కోస్గి రూరల్: పురకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.2 కోట్లతో సుందరంగా నిర్మించనున్నామన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తయిందని, పనులు ఏడాదిన్నరలోగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలో 200 ఎకరాల్లో విద్యాహబ్, ఇండస్ట్రియల్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ పనులకు 90 శాతం అనుమతులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


