి చైర్మన్‌గా చిన్నచింతకుంట గ్రామానికి చెందిన బత్తుల బాలరాజు నియమితులయ్యారు. ఆయనతోపాటు సభ్యులుగా 13 మంది వేగనాథ్, మహిపాల్‌రెడ్డి, శ్రీశంకర్, భరత్‌కుమార్‌రెడ్డి, వడ్డె శ్రీను, మహేందర్, అర్జున్, తిరుపతయ్య, ప్రేమ్‌సాగర్, తిరుపతిరెడ్డి, మున్నూరు బాలరాజు, భాస్కరాచారి, సౌజన్య, ఎక్స్అఫీషియల్ మెంబర్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పాలక మండలి సభ్యుల చేత అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈఓ మదనేశ్వరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొలువుదీరిన పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, దేవరకద్ర, మదనాపురం మార్కెట్ కమీటీ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, కురుమూర్తిస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, అప్పంపల్లి పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, అమ్మాపురం, కురుమూర్తి, గూడూరు సర్పంచులు రంజిత్, కుర్మన్న, భీమన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరి ఆలయ తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వెల్లడి కొలువుదీరిన నూతన పాలక మండలి -
వైద్యాధికారులు పనితీరు మార్చుకోండి
పాలమూరు: ‘అన్ని విభాగాల హెచ్‌ఓడీలతోపాటు కొందరు వైద్యులు, టెక్నీషియన్స్ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడంతోపాటు సమయపాలన పాటించడం లేదని, పీజీ విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులతో వసతుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న అంశంపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రి వైద్యాధికారులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల నుంచి రూ.90 వేలు డొనేషన్ తీసుకుని వీల్‌చైర్స్, స్టేచర్స్ తీసుకురావడం ఏమిటని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఒక సూపరింటెండెంట్, అన్ని విభాగాల హెచ్ఓడీల మధ్యనే సమన్వయం ఉండటం లేదని మండిపడ్డారు. ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోతే ఒక ఎమ్మెల్యేగా నా దృష్టికి లేదా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి కానీ విద్యార్థుల నుంచి డొనేషన్స్ ఎందుకు వసూలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో పనితీరు మార్చుకోవాలని, ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం కలెక్టర్ ఖుష్బూగుప్తా అధ్యతన జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న చర్యా నివేదిక, ఆస్పత్రిలో రోగులకు కావలసిన సౌకర్యాలు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. హెచ్‌వోడీలతో పాటు కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న వనరులు, సదుపాయాలు, నిధులను సమర్థంగా వినియోగించుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. అనంతరం బాలింతలకు యెన్నం హెల్త్ కిట్లను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సురే ందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీరా, ఇన్చార్జి డీఎంహెచ్ఓ శశికాంత్, కార్పొరేటర్లు సల్మాన్ షరీఫ్, సోమిరెడ్డి రమేష్‌రెడ్డి, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ జె.రాంమోహన్, డాక్టర్ సామ్యుల్, బెజుగం రాఘవేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న హెచ్‌ఓడీలపై ఆరా విద్యార్థులతో డొనేషన్లు సేకరించడంపై సీరియస్ ఎవరికీ సమన్వయం లేదని ఎమ్మెల్యే యెన్నం మండిపాటు -
ముగిసిన హజ్రత్ షా అలీ ఉర్సు
అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మహిళల ప్రత్యేక ఉర్సు జరిగింది. ఈ నెల 9న గంధోత్సవంతో ఉత్సవాలు ప్రారంభించారు. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కిస్తీలకు ప్రసాదం అందించి మొక్కులు తీర్చుకున్నారు. 12న ఉర్సులో వెలిసిన బ్యాంగిల్స్, బొమ్మల దుకాణాల వద్ద మహిళల కొనుగోళ్లతో రద్దీగా మారాయి. నాలుగు రోజులుగా భక్తుల రాకపోకలతో వీధులు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
టీ20 లీగ్‌లో మహబూబ్‌నగర్ శుభారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని 22 యార్డ్స్ మైదానంలో మంగళవారం జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్ టీ–20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఉస్మానియా యూనివర్సిటీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. జట్టులో హయాన్ ఆరిఫ్ మొహియోద్దీన్ 45 పరుగులు నాటౌట్, సూర్య కిరణ్ యాదవ్ 45 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు జస్వంత్ 2 వికెట్లు, శశాంక్, వర్షిత్‌రెడ్డి, ఎండి.ముఖితుద్దీన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో అభిలాష్‌గౌడ్ అర్ధసెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేయగా సంజయ్ 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు మ్యాచ్ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్పూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఐదు వికెట్ల తేడాతో ఓయూ జట్టుపై విజయం -
మొక్కజొన్న పంటకు నిప్పు
● 2.5 ఎకరాలల్లో పంట దగ్ధం పాన్‌గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. 2.5 ఎకరాలల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా కాలిపోవడంతో పాటు పొలంలో ఉన్న 30 స్పింక్లర్ పైపులు, విద్యుత్ మోటార్, వైర్లు దగ్ధమయ్యాయని వాపోయాడు. వీటి విలువ సుమారుగా రూ.2.50 లక్షలు ఉంటుందని రైతు తెలిపాడు. -
11మంది బైకర్లపై కేసు నమోదు
● ఫంక్షన్ నిర్వాహకుడు జహంగీర్‌పై కూడా.. ● మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి ● పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్న రూరల్ పోలీసులు మహబూబ్‌నగర్ క్రైం: బైపాస్ రోడ్డుపై పాలకొండ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. గాయపడిన వారిలో రేష్మా ఖాతూమ్ ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె దవడ భాగం పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిసింది. ఆమె కొడుకు శ్రీకృష్ణ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గౌసియా బేగం జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెకు ఊపిరితిత్తుల్లో కొంత మేర పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. మహ్మద్ బాసిత్ ఇంటి దగ్గర ఉండగా ఇతని మరో కొడుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైడర్ల మృతదేహలను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ముగ్గురి మృతదేహలను మంగళవారం ఉదయం 5.30 ప్రాంతంలో వారి సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. 12 మందిపై కేసు నమోదు బైక్, కారు రోడ్డు ప్రమాద ఘటనలో మొత్తం 12 మందిపై 304–పార్ట్ 2 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. 11 మంది బైక్ రైడర్లతో పాటు మెట్రో ఫంక్షన్ హాలులో ఫంక్షన్ చేసిన జహంగీర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫంక్షన్ హాల్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి బైకర్లు రేస్ పెట్టుకున్నారా? లేదా అనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఆందోళనలో నీట్ విద్యార్థులు
● ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాసిన 4,141 మంది విద్యార్థులు ● సీటు వస్తుందనుకుంటే మరోసారి పరీక్ష రాయాల్సిన వస్తుందని ఆవేదనసీటు వస్తుందని అనుకున్నాం. పరీక్షకు కొన్నినెలలుగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. పరీక్ష రాశాక తీరా పేపర్ లీక్ అయ్యిందని, మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని తెలిసింది. పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు సాధిస్తామని అనుకునేలోపే ఇలా పేపర్‌లీక్ గురించి తెలిసింది. వీలైనంత త్వరగా పరీక్షలు మళ్లీ నిర్వహిస్తే బాగుటుంది. – గిరిజ, నీట్ అభ్యర్థిని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం నీట్‌కు ఎన్నో రోజులు కష్టపడి సిద్ధమయ్యాం. తీరా పేపర్ లీక్ కావడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. లీకులతో విద్యార్థుల భవిష్యత్ ఇబ్బందికరంగా మారింది. పరీక్ష వాయిదా వేస్తే మరోసారి కష్టపడి సమయం కేటాయించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితాలు ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులపై ఆధారపడి ఉంటాయి. అంచనాలు మారుతాయి. – వైష్ణవి, నీట్ అభ్యర్థిని నిర్లక్ష్యం వల్లే .. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్లో పేపర్ లీక్ కావడం బాధాకరం. ఎంతో మంది భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉంది. పేపర్ లీక్ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉంది. లీక్‌కు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు. –సిద్దార్థ, నీట్ అభ్యర్థి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: దేశ వ్యాప్తంగా పలు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీకి ఈనెల 3వ తేదీన ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నీట్–యూజీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు తదుపరి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. పేపర్ లీక్ కావడంతో ఒక్కసారి ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మంచి ర్యాంకులు సాధించేందుకు విద్యార్థులు నెలల తరబడి కసరత్తు చేసి లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లి, గంటల తరబడి సిద్ధమైతే చివరకు పరీక్ష వాయిదా పడడంతో గందరగోళం నెలకొంది. వాయిదా పడిన పరీక్ష తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ఎన్టీఏ నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు మరోమారు కోచింగ్ సెంటర్లకు వెళ్లి పరీక్షకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,141 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరోసారి పరీక్ష రాసేందుకు ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. మరోసారి పేపర్ లీక్‌లకు పాల్పడకుండా, పేపర్ లీక్ చేసిన వారిపై ఖఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు గతంలో ఓసారి నీట్ రాస్తే సరైన ర్యాంకు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఏడాది మొత్తం కష్టపడి చదివా. ఈ సారి కీ చూసుకుంటే 530 మార్కులు వచ్చాయి. కచ్చితంగా సీటు వస్తుంది. ఎక్కడో కొందరు చేసిన తప్పిదాల కారణంగా మొత్తం విద్యార్థుల భవిష్యత్‌ను అనిశ్చితిలోకి నెట్టడం సరైంది కాదు.ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు. పేపర్ లీక్ జరిగినట్లయితే అందుకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా పరీక్ష మొత్తం రద్దు చేసి విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేయకూడదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని. – ఎం.భవాని, నీట్ అభ్యర్థి, కొత్తకోట, వనపర్తి జిల్లా పేపర్ లీక్ లేకుండా చూడాలి నీట్ ప్రతి విద్యార్థికి కూడా ఎంతో కీలకమైంది. ఎన్నో నెలలు కష్టపడి చదివినటువంటి పరీక్షకు సంబంధించిన పేపర్ లీకయితే విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహించాలి. – ధన్‌రాజ్, నీట్ అభ్యర్థి సీబీటీ విధానంలో నిర్వహించాలి ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహించడంతో పేపర్ లీక్ అవుతున్న క్రమంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విధంగా కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తే బాగుటుంది. లక్షలాది మంది విద్యార్థులు కళలు ఒక్క లీకేజ్‌తో తలకిందులయ్యాయి. ప్రభుత్వం వెంటనే పరీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – జ్ఞానేశ్వర్, నీట్ అభ్యర్థి ● -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మక్తల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని రైల్వేస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్‌కు చెందిన జుట్లు వాసు(25) ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్‌లో కొందరు దళారులు ఓ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20 వేలు వాసు వద్ద తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం మక్తల్‌కు వచ్చాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిన వాసు మోసపోయానన్న మనస్తాపంతో స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొని...ఇద్దరు మృతి సనత్‌నగర్: బైక్‌పై దూసుకెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోడూరుకు చెందిన వాకిటి కుమార్ కుమారుడు సందీప్ (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ మహేంద్రహిల్స్‌లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌషిక్ (24) కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ రామంతాపూర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు బీటెక్ చదువుకునే సమయంలో స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగిన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు యమహా ఆర్ 15 బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎర్రగడ్డ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వేగంగా ప్రయాణిస్తూ భరత్‌నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. కౌషిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనుక కూర్చున్నాడు. ముందున్న లారీల్లో మొదటి లారీని ఓవర్ టేక్ చేసి, రెండో లారీని కూడా అదే వేగంతో ఓవర్టేక్ చేయబోతూ బైక్‌తో లారీని ఢీకొట్టారు. సంఘటనలో బైక్‌తో సహా ఇద్దరూ రోడ్డు పడిపోఆరు. వేగంతో కిందపడడంతో తలలు పగిలి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్, కౌషిక్ మృతదేహహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను.. నా విహారం
అరకు, బొర్రా కేవ్స్ అద్భుతం హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు శ్రీ చైత్రిక, నేను మహబూబ్‌నగర్‌లోని మౌంట్‌బాసిల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నా.నేను, అమ్మ, నాన్న, మా తమ్ముడు అభిరామ్‌తో పాటు తాత, నాయనమ్మతో పాటు బాబాయ్, అత్తమ్మ ఫ్యామిలీలతో కలిసి నాలుగు రోజుల పాటు విశాఖపట్నంతో పాటు అరకు విహారయాత్రకు వెళ్లాం. అన్నవరం, విశాఖపట్నం, అరకు బొర్రా కేవ్స్లో సంతోషంగా గడిపాం. వైజాగ్ ఆర్కే బీచ్‌లో అర్ధరాత్రి చంద్రుడి వెన్నలలో మా అమ్మ లక్ష్మి, అత్తమ్మ ఉమాదేవి పాటు వారి పిల్లలు అక్షయ, భవ్య, మా పిన్నిలు లక్ష్మి, అంజలితో కలిసి కాసేపు కబడ్డీ ఆడాం. రిషికొండ బీచ్‌లో ఆటపాటలతో సందడి చేశాం. అరకులో కాపీ తోటలు, వాటర్‌ఫాల్స్ కనువిందు చేశాయి. చివరిగా బొర్రా కేవ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ యాత్ర నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలను ఇచ్చింది. మీరు మీ కుటుంబసభ్యులతో ఓసారి వెళ్లి రండి.. చాలా బాగుంటుంది. -
నల్లమలలో దేశ, విదేశీ ప్రతినిధుల పర్యటన
మన్ననూర్: దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా ఉన్న అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో బిగ్‌క్యాట్ ఆవాసాల సంరక్షణ దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ క్యాట్ సంరక్షణ వర్క్‌షాప్‌లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీశాఖ, హైదరాబాద్ సెక్రటేరియట్ సంయుక్త దౌత్య ప్రతినిధి బృందం సభ్యులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపిల్లి జాతికి చెందిన పెద్దపులులు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వార్, సింహాల జాతుల ఆవాసాలు, పర్యావరణ సుస్థిరత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై 11, 12వ తేదీ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం మన్ననూర్ అటవీశాఖ వనమాళిక ప్రాంగణం నుంచి అటవీ శాఖ అధికారులతో కలిసి బృందం సభ్యులు జంగిల్ సఫారీలో అటవీ అందాలను వీక్షించారు. అటవీశాఖ చేపట్టిన జీవ వైవిధ్యం, వన్య ప్రాణుల సంరక్షణకు సంబంధించిన చర్యలను పరిశీలించారు. అంతకు ముందు రోజు మన్ననూర్లోని జంగిల్ సఫారీకి సంబంధించిన రిసార్ట్‌లో బస చేసిన సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పులులు, వన్య ప్రాణులు, హాబిటాట్ పర్యవేక్షణ, ఎకో టూరిజం, పునరావాసం చర్యలపై అభినందించారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణతో పాటు వేటగాళ్ల నివారణ చర్యలు, పర్యావరుణ పునరుద్ధరణ అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బంగ్లాదేశ్, మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, ఫీల్డ్ డైరెక్టర్ సునిల్, డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర, ఎఫ్డీలు రామ్మూర్తి, రామ్మోహన్, రేంజ్ అధికారులు వీరేష్, గురుప్రసాద్, వాణి, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యూఫాయింట్ వద్ద బృందానికి టైగర్ రిజర్వు గురించి వివరిస్తున్న సీసీఎఫ్ -
స్తంభించిన కొనుగోళ్లు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడుల క్రయవిక్రయాలు స్తంభించాయి. యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం పోటెత్తడంతో మార్కెట్ ఆవరణలో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 30 వేల బస్తాల వరి ధాన్యం, మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్‌కు రావడంతో కొనుగోళ్లు జరిపినా తూకాలు, బస్తాల తరలింపు చేయకపోవడంతో మంగళవారం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా శుక్ర, శనివారాల్లో సైతం ఇదే సమస్య కారణంగా కొనుగోళ్లు నిలిపివేయగా.. ఆదివారం బస్తాలను గోదాంలకు తరలించడంతో సోమవారం క్రయవిక్రయాలు సాఫీగా సాగాయి. అయితే మూడు రోజుల సరుకు మంగళవారం ఒకేసారి రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేసి.. తూకాలు, బస్తాల తరలింపు చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు బాదేపల్లి యార్డు ఆవరణలో సామర్థ్యానికి మించి దిగుబడులు రావడం, సకాలంలో టెండర్లు దాఖలు చేసి తూకాలు వేయడం, బస్తాల తరలింపులో ఆలస్యం చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డు అధికారులు, పాలక మండలి నిర్ణయించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రెండు, మూడు రోజులపాటు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. లారీలు, హమాలీలతో ఇబ్బందులు ఒకవైపు పేరుకుపోయిన నిల్వలు.. మరోవైపు మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్‌కు ప్రతిరోజు భారీగా వస్తుంది. ఈ క్రమంలో బస్తాలు తరలించేందుకు లారీలు, హమాలీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ నుంచి బయటి ప్రాంతాల్లోని గోదాంలకు తరలించాలంటే అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కారణంగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి క్రయవిక్రయాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట దిగుబడులను అమ్మడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల కుమ్మక్కు..? ధాన్యం దిగుబడులు అధికంగా రావడం, రోజుల తరబడి రైతులు మార్కెట్లోనే ఉండిపోయే పరిస్థితులు తలెత్తడం కారణంగా వ్యాపారులు ఇదే అదునుగా తక్కువ ధర కేటాయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న, వరిధాన్యం ఇకపై రోజు విడిచి రోజు చేపట్టాలని నిర్ణయం మంగళవారం కొనుగోళ్లు నిలిపివేత.. నేడు టెండర్ ప్రక్రియ తీవ్ర ఆందోళనలో రైతులు -
పట్టించుకోలేదు..
బైపాస్ రోడ్డుపై రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నా నియంత్రణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – శ్రీనివాసులు, పాలకొండ అడ్డాగా మారింది.. పాలకొండ చౌరస్తా ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇటీవల టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఇది మరువక ముందే కారు, బైక్ ఢీకొని ఐదుగురు చనిపోయారు. పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో కూడా ట్రాఫిక్‌పై అవగాహన పెంచాలి. – రామాంజనేయులుగౌడ్, హోటల్ యజమాని, పాలకొండ చౌరస్తా చర్యలు తీసుకుంటాం.. బైపాస్ రోడ్డుపై ఇక నుంచి రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఎలాంటి ఆహార విక్రయాలు జరిపే దుకాణాలు తెరిచి ఉండటానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బైపాస్‌పై ప్రత్యేకంగా పెట్రోలింగ్, నిఘా పెంచుతాం. నిత్యం వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతాం. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్ ● -
ప్రాణాల మీదికి తెస్తున్న రాంగ్‌రూట్ ప్రయాణం
సిగ్నల్స్ లేక ఎదురెదురుగా వెళుతున్న వాహనాలు నగరంలో పనిచేయని సిగ్నల్స్.. బైపాస్‌లో ట్రాఫిక్‌పై కొరవడిన పర్యవేక్షణ నచ్చినట్లు వెళ్తూ.. హల్చల్ చేస్తున్న కొందరు వాహనదారులు రాంగ్రూట్లలో వెళ్లడానికే బైకర్స్ ఆసక్తి ప్రధాన కూడళ్లు, రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ రాత్రివేళలోనూ బైపాస్ రోడ్డుపై కనిపించని పెట్రోలింగ్ -
5.5 కిలోమీటర్ల దారిలో..
నగరంలో ఉన్న అతి ప్రధానమైన బైపాస్ రోడ్డు 5.5 కిలోమీటర్ల దారిలో ఇరువైపులా మూడు బార్లు, 8 దాబాలు, 9 టీ పాయింట్స్, పదిలోపు చిన్నపాటి హోటళ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా పిస్తాహౌస్ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉండటంతో నగరంతో పాటు జడ్చర్ల, హైదరాబాద్ వైపు నుంచి వెళ్లే చాలామంది యువకులు రాత్రి 11 గంటల తర్వాత ఇక్కడ కలుస్తుంటారు. పిస్తాహౌస్ సమయపాలనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన యువత బైపాస్ మార్గంలో బైక్‌లపై చక్కర్లు కొడుతుంటారు. దాబాల్లో లభించే మద్యం కారణంగా గ్రూప్‌లు, గ్రూప్‌లుగా చేరుకొని మద్యం తాగుతూ హల్చల్ చేస్తుంటారు. బైపాస్‌లో పోలీసుల పాయింట్స్ లేకపోవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కేవలం పిస్తాహౌస్ చౌరస్తాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రమే ఉంటారు. న్యూటౌన్‌లోని రోడ్డుపై ద్విచక్రవాహనాల పార్కింగ్ -
18 ప్రమాదాలు.. 12 మంది మృతి
నగరంలో ఉన్న జాతీయ రహదారితో పాటు బైపాస్ రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో రెండు బైపాస్‌లపై 18 రోడ్డు ప్రమాదాలు జరిగితే 12 మంది దుర్మరణం చెందారు. మరో పదిమంది వరకు క్షతగాత్రులయ్యారు. ఇక నగరంలో రోడ్డు పక్కన ఉండే ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవడంతో పాదచారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. ధాన్యం, ఇసుకతోపాటు ఇతర వస్తువులు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య అధికంగా వస్తోంది. నగరీకరణ అధికంగా ఉన్న పాలమూరులో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం విఫలమవుతోంది. -
ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాసం (ఆర్అండ్ఆర్) పనులను వేగంగా పూర్తిచేసి నిర్వాసిత కుటుంబాలను వీలైనంత త్వరగా పునరావాస కాలనీకి తరలించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదండాపూర్ పునరావాస కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తిచేయాలన్నారు. ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అవసరమైన డిజైన్ అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారులు, విద్యుత్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మూలంగా మిగిలిన వ్యవసాయ భూములకు వెళ్లడానికి బండ్ల బాటలు వేయాలని ఎమ్మెల్యే కోరగా ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జడ్చర్ల తహసీల్దార్‌ను ఆదేశించారు. ● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం నిధులు జమ చేసినా ఇప్పటి వరకు ఒక్క కుటుంబం కూడా పునరావాస కాలనీకి వెళ్లకపోవడం సరికాదన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి నిర్వాసితులను కాలనీకి తరలించాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరహాలో ప్లాట్లను లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తే వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తారని సూచించారు. ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన వీసీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలు పెంచాలని, జిల్లాలో స్థానిక హమాలీలను వందశాతం వినియోగించుకోవాలని సూచించా రు. హమాలీలు అధికంగా డబ్బు డిమాండ్ చేస్తే లైసెన్సు రద్దు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని, రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, తడిసి న ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతిరోజు కొను గోళ్ల పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఖుష్బు గుప్తా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. -
తెలియక వచ్చాను..
బాదేపల్లి యార్డులో మంగళవారం కొనుగోళ్లు చేయడం లేద ని తెలియక ధాన్యం తీసుకువచ్చాను. దీంతో ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం తెలిసి ఉంటే బుధవారమే తీసుకువచ్చే వాడిని. రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. – మధుసూదన్‌రెడ్డి, రైతు, గోప్లాపూర్ వర్షం వస్తే ఎలా..? మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో యార్డులోనే పడిగాపులు కాస్తున్నాం. దీనికితోడు ఇక్కడ రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాగే అకాల వర్షం వస్తే ఆరుబయట ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. వెంటనే కొనుగోళ్లు నిర్వహించేలా చూడాలి. – రాములు, కావేరమ్మపేట రైతులు సహకరించాలి.. బాదేపల్లి యార్డుకు సోమవారం ఒక్కరోజే 30 వేల బస్తాల దిగుబడులు వచ్చాయి. దీంతో బస్తాలు తూకం వేయడంలో ఆలస్యమైంది. మంగళవారం కూడా అవే బస్తాలు తూకాలు వేశాం. బస్తాల తరలింపులోనూ ఆలస్యం కావడంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించాం. ఈ విషయం రైతులు గమనించి సహకరించాలి. – అశ్వక్ ఆహ్మద్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి -
ముగిసిన వేసవి యువ నిర్మాణ శిబిరం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో దయానంద విద్యామందిరంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి యువ నిర్మాణ శిబిరం ఆదివారంతో ముగిసింది. మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి మొత్తం 65 మంది శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో హర్యాన నుంచి వచ్చిన శిక్షకులు కరెన్సీ, డింపుల్, బాలాజీ కర్రసాము, కత్తిసాము, డంబుల్స్, పిరమిడ్, కరాటే, భూమి నమస్కారం, సూర్యనమస్కారాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమాజం, పెద్దలు, ఇతరులతో ఎలా మెలగాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే యజ్ఞాల వల్ల కలిగే ప్రయోజనాలు, భాష పట్ల పట్టు సాధించటం, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంపైనా అవగాహన కల్పించారు. భజనలు, వేదోక్త ప్రవచనాలు, ధార్మిక సందేశాలతో భక్తిభావం పెంపొందింపజేశారు. విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేవంలో ఆచార్య వేదసింధు పాల్గొని నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఆర్యసమాజం గూర్చి వివరించారు. పితృభక్తి, మాతృభక్తి, గురు భక్తి, దేశభక్తి, దైవభక్తి అంశాలపై అవగాహన కల్పిస్తూ సందేశమిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమి మాజీ చైర్మన్ బి.శివకుమార్, ఆర్యసమాజ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాసులు, గుబ్బనర్సింహులు, బక్క రాజేశ్వర్, డి.కృష్ణయ్య, బి. విజయ్‌కుమార్, గోనెల రాధాకృష్ణ, లావణ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. శిక్షణలో అనేక అంశాలు నేర్చుకున్న వేసవి యువ నిర్మాణ శిబిరంలో అనేక అంశాలను నేర్చుకున్నా. ఇక్కడికి రాకముందు ఇతరులతో ఎట్లపడితే అట్ల ఉన్నా. ఇప్పుడు ఎవరితో ఎలా మెలగాలో పూర్తి అవగాహన వచ్చింది. అలాగే సూర్య నమస్కారాలపై మరింత ప్రావీణ్యత సంపాదించగలిగాను. కర్ర, కత్తి సాము లు కూడా నేర్చుకున్న. ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. – యోగానంద సాయి, ఇంటర్ విద్యార్థి, నల్లగొండ. కర్రసాము, కత్తిసామునేర్చుకున్న ఆర్యసమాజం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా వేసవిలో యువనిర్మాణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సారి శిబిరంలో టీచర్లు కర్రసాము, కత్తిసాముపై శిక్షణ ఇచ్చారు. రెండింటినీ నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. సూర్య నమస్కారాలు అయితే మాకు ముందే నేర్పించారు. శిబిరంలో కొత్తగా భూమి నమస్కారాలు నేర్చుకున్నాను. – మణిశంకర్, దయానంద 7వ తరగతి విద్యార్థి. -
సాఫ్ట్‌బాల్ సందడి
●మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు వేసవి సాఫ్ట్‌బాల్ శిక్షణ శిబిరంలో కొద్ది రోజుల్లోనే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కొత్లబా ద్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరం గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ శిబిరంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను గుర్తించి వారికి రెగ్యులర్ శిక్షణ అందజేస్తాం. – లక్ష్మినారాయణ, సాఫ్ట్‌బాల్ కోచ్ మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన 10 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటిసారిగా కోయిలకొండ మండలంలోని కొత్లబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 1వ తేదీ నుంచి సాఫ్ట్‌బాల్ శిబిరం కొనసాగుతోంది. కొత్లబాద్, మల్లాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 25 మంది బాలబాలికలు శిబిరంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ప్రోత్సాహంతో కోచ్‌లు లక్ష్మినారాయణ, మమత విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్‌బాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రతిభకు వేదికలా నిలుస్తుంది. శిబిరంలో మొదట విద్యార్థులకు వార్మప్, ఫిట్నెస్ ట్రైనింగ్ అందజేస్తున్నారు. బేసిక్ అంశాలైన రోల్ బాల్స్, ఫీల్డింగ్, క్యాచింగ్, బేస్ రన్నింగ్, స్లగ్గింగ్, పిచ్చింగ్ ఇస్తున్నారు. విద్యార్థుల త్రో, హ్యాండ్ పవర్‌ను బట్టి పిచ్చింగ్, స్లగ్గింగ్పై శిక్షణ అందజేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో విద్యార్థులకు రెండు జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిపిస్తున్నారు. కొత్లబాద్లో వేసవి సాఫ్ట్‌బాల్ శిబిరం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి
రండి.. విశేషాలు పంచుకుందాం ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలి మృతి ● భక్తిశ్రద్ధలతో గంధోత్సవం ● సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు శ్రీజ మూడో తరగతి, గంగారం (బిజినేపల్లి మండలం) నాగర్‌కర్నూల్ పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని రిటైర్డ్ పోస్టుమాస్టర్ నరసింహసాగర్ నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. దీనిని ఫుట్‌బాల్ లిల్లీ అని, బ్లడ్ లిల్లీ అని కూడా అంటారు. ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క.సాధారణంగా మే నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలోఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో వికసించే ఈ ‘మే ఫ్లవర్’ ఏడాది పొడవునా మొక్క దశలో ఉండి, కేవలం ఈ సీజన్లో మాత్రమే తన అందాలను వెదజల్లుతుంది. – కందనూలు వైభవంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు కొత్తకోట రూరల్: ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాచారంపేట శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందంగౌడ్ కథనం ప్రకారం...పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామానికి చెందిన సాయితేజ(19) అదే గ్రామానికి చెందిన గోపాల్ ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఈనెల 9న ట్రాక్టర్ ఇంజన్‌కు గడ్డి చుట్టే యంత్రాన్ని తీసుకొని కొత్తకోట మండలం నాచారంపేటలో ఓ రైతు పొలంలో గడ్డి చేట్టేందుకు సాయితేజ వెళ్లాడు. రోజంతా పనిచేసి సాయంత్రం 7 గంటల సమయంలో స్వగ్రామానికి ట్రాక్టర్‌తో తిరుగు ప్రయాణం అయ్యాడు. నాచారంపేట గ్రామ శివారులో కాల్వలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో సాయితేజ అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసలకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాల్వలో నుంచి బయటకు తీసి వనపర్తి మార్చూరీకి తరలించి ట్రాక్టర్ యజమానికి సమాచారం అందించారు. మృతుడి తండ్రి శేరుమీది రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దర్గాలో గంధోత్సవం నిర్వహించారు. గుల్బార్గా నుంచి తీసుకొచ్చిన గంధాన్ని మేళతాళాల మధ్య సయ్యద్ఖాదర్ బాషా ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మత పెద్దలు, తహసీల్దార్ ప్రభాకర్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నుంచి మత పెద్దలు గంధం శిరస్సుపై పెట్టుకొని సర్ ముబారక్ దర్గా, ధడ్ముబారక్ దర్గాలకు తీసుకెళ్లి గంధోత్సవ ఘట్టాన్ని ముగించారు. ఘనంగా చిన్న కిస్తీ పోటీలు ఉత్సవాల్లో హజ్రత్ షా అలీ పహిల్వాన్ సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు నిర్వహించగా.. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు ప్రసాదాన్ని కిస్తీలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. పహిల్వాన్లు పోటీ పడి కిస్తీ పోటీలు కొనసాగించారు. ఈ సందర్భంగా పహిల్వాన్లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మతసామరస్యాన్ని చాటుతూ భక్తులు తరలి వచ్చి దర్గాల్లో మొక్కులు చెల్లించి, ప్రార్థనలు చేశారు. నేడు పెద్ద కిస్తీలు ఉత్సవాలను పురస్కరించుకొని ధడ్ ముభారక్ దర్గాలో సోమవారం పెద్ద కిస్తీ పోటీలు జరగనున్నాయి. పెద్ద కిస్తీ పోటీలు వీక్షించడానికి భక్తులు భారీగా వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు చోరీ కేసులు నమోదు కల్వకుర్తి టౌన్: పట్టణంలోని పలుచోట్ల జరిగిన రెండు చోరీ కేసులు నమోదు చేసినట్లుగా ఆదివారం ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా.. చారకొండ మండలంలోని సిర్సనగండ్లకు చెందిన ఖాజాభాను సుమారు మూడున్నర తులాల బంగారం లాంగ్ చైన్‌ను బ్యాగ్‌లో పెట్టుకొని ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో లగేజీ బ్యాగును బస్సులోని ర్యాక్‌లో పెట్టి ముందుకు వచ్చి నిలబడింది. కల్వకుర్తిలో బస్సు దిగిన తర్వాత దిగి బ్యాగును చూడగా, అందులో పెట్టిన బంగారు గొలుసు కనపడకపోవటంతో వెంటనే కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి తాళం పగలగొట్టి.. పట్టణంలోని మార్గదర్శి కాలనీలో నివాసముండే లక్ష్మి తన భర్త గోపాల్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రిలో చూయించేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. బంధువైన మంగమ్మకు ఇంటి తాళం ఇచ్చి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ఆదివారం ఇంటిపైన ఉన్న బెడ్‌షీట్స్ తీసేందుకు మంగమ్మ అక్కడికి వెళ్లగా.. ఇంటి తలుపులకు ఉన్న తాళం విరగగొట్టి ఉండటం చూసి లక్ష్మికి సమాచారం ఇచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారు ఉంగరాలు, రెండు చిన్న ఉంగరాలు, మహాలక్ష్మి పొదుపు సంఘం డబ్బులు రూ.1.40లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి ఖిల్లాఘనపురం: విద్యుదాఘాతంతో వేరు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జోగు బక్కన్న తన ఇంటికి మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. సిమెంటు చేసిన గోడలకు నీరు పట్టేందుకు ఆయన కుమారుడు జోగు మహేష్ (22) శనివారం రాత్రి సమయంలో సింగిల్ ఫేస్ మోటార్ పెట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు అతడి చేయికి తగిలి విద్యుదాఘాతానికి గురి కాగా.. కుటుంబ సభ్యులు బాధితుడిని ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడే వైద్యం పొందుతూ.. శనివారం రాత్రే మృతి చెందాడు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆముదంబండ తండాలో.. ఖిల్లాఘనపురం మండలంలోని ఆముదంబండతండాలో ఆదివారం ఉదయం కేతావత్ బాబు (28) ఇంటి ఆవరణలో ఉన్న మోటార్ ఆన్ చేసి బైక్ కడుగుతున్నాడు. ఈ సమయంలో ప్లగ్ వద్ద వైరు తేలి ఉండటంతో ఒక్కసారిగా షాక్ వచ్చింది. బాబు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం ఖిల్లాఘనపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కెతావత్ బాబు (ఫైల్) జోగు మహేష్ (ఫైల్) తెలకపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి పెద్దచెరువులో అదివారం మధ్యాహ్నం మహిళ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో స్థానికులే చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. లింగాల మండలం వల్లాభాపూర్ గ్రామానికి చెందిన కిష్టమ్మ(75)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానిక తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులను వివరాలు అడగగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కనువిందు చేస్తున్న మే పుష్పం -
నీటి సంపులో పడి బాలుడి మృతి
హన్వాడ: నీటి సంపులో పడి బాలుడి మృతి చెందిన ఘటన మండలంలోని మాధారంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసయ్య కుమారుడు లక్కీ(6) ఇద్దరు స్నేహితులతో కలిసి తమ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు తవ్విన నీటి సంపులో పడి ఊపిరాడక మృతి చెందాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మరో ఇద్దరు చిన్నారులను కాపాడినా లక్కీని మాత్రం రక్షించలేకపోయారు. స్కూళ్లకు సెలవులు వస్తే పిల్లలు కళ్ల ముందు తిరుగుతూ సందడి చేస్తారని సంబరపడే తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిలిందని వాపోతున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి గద్వాల క్రైం: గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(70) రైలులో ప్రయాణిస్తూ.. ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాల్సిందిగా హెడ్ కానిస్టేబుల్ సూచించారు. -
క్రికెట్ శిబిరాలకు వేళాయే...
నేటి నుంచి సమ్మర్ క్యాంప్ ● పెబ్బేర్ పీజేపీ మున్సిపల్ మైదానం ● నారాయణపేట మినీ స్టేడియం అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నామని ఆ పాఠశాల జీహెచ్ఎం గోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యాంపు కొనసాగనుందని, స్థానికంగా, పట్టణంలో ఉండే 6 నుంచి 9తరగతి విద్యార్థులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో పరిశుభ్రత, యోగా, డ్రాయింగ్, పెయింటింగ్, నీతి కథలు చెప్పడం, డాన్స్ వంటి పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారని, క్యాంప్‌లో పాల్గొనే విద్యార్థులకు రోజు స్నాక్స్ కూడా అందిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ క్రీడలు: గ్రామీణ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. హెచ్‌సీఏ సౌజన్యంతో మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఐదు వేసవి శిబిరాలు నిర్వహించగా వందలాదిమంది యువత సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం మహబూబ్‌నగర్, జడ్చర్లలో, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేర్, కల్వకుర్తి పట్టణాల్లో క్రికెట్ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఆయా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఈ శిబిరాల్లో అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23 విభాగాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నేడు ఎండీసీఏ మైదానంలో ప్రారంభమయ్యే వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిర ఏర్పాట్లను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ పరిశీలించారు. శిబిరాల్లో క్రీడాకారుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. క్రీడాకారుల కోసం జంబో కిట్లు, ఫిజికల్ ఫిట్నెస్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారం కింద అరటిపండు, గుడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి వేసవి ఉచితక్రికెట్ శిక్షణా శిబిరాలు ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఏర్పాట్లు నాలుగు విభాగాల క్రీడాకారులకు అవకాశం -
పీయూలో ఇంజినీరింగ్ ల్యాబ్స్ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజినీరింగ్ కళాశాల బీఈఈ ల్యాబ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ల్యాబ్స్ వినియోగించడంతో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సబ్జెక్టుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధవిద్యలో ప్రావీణ్యం
చిన్నారి కరాటే పంచ్ నేను కరాటే శిక్షణకు వస్తుండటంతో ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగింది. భయపడకుండా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. బయటకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నాను. ఫిట్నెస్తో పాటు చదువులో కూడా ఏకాగ్రత కనిపిస్తుంది. – శ్రావ్య, నాగర్‌కర్నూల్ మాస్టర్ స్వాతి మెళకువలతో నేర్పిస్తున్నారు. కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉచితంగా నేర్పించడం చాలా బాగుంది. మాస్టర్ నేర్పిన అంశాలను ప్రాక్టిస్ చేస్తూ ధృడంగా తయారవుతున్నాం. – గణేశ్, నాగర్‌కర్నూల్ -
బైక్ ఢీకొని రైతు మృతి
మన్ననూర్: అమ్రాబాద్–మన్ననూర్ ప్రధాన రహదారిలో జరిగిన ప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్ననూర్లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పంబలి తిర్మలయ్య(68) వ్యక్తిగత పని నిమిత్తం బటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇంటికి కొద్ది దూరంలో కుమ్మరోనిపల్లికి చెందిన ఆర్టీసీ పీహెచ్బీ (ప్రైవేటు) డ్రైవర్ రాకేష్ బైక్‌తో వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టాడు. తల వెనుకభాగం, కాలు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యసిబ్బంది వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో మృతిచెందాడనే ఆరోపణలు ఉన్నాయి. అయతే ఘటన జరిగిన వెంటనే బాధితులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అప్పటికే స్వల్పగాయాలతో ఉన్న రాకేష్‌తో ఉన్న అంబులెన్స్ ఆస్పత్రి వద్దకు వేగంగా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రి, 108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తిర్మలయ్య మృతిచెందాడని ఆవేశానికి గురైన బంధువులు ఆస్పపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. అమ్రాబాద్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలకిష్టమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ ఎస్ఐ హన్మంత్‌రెడ్డి తెలిపారు. -
మక్కల కుప్పను ఢీకొని యువకుడు దుర్మరణం
గోపాల్పేట: రోడ్డుపై ఆరబోసిన మక్కల కుప్పను బైక్‌తో ఢీకొని ఓ యువకుడు మృతిచెందినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఏదుల మండల కేంద్రానికి చెందిన వీరపాగ కృష్ణ(25) ఆదివారం సాయంత్రం రేవల్లికి వెళ్లాడు. రాత్రికి తిరిగి వస్తుండగా ఏదుల రిజర్వాయర్ వద్ద రోడ్డుపై బ్రిడ్జిపై అనంతపురం గ్రామానికి చెందిన చిన్ననర్సింహ మక్కలను ఆరబోసి నల్లకవర్ కప్పి వెళ్లిపోయాడు. ఇది గమనించకుండా బైక్‌పై వెళ్లి మక్కలకుప్పను ఢీకొట్టడంతో కృష్ణ ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం అక్కడికి వచ్చిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బావిలో పడి వృద్ధురాలి మృతి మానవపాడు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని జల్లాపురం గ్రామానికి వడ్డె లక్ష్మమ్మ (80) సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. కొత్త యాపట్లలో పులి కలకలం పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తయాపట్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన గొల్ల శివుడు ఆదివారం సాయంత్రం అడవిలో మేకలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. మేకల గుంపుపై పెద్ద పులి దాడి చేసి ఒక మేకను లాక్కెళ్లిందన్నారు. మంద వెంట ఉన్న కుక్కలు పులిని వెంబడించగా మేకను వదిలిపెట్టి అడవిలోకి పారిపోయిందని గొర్రెల కాపారి తెలిపారు. కొత్త యాపట్ల సమీపంలో పులి కనిపించడంతో గొర్రెల కాపారులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. -
‘కిస్తీ’మే సవాల్
● ఉత్సాహంగా పెద్దకిస్తీ పోటీలు ● వైభవంగా షా అలీ పహిల్వార్ దర్గా ఉర్సు ● ప్రసాదం కోసం పోటీపడిన పహిల్వాన్లు ● వేలాదిగా తరలివచ్చిన భక్తులు అలంపూర్: హజరత్ షా అలీ పహిల్వాన్ ఉర్సులో కిస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. భక్త జనసందోహం మద్య పెద్ద కిస్తీ పోటీలు పోటాపోటీగా జరిగాయి. కిీస్తీలో వేసిన తబురుక్(ప్రసాదం) కోసం పహిల్వాన్లు పోటీ పడ్డారు. కిస్తీలో వేసిన ప్రసాదాన్ని పహిల్వాన్లు భక్తులపైకి విసురుతూ ఉర్సు ప్రాధాన్యతను కొనసాగించారు. అలంపూర్‌లో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు సోమవారం మూడోరోజుకు చేరుకుంది. హజ్రత్ షా అలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గాల్లో పెద్ద కిస్తీ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉర్సుకు ప్రధాన ఆకర్షణగా నిర్వహించే పెద్ద కిస్తీ పోటీలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. పహిల్వాన్లు అబ్బురపరిచే విన్యాసాలతో వీక్షకులను అలరిస్తూ కిస్తీల్లో పోటీపడ్డారు. భక్తులు ఆనందోత్సవాల మధ్య కిస్తీ పోటీలను తిలకించారు. ఉత్సాహంగా ఉర్సు హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సును భక్తులు ఉత్సహంగా జరుపుకొన్నారు. పెద్ద కిస్తీ పోటీల కోసం భక్తులు ప్రసాదాన్ని మేళతాలల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి కిస్తీ పోటీలకు సమర్పించారు. పట్టణంలోని వివిధ కాలనీలు, మండలంలోని ఆయా గ్రామాల నుంచి సైతం భక్తులు కిస్తీ పోటీలకు ప్రసాదంను అందించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అండాల్లో(పలావ్) సిద్ధం చేసుకొని కాడేద్దుల బండ్లు, ట్రాక్టర్లలో దర్గా వద్దకు చేరుకొని ప్రసాదం అందించి కిస్తీలను కొనసాగించారు. ఉర్సుకు తరలివచ్చిన భక్తజలతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. ఉర్సుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు వివిధ ప్రాంతాల భక్తులు వచ్చారు. ప్రధాన రహదారుల్లోని మిఠాయి, బొమ్మల, బ్యాంగిల్స్ దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపించాయి. రంగులరాట్నాల వద్ద పిల్లలు సందడి చేశారు. ఉర్సు ఉత్సవాలలో సర్కారి కిస్తీయే ప్రధానంగా కొనసాగుతుంది. దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ సయ్యద్ అహ్మద్ షా ఒవైసీ అధ్వర్యంలో సర్కారి కిస్తీ పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడు దర్గాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం కిస్తీ వద్దకు వద్దకు చేరుకున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇస్మాయిల్‌ను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం సయ్యద్ ఖాదర్ బాషా ఇంటినుంచి వచ్చిన సర్కారి కిస్తీని ఊరేగింపుగా దర్గాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు ప్రసాదంను పడవలాంటి ఆకారంలో ఉన్న కిస్తీలో నింపి సర్కారి కిస్తీని సిద్ధం చేశారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కిస్తీ పోటీలను ప్రారంభించారు. పహిల్వాన్లు పోటీపడుతు బలప్రదర్శనతో ప్రసాదాన్ని దక్కించుకోని భక్తులపైకి విసిరుతూ పోటీలను కొనసాగించారు. కిస్తీ పోటీలకు వచ్చిన పహిల్వాన్లు విన్యాసాలను ప్రదర్శిస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. ఉర్సులో సీఐ ప్రదీప్, ఎస్ఐ రామకృష్ణల అధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
మీరు ఫొటోలు, విశేషాలు, గీసిన చిత్రాలను 94415 43232 నంబర్‌కు వాట్సప్ చేయండి. పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. వీటిని ప్రచురించి మీ సందడిని అందరితో పంచుకునేలా చేస్తాం. -
ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సునీల్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికారిక కోచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి, పరిశీలకులు జె.రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్‌ల సంఘాన్ని (ఎస్ఏటీజీసీఏ) ఎన్నుకున్నారు. కోచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.సునీల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ బాస్కెట్‌బాల్ కోచ్ ఎండి.ఖలీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. అనంతరం నూత న అధ్యక్ష, ప్రధాన కార్య దర్శిని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో మ రో పరిశీలకుడు ఎండి.జియావుద్దీన్‌తోపాటు పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. -
క్రికెట్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ● పాలమూరులో వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం మహబూబ్‌నగర్ క్రీడలు: వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్ మాట్లాడుతూ క్రికెటర్లు ఆటపై ఆసక్తి, పట్టుదలతో ఆడాలని సూచించారు. మైదానంలో అభివృద్ధి పనులకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. జిల్లా క్రికెటర్లు ఇండియాకు, ఐపీఎల్లో ఆడాదని, మిమ్మల్ని టీవీలో చూడాలనే ఆకాంక్ష ఉందన్నారు. ఇష్టపడి, పట్టుదలతో క్రికెట్ ఆడి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి అండర్–14, 16 జట్లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను రానున్న హెచ్‌సీఏ టోర్నమెంట్లకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం ముడా నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేఘ్యానాయక్, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కార్యదర్శి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండీ మన్నాన్, ముఖ్తార్‌అలీ, ఆబిద్ హుస్సేన్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున బైపాస్‌లోని పాల్కొండ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేశారని, మాజీ డీజీపీ భార్యను చంపి దొంగతనం చేసినట్లు తెలిపారు. బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ కొడుకు భగీరథను అదుపులో పెట్టుకోలేదని, ర్యాగింగ్ చేసిన సమయంలోనే అదుపులో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. కొడుకును గాలికి వదిలేయడంతో అమ్మాయి జీవితాలతో చెలగాటం అడుతున్నారడని ఆరోపించారు. అమ్మాయి కేసు పెడితే పోలీసులు కనీసం కేసు నమోదు చేసుకోలేదని విమర్శించారు. అమ్మాయిపై తెలివిగా వేరే ప్రాంతంలో కేసులు పెట్టించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హిందువులు, ముస్లింలను రెచ్చగొట్టుడు తప్పా.. బండి సంజయ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ మీద నోరు పారేసుకోవడం తప్పా రాష్ట్రానికి ఒక్కపైస తెచ్చే తెలివిలేదన్నారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయని ఆరోపించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటి నుంచి పెట్టుబడులు రావడం కష్టం అవుతుందన్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
● ప్రశ్న: తెలంగాణ చౌరస్తాలో తరచూ మెయిన్ పైపులైన్ పగిలి తాగునీరు లీకేజీ అవుతోంది. ఎన్నిసార్లు బాగు చేసినా ఉపయోగం లేకుండాపోతోంది. – మోహన్, క్రిస్టియన్‌కాలనీ (డివిజన్ నం.41) ● మేయర్: తాగునీటి వ్యవస్థ పటిష్టానికి నగరానికి మంజూరైన రూ.220 కోట్లతో త్వరలోనే కొత్త పైపులైన్ వేయనున్నాం. అప్పుడు తప్పక అక్కడ మార్చి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా చూస్తాం. ● సమస్యాత్మక ప్రాంతాలకు ట్యాంకర్లు ● నగర మేయర్ జి.మమత ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన ● ప్రశ్న: వారంలో రెండు రోజులు మాత్రమే మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది. అందులోనూ ఒండ్రు కలిసి రావడంతో తాగే పరిస్థితి లేదు. – శాంతిభూషణ్, బీసీ కాలనీ, ఏనుగొండ (డివిజన్ నం.2) ● మేయర్: ఇక నుంచి సమీపంలోని ఓవర్‌హెడ్ ట్యాంకును శుభ్రం చేయించిన తర్వాతే తాగునీరు వదులుతాం. ● ప్రశ్న: పీహెచ్సీ సమీపంలోని పాత నీటి ట్యాంకు వద్ద అంతా అపరిశుభ్రంగా ఉంది. అక్కడ చెత్తాచెదారం వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. – ఆనంద్‌కుమార్, సుభాష్‌నగర్ (డివిజన్ నం.56) ● మేయర్: అక్కడికి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తాం. చెత్త వేయొద్దని బోర్డు ఏర్పాటు చేయిస్తాం. ● ప్రశ్న: ఆరు నెలలుగా మా ప్రాంతంలోని పవర్ బోర్ పని చేయడం లేదు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించడం లేదు. – సిద్దిరామప్ప, జగదాంబ కాలనీ, (డివిజన్ నం.45) ● మేయర్: అక్కడికి ఇంజినీరింగ్ అధికారులను పంపిస్తాం. వీలైనంత త్వరగా పవర్ బోరును బాగు చేయిస్తాం. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జి.మమత హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లు పంపిస్తామన్నారు. ఇదే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం ఆమెతో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలువురు నగర ప్రజలు తమ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను ప్రస్తావించారు. ● ప్రశ్న: మిషన్ భగీరథ పథకం పైపులైన్లు పగిలినప్పుడు తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం లేదు. – షేక్ ఫారూక్ హుస్సేన్, షాషాబ్‌గుట్ట–న్యూటౌన్ ప్రాంతం (డివిజన్ నం.59) ● మేయర్: వెనువెంటనే బాగు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచిస్తాం. ఇక ముందు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ● ప్రశ్న: నెల రోజులుగా మా ఇంటి (నం.1–1–9/22/3/2)కి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చుట్టుపక్కల వారికి వస్తున్నా, మాకు మాత్రం అందడం లేదు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదు. – కె.రాములు, న్యూమోతినగర్ (డివిజన్ నం.18) ● మేయర్: మీ ప్రాంతానికి వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందికి పంపించి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ● ప్రశ్న: మా ప్రాంతానికి మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. పాల్సాబ్గుట్టలోని ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి సన్నగా వస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – బాబా, సద్దలగుండు (డివిజన్ నం.47) ● మేయర్: మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా కాని రోజుల్లో అక్కడికి మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను పంపిస్తాం. ● ప్రశ్న: వేసవికాలం కావడంతో తరచూ తాగునీటి సమస్య తలెత్తుతోంది. సమీపంలోని పవర్ బోరు నుంచి నీరు సైతం సరిగా రావడం లేదు. – అనుపటి చెన్నయ్య, ఎస్సీ కాలనీ, ఏనుగొండ (డివిజన్ నం.2) ● మేయర్: ఇంజినీరింగ్ సిబ్బందిని అక్కడికి పంపి పవర్ బోరు ప్రెస్సింగ్ చేయిస్తాం. ● ప్రశ్న: మూడు రోజులకోసారి మిషన్ భగీరథ పథకం ద్వారా వస్తున్న తాగునీరు ఎక్కువ సేపు వదలాలి. సన్నగా వదలడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – శ్రీకాంత్, ఎదిర (డివిజన్ నం.5)/ రమేష్, ఏనుగొండ (డివిజన్ నం.6) ● మేయర్: మీ ప్రాంతాలకు అవసరమైనప్పుడు మున్సిపల్ ట్యాంకర్ పంపిస్తాం. -
వామ్మో.. బైపాస్!
● ఇటీవల పాలకొండకు చెందిన ఓ మహిళ బైపాస్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మృతి చెందింది. ● తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు దాదాపు స్పోర్ట్స్ బైక్‌ను 200కిలోమీటర్ల వేగంతో పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీ కొట్టింది. కారు బోల్తా పడడంతో పాటు బైక్ నుజ్జునుజ్జుగా మారింది. ఈ ఘటనలో బైక్ రైడర్‌తో పాటు వెనుక కూర్చున యువకుడు, కారులో ఉన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
ప్రజావాణికి 114 వినతులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఎకై ్సజ్, భూ సర్వే రికార్డులు, గృహనిర్మాణం, జిల్లా సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన 114 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అడిషనల్ కలెక్టర్లు మధుసుదన్‌నాయక్, హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాం భద్రత ఏర్పాట్లు, సీల్‌ను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్లో కౌన్సెలింగ్ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రీడాకారులకు సన్మానం మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈనెల 10వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను సన్మానించారు. ఈ పోటీల్లో పురుషుల 400 మీటర్ల పరుగులో డి.శ్రీధర్ బంగారు పతకం, 18ఏళ్ల లోపు బాలికల విభాగం డిస్కస్‌త్రోలో పౌర్ణమి బంగారం, షాట్‌పుట్‌లో కాంస్యం, 18 ఏళ్లలోపు బాలికల విభాగం లాంగ్‌జంప్‌లో సాయికీర్తన కాంస్యం, 20 ఏళ్ల లోపు బాలుర 400 మీటర్ల పరుగులో కేతావత్ నవీన్ కాంస్యం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర పేర్కొన్నారు. అథ్లెట్లను సోమవారం జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రకుమార్. సి.శ్రీనివాసులు శాలువాలతో సత్కరించి అభినందించారు. -
ఆత్మబంధువులు
● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కీలక విధుల నిర్వహణ ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు ● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్‌లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్‌లో 59, సెకండియర్‌లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్‌హెచ్‌ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. ● నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్‌సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం
మహబూబ్‌నగర్ క్రైం: పాలకొండ బైపాస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ రైడర్ అతివేగం వల్ల నగరంలో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. న్యూ ప్రేమ్‌నగర్‌కు చెందిన మహ్మద్ బాసిద్ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతో పాటు రబియా మజీద్ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసియా బేగం ఆమె కొడలు రేష్మా ఖాతూమ్, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్‌నగర్‌తో పాటు రబియా మజీద్ ఏరియా(మర్లు)లో విషాదం అలుముకుంది. అటు మహ్మద్ బాసిద్ కుటుంబంలో బాసిత్‌తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్ జైద్ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్, నాలుగేళ్ల మనవడు మహ్మద్ జమాద్ద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్ హమ్మర్ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్ వెళ్లిన హమ్మర్ తండ్రి మహ్మద్ ఇమ్రాన్ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఇద్దరూ స్నేహితులే.. ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఒవైజ్(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్ అబ్జల్(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ బైక్‌లపై మహబూబ్‌నగర్‌కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యాన పాసింగ్ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్‌నగర్ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. బైపాస్‌పై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ప్రేమ్‌నగర్, రబియా మజీద్ ఏరియాలో విషాదం -
హెచ్‌పీవీ నత్తనడకన
ఫోన్ చేయాల్సిన నంబర్: 94413 57967 తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ● జిల్లాలో 14–15 ఏళ్లు బాలికలు 8,563 ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్యశాఖ ● రెండు నెలల్లో 2,510 మందికే వ్యాక్సినేషన్ ● అర్బన్, కమ్యూనిటీ హెల్త్సెంటర్ల్లో అధ్వానం ● లక్ష్యంలో 50 శాతం కూడా చేరని వైనం పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కిషోర బాలికల్లో భవిష్యత్‌లో సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వారా) క్యాన్సర్ రాకుండా ప్రభుత్వం ప్రారంభించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఆదరణ లభించడం లేదు. 14–15 వయసు మధ్య బాలికలకు ఉద్దేశించిన ఈ వ్యాక్సిన్‌ను మార్చి 8న మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రారంభించారు. అయితే ఈ టీకా విషయంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, అపోహ లు నెలకొనడంతో కార్యక్రమం నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జిల్లాలో కేవలం 2,510 మంది బాలికలకు మాత్రమే టీకాలు అందించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా 14–15 ఏళ్లు ఉన్న బాలికలను 8,563 మందిని గుర్తించారు. రెండు నెలలు గడుస్తున్న లక్ష్యంలో 50 శాతం కూడా చేరుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 14–15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వేయడానికి జనరల్ ఆస్పత్రి, జడ్చర్ల ఆస్పత్రిలో మార్చి 8న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం అర్బన్ హెల్త్సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం విస్తరించారు. ఇప్పటి వరకు జనరల్ ఆస్పత్రిలో 406, గండేడ్‌లో 339, జడ్చర్లలో 215, నవాబ్‌పేటలో 176, బాలానగర్‌లో 163, జానంపేట 134, ఎదిర 211, భూత్పూర్లో 102 మంది మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. నగరంలో ఉన్న అర్బన్ హెల్త్సెంటర్లలో ఇప్పటి వరకు కుమ్మరివాడిలో ఒకరు, మోతీనగర్‌లో ఆరు, రామయ్యభౌళిలో ఒకరు, పాత పాలమూరులో ఇద్దరికి ఇచ్చారు. పలు పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య రెండు అంకెలు కూడా దాటలేదు. -
తాగునీటికి తండ్లాట..!
● వారం రోజులకోసారి నీటి సరఫరా ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● పట్టింపు లేని అధికారులు జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి రోజు తాగునీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో కొన్ని కాలనీల్లో మూడునుంచి ఏడురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుంది. మధ్యలో నీరు అవసరమైతే ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అసలే ఎండాకాలం.. ఆపై నీటిఎద్దడి తీవ్రం కావడంతో ప్రధానంగా మహిళలు నీటి కొళాయిల వద్ద పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. జడ్చర్ల మున్సిపాలిటి పరిధిలో ప్రతిరోజు 11.5 ఎంఎల్డీ నీరు అవసరం కాగా.. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పట్టణానికి 7–8 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్నిరోజుల పాటు 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసిన అధికారులు ఇటీవల మళ్లీ 7 ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేయడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టణంలో పలు కాలనీల్లో తాగునీటి పైపులైన్లు లీకేజీల కారణంగా కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మిషన్ భగీరథ డబ్ల్యూటీపీల నుంచి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే స్థానిక పైపులైన్లు లీకేజీ ఏర్పడడంతో ప్రజలు ఈ నీటిని తాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేస్తున్నా.. లీకేజీల కారణంగా పథకం లక్ష్యం నిరుగారుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతిరోజు శుద్ధమైన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జడ్చర్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి 12 ఎంఎల్డీకిపైగా ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇటీవల కొన్ని రోజులుగా 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీ ఏర్పడినప్పడు నీటి సమస్య ఏర్పడుతుంది. మున్సిపాలిటీ పరిధిలో లీకేజీలను సరిచేశాం. – లక్ష్మారెడ్డి, కమిషనర్, మున్సిపాలిటి, జడ్చర్ల బాదేపల్లి పట్టణంలోని పాతబజార్, ఫకీర్‌నగర్, జవహర్‌నగర్, విద్యానగర్, క్లబ్‌రోడ్డు, చైతన్య నగర్, కావేరమ్మపేట, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుందని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు. కాలనీల పరిధిలోని సింగిల్ ఫేజ్ మోటర్ బోర్లను ఆశ్రయించి బిందెలతో నీటిని తీసుకొస్తున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు 18వేల నల్లా కనెక్షన్లు ఉండగా 197 బోర్లు కొనసాగుతున్నాయి. మల్లెబోయిన్పల్లి పంపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి విషయంలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీంతో దీని పరిధిలో ఉన్న కాలనీల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పౌర్ణమికి రెండు పతకాలు
మిడ్జిల్: హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి మూడో అథ్లెటిక్స్ పోటీల్లో మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి అద్భుత ప్రతిభ చాటి ఓ స్వర్ణపతకంతో పాటు ఓ కాంస్య పతకం సాధించింది. డిస్కస్‌త్రో ఈవెంట్లో 29.69 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే షాట్‌పుట్‌లో 8.49 మీటర్లు విసిరి మూడో స్థానంతో కాంస్య పతకం పొందింది. ఈ సందర్భంగా పౌర్ణమికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఎప్‌సెట్ కేంద్రం తనిఖీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జేపీఎన్సీ కళాశాలలో జరుగుతున్న ఎప్‌సెట్ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 360 మంది విద్యార్థులకు 345 మంది హాజరయ్యారు. వారి వెంట కళాశాల పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్ పాల్గొన్నారు. కొత్త కోర్సుల్లో చేరండి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్ఎస్ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్‌షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్‌గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ మందిరంలో నౌకా విహార్ ఉత్సవాలు స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీ ఇస్కాన్ జగన్నాథ మందిరంలో శ్రీరాధా శ్యాంసుందర్ నౌకావిహార్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ గురువు వరదరాజ్ దాస్ప్రభు మాట్లాడుతూ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను పడవతో విహరింపజేయడం, వేసవి తాపాన్ని తగ్గించడానికి స్వామికి చందనం, నీటితో సేవలందించడమే నౌకావిహార్ విశేషమన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో విజయ వెంకటేశ్వరదాస్ ప్రభు, రఘునాథ్ ప్రభు, రసమయ హరిదాస్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులకు ఓసారి
ప్రతిరోజు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మమ్మ, కావేరమ్మపేట తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీళ్ల సమస్యల కారణంగా బ యటి పనులకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. తెల్లారితే నీళ్ల సమస్యతో సతమత మవుతున్నాం. ప్రతిరోజు తాగునీటిని సకాలంలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, ఆదర్శనగర్ ● -
సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలి
మహమ్మదాబాద్: ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లు తప్పకుండా అవసరమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద ఆడిటోరియంలో గండేడ్, మహమ్మదాబాద్ మండలాలకు చెందిన 20 మంది అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీలు ఎలా వినియోగించాలో అధికారులు తెలియజేయాలన్నారు. మదర్స్‌డే సందర్భంగా కేక్ కట్‌చేసి మహిళలకు పంచిపెట్టారు. అమ్మ గొప్పతనం మాటల్లో చెప్పలేనిదని, అమ్మ నేర్పిన పాఠాలతోనే తండ్రి, గురువులు ఆదరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, సీడీపీఓ రాధిక, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అలవేలు, మల్లమ్మ, పద్మ, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌తో కారు, బైక్‌లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్‌నగర్ న్యూప్రేమ్ నగర్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉంది.పోలీసుల నిర్లక్ష్యంతోనే..ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
నెలరోజులుగా పడిగాపులు
నెలరోజుల కిందట కొనుగోలు కేంద్రానికి 266 బస్తాల మొక్కజొన్న తీసుకొచ్చా. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజూ పనులు మానుకుని కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నా.. శుక్రవారం బస్తాలను తూకం వేయడంతో ట్రాక్టర్లో తానే స్వయంగా గోదాం వద్ద అన్లోడ్ చేసేందుకు తీసుకెళ్లా. గోదాం ఖాళీ లేదంటూ వెనక్కి పంపారు. – మైబు, రైతు, గంగాపూర్ 25రోజులుగా ఇబ్బందులు మొక్కజొన్న పంటను అమ్ముకుపోదామని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. 150 బస్తాలను ఇక్కడికి తెచ్చి 25రోజులు గడించింది. అయినా కొనుగోలు చేయక పడాగాపులు పడుతున్నాం. ఇంటి వద్ద కుటుంబం, వ్యవసాయ పనులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. రేపుమాపు అంటున్నారే తప్పా.. కొనడంలేదు. దీంతో నరకం అనుభవిస్తున్నాం. – వెంకటయ్య, రైతు, లింగంపేట ● -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్‌నగర్ -
రగిలిన మక్క రైతులు
