క్రికెట్‌ శిబిరాలకు వేళాయే... | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ శిబిరాలకు వేళాయే...

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

నేటి నుంచి సమ్మర్‌ క్యాంప్‌

● పెబ్బేర్‌ పీజేపీ

మున్సిపల్‌ మైదానం

● నారాయణపేట

మినీ స్టేడియం

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నామని ఆ పాఠశాల జీహెచ్‌ఎం గోపాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యాంపు కొనసాగనుందని, స్థానికంగా, పట్టణంలో ఉండే 6 నుంచి 9తరగతి విద్యార్థులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో పరిశుభ్రత, యోగా, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, నీతి కథలు చెప్పడం, డాన్స్‌ వంటి పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారని, క్యాంప్‌లో పాల్గొనే విద్యార్థులకు రోజు స్నాక్స్‌ కూడా అందిస్తామని తెలిపారు.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: గ్రామీణ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ వేసవిలో ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. హెచ్‌సీఏ సౌజన్యంతో మహబూబ్‌నగర్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఐదు వేసవి శిబిరాలు నిర్వహించగా వందలాదిమంది యువత సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌, జడ్చర్లలో, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేర్‌, కల్వకుర్తి పట్టణాల్లో క్రికెట్‌ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఆయా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఈ శిబిరాల్లో అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 విభాగాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నేడు ఎండీసీఏ మైదానంలో ప్రారంభమయ్యే వేసవి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిర ఏర్పాట్లను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ పరిశీలించారు. శిబిరాల్లో క్రీడాకారుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. క్రీడాకారుల కోసం జంబో కిట్‌లు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కిట్‌లు అందుబాటులో ఉంచుతారు. కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారం కింద అరటిపండు, గుడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు.

నేటి నుంచి వేసవి ఉచితక్రికెట్‌ శిక్షణా శిబిరాలు

ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఏర్పాట్లు

నాలుగు విభాగాల క్రీడాకారులకు అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement