18 ప్రమాదాలు.. 12 మంది మృతి | - | Sakshi
Sakshi News home page

18 ప్రమాదాలు.. 12 మంది మృతి

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

గరంలో ఉన్న జాతీయ రహదారితో పాటు బైపాస్‌ రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో రెండు బైపాస్‌లపై 18 రోడ్డు ప్రమాదాలు జరిగితే 12 మంది దుర్మరణం చెందారు. మరో పదిమంది వరకు క్షతగాత్రులయ్యారు. ఇక నగరంలో రోడ్డు పక్కన ఉండే ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవడంతో పాదచారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. ధాన్యం, ఇసుకతోపాటు ఇతర వస్తువులు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ సమస్య అధికంగా వస్తోంది. నగరీకరణ అధికంగా ఉన్న పాలమూరులో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంలో పోలీసులు, మున్సిపల్‌ యంత్రాంగం విఫలమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement