ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు
● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ
అధికారులకు పట్టుబడుతున్న వైనం
● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు
చిక్కిన వైనం
ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభు త్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది.