జడ్చర్ల: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన మొక్కజొన్న దిగుబడులను విక్రయించేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా.. కొనుగోళ్లు చేయకపోవడంతో నీరసించిన రైతన్న కడుపు మండి రోడ్డెక్కిన దుస్థితి శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొనుగోళ్లు సజావుగా సాగక రైతాంగం చివరికి రగిలిపోయి ఆందోళనకు దిగింది. ఎదురుగా ఉన్న 167వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ● మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 40 వేల బస్తాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బస్తాలను సైతం గోదాములకు తరలించకపోవడంతో సమస్య మొదలైంది. లారీలు, హమాలీలు లేకపోవడంతో మొదటగా బస్తాలను తరలించలేకపోయారు. తదుపరి గోదాములు ఖాళీగా లేకపోవడంతో అన్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నెల రోజులకు పైగా మొక్కజొన్న కుప్పలు, బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. తూకాలు పూర్తయినా బస్తాలను తరలించే వరకు రైతులను బాధ్యులను చేయడంతో రైతులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం తూకాలు వేసిన బస్తాలను రైతులే స్వయంగా 40 ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని చర్లపల్లి సమీపంలోని గోదాములకు తరలించారు. అయితే అక్కడ కేవలం 4 ట్రాక్టర్లను మాత్రం అన్లోడ్ చేసుకుని గోదాములు ఖాళీగా లేవంటూ వెనక్కి పంపారు. దీంతో మళ్లీ ఆయా ట్రాక్టర్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. చైర్పర్సన్ భర్తపై రైతుల ఆగ్రహం రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి భర్త అల్వాల్‌రెడ్డి అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నంలో ఓ రైతును కోప్పడడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. ఈయనేనా చైర్మన్.. ఇన్నాళ్లు యాడున్నావంటూ మండిపడ్డారు. మార్కెట్ చైర్మన్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● రైతుల ఆందోళనతో జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రోడ్డుపై ఆరు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు 5కిమీల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎండాకాలం కావడంతో ప్రయాణికులు నీళ్లకు, తిండికి ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు కొందరు ఎండను తాళలేక వెనక్కి వెళ్లిపోయారు. రోడ్డు పక్కదారులకు కూడా ట్రాక్టర్లను అడ్డుపపెట్టి మూసి వేయడంతో వాహనాలు ఎటూ కదలకుండాపోయాయి. ఇదేనా.. ప్రజాపాలనా?: మాజీమంత్రి లక్ష్మారెడ్డి రైతులు పంట పండించేందుకు మూడు నెలలు పడితే.. వచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు మరో మూడునెలలు పడుతుందుని, ఆలోగా అకాల వర్షాలతో దిగుబడులకు నష్ట వాటిల్లి రైతులు ఆధోగతి పాలవుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు ఆయన మద్దతు పలికి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయడమేనా.. ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ఇలాంటి దుస్థితి ఏనాడు రాలేదన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎంతమాత్రం రైతుల గోసను పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రానికి లక్ష బస్తాలకుపైగా విక్రయానికి వచ్చాయని.. వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చివరకు మార్క్‌ఫెడ్ డీఎం రహెమున్నిసా బేగం, తహసీల్దార్ నర్సిగరావు, సింగిల్‌విండో సీసీఓ యాదగిరితో చర్చించి పత్తి మార్కెట్ యార్డు షెడ్లలోనే బస్తాలను నిల్వ చేసేవిధంగా నిర్ణయం తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. తూకం వేసిన బస్తాలను వెంటనే ఆయా షెడ్లలోనే నిల్వ చేస్తామని అధికారులు ప్రకటించడంతో మాజీ మంత్రి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రామ్మోహన్, ఇమ్ము, జ్యోతి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని తామే భరిస్తున్నాం.. మొక్కజొన్నను విక్రయించేందుకు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, బయటి నుంచి తామే కొనుగోలు చేసుకుని వచ్చినా.. తూకాలు వేయడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. గన్నీబ్యాగులతో పాటు తూకా లు వేసేందుకు బస్తాకు రూ.27 చెల్లిస్తున్నామని, బస్తాలను కుట్టు వేసే సుత్తిలి ధారాలను సైతం తామే బయటి నుంచి కొనుగోలు చేసి అందిస్తున్నామని రైతులు వాపోయారు. చివరకు గోదాముల వద్దకు ట్రాక్టర్లతో తాము తరలించినా అన్లోడ్ చేయకుండా వెనక్కి పంపారని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ ఆందోళన బస్తాల లోడ్ ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి నిరసన 167వ నంబర్ జాతీయ రహదారిపై ధర్నా ఆరు గంటల పాటు నిలిచిన రాకపోకలు -
వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
నాగర్‌కర్నూల్, గద్వాల ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల జరిగిన అగ్నిప్రమాదాలతో రూ.లక్షల్లో ఆస్తినష్టం సంభవించింది. సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్ –8లో uప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్‌నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్ -
మహబూబ్‌నగర్
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్‌కర్నూల్/ పాలమూరు/గద్వాల /జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) అమ్మకు వందనంఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. నేడు మాతృదినోత్సవం ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్‌నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ కూతురు మానస, కుమారుడు సాయిరాంతో ఏఎస్ఐ విజయలక్ష్మి -
నేటివరకు స్వీయ గణనకు అవకాశం
ఫోన్ చేయాల్సిన నంబర్: 94413 57967 తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జనగణన– 2027లో భాగంగా ఆదివారం (మే 10)వరకు స్వీయగణనలో ప్రజలు వివరాలు నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సెన్సెస్‌పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమ గ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభు త్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్‌లైన్‌ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా న మోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్ఈఐడీ) జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీఎస్ఓ గంప శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం రవినాయక్, జిల్లా సహకార అధికారి కృష్ణ, డీఏఓ బి.వెంకటేష్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు మే10 వరకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. -
హ్యాండ్‌బాల్‌లో అదరగొడుతున్నారు
●మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పలు క్రీడలకు సంబంధించి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ శిబిరంలో విద్యార్థులు, యువత పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు సీనియర్ క్రీడాకారులు చక్కగా మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు. 40 మంది క్రీడాకారులు హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో దాదాపు 40 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు కొత్తగా హ్యాండ్‌బాల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొదట క్రీడాకారులకు వార్మప్, ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం హ్యాండ్‌బాల్ టెక్నిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు. హ్యాండ్‌బాల్ క్రాసింగ్, టూమెన్, త్రీమెన్ పాసింగ్తోపాటు వివిధ స్థానాల నుంచి షూటింగ్ ప్రాక్టిస్ చేయిస్తున్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థులకు రీక్రియేషన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో చిన్నారులు, సీనియర్ క్రీడాకారులను జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు. టెక్నిక్స్‌పై అవగాహన.. ఈ సంవత్సరం మొదటిసారి వేసవి హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నా. ఇక్కడ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. హ్యాండ్‌బాల్ బేసిక్ టెక్నిక్ అంశాలపై అవగాహన పెంచుకుంటున్న. – సాయి సాహితి, మహబూబ్‌నగర్ పాలమూరు మెయిన్ స్టేడియంలో వేసవి శిబిరం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్న యువత జూనియర్, సీనియర్ జట్లుగా విభజించి మ్యాచ్‌లు కొత్తగా వస్తున్న వారిపై నిర్వాహకుల ప్రత్యేక దృష్టి -
పరిశుభ్రమైన నీటితో చేపల ఉత్పత్తి మెరుగు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): చెరువుల్లో కలుపు మొక్కలను తొలగించడం, పరిశుభ్రత పాటించడం, నీటి నాణ్యతను కాపాడడం ద్వారా చేపల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు రాధారోహిణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాల సభ్యులకు చెరువులలో కలుపు మొక్కల నివారణ, చేపలలో వ్యాధుల నిర్మూలన, చేపల ఉత్పత్తి పెంచడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపల వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చేపలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. మత్స్యశాఖ అధికారులు శాసీ్త్రయ విధానాలతో చేపల పెంపకం, నాణ్యమైన చేప పిల్లల వినియోగం, మిశ్రమ చేపల పెంపకం, కేజ్ కల్చర్ విధానాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడితోపాటు ఆదాయం పెంచుకోవచ్చని వివరించారు. సదస్సుకు వివిధ మండలాల మత్స్యకార సహకార సంఘాల సభ్యులు, రైతులు హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, జిల్లా ఉద్యానవన అధికారి వేణుగోపాల్, ఫిషరీస్ శాస్త్రవేత్తలు గణేష్, శేఖర్, గంగారాం, మత్స్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. 9 నుంచి 12వ వరకు ఉర్సు హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సును పురస్కరించుకొని 9న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలీ సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధాన్ని సర్ ముబారక్ దర్గాకు భక్త జనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధం తీసుకెళ్లి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తి పోటీలు జరగనున్నాయి. 11న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తి పోటీలు నిర్వహిస్తారు. 12న ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. గుల్బర్గా నుంచి గంధం ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజా బందేనవాజ్ దర్గా నుంచి గంధాన్ని అలంపూర్‌లోని సయ్యద్ ఖాదర్ బాషా ఇంటికి తీసుకొస్తారు. అక్కడి నుంచి గంధాన్ని దర్గాలకు తీసుకెళ్లి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉర్సులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు వచ్చి మృతి భూత్పూర్: బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కర్వెన గ్రామానికి చెందిన మర్కంటి లక్ష్మమ్మ(55) శుక్రవారం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి భూత్పూర్లోని ఓ బ్యాంకుకు వచ్చి కూర్చొంది. అకస్మాత్తుగా కుర్చీలో కూర్చున్న చోటే కిందపడిపోవడంతో వెంటనే బ్యాంకుకు వచ్చిన ఇతర ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. బ్యాంకుకు వచ్చిన కర్వెన గ్రామ మహిళా సంఘం సభ్యులు లక్ష్మమ్మను గుర్తించి.. బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్వగ్రామమైన కర్వెన గ్రామానికి తీసుకెళ్లారు. మృతురాలి భర్త ఇప్పటికే మృతిచెందగా.. సంతానం ఎవరూ లేరని గ్రామ సర్పంచ్ నాగరాణి తెలిపారు. -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మైనర్లుకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా.. కొందరు తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్‌లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్‌పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్‌లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్‌లు ర్యాష్‌గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోగణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవులనేపథ్యంలో బైక్‌లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరులో రెండు బైపాస్ రోడ్లపై రేస్‌ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం -
రైతు సమస్యలపై త్వరలో పాదయాత్ర
మహబూబ్‌నగర్ రూరల్: రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద వరి ధాన్యం అమ్మకం కోసం వాహనాల్లో సంచులు పెట్టుకొని వేచి ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా, నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై త్వరలో పాదయాత్ర ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మిల్లర్లు రైతుల నుంచి అధిక తరుగు తీసుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేసి తర్వాత ఎత్తివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్లాల వద్దే వడ్లు కొనుగోలు చేసి, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో సమయానికి డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, నాయకులను డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కోటకదిర సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
11 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ
వేదిక ఇన్చార్జి సెల్ నం. ఎండీసీఏ మైదానం, మహబూబ్‌నగర్ ఆబిద్ 99482 74760 డీఎస్ఏ మైదానం, నారాయణపేట రమణ 91007 53683 డీఎస్ఏ మైదానం, కల్వకుర్తి ఎం.సుధాకర్ 96406 00329 డీఎస్ఏ మైదానం, గద్వాల శ్రీనివాస్ 77806 90883 డీఎస్ఏ మైదానం, జడ్చర్ల మోయిన్ 99853 75737 పీజేపీ మున్సిపల్ మైదానం, పెబ్బేరు చరణ్ 76748 88101 మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ సౌజన్యంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11 జూన్ 10 వరకు వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి శివారు క్రికెట్ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న మహబూబ్‌నగర్ ఎండీసీఏ మైదానం, జడ్చర్ల, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేరు, కల్వకుర్తి పట్టణాల్లో శిబిరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆయా కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్‌లు శిక్షణ అందిస్తారని, క్రీడాకారులకు జంబో కిట్, వివిధ రకాల బాల్స్, ఫిజికల్ ఫిట్నెస్ కిట్లు అందజేస్తామన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కోచింగ్ ఉంటుందని, క్రీడాకారులకు అల్పాహారం అందిస్తామన్నారు. అండర్– 14, 16, 19, 23 విభాగాల క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో ప్రతిభగల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలను ఔత్సాహిక క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు. సమావేశంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకష్ణ, మన్నాన్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాల వివరాలు ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి శిబిరాలు -
తాగలేం..!
