కూలిన ఇళ్లు.. రోడ్డుపై వరద | - | Sakshi
Sakshi News home page

కూలిన ఇళ్లు.. రోడ్డుపై వరద

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

డ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్య కాలనీలో రెండు ఇళ్లు కూలిపోయాయి. బాధితులను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకరికి రూ.25వేల ఆర్థికసహాయం చేశారు. వర్షం కారణంగా ప్రధాన రోడ్డుపై వరదనీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద ముంపు నివారణ కాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా 4వ వార్డులో మురికినీరు ఇళ్ల ముందు నుంచి ప్రవహించింది. బాదేపల్లి మార్కెట్‌లో పంట తడిసిపోయిన ధాన్యంను ఎమ్మెల్యే పరిశీలించారు. యార్డులో రైతులతో మాట్లాడి..మక్కలు, వరి చివరి గింజ కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement