మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎఫ్‌సెట్ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని రిషి కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో వెయ్యిలోపు 11 మంది ర్యాంకులు సాధించారు. సమీరాబేగం 180, అమూల్య 221, నందినిరెడ్డి 348, మనస్విత 404, నుజత్ 446, హప్స మెహిన్ 457, మాలిహ తహనీయత్ 684, అదిబామైహిన్ 725, తహనీయత్ 648, ఆదిబామైహిస్ 725, ప్రసన్నలక్ష్మి 895, సాయిశ్రీ 1000, రూపశ్రీ 1,006 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో కిరణ్ 1,109, నరహరి 1,213, సయ్యద్ మిస్సవుద్దీన్ 1,801, కిషోర్‌కుమార్ 1,951, సంతోష్ 2,456, జోతిర్నాథ్ 2,513 ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, చైర్‌పర్సన్ చంద్రకళ, అధ్యాపకులు తదితరులు అభినందించారు.