మహబూబ్నగర్శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026నగరంలో వారంలో రెండుసార్లే తాగునీటి సరఫరా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని 60 డివిజన్లకు వారంలో రెండుసార్లు మాత్రమే మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. శుద్ధనీటి సరఫరా అంటున్నా.. ఒండ్రుతో కలిసి వస్తుండటంతో దాదాపు 90 శాతం ప్రజలు ఈ నీటిని తాగడమే లేదు. ఎక్కడికక్కడ ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్లు, ట్రాలీ ఆటోల ద్వారా వచ్చే నీటికి డబ్బులిచ్చి క్యాన్లలో పట్టుకుంటున్నారు. సుమారు మూడు లక్షల జనాభా కలిగిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28 చోట్ల ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. నెలలో కనీసం రెండుసార్లు అన్నిచోట్ల క్లారిఫొక్లేటర్ క్లీనింగ్ (ఫిల్టర్‌బెడ్‌లో అడుగున చేరిన బురద, మట్టిని తొలగించే పని) చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నా.. ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతోంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రత్యామ్నాయంగా సుమారు 700 పవర్ బోర్లు ఉండటంతో మిగతా రోజుల్లో వీటిని ఆశ్రయిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఒండ్రుతో వస్తున్న శుద్ధజలం సుమారు 3 లక్షల జనాభాకు సరిపోక ఇబ్బందులు ప్రత్యామ్నాయంగా పవర్ బోర్లతోసరిపెడుతున్న వైనం ‘సాక్షి’ బృందం పరిశీలనలోవెలుగులోకి వాస్తవ పరిస్థితులు -
వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కోస్గి రూరల్: పురకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.2 కోట్లతో సుందరంగా నిర్మించనున్నామన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తయిందని, పనులు ఏడాదిన్నరలోగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలో 200 ఎకరాల్లో విద్యాహబ్, ఇండస్ట్రియల్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ పనులకు 90 శాతం అనుమతులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదరగొడుతున్నారు
పాలమూరులో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు. –8లో uడివిజన్లలో ఇదీ పరిస్థితి.. డివిజన్ నం.1లోని దొడ్డలోనిపల్లిలో పవర్ బోర్ల ద్వారా సరఫరా అయ్యే తాగునీటికి కొన్ని ఇళ్లకు పైపులైన్లు వేసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా కాని రోజుల్లో ఈ నీటినే వినియోగిస్తున్నారు. డివిజన్ నం. 2లోని ఏనుగొండ బీసీకాలనీ, ఎస్సీ కాలనీలకు రెండు, మూడు రోజులకోసారి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది. డివిజన్ నం.5 పరిధిలోని ఎదిరకు మూడు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని స్థానికులు తెలిపారు. డివిజన్ నం.11లోని గొల్లబండతండాలో ఎత్తు ప్రదేశంలోని సుమారు 150 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సన్నగా వస్తోంది. డివిజన్ నం.16లోని బోయపల్లి– కోట్ల వీధి, యాదవకాలనీలు ఎత్తు ప్రదేశంలో ఉండటంతో మిషన్ భగీరథ తాగునీరు సరిగా అందడం లేదు. డివిజన్ నం.41లోని సద్దలగుండు, రాజేంద్రనగర్‌లో, డివిజన్ నం.42లోని ప్రేమ్‌నగర్‌కు మూడురోజులకోసారి తాగునీరు అందుతోంది. శెట్టి కాంప్లెక్స్‌కు వెళ్లే దారిలో ఒకచోట్ల పైపులైన్‌కు లీకేజీ ఏర్పడటంతో తాగునీరు వృథాగా పారుతోంది. డివిజన్ నం.47, 48, 49, 50లకు నాలుగు రోజులకోసారి తాగునీరు అందుతోంది. దీంతో కొందరు ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. -
సస్పెన్షన్‌తో సరిపెట్టారు!
గండేడ్: రుణాల రికవరీలో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణలో జాప్యం జరుగుతున్నది. కేవలం తాత్కాలికంగా సప్పెన్షన్ వేటు వేశారు తప్పా.. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గండేడ్ మండలంలో పీఏసీఎస్‌తోపాటు డీసీసీబీ ఉంది. వీటి ద్వారా రైతులకు పంట, దీర్ఘకాలిక, పిటీలోన్లు ఇచ్చారు. అయితే ఇచ్చిన రుణాల రికవరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. గతంలో పనిచేసిన ఓ బ్యాంకు మేనేజర్ పీఏసీఎస్ సిబ్బంది సహకారంతో కలిసి చేతివాటం ప్రదర్శించారు. అయితే ఇచ్చిన రుణాలు ప్రతిఏటా రికవరీ చేయడం.. అటు బ్యాంకు.. ఇటు పీఏసీఎస్ సిబ్బంది బాధ్యత. అందులో భాగంగానే ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా రుణాలు రికవరీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వారు రికవరీకిగాను నేరుగా లబ్ధిదారుల వద్దకెళ్లి రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. సిబ్బంది రికవరీకి రావడంతో రుణం తీసుకున్న లబ్ధిదారులు నానా తంటాలు పడి రుణాలు చెల్లించేవారు. రైతుల నుంచి రుణాల రికవరీ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు హ్యాండ్ రిసిప్టులు ఇచ్చేవారు. అయితే అలా చెల్లించిన రుణం మాత్రం చెల్లించిన రైతుల ఖాతాల్లో స్క్రోల్గాని అక్కౌంట్కుగాని లెడ్జర్కుగాని పోలేదు. కొత్త మేనేజరు వచ్చాక రికవరీకి వెళ్లడంతో బాధితులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాస్తవాలు వెళ్లడయ్యాయి. బ్యాంకులో క్యాషియర్, పీఏసీఎస్‌లో సీఈఓ రిసీవ్డ్ రిసిప్టు ఇస్తాడు. వాటిపై ముద్రలతో సహా ఉంటాయి. కాని రైతులకిచ్చిన రిసిప్టులు డుప్లికేట్ హ్లాండ్ రిసిప్టులు ఇచ్చారు. కొన్ని సీలు, సిగ్నేచర్ లేకుండా ఇచ్చారు. దీంతో వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది. అప్పు బాకీ వారినుంచి నేరుగా ఫోన్‌పే, గూగుల్ పే రూపంలో బ్యాంకు సిబ్బందికి పీఏసీఎస్ సిబ్బంది ఖాతాలకు డబ్బులు వేశారు. అయితే వీటిని వెంటనే వారి అప్పుఖాతాల్లో జమచేయకుండా మేనేజర్ స్వాహా చేశాడు. కొంరెడ్డిపల్లిలో పలువురు రైతులకు చెందిన డబ్బులు ఇదే తరహాలో స్వాహా అయ్యాయి. దీంతోపాటు జక్లపల్లిలో ఓ రైతు నుంచి కూడా ఫోన్‌పే ద్వారా రుణం కిస్తు వేయగా దానిని వారి ఖాతాల్లో జమచేయలేదు. ఆయన బదిలీ అనంతరం కొత్తగా వచ్చిన మేనేజరు ఆ రుణం గురించి ఆ రైతును అడగగా విషయం బయటికి వచ్చింది. రుణం కిస్తు రూ.35000 ఉండగా సదరు మేనేజరుకు రూ.45000 వేయించుకున్నట్లు సమాచారం. ఇవేకాక గోల్డ్లోన్ల రికవరీ ఉందని చెప్పి డబ్బులు వేయించుకొని లోన్ తీసుకున్నవారికి తెలియకుండా దానిని ఎక్కువ చేసి వారు వేసిన డబ్బులు కూడా జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆగమేఘాల మీద సర్దుబాటు గండేడ్ మండలంలోని కొంరెడ్డిపల్లిలో పలు రైతుల డబ్బులు స్వాహా అవ్వడంతో విచారణ అనంతరం సదరు మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఆ స్వాహా చేసిన డబ్బులు పీఏసీఎస్ సిబ్బంది ఖాతా ద్వారా సర్దుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆగమేఘాల మీద ఈ డబ్బును సర్దుబాటు చేశారు. దీంతోపాటు జక్లపల్లి రైతు రుణాన్ని కూడా సర్దుబాటు చేశారు. అయితే విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా సస్పెండ్ చేసినా ఇప్పటివరకు పూర్తి విచారణ మాత్రం చేయడం లేదు. అంతేకాక కేవలం రెండు గ్రామాల్లో జరిగిన వాటిపైనే దష్టిపెట్టారు తప్పా.. మిగతా వాటిపై అధికారులు దృష్టిసారించలేదన్న విమర్శలు లేకపోలేదు. పీఏసీఎస్ రుణాలతోపాటు బ్యాంకు డైరెక్టు రుణాలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని లొసుగులు బయటికి వచ్చే అవకాశం ఉంది. 2022 సదరు మేనేజర్ పీఏసీఎస్ పూర్తిస్థాయిలో వసూళ్లు కాకపోయిన టార్గెట్ 50శాతం పూర్తయిందని తప్పుడు సమాచారం ఇచ్చి కొత్త అలాట్‌మెంటు తీసుకొని తిరిగి రుణాలు ఇచ్చి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఇతనికి బెస్టు రికవరీ ఆఫీసర్ అని ప్రశంసాపత్రం కూడా ఇవ్వడం విడ్డూరం. బ్యాంకులో ఉన్న పాసుపుస్తకాలు ఇతర రికార్డులు కాని జిరాక్స్ అవసరమొస్తే పీఏసీఎస్ సిబ్బందికి ఒకరికి బాధ్యత అప్పగించి రూ.వేయి చొప్పున కూడా వసూలు చేసినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సస్పెండ్ అయిన మేనేజర్ రైతుల డబ్బులు సర్దుబాటు చేశాక.. సస్పెన్షన్ ఎత్తేయించుకొని తిరిగి విధుల్లో చేరడానికి ముమ్మర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికిగాను అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అక్రమాల్లో పీఏసీఎస్ సిబ్బంది హస్తం లేకపోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒక్క మేనేజరే కాక పీఏసీఎస్ సిబ్బంది లీలలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే విచారణ పూర్తిస్థాయి విచారణలో జాప్యం రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు -
పకడ్బందీగా ఇంటింటి జనగణన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈనెల నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండో విడత జనగణనపై సమీక్షించగా.. మహబూబ్‌నగర్ నుంచి కలెక్టర్ ఖుష్బూ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చార్జి అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకులను మొదటి మూడు రోజులు (11, 12, 13)లలో తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఆయా బ్లాకుల్లో హెచ్‌బీఎల్ (హౌస్ బేస్డ్ లిస్టింగ్)ను పరిశీలించి.. లేఔట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే 11 నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని విధిగా సందర్శించి, గృహాల వారీగా జాబితా సిద్ధం చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. గృహాల జాబితా తయారీ సమయంలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, జనాభా గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: చించోళి బైపాస్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. నగర పరిధిలో నూతనంగా నిర్మించిన చించోళి బైపాస్‌పై ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం బ్లాక్‌స్పాట్ ఏరియాలను పరిశీలించారు. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులతోపాటు జాతీయ రహదారి అథారిటీ అధికారులతో మాట్లాడారు. రోడ్డుపై ప్రమాద సూచిక బోర్డులు, రాత్రివేళలో వాహనదారులకు స్పష్టంగా కన్పించే విధంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలన్నారు. వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం, డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర మలుపుల దగ్గర ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,381 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,109 ధరలు లభించాయి. అలాగే హంస సరాసరిగా రూ.1,789, ఆముదాలు సరాసరిగా రూ.6,082 ధరలు వచ్చాయి. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. సస్పెన్షన్‌తో సరిపెట్టారు! ● అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం ● ఫిర్యాదులపై మాత్రమే విచారణ ● పూర్తిస్థాయి విచారణలో జాప్యం ● రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు -
రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు 32 మంది జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను జిల్లాకేంద్రంలో డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీమ్ కోచ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు
మెట్టుగడ్డ: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేవరకు యూనియన్ అండగా ఉంటుందని ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రెస్‌క్లబ్ ప్రతినిధులపైనా రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ నాయకులు జర్నలిస్టుల మధ్య ఉండే ఆరోగ్యకరమైన సంబంధాలు ఇలాంటి కేసులు దెబ్బతీస్తాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో యునియన్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాములు, ఐజేయూ జిల్లా అధ్యక్షులు నాగరాజుగౌడ్, పాషా, కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లమైన మార్కులే సాక్షి
నారాయణపేట రూరల్: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. సాక్షి యాజమాన్యం నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో గణితం, భౌతికశాస్త్రం మెటీరియల్ రూపొందించి పదో తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు విద్యార్థులకు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బీద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా లభించిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపకరించిందని కొనియాడుతున్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలలకు ‘సాక్షి’ దినపత్రికను అందించడంతో నిత్యం అందులో ప్రచురితమైన భవిత పేజీ సద్వినియోగం చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. భవిత పేజీని ప్రతిరోజు టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తే వాటిని ఇంటికి వెళ్లి రివిజన్ చేసుకునేవారని, సందేహాలు ఉంటే మరుసటిరోజు నివృత్తి చేసుకునే వారిని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంలో సాక్షి ఎంతో ఉపయోగపడిందని, భవిష్యత్‌లోనూ మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌తోపాటు తెలుగు మీడియం వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా టాపర్‌గా నిలిచా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచా. డిసెంబర్‌లోగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి రివిజన్ టెస్టులు నిర్వహించారు. దీనికితోడు సాక్షి మెటీరియల్ ద్వారా చదువుకోవడం మార్కులు పెరగడానికి ఎంతో ఉపకరించింది. – పూర్విక, మద్దూరు స్టడీ మెటీరియల్ ఉపయోగపడింది సాక్షి యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ మార్కుల సాధనలో ఎంతో ఉపయోగపడింది. కఠినమైన అంశాలను సులువుగా వివరించి అందించడంతో స్వయంగా చదువుకోవడానికి దోహదపడింది. చివరి రెండు నెలలు సాక్షి మెటీరియల్ పైనే ఆధారపడటంతో మంచి మార్కులు సాధించాను. – నవనీత, కొలంపల్లి. గణితంలో 95మార్కులు సాధించా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులం కావడంతో కొంత గణితంలో వెనకబడి ఉంటాం. ఎప్పుడూ లెక్కల సబ్జెక్ట్ లోనే మార్కులు తక్కువగా వచ్చేవి. అయితే పరీక్షల ముందు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చిన గణితం మెటీరియల్ నాకు ఎంతో ఉపయోగపడింది. రెగ్యులర్‌గా పుస్తకం ఫాలో కావడంతో గణితంలో 95మార్కులు సాధించాను. సాక్షికి ధన్యవాదములు. – ఎల్లప్ప, భైరంకొండ పాలిసెట్‌కు ఉపయోగిస్తున్న.. పరీక్షల ముందు సాక్షి దినపత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. గణితం, సైన్స్‌లో 90కి పైగా మార్కులతో మొత్తం 527 సాధించాను. పాలిసెట్‌లో సీటు సాధించేందుకు సైతం ఈ మెటీరియల్‌ను ఫాలో అవుతున్న. కష్టమైన వాటిని సులువుగా నేర్చుకుంటున్నా. –శిరీష, అమీన్పూర్ గణితం అంటే ఎంతో భయం ఉండేది. ప్రతి అధ్యాయం నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టమైన లెక్కలను సులభమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి మెటీరియల్‌లో పొందుపరిచారు. తద్వారా లెక్కలు కష్టమన్న విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్‌తో భయం పోయింది. ప్రధానంగా గణితం పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఈ మెటీరియల్ ఉపయోగపడింది. – మధుసూదన్, గణిత ఉపాధ్యాయులు, జాజాపూర్ పత్రికలు కేవలం సమస్యలు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ సాక్షి దినపత్రిక అందుకు భిన్నంగా ఆలోచిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయం. ప్రతిరోజు భవిత పేజీలో కీలక అంశాలను తెలియజేస్తూనే కష్టమైన గణితం, సైన్స్ మెటీరియల్‌ను విద్యార్థులకు ఉచితంగా అందించడం శుభపరిణామం. భవిష్యత్‌లో తెలుగు మీడి యం విద్యార్థులకు అందించే విధంగా కృషిచేయాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి ‘సాక్షి’ చేయూత మరువలేనిది సాక్షి దినపత్రిక విద్యార్థుల కోసం అందించిన చేయూత మరవలేనిది. ఇంటర్‌తోపాటు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు భవిత పేజీ ఎంతో ఉపయోగపడింది. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుపై విశ్లేషణాత్మక విషయాలు, పాఠ్యాంశం వారీగా చదవాల్సిన అంశాలు చాలా బాగున్నాయి. మంచి ఫలితాలు సాధించడానికి సహకరించడం ఆనందంగా ఉంది. – శ్రీ విద్య, గురుకుల స్కూల్, నారాయణపేట మంచి ప్రోత్సాహం అందించింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాక్షి ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ఆంగ్ల మాధ్యమంలో ప్రింట్ చేసిన మెటీరియల్ కొన్ని పుస్తకాలు మా పాఠశాలకు అందించారు. వాటిని ఉపాధ్యాయులు తెలుగులో తర్జుమా చేసి రోజువారీగా చదివించడం ఎంతో ఉపయోగపడింది. మెటీరియల్ ఆధారంగా పరీక్షలకు సిద్ధం కావడంతో మంచి ఫలితాలు సాధించాం. – అక్షిత, కేజీబీవీ, నారాయణపేట స్టడీ మెటీరియల్ సహకారంతో ఉత్తమ ఫలితాలు ఎంతో ఉపకరించిందని కొనియాడిన విద్యార్థులు సాక్షి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ బృందం -
మహిళ అదృశ్యం: కేసు నమోదు
నవాబుపేట: మండల కేంద్రంలో ప్లాస్టీక్ సామన్ల వ్యపారం నిర్వహించే ఒక మహిళ అదృశ్యం కావడంతో గురువారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అనగొంది వెంకటయ్య భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ఆయన ప్రమీల అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, ఆయనతోపాటు తన భార్యతోపాటు తన సోదరుడి కుమారుడు సైదులును వ్యాపారానికి తోడుగా తీసుకెళ్లేవాడు. కాగా, గతనెల 8వ తేదీన భార్యతోపాటు సైదులు ఇద్దరు మాత్రమే వ్యాపారానికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన వారి ఆచూకీ లభించలేదు. దీంతో తాజాగా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సరిహద్దులో పటిష్ట నిఘా ఉంచాలి
రాజోళి: ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల డ్యాంపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద అనునిత్యం నిఘా ఉంచాలని అడిషనల్ ఎస్పీ శంకర్ అన్నారు. గురువారం ఆయన రాజోళిలో పర్యటించి, సుంకేసుల డ్యాం పరిసరాలను, చెక్‌పోస్టును పరిశీలించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని జంతు రవాణా జరగకుండా నిఘా పెట్టాలని, ప్రస్తుతం మొక్కజొన్న, వరి కొనుగోళ్ల సందర్భంగా ఏపీ నుంచి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు హెల్మెట్,సీటు బెల్టు ధరించి,ట్రాఫిక్ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపటం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా నేరమన్నారు. ప్రమాదాల నివారణకు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్ఐ గోకారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ శంకర్ -
‘సీడ్, ఫెర్టి డ్రిల్’తో సాగు సులభం
● విత్తనం, ఎరువులు ఒకేసారివేసుకునే అవకాశం ● కూలీల సమస్యకు చెక్ ● దిగుబడి ఆశాజనకమే.. రకం వరుసల మొక్కల మధ్య మధ్య వరి 25 15 మొక్కజొన్న 60 20 పామాయిల్ 60 20 పెసర 25 10 గోగు 25–30 15 వేరుశనగ 30 15 అలంపూర్: జిల్లాలో రైతులు సాగులో ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగలి వెనుక సాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగుచేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. పెర్టికమ్ సీడ్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు సూచించారు. ఈ విధానంతో కూలీల సమస్యను అధికమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సీడ్ డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతుల గురించి ఏఓ మాటల్లో.. ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ వల్ల ఉపయోగాలు ● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్‌తో వేయవచ్చు. ● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చును. ● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది. ● పంటను బట్టి వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం మార్చుకోవచ్చు. ● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వల్ల పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ● పంటకు గాలి వెలుతురు బాగా తగిలి ఆరోగ్యంగా ఉంటుంది. ● యంత్రాలతో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ముశనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు. ● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి. ● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి. ● పొలం చదునుగా ఉంటే పొలం అంతా విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. ● ఈ యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది. సీడ్‌డ్రిల్‌తో సాగు సీడ్ డ్రిల్ యంత్రంలో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్‌లో ఎరువులు వేయాలి. రెండో బాక్స్‌లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది. పాటించాల్సిన దూరం (సెం.మీ) పాడి–పంట -
షీటీంలతో ఆకతాయిలకు చెక్
మహబూబ్‌నగర్ క్రైం: అమ్మాయిలు, మహిళా రక్షణతో పాటు చిన్నారులపై జరిగే వేధింపులకు గురి చేసే వారిపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంచుతోంది. యూనిఫాం లేకుండా జనసంచారంలో ఉంటూ ఆకతాయిల ఆట కట్టించడానికి ఏర్పాటు చేసిన షీటీం సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, కళాశాలలు, మార్కెట్లలో నిఘా వ్యవస్థ పని చేస్తోంది. వేసవి సెలవుల్లో ఖాళీగా తిరిగే ఆకతాయిల ఆట కట్టించేందుకు పోలీస్‌శాఖ షీటీం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రం బస్టాండ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ జానకి (ఫైల్) -
పశువుల అక్రమ రవాణాపై చర్యలు
రాజాపూర్(బాలానగర్): పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. గురువారం బాలానగర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆమె సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాపై ఏడు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు. కీలక ప్రాంతాలైన పాలమూరు యూనివర్సిటీ, కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, మహమ్మదాబాద్, అడ్డాకల్ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. చెక్‌పోస్టులో తనిఖీలు, రిజిస్టర్లలో నమోదుపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ చెక్‌పోస్టును సందర్శించిన మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి


